‘ఆ రోజు నా ప్యాంటులోకి ఎలుక దూరింది’.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన బిగ్ బీ..
బాలీవుడ్ నటుడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటించిన ‘దో ఔర్ దో పాంచ్’ సినిమా విడుదలై 43 ఏళ్లు ఆవుతుంది. ఈ సందర్భంగా ఆయన ఓ ఆసక్తికర ఘటనను సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకున్నారు. అప్పట్లో తాను బెల్‌బాటమ్ ధరించిన సందర్భంలో తన ప్యాంటులోకి ఓ ఎలుక దూరిందని చెప్పుకొచ్చారు బిగ్ బీ. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను అభిమానులతో పంచుకోవాలనుకున్న అమితాబ్ తన పోస్ట్‌తో ‘2+2=5; దో ఔర్ దో పాంచ్ సినిమా వచ్చి 43 ఏళ్లయ్యింది. ఈ సినిమా షూటింగ్ ఎంత సరదాగా సాగిందో..! బెల్ బాటమ్స్ ఇంకా అన్నీ !!! …. ఆ రోజుల్లో బెల్ బాటమ్‌లు చాలా ఆహ్లాదకరంగా ఉండేవి.. థియేటర్‌లో సినిమా చూడటానికి వెళ్లినప్పుడు, నా ప్యాంట్‌లోకి ఎలుక ఎక్కింది.. బెల్ బాటమ్‌కి ధన్యవాదాలు’ అంటూ లాఫింగ్ ఎమోజీలను కూడా జతచేశారు.
తమ అభిమాన హీరో ఇలాంటి సరదా విషయాన్ని తమతో పంచుకుంటే ఫ్యాన్స్ ఆగుతారా..? ఈ పోస్టుకు తమ స్పందనగా తెగ కామెంట్లు, లైకులు, షేర్లు చేస్తున్నారు. ఇంకా అమితాబ్ బచ్చన్ బెల్‌బాటమ్ లుక్స్‌ను గుర్తు చేసుకున్న నెటిజన్లు ఆ రోజుల్లో ఆయన స్టైల్ వేరే లెవెల్‌లో ఉండేదంటూ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. ‘‘నాటి నుంచీ నేటి దాకా మీలో ఎనర్జీ లెవెల్స్ ఏమాత్రం తగ్గలేదు’’ అంటూ మరికొందరు బిగ్ బీపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.
View this post on Instagram
A post shared by Amitabh Bachchan 1980లో విడుదలైన ఈ చిత్రంలో హేమమాలిని, ఖదీర్ ఖాన్, ఓం ప్రకాశ్, శ్రీరామ్ లగూ తదితరులు నటించారు. ఈ మూవీకి రాకేశ్ కుమార్ దర్శకత్వం వహించగా సాండో ఎమ్ఎమ్ఏ చిన్నప్ప తేవర్ నిర్మించారు. ఇక కళారంగానికి బిగ్ బీ చేసిన సేవకు గాను భారత ప్రభుత్వం ఆయనను 2015లో పద్మ విభూషణ్‌తో సత్కరించిన విషయం తెలిసిందే.






Feb 12 2023, 10:24
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
66.4k