/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz అత్యాచార నిరోధక చట్టాన్ని మహిళలు దుర్వినియోగం చేస్తున్నారు: హైకోర్టు Yadagiri Goud
అత్యాచార నిరోధక చట్టాన్ని మహిళలు దుర్వినియోగం చేస్తున్నారు: హైకోర్టు

పెళ్లి పేరిట తనను మోసం చేశాడంటూ ఓ వ్యక్తిపై మహిళ అత్యాచారం కేసు

కేసు కొట్టేస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు న్యాయమూర్తి తీర్పు

పరస్పర అంగీకారంతో దగ్గరై ఆ తరువాత పెళ్లికి నిరాకరిస్తే అత్యాచారం కాదని వ్యాఖ్య

భాగస్వాములతో భేదాభిప్రాయలు వచ్చినప్పుడు ఈ చట్టాన్ని ఆయుధంగా వాడుతున్నారని కామెంట్

అత్యాచార నిరోధక చట్టాన్ని మహిళలు దుర్వినియోగ పరుస్తున్నారని ఉత్తరాఖండ్ హైకోర్టు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. భాగస్వాములతో భేదాభిప్రాయాలు తలెత్తిన సమయంలో ఈ చట్టాన్ని ఓ ఆయుధంగా వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వ్యక్తిపై అతడి మాజీ ప్రేయసి దాఖలు చేసిన అత్యాచారం కేసును కొట్టేస్తూ న్యాయమూర్తి శరద్ కుమార్ శర్మ ఈ వ్యాఖ్యలు చేశారు.

తనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిన ఓ వ్యక్తిపై మహిళ అత్యాచారం కేసు వేశారు. 2005 నుంచి వారు రిలేషన్‌లో ఉన్నారు. ఇద్దరిలో ఎవరికి జాబ్ వచ్చినా పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. ఈ క్రమంలో వారు శారీరకంగా కూడా దగ్గరయ్యారు.

ఆ తరువాత అతడు మరో మహిళను వివాహం చేసుకోవడంతో బాధితురాలు కోర్టును ఆశ్రయించారు. అయితే, అతడికి పెళ్లయ్యాక కూడా వారిద్దరూ తమ బంధాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో జూన్ 30న ఆమె కోర్టును ఆశ్రయించారు. అయితే, మహిళ దాఖలు చేసిన అత్యాచార కేసును కోర్టు కొట్టేసింది.

‘‘అతడికి పెళ్లయిన తరువాత కూడా పిటిషనర్ తమ బంధాన్ని కొనసాగించారు. అంటే..ఆమె అతడితో బంధానికి అంగీకరించినట్టే’’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అతడికి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా అనేది తమ బంధం తొలినాళ్లలోనే నిగ్గుతేల్చుకోవాలని వ్యాఖ్యానించారు. పరస్పర అంగీకారంతో శారీరకంగా దగ్గరయ్యాక పెళ్లికి నిరాకరిస్తే దాన్ని అత్యాచారంగా పరిగణించలేమని స్పష్టం చేశారు.

తిరుమలలో భక్తుల రద్దీ

తిరుపతి:జులై 23

తిరుమల తిరుపతి దేవస్థానం ఆదివారం భక్తులతో కిటకిట లాడు తోంది. శ్రీవారి సర్వ దర్శనానికి 31 కంపార్టు మెంట్లలో భక్తులు నిండిపోయి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి.

స్వామి వారి సర్వ దర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు.

కాగా నిన్న శనివారం శ్రీవారిని 84,430 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా స్వామి వారికి హుండీ ఆదాయం 3.45 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. శ్రీవారికి 38,662 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు......

దివ్యాంగులకు వెయ్యి రూపాయల పింఛన్ పెంపు ఉత్తర్వులు జారీ

దేశానికే ఆదర్శంగా మానవీయకోణంలో కొనసాగుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పాలనలో తెలంగాణ రాష్ట్రం మరో చారిత్రక ఘట్టానికి వేదికగా నిలచింది.

తెలంగాణ ప్రభుత్వం అభాగ్యులైన, ఆసరా అవసరమైన దివ్యాంగులకు నేనున్నానంటూ ఆర్థిక భరోసాగా అందిస్తున్న మొత్తాన్ని మరింతగా పెంచింది. మంచిర్యాల సభ వేదికగా దివ్యాంగుల పింఛన్ ను పెంచబోతున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.

ఈ మేరకు దివ్యాంగుల పింఛన్ ను రూ. 1,000 పెంచుతూ ఇవ్వాల శనివారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి నెలా రూ. 3,116 పెన్షన్ ను అందుకుంటున్న దివ్యాంగులు, ఇక మీదట 4,116 పెన్షన్ ను అందుకుంటారు. ఈ నెల నుండి అమలులోకి వస్తుందని ప్రభుత్వం జీవోలో పేర్కొంది.

దీని ప్రకారం 5 లక్షల పైగా దివ్యాంగ పించనర్లు లబ్ధి పొందనున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. అత్యధిక పింఛన్లు ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది.

దివ్యాంగుల పింఛన్లు పెంచడం పట్ల ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో వేరెక్కడ లేనివిధంగా అత్యధిక పింఛన్లు అందిస్తూ దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి హరీష్ రావు ట్విట్ చేశారు.....

రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!!

హైదరాబాద్ :జులై 22

తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ ఆరాధే రేపు ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీసులు హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు.

ఆదివారం ఉదయం 11:00 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రధాన న్యాయమూర్తిగా ఆరాధే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం నుండి వీవీ జంక్షన్ వరకు రాజ్ భవన్ రహదారిలో ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు భారీ ట్రాఫిక్ ఉంటుందని పోలీసులు తెలిపారు.

ట్రాఫిక్ మళ్లీంపు

VV విగ్రహం ,మోనప్ప జంక్షన్ మధ్య ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ఈ రూట్ వ‌చ్చే వాహ‌న‌దారులు పంజాగుట్ట గ్రీన్‌ ల్యాండ్స్ , పంజాగుట్ట నుండి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ – షాదన్ నిరంకారి వైపు వెళ్లాల్సి ఉంటుంది.

పంజా గుట్ట రోడ్ రాజ్ భవన్ క్వార్టర్స్ రోడ్ మెట్రో రెసిడెన్సీ నుండి ఇరు వైపులా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు...

Naveen Patnaik: చరిత్ర సృష్టించిన నవీన్ పట్నాయక్.. జ్యోతిబసు రికార్డు బద్దలు..

ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ (Naveen Patnaik) అరుదైన ఘనత సాధించారు. దేశంలో అత్యధిక కాలం సీఎం పదవిలో కొనసాగిన రెండో వ్యక్తిగా నవీన్ పట్నాయక్ రికార్డు (Record) సృష్టించారు..

ఇప్పటివరకు రెండో స్థానంలో ఉన్న పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం జ్యోతిబసును (Jyothi Basu) ఆయన వెనక్కి నెట్టారు. ఈ జాబితాలో తొలి స్థానంలో సిక్కిం మాజీ సీఎం పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌ (Pawan Kumar Chamling) ఉన్నారు.

ఇప్పటివరకు దేశంలో అత్యధిక కాలం సీఎంగా కొనసాగిన రికార్డు పవన్ కుమార్ చామ్లింగ్ పేరిటే ఉంది. ఆయన 1994 డిసెంబర్‌12 నుంచి 2019 మే 27 వరకు 24 ఏళ్లకు పైగా సీఎం పదవిలో సేవలు అందజేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ (BJD) విజయం సాధించి నవీన్ పట్నాయక్‌ మరోసారి సీఎం అయితే అత్యధిక కాలం సీఎంగా కొనసాగిన వ్యక్తిగా రికార్డు సృష్టించనున్నారు..

కాగా ప్రస్తుతం ఒడిశా ముఖ్యమంత్రిగా ఐదోసారి నవీన్ పట్నాయక్ సేవలు అందిస్తున్నారు. 1997లో తండ్రి బీజూ పట్నాయక్ మరణించడంతో ఆయన వారసుడిగా నవీన్ పట్నాయక్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తన తండ్రి పేరుతో బీజూ జనతా దళ్ (బీజేడీ)ని ఏర్పాటు చేసి 1997 నుంచి ఆ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

అదే ఏడాది ఎంపీగా విజయం సాధించారు. 1998 నుంచి 2000 వరకు కేంద్రమంత్రిగానూ పనిచేశారు. 2000 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఒడిశాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అలా 2000 మార్చి 5న తొలిసారి ఆయన సీఎం పదవిని చేపట్టారు. 23 ఏళ్ల 138 రోజులుగా ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు..

హైదరాబాద్‌లో బయటపడ్డ మరో ఉగ్ర కోణం.. ఈ మోసాలు అందుకేనా?

హైదరాబాద్‌: అతిపెద్ద సైబర్ క్రైమ్ ఫ్రాడ్‌ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌ పెట్టుబడుల పేరుతో రూ. 712 కోట్ల ఫ్రాడ్ చేసిన ముఠాని అదుపులోకి తీసుకున్నామని సీపీ ఆనంద్‌ తెలిపారు..

శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ తరహా మోసాలకు సంబంధించి 15 వేల మంది బాధితులు ఉన్నారని అన్నారు. టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా ఈ మోసాలు జరుగుతున్నట్లు గుర్తించామన్నారు.

ఆన్లైన్ లో టాస్క్‌ల పేరుతో.. మొదట డబ్బులు ఇచ్చి... ఆ తర్వాత ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మోసం చేస్తున్నారని.. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు.

ఇందులో అమాయకులే కాకుండా హై లెవెల్ పొజిషన్ లో ఉన్న ఐటీ ఎంప్లాయిస్ కూడా బాధితులు ఉన్నట్లుగా గుర్తించారని చెప్పారు. శివకుమార్ అనే ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసును దర్యాప్తు చేశామన్నారు. చైనా, దుబాయ్ కేంద్రంగా ఈ ఫ్రాడ్ జరుగుతోందని చెప్పారు..

ఇక్కడ ఎజెంట్లను నియమించుకొని, షెల్ కంపెనీలు, బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి చైనా, దుబాయ్ నుంచి ఆపరేట్ చేస్తున్నారని అన్నారు. చైనా, దుబాయ్‌లో ఉన్న ప్రధాన నిందితులకు ఇండియాలో సహకరిస్తున్న 9 మందిని అరెస్ట్ చేశామన్నారు. అకౌంట్స్ లో ఉన్న డబ్బును క్రిప్టో కరెన్సీ ద్వారా నగదు ట్రాన్స్ఫర్ చేసుకుని చైనా, దుబాయ్‌లో విత్‌డ్రా చేసుకుంటున్నారని అన్నారు. ఇక్కడ ఫ్రాడ్ చేసిన డబ్బును టెర్రరిస్టులకు ఫైనాన్స్ చేసే అవకాశం కూడా ఉందన్నారు. ఎన్‌ఐఐ(NIA) వాళ్ళకి ఈ కేసు గురించి సమాచారం ఇచ్చామని ..వాళ్లు కూడా ఇన్వాల్వ్ అవచ్చని చెప్పుకొచ్చారు. హిజ్బుల్ టెర్రర్ మోడ్యూల్ కి క్రిప్టో కరెన్సీ ట్రాన్స్ఫర్ పై ఎన్‌ఐఏ దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు..

Pawan Kalyan: ఆర్భాటాలు కాదు.. పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించండి: పవన్‌ కల్యాణ్..

అమరావతి: బైజూస్‌ను చూపించి రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. బైజూస్‌ ద్వారా ఏదో సాధించామని ప్రభుత్వం చెబుతోందన్నారు..

ఆర్భాటాలు కాదు.. ముందు పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించాలని పవన్‌ సూచించారు. ''మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఊసే లేదు. ఉపాధ్యాయుల భర్తీ చేపట్టలేదు.

వారికి శిక్షణ ఇవ్వడం లేదు. నష్టాలు వచ్చే స్టార్టప్‌కు మాత్రం రూ.కోట్ల కాంట్రాక్టు ఇచ్చారు. టెండర్‌ కోసం ఎన్ని కంపెనీలు దరఖాస్తు చేశాయి?

టెండర్ల ప్రక్రియలో ప్రమాణాలను ప్రభుత్వం పాటించిందా? ఆ కంపెనీలను ఎవరు పరిశీలించారు?వాటికి సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచారా? టెండరు, కంపెనీ ఎంపిక అంశాలపై ప్రభుత్వం స్పందించాలి'' అని పవన్ కల్యాణ్‌ డిమాండ్ చేశారు..

Viveka Murder Case: అందుకే లేఖ దాచిపెట్టమని చెప్పా: సీబీఐకి సునీత భర్త వాంగ్మూలం

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తులో కీలక అంశాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తు్న్నాయి..

ఇప్పటికే పలువురు కీలక సాక్షులు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలాలు బయటకు రాగా.. తాజాగా సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం వివరాలు వెల్లడయ్యాయి.

వైఎస్‌ రాజారెడ్డి హత్య తర్వాత జరిగిన హింసను దృష్టిలో పెట్టుకొని వివేకా హత్య స్థలిలో లభించిన లేఖను తాను వచ్చే వరకు దాచిపెట్టమని చెప్పానని సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి సీబీఐకి తెలిపారు. ఉదయం 6.30గంటలకు వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి ఫోన్‌ చేసి ఘటనా స్థలిలో లేఖ ఉందని చెప్పారని రాజశేఖర్‌రెడ్డి సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. లేఖలో ఏముందని అడగ్గా.. డ్రైవర్‌ ప్రసాద్‌ బాధ్యుడిగా ఉందని కృష్ణారెడ్డి చెప్పారన్నారు. రాజారెడ్డి హత్య సమయంలో జరిగిన పరిణామాలతో పాటు ప్రసాద్‌కు ప్రాణహానిని దృష్టిలో పెట్టుకొని.. తాను వచ్చి వ్యక్తిగతంగా పోలీసులకు ఇస్తానని చెప్పినట్టు పేర్కొన్నారు..

వివేకా పేరిట ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలుసా? అని సీబీఐ అడగ్గా.. కొన్ని తెలుసని రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. హత్యకు ముందు రోజు రాత్రి కడప ఎంపీగా తాను పోటీ చేయనున్నట్టు జమ్మలమడుగులో వివేకా చెప్పినట్టు తెలిసిందని రాజశేఖర్‌రెడ్డి సీబీఐకి తెలిపారు. జమ్మలమడుగు ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా అవినాష్‌కు మద్దతివ్వాలని ప్రభావతమ్మను వివేకా కోరినట్టు తెలిసిందన్నారు.

హత్యకు ముందు రోజు మార్చి 13న శివశంకర్‌రెడ్డి గూగుల్‌ టేకవుట్‌ లొకేషన్‌ను సీబీఐ చూపించగా.. అది వివేకా ఇంటిదేనని నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి గుర్తించారు. సాధారణంగా శివశంకర్‌రెడ్డి తమ ఇంట్లోకి ఎప్పుడూ రాడని చెప్పారు. ఆరోజున ఎంవీ కృష్ణారెడ్డి ఫోన్‌ చేసి వివేకానందరెడ్డి పులివెందులకు ఎప్పుడొస్తున్నారని ఆరా తీశారని, తాము కడపలో ఉన్నామని చెప్పినట్టు నర్రెడ్డి వివరించారు. రాజశేఖర్‌రెడ్డిని సాక్షిగా పేర్కొంటూ ఆయన వాంగ్మూలాన్ని గత నెల 30న అనుబంధ ఛార్జిషీట్‌తో పాటు కోర్టుకు సీబీఐ సమర్పించింది..

NIA: భారీ కుట్రకు ప్రణాళిక.. అందుకే ఆర్కే భార్య శిరీష, దుడ్డు ప్రభాకర్‌ అరెస్టు: ఎన్‌ఐఏ

ఒంగోలు: మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీషను ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో నిన్న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

శిరీషను అరెస్టు చేసినట్టు ఎన్‌ఏఏ శనివారం ప్రకటన విడుదల చేసింది. ఆర్కే డైరీ ఆధారంగా శిరీషతో పాటు దుడ్డు ప్రభాకర్‌ను కూడా అరెస్టు చేశామని తెలిపింది.

దుడ్డు ప్రభాకర్‌, శిరీష మావోయిస్టుల కోసం పనిచేస్తున్నారని పేర్కొంది. మావోయిస్టుల నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకున్నట్టు గుర్తించామని ఎన్‌ఐఏ తెలిపింది.

2019లో జరిగిన తిరియా ఎన్‌కౌంటర్లో వీరిద్దరూ పాల్గొన్నారని, మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా భారీ కుట్రకు ప్రణాళిక సిద్ధం చేశారని ఎన్‌ఏఏ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

''జులై 28న సమావేశం ఏర్పాటు చేసుకొని భారీ కుట్ర పన్నేందుకు మావోయిస్టు కేడర్‌ ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. వీరు రాసిన లేఖలు, సాహిత్య పుస్తకాలతో పాటు భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాం'' అని ఎన్‌ఐఏ వివరించింది..

ఈ నెల 24 న హిమాన్షు కొత్త సాంగ్

బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ త‌నయుడు క‌ల్వ‌కుంట్ల హిమాన్షు మ‌రో కొత్త సాంగ్‌తో అల‌రించ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని హిమాన్షు ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు. నా కొత్త పాటను జులై 24వ తేదీన విడుద‌ల చేస్తున్నాను.

ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించ‌డం నాకు చాలా సంతోషంగా ఉంద‌ని హిమాన్షు పేర్కొన్నారు. ఈ సాంగ్‌ను చూసి మీరంద‌రూ ఆనందిస్తార‌ని ఆశిస్తున్నాని పేర్కొన్నారు.

ఈ ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేశారు. హిమాన్షు సాంగ్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాన‌ని కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

అమెరికాకు చెందిన గాయకుడు, గేయ రచయిత జాకబ్‌ లాసన్ పాడిన గోల్డెన్‌ అవర్‌’ సాంగ్‌ను క‌ల్వ‌కుంట్ల‌ హిమాన్షు రావు గ‌తంలో అద్భుతంగా ఆల‌పించిన సంగ‌తి తెలిసిందే.

ఈ ఇంగ్లీష్‌ సాంగ్‌ అలాపనలో హిమాన్షు ఆంగ్ల యాసను ఉచ్ఛరించిన తీరు ఆమోఘం అని నెటిజ‌న్లు కొనియాడిన సంగ‌తి తెలిసిందే. అచ్చం జాకబ్‌ లాసన్‌ను తలపించేలా అతను ఈ కవర్‌ సాంగ్‌ పాడాడ‌ని ప్ర‌శంసించారు. 24న విడుద‌ల కాబోయే సాంగ్ కూడా ఆ మాదిరిగానే ప్ర‌శంస‌లు అందుకోవాల‌ని నెటిజ‌న్లు ఆశిస్తున్నారు.........