హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో సీతారాముల కల్యాణ వేడుకలు

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో సీతారాముల కల్యాణ వేడుకలు 

అయోధ్యలో జనవరి 22వ తేదీన శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగనున్న నేపథ్యంలో..దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. ఈ క్రమంలో హైదారాబాద్ మహానగరం నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో సీతారాముల కల్యాణం ఆదివారం ఘనంగా నిర్వహించారు.

వేడుకకు త్రిదండి చిన జీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీతారాముల కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామి వారిని దర్శించుకుని పులకించిపోయారు.A

రాముడు కేవలం భారతదేశానికే కాదు..ప్రపంచానికే రాజుని త్రిదండి చినజీయర్‌ స్వామి తెలిపారు. సుమారు 5 వందల ఏళ్ల తర్వాత రాముడు తన జన్మస్థలానికి చేరుకుంటున్న క్షణం.. దేశ చరిత్రలోనే అద్భుతమన్నారు.

దేశం మొత్తం రామనామ స్మరణ మార్మోగుతున్న వేళ.. రాముడు అయోధ్య కు తిరిగి వస్తున్నాడన్నారు చినజీయర్ స్వామి. అయోధ్య లో రాముడు ప్రతిష్ఠ సందర్భంగా సీతారాముల కల్యాణం నిర్వహించి తన భక్తిని చాటుకోవడమే కాకుండా ఎంతోమంది సీతారాముల కళ్యాణం మహోత్సవంలో పాల్గొనే అవకాశం కల్పించిన కొమురయ్య దంపతులను చినజీయర్ స్వామి అభినందించారు.

 అలాగే జనవరి 20 నుండి మార్చి 11 వరకు ముచ్చింతల సమతామూర్తి రెండవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

సీతారాముల కల్యాణం నిర్వహించడం ద్వారా తమ జన్మ చరితార్ధమైందన్నారు డీపీఎస్ చైర్మన్ కొమురయ్య. ఈ సందర్భంగా 5 లక్షల ఇళ్లకు శ్రీరాముడి చిత్ర పటాన్ని పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

సంక్రాంతి సెలవులు రాకముందే విద్యార్థులను హాస్టల్ ఖాళీ చేయించి ఇంటికి పంపిస్తున్న ప్రభుత్వ వార్డెన్ల మీద చర్యలు తీసుకోవాలి: కట్టెల శివకుమార్

సంక్రాంతి సెలవలు 4 రోజులు మాత్రమే ప్రభుత్వం నిర్ణయించింది  షెడ్యూల్ కులముల అభివృద్ధి వసతి గృహాల వార్డెన్లు 7 రోజుల ముందే విద్యార్థులని మీకు పరీక్షలు పూర్తి అయినాయి ప్రభుత్వ నియమ నిబంధనకు వ్యతిరేకంగా విద్యార్థులను హాస్టల్లో నుంచి వెళ్లగొట్టడం జరుగుతుంది. దీనివలన బహుజన విద్యార్థులు చదువుకు దూరం కావడంతో పాటు ఉన్నత విద్యకు దూరం కావడం జరుగుతుంది.వారం రోజుల ముందే విద్యార్థులను ఎల్లగొడుతున్న వార్డెన్స్ ఎవరైనా సరే వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యార్థులకు న్యాయం జరిగిన చూడాలని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ డిమాండ్ చేశారు.

అయోధ్య రామయ్య సన్నిధిలో అన్నదానానికి భారీ విరాళం వితరణ

అయోధ్య రామయ్య సన్నిధిలో అన్నదానానికి భారీ విరాళం వితరణ

అమర్నాథ్ అన్నదాన సేవా సమితికి 200 క్వింటాళ్ల బియ్యం వితరణ

200 క్వింటాల బియ్యం (10 లక్షలు) అందజేసిన జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమనరసయ్య)

అయోధ్య, అయోధ్య, అయోధ్య ఏ నోట విన్న ఏ మాట విన్న అయోధ్య రాముడి మాటే తప్ప వేరే మాట వినపడటం లేదు. దేశ మొత్తం ఎదురుచూస్తున్న రామయ్య ప్రతిష్ట మహోత్సవం దగ్గర పడుతున్న శుభ సమయంలో అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అయోధ్య రామయ్య సన్నిధిలో నిర్వహిస్తున్న అన్న ప్రసాద వితరణ కు సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమ నరసయ్య 200 క్వింటాల బియ్యం (సుమారు పది లక్షల రూపాయలు విరాళం) శనివారం తిరుమలగిరిలోని ఆయన నివాసంలో ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఇమ్మడి సోమన్నరసయ్య మాట్లాడుతూ అయోధ్యలో అన్నదాన కార్యక్రమం నిర్వహించుటకు నా వంతుగా సహాయ సహకారం అందించడం ఆనందంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఈ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటున్నారని వారికి అన్నదానం నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. అందులో నేను సైతం పాలుపంచుకోవడం పూర్వజన్మ సుకృతమన్నారు.ఈ కార్యక్రమంలో అమర్నాథ్ సేవా సమితి వ్యవస్థాపక చైర్మన్ చికోటి మధుసూదన్ నిర్వాహకులు నల్ల చంద్రం, కాశం విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు...

తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మచ్చ ప్రభాకర్ రావు గారి అకాల మరణం పద్మశాలి సమాజానికి తీరని లోటు: పెండం ధనుంజయ

తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శ్రీ మచ్చ ప్రభాకర్ రావు గారి అకాల మరణం చాలా బాధాకరం అన్నగారు తమరు లేని లోటు ఊహించడానికి చాలా బాధేస్తుంది తమరు మన కుల సమాజానికి చేసిన సేవలు మరువలేనివి మీతో మాకు మంచి అనుబంధం ఉన్నది మీతో కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొని పద్మశాలీల అభ్యున్నతి కోసం మేము కూడా పని చేశాము, పద్మశాలీలు రాజకీయాల్లో ఉండాలి అని చెప్పి మీతో కలిసి ఎవరైతే యువకులు రాజకీయాల్లో ఉన్నారో వాళ్లందర్నీ కలుపుకొని అనేక మీటింగ్లను నిర్వహించి అన్ని పార్టీల కార్యాలయాల చుట్టూ తిరిగాము, ఆయా పార్టీల రాష్ట్ర అధ్యక్షులను ముఖ్య నాయకులను కలిశాము, మీ యొక్క లక్ష్యం పద్మశాలీలు రాజకీయాల్లో ఉండాలని చట్టసభల్లో ఉండాలని లక్ష్యాన్ని నెరవేర్చడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాము అన్నగారు తమరి పవిత్ర ఆత్మకు ఆ భగవంతుడు శాంతి చేకూర్చాలని మరియు ఈ పరిస్థితుల నుండి మీ కుటుంబ సభ్యులు త్వరగా కోలుకొని, సాధారణ జీవితంలోకి రావాలని వారికి కావలసిన మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ *బాధాతత్వ హృదయంతో. మీ పెండెం ధనుంజయ్ నేత అధ్యక్షులు నల్లగొండ జిల్లా పద్మశాలి యువజన సంఘం.

నాపై హత్యాయత్నం జరిగింది, నరకం అనుభవించా: కేఏ పాల్ సంచలన వాక్యాలు


  • నాపై హత్యాయత్నం జరిగింది, నరకం అనుభవించా: కేఏ పాల్ సంచలనం


విశాఖపట్నం: తన వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రజా శాంతి పార్టీ (Praja Shanti Party) చీఫ్ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తనపై హత్యాయత్నం జరిగిందని పిడుగు లాంటి వార్త చెప్పారు. క్రిస్మస్ వేడుకల సమయంలో డిసెంబర్ 25న తనను చంపే ప్రయత్నం జరిగిందని కేఏ పాల్ (KA Paul) ఆరోపించారు. క్రిస్మస్ పండుగ సమయంలో టార్గెట్ చేసుకుని తనకు ఫుడ్ పాయిజన్ అయ్యేలా చేశారని పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

విశాఖపట్నంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న కేఏ పాల్..

ఫుడ్ పాయిజనింగ్ తరువాత ప్రస్తుతం కోలుకుంటున్నానని కేఏ పాల్ తెలిపారు. ప్రస్తుతం విశాఖపట్నంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని పేర్కొన్నారు. దేవుడి దయ వల్ల తాను ప్రాణాలతో బతికి బయటపడ్డానని చెప్పారు.

ఈ విషయం చెప్పొచ్చో లేదోనని ఇన్ని రోజులు తాను మౌనంగా ఉన్నానని పేర్కొన్నారు. పది రోజుల నుంచి నరకం అనుభవిస్తున్నానని, కాన్ఫిడెన్షియల్ గా చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు.

SB news లో ప్రకటనకై సంప్రదించండి...

ప్రతిరోజు లక్షకు పైగా ప్రేక్షకులు వీక్షించే మా SB News(streetbuzz) లో మీ వార్తలు ముద్రించుటకై మరియు మీ యొక్క అన్ని రకాల ప్రకటనలు ముద్రించడానికి కాల్ చేయండి

మిరియాల కిరణ్ కుమార్

Ph no:8341186182

వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి...

వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి. కనిగిరి అభివృద్ధి బాధ్యత తీసుకుంటా. ఈ ఐదేళ్లలో ఎవరికైనా న్యాయం జరిగిందా.? అభివృద్ధి, సంక్షేమం టీడీపీ సిద్ధాంతం. ఎంపీలు, ఎమ్మెల్యేలకు ట్రాన్స్‌ఫర్లు ఉంటాయని ఎప్పుడూ ఊహించలేదు. ఒక ఊరిలోని చెత్తను మరో ఊరిలో వేస్తున్నారు. -చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వత రెడ్డికి రోడ్డు ప్రమాదం.. అటుగా వెళుతున్న జానీ మాస్టర్ స్పందించి సహకారం...

రోడ్డు ప్రమాదంలోఎమ్మెల్సీ పర్వతరెడ్డికి తీవ్ర గాయాలు ఒకరు మృతి

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది.

ఈ ప్రమాదంలో ఆయన తీవ్ర గాయాలతో తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. కానీ, పర్వతరెడ్డి పీఏ వెంక టేశ్వర్లు అక్కడికక్కడే మృతిచెందారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు ఆ దారిలో వెళ్తున్న డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ వెంటనే స్పందించి వారికి తోడుగా సహకరించారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరు జిల్లాలోని రేగడిచెలిక దగ్గర ఆగి ఉన్న కంటైనర్‌ లారీని ఆయన కారు వేగంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో పర్వ తరెడ్డికి తీవ్రంగా గాయ పడగా.. కారులో ఉన్న ఆయన పీఏ వెంకటేశ్వర్లు ప్రమాద స్థలంలోనే మృతి చెందారు. ఇక, వారు విజయవాడ నుంచి నెల్లూరుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది...

భారత్ దేశంలో అత్యంత సంపన్నుడిగా ఆదాని

భారత్ దేశంలో అత్యంత సంపన్నుడిగా ఆదాని 

 ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ దేశంలో నెం.1 సంపన్నుడిగా నిలిచాడని బ్లూమ్బిర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది.

 ఈ మేరకు అదానీకి అనుకూలంగా సుప్రీంలో తీర్పు రావడంతో ఆయన కంపెనీల షేర్లు ఒక్కసారిగా పెరిగాయి.

 దీంతో ఇవాళ ఉ.9.30 గంటలకు అదానీ సంపద 97.6 బిలియన్ డాలర్లకు చేరడంతో ఈ ఘనత సాధించారు.

ఈ క్రమంలోనే ముకేశ్ అంబానీ ఆదాయం 97 బిలియన్ డాలర్ల వద్ద ఉండటంతో స్వల్పంగా వెనుకబడి ఉన్నారు.

భారత్ దేశంలో అత్యంత సంపన్నుడిగా ఆదాని..

భారత్ దేశంలో అత్యంత సంపన్నుడిగా ఆదాని