నల్గొండలో నూతన బట్టల షోరూం ఓపెనింగ్ లో ముఖ్యఅతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసిన నల్లగొండ ఎమ్మెల్యే సతీమణి కంచర్ల రమాదేవి

నల్గొండలో నూతన బట్టల షోరూం ఓపెనింగ్ లో ముఖ్యఅతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసిన నల్లగొండ ఎమ్మెల్యే సతీమణి కంచర్ల రమాదేవి

నల్లగొండ పట్టణంలోని వివేకానంద నగర్ గౌతమి కాలేజ్ సమీపాన కొలను మహేష్ శ్రీవిద్య దంపతుల క్వీన్స్ ఫ్యాన్సీ క్లాతింగ్ స్టోర్ ను ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సతీమణి కంచర్ల రమాదేవి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.

అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలకు సరసమైన ధరలకు కాస్మెటిక్స్ ఫ్యాన్సీ మెటీరియల్ డ్రెస్సెస్ మరియు అన్ని రకముల వన్ గ్రామ్ గోల్డ్, ఎంపోరియం శారీస్ మ్యాచింగ్ డెకరేటివ్ ఐటమ్స్ లభిస్తాయని పట్టణ ప్రజలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ బొజ్జ నాగరాజు, రావుల రేణుక, విజయ , రూప, లీలావతి, సైదమ్మ శిరీష కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

వికలాంగుల విద్య, ఉపాధి కోసం ప్రత్యేక విధానాన్ని ప్రకటించాలి

వికలాంగుల విద్య, ఉపాధి కోసం ప్రత్యేక విధానాన్ని ప్రకటించాలి

ఆటిజం వినికిడి తెరపి కేంద్రాలను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి-సంక్షేమం, సాధికారత కోసం ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టాలి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

వికలాంగులకు విద్యా, ఉపాధి కల్పన కోసం ప్రత్యేక విదానాన్ని ప్రకటించాలనీ, రాష్ట్రంలో 12.2 శాతం జనాభా కలిగిన వికలాంగుల సంక్షేమం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టదా అని వక్తలు ప్రశ్నించారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) రాష్ట్ర కమిటీ నేతృత్వంలో వెలువడుతున్న వికలాంగుల వాయిస్ చైతన్య మాస పత్రిక 9వ వార్షికోత్సవం ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోజరిగింది. వార్షికోత్సవం ప్రత్యేక సంచికను వొకేషనల్ రేహాబిలిటేషన్ సెంటర్ మాజీ డైరెక్టర్ గంగాధర్ రావు, ఎన్పీఆర్డీ జాతీయ ఉపాధ్యక్షులు యం అడివయ్య, వికలాంగుల వాయిస్ మాస పత్రిక మేనేజర్ కే వెంకట్, అసిస్టెంట్ మేనేజర్ బి స్వామి, అసిస్టెంట్ ఎడిటర్ జే రాజు, ఎడిటోరియల్ బోర్డ్ సభ్యులు అర్ వెంకటేష్, ఎ రంగారెడ్డి, బలేశ్వర్, సాయమ్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అడివయ్య, గంగాధర్ రావు మాట్లాడుతూ దేశంలో 2.68 కోట్ల మంది వికలాంగులు ఉంటే రాష్ట్రంలో 43.04 లక్షల మంది వికలాంగులు ఉన్నారన్నారు. రాష్ట్ర జనాభాలో వీరు 12.2శాతం ఉన్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వీరి సంక్షేమం ఎందుకు పట్టడం లేదని ప్రశ్నించారు. విద్యా, ఉపాధి దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శక్తి సామర్థ్యాలను వెలికి తీయడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జనాభాకు అనుగుణంగా విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలన్నారు. దేశలో 50 లక్షల మంది ఆటిజం కలిగిన వారున్నారని తెలిపారు. రాష్ట్రంలో 5 లక్షల మంది ఉన్నారనీ, వీరందరికీ ప్రభుత్వమే ఉచితంగా థెరపీ అందించేందుకు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో, రాష్ట్రంలో వినికిడి లోపం సమస్య కూడా తీవ్రంగా ఉందన్నారు. వికలాంగుల వాయిస్ మాస పత్రిక మేనేజర్ కే వెంకట్ మాట్లాడుతూ వైకల్య ధృవీకరణ పత్రాలు అందించటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయని విమర్శించారు.

కార్యక్రమంలో ఎన్పీఆర్డీ నాయకులు టి మధు బాబు, కాశప్ప, దశరథ్, యశోద, పి కవిత, అరిఫా, ఉపేందర్, రాష్ట్ర కమిటీ సభ్యులు గోపాల్, ఎస్ ప్రకాష్ ,జయలక్ష్మి,శంకర్, భుజంగ రెడ్డి, రాధమ్మ, చంద్రమోహన్, లలిత ,బాలయ్య ,చందు, లింగన్న, వెంకన్న, సావిత్రి, షాహిన్ బేగం, రాజశేఖర్ గౌడ్, జంగయ్య, నారాయణ లతో పాటు వివిధ జిల్లాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

మినీ అంగన్వాడీ టీచర్లను గుర్తించిన ఘనత సీఎం కెసిఆర్ ది: ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

మినీ అంగన్వాడీ టీచర్లను గుర్తించిన ఘనత సీఎం కెసిఆర్ ది: ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

దేశంలో ఎక్కడ లేని విధంగా మినీ అంగన్వాడీ టీచర్లను గుర్తించిన ఘనత సీఎం కెసిఆర్ కే దక్కుతుందని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తెలిపారు. మినీ అంగన్వాడీ టీచర్లను ఎలాంటి షరతులు లేకుండా మెయిన్ అంగన్వాడీ టీచర్లు గా అప్గ్రేడ్ చేయడానికి ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మీ అధ్వర్యంలో నల్గొండ క్లాక్ టవర్ వద్ద జరిగిన పాలాభిషేకం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈసందర్బంగా వారు మాట్లాడుతూ టీచర్ విధులు, ఆయా విధులు రెండు నిర్వర్తిస్తూ ఎన్నో కష్టాలను ఎదుర్కొని,గత ఏడు సంవత్సరాలుగా మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ స్థాపించి, ప్రభుత్వానికి మీ సమస్యలను సామరస్యంగా తెలపడం వల్లన నేడు రాష్ట్రంలో ఉన్న 3989 మంది మినీ అంగన్వాడీ టీచర్లను ఎలాంటి షరతులు లేకుండా మెయిన్ అంగన్వాడీ అప్గ్రేడ్ చేసారని ఇందుకు గౌరవ ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు అని తెలిపారు.అనంతరం మినీ అంగన్వాడీ టీచర్స్ రాష్ట్ర అధ్యక్షురాలుఆడెపు వరలక్ష్మి..తమకు ఎల్లవేళలా సహకరిస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు,మంత్రులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి కు, సత్యవతి రాథోడ్ కు మరియు ఎల్లవేళల మాకు సహాయ సహకారాలు అందిస్తు.. నేటి కార్యక్రమానికి విచ్చేసి మాకు శుభాకాంక్షలు తెలిపినందుకు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గార్ల కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం కేకు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైది రెడ్డి,నల్గొండ జిల్లా మినీ అంగన్వాడీ టీచర్స్ అధ్యక్షురాలు గుడిసె ఇందిరా, బీ ఆర్ టీ యు నల్గొండ నియోజకవర్గ ఇంచార్జి అవుట రవీందర్,ప్రధాన కార్యదర్శి సుహాసిని, కమిటీ మెంబర్లు సబితా,రాములమ్మ,చంద్రకళ,శైలజ,అనూష, భాగ్య,దనమ్మ,నాగేంద్ర,జయమ్మ, కమల,లలిత మరియు జిల్లా మినీ అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మంత్రి కేటీఆర్ గారికి నామినేషన్ కోసం 1000 రూపాయలు చొప్పున 1 లక్ష రూపాయలు విరాళం ఇచ్చిన ముఖరా కె పింఛన్ దారులు..

ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మంత్రి కేటీఆర్ గారికి నామినేషన్ కోసం 1000 రూపాయలు చొప్పున 1 లక్ష రూపాయలు విరాళం ఇచ్చిన ముఖరా కె 100 మంది పింఛన్ దారులు..

ముఖరా కె పింఛన్ దారులు 1000 రూపాయలు చొప్పున మొత్తం 100 మంది ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మంత్రి కేటీఆర్ గారికి నామినేషన్ కోసం విరాలాలు ఇచ్చారు, తమకు కేసీఆర్ గారి పింఛనే ఆసరా అని, తమకు పెద్ద కొడుకుల నెల నెల పింఛన్ ఇచ్చి మా బ్రతుకుకు భరోసాగా నిలుస్తుండని, మా వంతు కృషిగా కేసీఆర్ సారు కు మరియు కేటీఆర్ సారుకు నామినేషన్ కోసం 1000 రూపాయలు చొప్పున విరాళం ఇస్తునమ్మన్నారు, జీవితాంతం కేసీఆర్ సార్కి రుణపడి ఉంటామని అన్నారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరియు మంత్రి కేటీఆర్ గారికి తమ విరాళం 1 లక్ష రూపాయలు అందించాలని సర్పంచ్ గాడ్గే మీనాక్షి కి ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గాడ్గే సుభాష్ మరియు పింఛన్ దారులు పాల్గొన్నారు

బాణసంచా ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం :ఏడుగురు సజీవదహనం

బాణసంచా ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం :ఏడుగురు సజీవదహనం

కోల్ కత:ఆగస్టు 27

పశ్చిమ బెంగాల్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో ఆదివారం చోటు చేసుకుంది, ప్రమాదంలో ఏడుగురు మృతి చెందినట్టు తెలిసింది 

వివరాల్లోకి వెళ్తే…నార్త్ 24 పరగణాల జిల్లాలోని దత్తపుకూర్‌ పోలీసుస్టేషన్ పరిధిలోని అక్రమ ఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో భారీగా పేలుడు సంభవించింది.

ఈ పేలుడులో ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది. అక్రమ బాణసంచా తయారీ కేంద్రానికి ఆనుకుని ఉన్న పలు ఇళ్లు కూడా పెద్ద మొత్తంలో దెబ్బ తిన్నాయి. ప్రస్తుతం సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి..

కోల్‌కతాకు ఉత్తరాన 30 కిలోమీటర్ల దూరంలోని దత్తపుకూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నీల్‌గంజ్‌లోని మోష్‌పోల్‌లోని ఫ్యాక్టరీలో పలువురు పని చేస్తున్నారు నేటి ఉదయం 10 గంటలకు ఈ పేలుడు సంభవించిందని పోలీసులు వెల్లడించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు

బీడీ టేకేదారుల్లో ఆత్మగౌరవాన్ని నింపిన ఘనత సీఎం కేసీఆర్‌దే రూప్‌ సింగ్‌

బీడీ టేకేదారుల్లో ఆత్మగౌరవాన్ని నింపిన ఘనత సీఎం కేసీఆర్‌దే రూప్‌ సింగ్‌

బిడీ కార్మికుల తరహాలో టేకేదారులకు ఆసరా పింఛను ఇవ్వడం పట్ల రాష్ట్ర బీడీ టేకేదారుల సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నాడు తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి టేకేదారులు క్షీరాభిషేకం చేశారు.

బీడీ కార్మికుల తరహాలో టేకేదారులకు ఆసరా పింఛను ఇవ్వడం పట్ల రాష్ట్ర బీడీ టేకేదారుల సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నాడు తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి టేకేదారులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యదర్శి, టేకేదారుల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎల్‌ రూప్‌ సింగ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7వేల మంది బీడీ టేకేదారులకు ఆసరా పింఛన్లు అమలు చేసి ఆత్మగౌరవాన్ని నింపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. 6 లక్షల మంది బీడీ కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న బీడీ పరిశ్రమను ఆదుకుంటున్న సీఎం కేసీఆర్‌కు యావత్‌ బీడీ కార్మికులు రుణపడి ఉంటారని తెలిపారు.

దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో బీడీ పరిశ్రమలు ఉండగా.. తెలంగాణ మినహా ఏ ఒక్క రాష్ట్రంలోనూ బీడీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క రూపాయి ఇవ్వడం లేదని రూప్‌ సింగ్‌ తెలిపారు. రకరకాల పేర్లతో బీడీ పరిశ్రమను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు.

ఎమ్మెల్యే ధర్మారెడ్డిని కలిసిన ఎరుకల సంఘం నాయకులు

.

ఎమ్మెల్యే ధర్మారెడ్డిని కలిసిన ఎరుకల సంఘం నాయకులు

       

          సంగెం మండలం..

నేడు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి నివాసంలో ఎరుకల సంఘం నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందచేసి,శాలువతో సన్మానం చేయడం జరిగింది.సంగెం రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు నరహరి ఆధ్వర్యంలో ఎరుకల వివిధ సమస్యలను ఎమ్మెల్యే గారికీ వివరించారు.అందులో ముఖ్యంగా ఎరుకల పిగ్ ఏంపర్మెంట్ స్కీమ్ కింద 60 కోట్లు ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు.ప్రతి మండల సోసైటీ కి 40 లక్షలు మంజూరైనందున మా మాడలానికి ఒక ఎకరం ప్రభుత్వ భూమి ఇవ్వాలని ఎరుకల సంఘం మండల నాయకులు పల్లకొండ బిక్షపతి మరియు రాయపురం సాంబ శివ గారు కోరారు.ఈ విషయం పై సానుకూలంగా స్పందించి ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉంటే ఎరుకల సోసైటీకి ఇప్పించండని స్థానిక ఎంపీపీకి ఎమ్మెల్యే తెలిపారు.ఎరుకల కులస్థులకు గృహ లక్ష్మిలో ప్రాధాన్యత చూపాలని తెలియజేశారు..

   

 ఈ కార్యక్రమంలో ఎరుకల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కేతిరి రాజశేఖర్,హన్మకొండ జిల్లా అధ్యక్షులు లోకిని సమ్మయ్య,జిల్లా ప్రధాన కార్యదర్శి మాణిపాటి రమేష్,సంగెం మండల అధ్యక్షులు పల్లకొండ బిక్షపతి, పిగ్ సోసైటీ మండల చైర్మన్ రాయపురం సాంబశివ,ప్రధాన కార్యదర్శి రాయపురం రాజు,ప్రచార కార్యదర్శి పల్లకొండ కుమారస్వామి,డైరెక్టర్లు రాయపురం మల్లేష్,సమ్మయ్య,జనార్దన్,కుమారస్వామి,శ్రీనివాస్,మల్లయ్య,రాజేష్, ఎల్లస్వామి,ఎల్లయ్య,సదానందం,స్వామి,సాంబమూర్తి,సమ్మక్క,యాకమ్మ,సంతోష తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డిలో కేసీఆర్‌కు బ్రహ్మరథం.. సీఎంకే ఓటేస్తామని పది పంచాయతీల ఏకగ్రీవ తీర్మానం

కామారెడ్డిలో కేసీఆర్‌కు బ్రహ్మరథం.. సీఎంకే ఓటేస్తామని పది పంచాయతీల ఏకగ్రీవ తీర్మానం

కామారెడ్డి నుంచి పోటీ చేయనున్న సీఎం కేసీఆర్ కు ఆ నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పది గ్రామ పంచాయతీలు ఆయనకే ఓటేస్తామని ఏకగ్రీవ తీర్మానాలు ఆమోదించాయి.

కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో గ్రామ గ్రామాన సీఎం కేసీఆర్‌కే ఓట్లు వేస్తామంటూ ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి మండలంలో ఉన్న ఎల్లంపేట, అంకిరెడ్డిపల్లి, నడిమి తండా, వెనుక తాండ, బోడగుట్ట తండా, మైసమ్మ చూరు, రాజకన్ పెట్, వడ్డెర గూడెం, గుంటి తండా, దేవునిపల్లి గ్రామపంచాయతీలు సీఎం కేసీఆర్‌కే ఓటేసి, ఆయన్ను గెలిపిస్తామని ఇప్పటికే ఏకగ్రీవంగా తీర్మానాలు ఆమోదించాయి. శనివారం మాచారెడ్డి మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ లోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంలో ఆమెను కలిసి సంబంధిత తీర్మాన ప్రతులను అందించారు.

ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలు, కార్యకర్తలు రావడం ఏకగ్రీవ తీర్మానాలు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విజ్ఞప్తి మేరకు గజ్వేల్‌తోపాటు కామారెడ్డిలోనూ సీఎం కేసీఆర్ పోటీ చేయాలని పార్టీ నిర్ణయించిందని చెప్పారు. ఈ నిర్ణయంతో రెండు నియోజకవర్గాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా నూతన ఉత్సాహం వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ కామారెడ్డి రావడంతో కేవలం కామారెడ్డి జిల్లాకే కాక ఉమ్మడి నిజామాబాద్ తోపాటు పొరుగున ఉన్న నాలుగైదు జిల్లాలు అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగుతాయని తాను విశ్వసిస్తున్నానని స్పష్టం చేశారు.

కామారెడ్డిలో కేసీఆర్‌ పోటీ చేయడాన్ని నిజామాబాద్ బిడ్డగా తాను స్వాగతిస్తున్నానని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. అందరిలాగే తనకూ ఉత్సాహంగా ఉందని చెప్పారు. సీఎం కేసీఆర్ కే ఓట్లు వేస్తామని ఏకగ్రీవంగా తీర్మానాలు చేయడం చాలా అద్భుతంగా అనిపిస్తోందని, ఏకగ్రీవ తీర్మానాలు చేసిన పది గ్రామాల ప్రజలకు కవిత ధన్యవాదాలు తెలియజేశారు. కారుకు ఎదురు లేకుండా సాగిపోయేలా 10 గ్రామ పంచాయతీల ప్రజలు ఉత్సాహాన్ని ఇచ్చారన్నారు. ఇదే ఉత్సాహం ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కు ఉండేదని చెప్పారు. సీఎం కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తే మరింత అభివృద్ధి అవుతుందన్న ఉద్దేశంతో గంప గోవర్ధన్ కేసీఆర్‌ను ఆహ్వానించారని వివరించారు.

పార్టీలకు అతీతంగా మాచారెడ్డి మండలంలోని గ్రామపంచాయతీలు తీర్మానం చేశాయని, షబ్బీర్ అలీ వంటి వారు ఎన్ని మాట్లాడినా ప్రజలు సీఎం కేసీఆర్‌ను పార్టీలు, కులాలు, మతాలకతీతంగానే చూస్తారని తేల్చి చెప్పారు. కామారెడ్డి లోని సబ్బండ వర్గాల ప్రజలు కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్ బోళా శంకరుడు అని, ఆయనకు ఆయన చేతికి ఎముకంటూ ఉండదని, కాబట్టి కామారెడ్డి తో పాటు పరిసర ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. సీఎం కేసీఆర్ గెలుపుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో ఈనెల 28న కామారెడ్డిలో జరిగే భారీ సమావేశంలో తాను కూడా పాల్గొంటానని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలన్న విషయాన్ని వివరించాలని నాయకులకు కార్యకర్తలకు కవిత దిశానిర్దేశం చేశారు. కామారెడ్డి ప్రజలు తమ పౌరుషం చూపేందుకు ఇది సరైన సమయం అని తెలిపారు. గజ్వేల్ కన్నా ఒక్క ఓటైనా ఎక్కువ మెజారిటీ తెప్పించి చూపాలని అన్నారు.

అవార్డులు వచ్చిన గ్రామపంచాయతీలకు కవిత అభినందనలు తెలిపారు. రాజకీయంగా మనల్ని వ్యతిరేకిస్తున్న పార్టీలు కూడా మన గ్రామాల అభివృద్ధిని ప్రశంసిస్తున్నాయన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మన పల్లెల అభివృద్ధిని చూసి అవార్డులు సైతం ఇస్తున్నదని తెలిపారు. గ్రామాలు, పట్టణాలు బాగుండాలన్న కేసీఆర్ పట్టుదల తోనే ఇవన్నీ సాధ్యమయ్యాయని వివరించారు. కామారెడ్డికి కాళేశ్వరం ప్యాకేజీ 22 ద్వారా నీళ్లు వస్తాయని, సిరిసిల్ల నుంచి కూడా నీటిని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, కార్పొరేషన్ల చైర్మన్లు అయాచితం శ్రీధర్, మఠం బిక్షపతి, మేడే రాజీవ్ సాగర్, మాచరెడ్డి ఎంపీపీ నర్సింగ్ రావ్ , గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యం రావ్, మండల పార్టీ అధ్యక్షుడు బాల్ చంద్రం, కామారెడ్డి సీనియర్ నాయకులు తిరుమల రెడ్డి పాల్గొన్నారు.

కంగ్రాట్స్‌ అల్లు అర్జున్‌: సీఎం కేసీఆర్

కంగ్రాట్స్‌ అల్లు అర్జున్‌

తన అత్యుత్తమ నటన ద్వారా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దకించుకొన్న ప్రముఖ సినీహీరో అల్లు అర్జున్‌కు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో..

తెలుగు చలనచిత్రాలు సత్తాచాటడంపై ఆయన శనివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. 69 ఏండ్లలో తొలిసారి తెలుగు హీరోకి ఉత్తమ నటుడిగా అవార్డు దకడం గర్వకారణంగా ఉన్నదని చెప్పారు.

69 ఏండ్లకు బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు దక్కడం హర్షనీయం

తెలుగు సినిమాలకు జాతీయ అవార్డులు గర్వకారణం

తెలుగు చిత్ర రంగాభివృద్ధికి మరింత కృషి: సీఎం కేసీఆర్‌

తన అత్యుత్తమ నటన ద్వారా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దకించుకొన్న ప్రముఖ సినీహీరో అల్లు అర్జున్‌కు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో.. తెలుగు చలనచిత్రాలు సత్తాచాటడంపై ఆయన శనివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. 69 ఏండ్లలో తొలిసారి తెలుగు హీరోకి ఉత్తమ నటుడిగా అవార్డు దకడం గర్వకారణంగా ఉన్నదని చెప్పారు. నాటితరం గొప్పనటుడు అల్లు రామలింగయ్య వారసుడిగా, విలక్షణ నటులైన చిరంజీవి స్ఫూర్తితో నేటితరం నటుడిగా స్వశక్తితో ఎదిగిన అల్లు అర్జున్‌ కృషి గొప్పదని కొనియాడారు.

తన సృజనాత్మక రచనతో సినీపాటల సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన ఆసార్‌ అవార్డు గ్రహీత చంద్రబోస్‌కు ఉత్తమ సినీ సాహిత్యానికి జాతీయ అవార్డు దకడం పట్ల సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు. చంద్రబోస్‌కు శుభాకాంక్షలు తెలిపి, అభినందించారు. ఉత్తమ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌, ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌ కాళభైరవ, ఉత్తమ ఫిల్మ్‌ క్రిటిక్‌ పురుషోత్తమాచార్యులతోపాటు ఆయా విభాగాల్లో జాతీయ అవార్డులు పొందిన పలు సినిమాలకు చెందిన నిర్మాతలు, దర్శకులు, నటులు, సాంకేతిక సిబ్బందికి సీఎం కేసీఆర్‌ అభినందనలు తెలిపారు. తెలుగు చలనచిత్ర రంగం హైదరాబాద్‌ కేంద్రంగా జాతీయ, అంతర్జాతీయస్థాయిలో తన ప్రతిభను చాటుతుండటం గొప్ప విషయమని పేర్కొన్నారు.

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షాదరణ పొందుతూ, ఫిల్మ్‌ ప్రొడక్షన్‌లో తెలుగు సినిమా దేశానికి ఆదర్శంగా నిలువడం గర్వ కారణమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో హైదరాబాద్‌ కేంద్రంగా తెలుగు సినిమా భారతీయ సినిమాతో పోటీపడుతుండటం అభినందనీయమని అన్నారు. తెలుగు చిత్ర రంగాభివృద్ధికోసం రాష్ట్ర ప్రభుత్వం తన వంతు కృషి కొనసాగిస్తూనే ఉంటుందని భరోసా ఇచ్చారు. విభిన్న సంస్కృతుల మేళవింపుతో భవిష్యత్తులో తెలుగు సినిమా విశ్వవ్యాప్తంగా మరింతగా విస్తరించాలని ఆకాంక్షించారు.

నల్లగొండ స్థానిక హనుమాన్ దేవాలయం లోని మహాలక్ష్మి అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కంచర్ల

 

నేడు నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు.. స్థానిక తులసి నగర్ హనుమాన్ దేవాలయం లో... నూతనంగా నిర్మాణం చేసిన మహాలక్ష్మి దేవాలయ లక్ష్మీ అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు...

 ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, స్థానిక కౌన్సిలర్ మారగోని నవీన్ గౌడ్.. ఆలయ కమిటీ చైర్మన్ నేలపట్ల రమేష్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.