/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz కూలిన ఆర్మీ హెలీకాప్టర్.. లెఫ్టినెంట్ కల్నల్ మృతి TeluguCentralnews
కూలిన ఆర్మీ హెలీకాప్టర్.. లెఫ్టినెంట్ కల్నల్ మృతి

అరుణాచల్ ప్రదేశ్‌లోని బొమ్‌డిలాలో ఆర్మీ హెలికాప్టర్ గురువారం కుప్పకూలింది. పైలట్ల జాడ కోసం ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. గురువారం ఉదయం 9.15 గంటల ప్రాంతంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని బోమ్‌డిలా సమీపంలో ఆపరేషన్ సమయంలో ఆర్మీ ఏవియేషన్‌కు చెందిన చితా హెలికాప్టర్‌కు ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయని రక్షణ శాఖ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర రావత్ తెలిపారు. హెలికాప్టర్ తరువాత బొండిలాకు పశ్చిమాన మండల్ సమీపంలో కూలిపోయినట్లు గుర్తించారు. పైలట్‌ల కోసం ఆర్మీ రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్ ప్రారంభించింది.

గతేడాది అక్టోబర్‌ 5న అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌లో ఆర్మీ చితా హెలికాప్టర్‌ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఆర్మీ పైలట్లకు గాయాలు కాగా వారిలో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఉదయం 10 గంటల సమయంలో తవాంగ్‌లోని జెమిథాంక్ సర్కిల్‌లోని బాప్ టెంగ్ కాంగ్ జలపాతం సమీపంలోని న్యామ్‌జాంగ్ చు వద్ద ఈ ప్రమాదం జరిగిందని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. సురవ సాంబ ప్రాంతం నుంచి ఇద్దరు పైలట్లతో హెలికాప్టర్లు నిత్యం సంచరిస్తుంటాయి.

ప్రమాదం గురించి తెలిసిన వెంటనే, రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుంది, ఆ తర్వాత తీవ్రంగా గాయపడిన ఇద్దరు పైలట్‌లను బయటకు తీసి అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు పైలట్లలో ఒకరైన లెఫ్టినెంట్ కల్నల్ సౌరభ్ యాదవ్ చికిత్స పొందుతూ మరణించారు. తవాంగ్‌లో ఇది మొదటి హెలికాప్టర్ ప్రమాదం కాదు. 2017లో వైమానిక దళానికి చెందిన Mi-17 V5 హెలికాప్టర్ కూలి ఐదుగురు IAF సిబ్బంది మరియు ఇద్దరు ఆర్మీ అధికారులు మరణించారు.

హర్యానా గురుగ్రాంలో ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య..

పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక ఇంటర్మీడియట్‌ చదివే ఓ విద్యార్ధి 13వ అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హర్యానా రాష్ట్రంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

 వివరాల్లోకెళ్తే.. గురుగ్రాంలోని సెక్టార్ 41లోని సౌత్ సిటీ 1లోని రిట్రీట్ సొసైటీలో 17 ఏళ్ల బాలుడు ఓ ప్రైవేట్ స్కూల్‌లో 12వ తరగతి చదువుతున్నాడు. ఫైనల్‌ టర్మ్‌ పరీక్షలు దగ్గరపడుతుండటంతో ఒత్తిడి తట్టుకోలేక తమ అపార్ట్‌మెంట్‌లో 13వ అంతస్థు బాల్కనీ నుంచి కింది దూకాడు. కింద ఏదోపడ్డ శబ్ధం రావడంతో సొసైటీ సెక్యూరిటీ గార్డులు బయటికి వచ్చి చూశారు. అక్కడ రక్తపుమడుగులో పడి ఉన్న బాలుడిని చూసి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు బాలుడు చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ సంఘటన సోమవారం అర్థరాత్రి చోటుచేసుకుంది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ పోలీసులకు లభ్యంకాకపోవడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మంగళవారం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

నోబెల్ శాంతి బహుమతి రేసులో ప్రధాని నరేంద్ర మోడీ

ప్రపంచం శాంతిని, స్నేహాన్ని కోరుకోవడంలో ప్రధాని మోడీ ఎప్పుడూ ముందుంటారు. కరోనా మహమ్మారిని తరిమి కొట్టి దేశాన్ని ఆర్థిక సంక్షోభంలో పడనీయకుండా కాపాడారు. అన్ని రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.

అన్ని దేశాలతో స్నేహాన్ని కొనసాగిస్తూ దేశ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో నోబెల్‌ శాంతి బహుమతి రేసులో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ప్రకటించే అవార్డుల్లో ప్రధాని మోడీకి నోబెల్ శాంతి బహుమతి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇటీవల నార్వేకు చెందిన నోబెల్ అవార్డ్స్ కమిటీ భారత్ ను సందర్షించింది. నోబెల్ శాంతి బహుమతి విజేతను నిర్ణయించే ఈ కమిటీ డిప్యూటీ ఛైర్మన్ అస్లే టోజే ప్రధాని మోడీని ప్రశంసించారు. ఆయన ప్రపంచానికి చేస్తున్న సేవలను కొనియాడారు. యుద్ధాలు చేసే దేశాల చేత కూడా యుద్ధాలను ఆపించగల సత్తా ఉన్నవాడని పేర్కొన్నారు. మోడీ లాంటి శక్తివంతమైన నేతకు ప్రపంచ దేశాల మధ్య శాంతి నెలకొల్పే సామర్థ్యం ఉందని కితాబిచ్చారు. మోడీ లాంటి నేత శాంతిని పెంచడంలో కీలక పాత్ర పోషించగలరని నమ్ముతున్నట్లు అస్లే టోజే వెల్లడించారు. 

మోడీ విధానాల వల్ల భారత్ సుసంపన్నమైన, శక్తిమంతమైన దేశంగా మారుతోందని అస్లే అన్నారు. ప్రపంచాన్ని నడపగల గొప్ప అర్హత ఉన్న నాయకుడైన ప్రధాని మోడీ.. ఈ ఏడాది అక్టోబర్ లో ప్రకటించే నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకుంటే అది చారిత్రాత్మకం అవుతుందని చెప్పారు.

కెనడా లో భారతీయల నకిలీ వీసాల గుర్తింపు... 700 మంది పై బహిష్కరణ వేటు...

కెనడాలో భారతీయ విద్యార్థుల వీసాలు నకిలీవని గుర్తించడంతో దేశంలోని అధికారులు వారిని దేశం నుంచి బహిష్కరణ వేటు వేశారు.

 వారు కెనడియన్ బోర్డర్ సెక్యూరిటీ ఏజెన్సీ (CBSA) నుండి బహిష్కరణ లేఖలను అందుకున్నారు. 

 700 మంది విద్యార్థులు బ్రిజేష్ మిశ్రా నేతృత్వంలోని ఎడ్యుకేషన్ మైగ్రేషన్ సర్వీసెస్ (జలంధర్‌లో ఉంది) ద్వారా స్టడీ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. బ్రిజేష్ మిశ్రా ప్రీమియర్ ఇన్‌స్టిట్యూట్ హంబర్ కాలేజీలో అడ్మిషన్ ఫీజుతో సహా అన్ని ఖర్చుల కోసం ఒక్కో విద్యార్థికి రూ. 16 లక్షలకు పైగా వసూలు చేశారు. ఈ విద్యార్థులు 2018-19లో అధ్యయనం ఆధారంగా కెనడా వెళ్లారు.

 ఈ విద్యార్థులు కెనడాలో శాశ్వత నివాసం (PR) కోసం దరఖాస్తు చేసుకోవడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది.

 దీని కోసం ‘అడ్మిషన్ ఆఫర్ లెటర్స్’ పరిశీలనలోకి వచ్చాయి, అంటే కెనడియన్ బోర్డర్ సెక్యూరిటీ ఏజెన్సీ విద్యార్థులకు వీసాలు జారీ చేసిన పత్రాలను పరిశీలించి ‘అడ్మిషన్ ఆఫర్ లెటర్స్’ నకిలీవని తేల్చింది.

దేశ వ్యాప్తంగా ఈ బంగారం - వెండి ధరలు

తాజాగా బంగారం ధరలో కొంత తగ్గుదల కనిపించింది. తులంపై ఒకేసారి రూ. 110 తగ్గింది.

 గురువారం దేశవ్యాప్తంగా నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,050

24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,870  

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,050 

24 క్యారెట్ల ధర రూ.57,870 వద్ద కొనసాగుతోంది.

విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,050  

24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,870 ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో గురువారం 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 53,200  

24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,020 

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,800 

 

24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,690 

ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.53,050.

24 క్యారెట్ల తులం ధర రూ.57,870 

బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.53,100  

24 క్యారెట్ల ధర రూ.57,920 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు 

వెండిపై ఏకంగా రూ. 500 వరకు పెరిగింది.  

హైదరాబాద్‌లో రూ.72,500, 

విశాఖ, విజయవాడలో రూ.72,500  

చెన్నైలో కిలో వెండి ధర రూ.72,500, 

ముంబైలో రూ.69,000, 

ఢిల్లీలో రూ.69,000, 

కోల్‌కతాలో కిలో వెండి రూ.69,000, 

బెంగళూరులో రూ.72,500,

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి మాత్రమే...

న్యూజిలాండ్‌ కెర్మాడెక్ దీవులలో 7.1 తీవ్రతతో భారీ భూప్రకంపనలు

న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. న్యూజిలాండ్‌కు ఉత్తరాన ఉన్న కెర్మాడెక్ దీవులను గురువారం రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం తాకింది.

 యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అంచనా. 300కిమీ వ్యాసార్థంలో సమీపంలోని, జనావాసాలు లేని ద్వీపాలకు యూఎస్ సునామీ హెచ్చరిక వ్యవస్థ ద్వారా సునామీ హెచ్చరిక కొద్దిసేపటి తర్వాత జారీ చేయబడింది. 

భూకంపం కారణంగా న్యూజిలాండ్‌కు సునామీ ముప్పు లేదని నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ తెలిపింది.

పెళ్లైన పురుషులపై పెరుగుతున్న గృహ హింసలు, పురుషుల జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టులో పిటీషన్

పెళ్లైన స్త్రీలపై గృహ హింస జరగడం లాంటి కేసులు చాలా వరకు జరుగుతున్నాయి. కాని వివాహమైన పురషులు కూడా గృహహింసకు గురవుతున్నారంటే చాలా మంది లైట్ గా తీసుకుంటారు. కాని వాస్తవానికి ఎన్సీఆర్బీ నివేదిక చూస్తే పురుషులు కూడా గృహ హింస వల్ల ఆత్మహత్యలు చేసుకనే ఘటనలు కూడా చాలానే జరుగుతున్నాయన్న విషయం అర్థమవుతుంది. అందుకేసమే పురుషుల కోసం సైతం ఓ జాతీయ కమిషన్ ను ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది.

న్యాయవాది మహేశ్ కుమార్ తివారీ ఈ పిటీషన్ ను దాఖలు చేశారు. జాతీయ నేర రికార్డుల బ్యూరో వెల్లడించిన సమాచారం ప్రకారం, 2021లో ప్రమాదవశాత్తూ సంభవించిన మరణాలు 1,64,033 అని ఈ పిటిషన్ పేర్కొంది. వీరిలో 81,063 మంది పెళ్లయిన పురుషులని తెలిపింది. వివాహిత మహిళలు 28,680 మంది ప్రమాదవశాత్తూ మరణించినట్లు ఈ నివేదిక పేర్కొందని తెలిపింది. మరణించిన పురుషుల్లో 33.2 శాతం మంది మరణానికి కారణం కుటుంబ సమస్యలని, 4.8 శాతం మంది మరణానికి కారణం వివాహ సంబంధితమైనవని వెల్లడించింది.

2021లో 1,18,979 మంది పురుషులు ఆత్మహత్య చేసుకున్నారని, 45,026 మంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్‌సీఆర్‌బీ డేటా వెల్లడించిందని తెలిపింది.

అయితే గృహ హింస బాధిత పురుషుల ఫిర్యాదులను స్వీకరించి, విచారణ జరపాలని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆదేశించాలని ఈ పిటిషన్ కోరింది. గృహ హింస బాధిత పురుషుల సమస్యల పరిష్కారానికి తగిన చట్టం అమల్లోకి వచ్చే వరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేసింది. 

కుటుంబ సమస్యల వల్ల ఒత్తిళ్ళలో ఉన్నవారు, వివాహ సంబంధిత సమస్యలపై పురుషులు చేసే ఫిర్యాదులను కూడా పోలీసులు స్వీకరించాలని కోరింది. దీని కోసం తగిన ఆదేశాలను కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా పోలీసు అధికారులు, స్టేషన్ హౌస్ ఆఫీసర్‌లకు జారీ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఈ పిటిషన్ కోరింది. ఈ ఫిర్యాదులు సరైనరీతిలో పరిష్కారమయ్యేందుకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు నివేదించాలని కోరింది. జాతీయ పురుషుల కమిషన్ వంటి వేదికను ఏర్పాటు చేసేందుకు తగిన నివేదికను సమర్పించాలని ఆదేశించాలని కోరింది.

‘‘మేడమ్ క్యూట్‌గా ఉన్నావ్’’.. మహిళా పోలీస్‌ని వేధించిన ఆకతాయి

పోలీసులతో పెట్టుకుంటే.. పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వారి పట్ల సఖ్యతగా ఉంటే పర్లేదు కానీ, కొంచెం తేడాగా ప్రవర్తిస్తే మాత్రం.. ఇక దబిడిదిబిడే! ఈ భయంతోనే.. ఎవ్వరూ వారి జోలికి వెళ్లరు. కానీ.. ఓ ఆకతాయి మాత్రం అందుకు భిన్నంగా ఓ మహిళా పోలీస్‌ని వేధించాడు. ‘‘మేడమ్.. నువ్వు చాలా క్యూట్‌గా ఉన్నావ్’’ అంటూ టీజ్ చేశాడు. అంతటితో ఆగకుండా నోటికొచ్చినట్టు వాగాడు. అయితే.. అతడు నేరుగా వేధించలేదు. ఒక ట్రెయిన్‌లో ప్రయాణిస్తూ.. రైల్వే ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ఓ మమిళా పోలీస్ వీడియో తీస్తూ, ఇలా వేధింపులకు పాల్పడ్డాడు.

ఈ వ్యవహారం వివాదాస్పదం అవ్వడంతో.. ఆ ఆకతాయిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ముంబైలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..

ఆ ఆకతాయి ముంబై లోకల్ ట్రైన్‌లో, ఫుట్‌బోర్డు వద్ద నిల్చొని ప్రయాణిస్తున్నాడు. ఆ ట్రైన్ సరిగ్గా బాంద్రా స్టేషన్‌కి చేరుకున్నప్పుడు.. అతగాడు తన మొబైల్ ఫోన్ బయటకు తీసి, ప్లాట్‌ఫామ్‌లో నిల్చున్న ఇద్దరు మహిళా పోలీసుల వీడియో తీశాడు. ఆ వీడియో రికార్డ్ చేస్తూ.. ‘మేడమ్, నువ్వు చాలా క్యూట్‌గా ఉన్నావ్’ అంటూ చెప్పాడు. ఆమెతో కంపెనీ మస్తుగా ఉంటుందంటూ.. అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ వాగాడు. ఈ వీడియో అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది వెంటనే వైరల్ అయ్యింది. అందులో మహిళా పోలీస్‌ని టీజ్ చేయడంతో, ఈ వ్యవహారం సంచలనంగా మారింది. దీంతో.. ఈ వీడియోపై ముంబైకి చెందిన ఎన్‌జీఓ జీవధార సంఘ్ సీరియస్ అయింది. ఈ వీడియోని ట్విటర్‌లో షేర్ చేసి.. మహారాష్ట్ర సీఎం కార్యాలయం, ముంబై పోలీసులను ట్యాగ్ చేసింది.

‘‘ముంబై పోలీసులు 365 రోజుల పాటు 24 గంటలూ ప్రజలకు సేవ అందిస్తుంటారు. అలాంటి మహిళా పోలీసుల పట్ల ఓ వ్యక్తి ‘మస్తాన్ కంపెనీ’ పేరుతో వీడియో పోస్ట్ చేసి, వారిని అవమానిస్తున్నారు. ఇలాంటి వారిని ఊరికే వదిలిపెట్టకూడదు. వీరికి తగిన బుద్ధి చెప్పాలి’’ అంటూ ట్వీట్ చేసింది. దీంతో.. ఆ ఆకతాయిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు రంగంలోకి దిగారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ ఆకతాయి.. మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తాము ఆ వీడియో కంటెంట్‌ని తనిఖీ చేస్తున్నామని, అనుమానుతుడ్ని ట్రాక్ చేస్తున్నామని అని బాంద్రా GRP అధికారి తెలిపారు.

मुंबई पुलिस हमारी सेवा में साल के 365 दिन 24 घंटे रहती है ऐसे में महिला पुलिस के साथ मस्तान कंपनी नाम से सोशल मीडिया पर वीडियो डालकर कुछ लोग बदतिमीजी कर रहे है महिला का अपमान करने वाले और छेड़छाड़ करने वालो को सबक सिखाना चाहिए। pic.twitter.com/YsxRrOVKDw

— जीवनधारा संघ ( NGO ) March 13, 2023

సోషల్ మీడియాలో కంటెంట్ కోసం పిచ్చి పనులు... కరెన్సీ నోట్లు విసురుతూ అండ్డంగా బుక్కయ్యారు...

జనాల మీద ఓటీటీలు, వాటిల్లో వచ్చే వెబ్ సిరీస్‌ల ప్రభావం ఏ రేంజ్‌లో ఉందో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. సోషల్ మీడియాలో కంటెంట్ కోసం పిచ్చి పనులు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. తాజాగా హర్యానాలోని గురుగ్రామ్‌లో ఓ వ్యక్తి నడుస్తున్న కారులోంచి కరెన్సీ నోట్లను విసిరాడు. 

ఇటీవల విడుదలైన ఫర్జీ వెబ్ సిరీస్‌లోని ఓ సన్నివేశాన్ని సేమ్ టు సేమ్ రిపీట్ చేయడానికి ప్రయత్నించాడు కానీ అడ్డంగా దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే.. యూట్యూబర్ జోరావర్ సింగ్, అతని ఫ్రెండ్ గురుప్రీత్ సింగ్‌లు.. ఫేక్ కరెన్సీని రోడ్లపై చల్లారు. ఇదంతా కేవలం యూట్యూబ్ వీడియో కోసం మాత్రమే. కానీ వారిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.  

గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్‌లో ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారు కానీ.. అడ్డంగా బుక్కైపోయారు. ఈ ఘటనతో…ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయి జనాలు ఇబ్బంది పడ్డారు.

#WATCH | Haryana: A video went viral where a man was throwing currency notes from his running car in Gurugram. Police file a case in the matter.

(Police have verified the viral video) pic.twitter.com/AXgg2Gf0uy

— ANI March 14, 2023

రణరంగంగా పాకిస్తాన్.. ఇమ్రాన్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు, ఆర్మీ విఫలయత్నం..

పాకిస్తాన్ రణరంగంగా మారుతోంది. సివిల్ వార్ దిశగా పాకిస్తాన్ వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడి ఆర్మీ, పోలీసులను ఇమ్రాన్ మద్దతుదారులు సవాల్ చేస్తున్నారు.

 ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసేందుకు అక్కడి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోంది. తోషాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసేందుకు లాహోర్ లోని జమాన్ పార్క్ వద్ద ఉన్న ఆయన నివాసానికి పంజాబ్ పోలీసులు చేరుకున్నారు.

 అయితే పీటీఐ, ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని అరెస్ట్ చేయకుండా పోలీసులకు అడ్డుగా నిలుస్తున్నారు.

తాజాగా బుధవారం ఇమ్రాన్ ఖాన్ ను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. మంగళవారం నుంచి 24 గంటలుగా ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

అయితే ఇమ్రాన్ మద్దతుదారుల నుంచి పోలీసులకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో పీటీఐ మద్దతుదారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ క్యాన్లు, టియర్ గ్యాస్ ఉపయోగిస్తున్నారు. అక్కడే గుమిగూడిన ప్రజలపై లాఠీఛార్జ్ చేస్తున్నారు. ఈ ఘర్షణలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు పాకిస్తాన్ వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. 

ఈ మొత్తం ఘర్షణల్లో ఇస్లామాబాద్ డీఐజీ ఆపరేషన్స్ షాజామ్ నదీమ్ బుఖారీతో పాటు 54 మంది పోలీసులు గాయపడ్డారు.

మరోవైపు పాక్ పోలీసులతో పాటు ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసేందుకు పాక్ ఆర్మీ కూడా రంగంలో దిగినట్లు తెలుస్తోంది. అయితే జమాన్ పార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో లాహోర్ హైకోర్టు రేపు ఉదయం 10 గంటల వరకు ఆ ప్రాంతంలో పోలీస్ చర్యలు నిలిపివేయాలని ఆదేశించింది. అయితే మంగళవారం పాక్ ప్రజలు, పీటీఐ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్.. తనను అరెస్ట్ చేసి చంపాలని చూస్తున్నారని ఆరోపించారు. దేవుడు నాకు అన్నీ ఇచ్చాడని, నేను పాక్ ప్రజల కోసం పోరాడుతున్నా అని అన్నారు. నేను చనిపోయినా, అరెస్ట్ అయినా ఉద్యమాన్ని ఆపొద్దని సూచించాడు.