ముంబై మురికివాడలో భారీ అగ్నిప్రమాదం.. 25కు పైగా ఇళ్లు దగ్ధం...
ముంబైలోని ధారవి షాహోనగర్ ప్రాంతంలోని కమలా నగర్ మురికివాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.. షాహునగర్ ప్రాంతంలో 25కు పైగా ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పే ప్రయత్నం చేశారు. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో 20 నుంచి 25 వాహనాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి.
రోడ్లు ఇరుకుగా ఉండడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. మంటలు ఇంకా మండుతూనే ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఈ ఘోర అగ్నిప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.




















Feb 22 2023, 14:17
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
52.1k