TSNews

Sep 30 2020, 11:58

మిలిటరీ ఇంటెలిజెన్స్‌ నుంచి వచ్చామంటూ కిడ్నాప్‌... 

 హైదరాబాద్‌ 

  సైన్యంలో చేరాలనుకున్న యువకుడు అది నెరవేరకపోవడంతో నకిలీ సైనికాధికారి అవతారం ఎత్తి నేరాల బాట పట్టాడు. మరో ముగ్గురితో కలిసి ఓ వ్యక్తిని కిడ్నాప్‌ చేసి సైబరాబాద్‌ పోలీసులకు చిక్కాడు. సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ కమిషనరేట్‌లో మంగళవారం వివరాలు వెల్లడించారు.

సైనికాధికారిగా బురిడీ.. నాగరాజు రఘువర్మ అలియాస్‌ ఎస్‌ఎస్‌ కార్తికేయ సింగ్‌ (21) పగో జిల్లా పాలకొల్లుకు సమీపంలోని కొమ్ముచిక్కాల వాసి. 2016లో చదువు పూర్తి కాగానే డ్రైవింగ్‌ నేర్చుకుని హైదరాబాద్‌లో పనికి కుదిరి యజమాని ఇంట్లో చోరీ చేయడంతో సనత్‌నగర్‌, పంజాగుట్ట ఠాణాల్లో కేసు నమోదైంది. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో పాల్గొనగా ఉద్యోగం వచ్చినా కేసులుండటంతో అనర్హుడయ్యాడు. దాంతో నకిలీ సైనికాధికారి అవతారమెత్తి, 2 ఎయిర్‌ రైఫిల్స్‌, డమ్మీ తుపాకీ కొని కారుకు సైనిక స్టిక్కర్లు అతికించుకుని తిరిగేవాడు. గ్యాలంటరీ మెడల్స్‌ తయారు చేయించి మేజర్‌, కర్నల్‌గా ప్రచారం చేసుకున్నాడు. సీఏలో ర్యాంకు సాధించిన తన కుమారుడికి ఓ సీఐ ఇతనితో సత్కారం చేయించడం గమనార్హం.

కిడ్నాప్‌ బాగోతం: ఆర్మీలో ఉద్యోగాలంటూ నిరుద్యోగుల నుంచి రూ.6.8 లక్షలు వసూలు చేశాడు. వ్యాపారవేత్తను కిడ్నాప్‌ చేస్తే భారీగా డబ్బు వస్తుందని మిత్రులు.. ప.గో జిల్లా నర్సాపూర్‌ వాసి కల్లెపల్లి రాజేష్‌ (26), విజయనగరం జిల్లా పార్వతీపురం తాలుకా ఉద్దవోలు వాసి లావేటి రామకృష్ణ (36), కామారెడ్డి జిల్లా గాంధారి మండలం నేరళ్‌ తాండా వాసి ఆర్‌.జోరే సింగ్‌ (19)తో కలిసి సెప్టెంబర్‌ 4న పథకం వేశాడు. మరుసటిరోజు ‘మిలిటరీ ఇంటలిజెన్స్‌ నుంచి వచ్చాం.. మీ మిత్రుడి తండ్రి దేశద్రోహానికి పాల్పడ్డాడు.. వివరాలు కావాలంటూ భెల్‌ వద్ద జి.నిఖిల్‌ను ఎత్తుకెళ్లి హఫీజ్‌పేట్‌లో ఐ హెల్త్‌ కార్డ్‌ ఆయుర్వేదిక్‌ దుకాణంలో కూర్చోబెట్టారు. మిత్రుడి తండ్రిని ఎన్‌కౌంటర్‌ చేస్తామంటూ నిఖిల్‌ను సైనిక దుస్తుల్లో ఉన్న కార్తికేయ బెదిరించి రూ.26 వేలు లాక్కుని బాధితుడి కారుతో ఉడాయించారు. నిఖిల్‌ ఫిర్యాదుతో మాదాపూర్‌ ఎస్వోటీ ఇన్‌స్పెక్టర్‌ సుధీర్‌ బృందం నలుగురిని అరెస్ట్‌ చేసి 2 యూనిఫాంలు, 3 ఆయుధాలు, 4 నకిలీ ఐడీకార్డులు, ధ్రువపత్రాలు స్వాధీనం చేసుకుంది.

 Source : ఈనాడు

TSNews

Sep 29 2020, 17:20

రేపటి నుంచి ఈ డెబిట్ కార్డులు పనిచేయవు...?

  ప్రస్తుతం అన్నిరకాల బ్యాంకులు తమ కస్టమర్లకు డెబిట్ క్రెడిట్ కార్డుల సదుపాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. వివిధ రకాల కార్యకలాపాలు జరుపుకునేందుకు ఎన్నో సర్వీసులను కూడా తమ కస్టమర్లకు అందుబాటులోకి ఉంచాయి వివిధ బ్యాంకులు. రేపటి నుంచి డెబిట్ క్రెడిట్ కార్డు వినియోగదారులు ఇబ్బంది పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 30 తర్వాత డెబిట్ క్రెడిట్ కార్డుల సేవలు నిలిచిపోనున్నాయి.

సెప్టెంబర్ 30 తర్వాత డెబిట్ క్రెడిట్ కార్డ్ పై ఇంటర్నేషనల్ ఆన్లైన్ కాంటాక్ట్ ట్రాన్సాక్షన్ లెస్ సర్వీసులు పూర్తిగా నిలిచిపోనున్నట్లు తెలుస్తోంది. డెబిట్ క్రెడిట్ కార్డ్ సేవలను పునరుద్ధరించుకునేందుకు ఆన్లైన్ యాప్, ఏటీఎం సెంటర్, లేదా సమీప బ్రాంచ్ కి వెళ్లి ఈ సేవలను పునరుద్ధరించేందుకు అవకాశం ఉంటుంది.
  రిక్వెస్ట్ చేసిన అనంతరం 24 గంటలు ఈ సేవలు మళ్లీ పునరుద్ధరించబడతాయి. అందుకే ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఆగిపోతే కంగారు పడకుండా వెంటనే బ్యాంకు కి వెళ్లి రిక్వెస్ట్ చేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.

TSNews

Sep 29 2020, 16:41

హైదరాబాద్‌లో బతుకమ్మ చీరల ప్రదర్శన...

 హైదరాబాద్ 

నగరంలోని టూరిజం ప్లాజాలో 2020 - బతుకమ్మ చీరల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరలను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు.చేనేత కార్మికులు బతుకమ్మ చీరలను మరమగ్గాలపై తయారు చేశారు. ఈ ఏడాది 287 విభిన్నమైన డిజైన్స్‌లలో బతుకమ్మ చీరలు సిద్ధంగా ఉన్నాయి. బంగారు, వెండి జరీ అంచులతో పాలిస్టర్ పిలిమెంట్ నూలు చీరలను తయారీ చేశారు. దాదాపు రూ.317.81 కోట్ల వ్యయంతో ప్రభుత్వం చీరలను తయారు చేయించింది. కోటికి పైగా చీరలను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాలకు చీరలు చేరాయి. అక్టోబర్ రెండో వారంలో తెలంగాణ ఆడపడుచులకు చీరలను పంపిణీ చేయనున్నారు.

TSNews

Sep 29 2020, 15:32

వీట్‌గ్రాస్ జ్యాస్ అధికంగా తాగితే ఈ స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు!

  వీట్‌గ్రాస్ శక్తి స్థాయిలను పెంచుతుందని కొందరు భావిస్తున్నారు. ఇది పనితీరును పెంచేదిగా పనిచేస్తుందని మరికొందరు నమ్ముతారు. ఇది సాధారణంగా సురక్షితమైనది అయిన‌ప్ప‌టికీ, దాని వినియోగం త‌ర్వాత అనేక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మ‌ట్టినుంచి వ‌చ్చే వీట్‌గ్రాస్ కలుషితమయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇది తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. కూరగాయలతో పోల్చినప్పుడు వీట్‌గ్రాస్ అంత మంచిదేం కాదు. ఇప్పుడు వీట్‌గ్రాస్ వ‌ల్ల క‌లిగే దుష్ప్రభావాల గురించి తెలుసుకుందాం.

తలనొప్పి

కొంతమంది వీట్‌గ్రాస్ జ్యూస్ తాగిన తర్వాత తలనొప్పికి గుర‌వుతారు. ఇది తలనొప్పి, వికారానికి చికిత్సగా పనిచేస్తున్నప్పటికీ, అధికంగా తీసుకోవడం వ‌ల్ల‌ తలనొప్పికి దారితీస్తుంది. రసాన్ని తక్కువ పరిమాణంలో తీసుకోవడం వల్ల తలనొప్పి వచ్చే ప్రమాదం తక్కువ‌గా ఉంటుంది. 

వికారం

వీట్‌గ్రాస్ తాగ‌డం వ‌ల్ల‌ వికారానికి కూడా గురి కావొచ్చు. ఈ స‌మ‌స్య ఇలానే ఉంటే దయచేసి వైద్యుడిని సంప్ర‌దించ‌డం మేలు. కీమోథెరపీ చికిత్సలో పాల్గొన్న ఆరుమంది రోగులలో వీట్‌గ్రాస్ వికారం కలిగిస్తుందని తెలిసింది. 

అలెర్జీ

వీట్‌గ్రాస్ తాగ‌డం వ‌ల్ల‌ అలెర్జీకి గుర‌వుతారు. అలెర్జీకి గురైతే వీట్‌గ్రాస్‌కు దూరంగా ఉండ‌టం మంచిది. ఇది ఒక‌టే కాకుండా వికారం, తిమ్మిరి, వాంతులు మరియు విరేచనాలకు కారణం కావచ్చు. వీట్‌గ్రాస్ తీసుకున్న తర్వాత ఇలాంటి సంకేతాలు ఏవైనా ఎదురైతే వైద్యుడిని సంప్ర‌దించ‌డం ఉత్త‌మం. 

మలబద్దకం

గోధుమ గ్రాస్ రసం తీసుకోవడం మలబద్దకానికి దారితీస్తుందని కొందరు నమ్ముతారు. కాని ఈ విష‌యాన్ని నిరూపించడానికి ఆధారాలు లేవు. అయినప్పటికీ, వీట్‌గ్రాస్ తాగిన త‌ర్వాత ప‌రిస్థితి బాగులేకుంటే డాక్ట‌ర్‌ని సంప్ర‌దించాలి. 

ఆకలిని చంపేస్తుంది

బరువు తగ్గాల‌నుకునే వారికి వీట్‌గ్రాస్ ఉప‌యోగ‌ప‌డుతుంది. వీట్‌గ్రాస్ ఆక‌లిని అణిచివేస్తుంద‌ని చెప్ప‌డానికి ఎలాంటి ఆధారాలు లేవంటున్నారు. 

అలసట

వీట్‌గ్రాస్ అధికంగా తాగేవారిలో అల‌స‌టకు గుర‌వుతున్నారు. కొంత‌మంది మైకానికి కూడా గుర‌వుతున్నారు. వీట్‌గ్రాస్ కాలుష్య‌మే ఈ స‌మ‌స్య‌ల‌కు కార‌ణం.

TSNews

Sep 29 2020, 15:10

త్వరలో అందుబాటులోకి కొవాగ్జిన్‌: తమిళిసై

    కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ తయారు చేస్తున్న ‘కొవాగ్జిన్‌’ త్వరలో అందుబాటులోకి వస్తుందని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై విశ్వాసం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ శామీర్‌పేటలోని భారత్‌ బయోటెక్‌ను మంగళవారం సందర్శించిన గవర్నర్‌ .. వ్యాక్సిన్‌ తయారీలో భాగస్వాములైన శాస్త్రవేత్తలతో మాట్లాడారు. కరోనా వ్యాక్సిన్‌ మీద శాస్త్రవేత్తలు ఎంతో శ్రద్ధ పెట్టి పనిచేస్తున్నారన్నారు. ప్రధాని నరేంద్రమోదీ చెప్పినట్టు దేశంలో కరోనాకు వ్యాక్సిన్‌ తయారు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గవర్నర్‌ పేర్కొన్నారు. 2020లోనే కరోనాకు వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. వ్యాక్సిన్‌ కోసం అహర్నిశలు కష్టపడుతున్న శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు తెలిపేందుకు వచ్చినట్టు గవర్నర్‌ తెలిపారు.

 Source : ఈనాడు

TSNews

Sep 29 2020, 13:40

మళ్లీ మొదలు కానున్న డ్రంక్ అండ్ డ్రైవ్ త‌నిఖీలు... 
  
 హైదరాబాద్ 

  రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో నిలిపివేసిన డ్రంక్ అండ్ డ్రైవ్ త‌నిఖీల‌ను తిరిగి మొదలు పెట్టేందుకు హైదరాబాద్ పోలీసులు రెడీ అవుతున్నారు.
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో నిలిపివేసిన డ్రంక్ అండ్ డ్రైవ్ త‌నిఖీల‌ను తిరిగి మొదలు పెట్టేందుకు హైదరాబాద్ పోలీసులు రెడీ అవుతున్నారు.

  తెలంగాణ‌లోని బార్లు, క్ల‌బ్బులు తెరిచేందుకు రాష్ర్ట ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చిన విష‌యం విదిత‌మే. ఈ నేప‌థ్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ త‌నిఖీల‌కు హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు సిద్ధ‌మ‌వుతున్నారు. 

   త‌నిఖీల‌కు సంబంధించి స్టాండ‌ర్డ్ ఆప‌రేటింగ్ ప్రోసిజ‌ర్స్ ని రూపొందిస్తున్నామ‌ని ట్రాఫిక్ అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్ తెలిపారు. ఎస్‌వోపీని రూపొందించిన త‌ర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ త‌నిఖీలు ఎలా చేపట్టాలో పోలీసులకు వివరిస్తామని ఆయన అన్నారు. క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో ఇత‌ర రాష్ట్రాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ స‌మ‌యంలో పోలీసులు తీసుకుంటున్న జాగ్రత్తలను కూడా ప‌రిశీలిస్తున్నామ‌ని చెప్పారు. అయితే, ట్రాఫిక్ పోలీసు చెక్ పాయింట్ల‌ను వీలైనంత వ‌ర‌కు త‌గ్గిస్తామ‌న్నారు.

   రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ప్ర‌ధాన ర‌హ‌దారుల్లో త‌నిఖీలు చేపడుతామ‌ని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ త‌నిఖీల్లో పాల్గొనే పోలీసుల‌కు పీపీఈ కిట్లు,శానిటైజ‌ర్లను అందుబాటులో ఉంచుతామ‌ని అనిల్ కుమార్ తెలియజేశారు.

TSNews

Sep 29 2020, 12:38

ప్రభుత్వ వాహనంలో అక్రమ మద్యం సరఫరా... 

  హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న సౌత్ సెంట్రల్ రైల్వే శాఖకు చెందిన లారీ..

కంచికచర్ల మండలం దొనబండ చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించిన కంచికచెర్ల పోలీసులు...

రైల్వే స్క్రాప్ మెటీరియల్ కింద దాచి ఉంచిన ఖరీదైన మద్యం బాటిల్ లను గుర్తించిన పోలీసులు ...

అక్రమ మద్యం తో పాటు వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురు రైల్వే టెక్నీషియన్ లు ...

64 ఖరీదైన మద్యం సీసాలతో పాటు లారీని కంచికచర్ల పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు..

డ్రైవర్ తో పాటు నలుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు..

TSNews

Sep 29 2020, 11:33

తెలంగాణలో కరోనా అప్డేట్స్...
 Date : 29-09-2020 

కొత్తగా 2,072 కరోనా కేసులు

  తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 54,308 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 2,072 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

 దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,89,283కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది.

 నిన్న ఒక్కరోజే కరోనాతో 9 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,116కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,259 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,58,690కి చేరింది.

 రాష్ట్రంలో ప్రస్తుతం 29,477 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 23,934మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 29,40,642కి చేరింది.

TSNews

Sep 27 2020, 17:03

జగిత్యాల పట్టణంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు... 

 జగిత్యాల జిల్లా కేంద్రం 

  ఈరోజు జగిత్యాల పట్టణంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా స్థానిక అంగడి బజార్ లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ గారు.

  అనంతరం డా.సంజయ్ కుమార్ గారు మాట్లాడుతూ... 

  కొండ లక్ష్మణ్ బాపూజీ గారు గాంధేయవాది అని,స్వాతంత్ర్య సమర యోధుడని, అహింసావాదని తెలంగాణ సాధన కోసం తపించే వారని, వారి ఆశయాలకు అనుగుణంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మలి దశ ఉద్యమాన్ని వారి వద్దనుండే ప్రారంభించారని, బాపూజీ ఆశయాలకు అనుగుణం గా ఉద్యమాన్ని కొనసాగించి తెలంగాణాను సాధించారని, ఈనాడు తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఉద్యమ నాయకుణ్ణి మనం స్మరించుకుంటున్నామని, గత ప్రభుత్వాలు తెలంగాణ వీరులను మరచి ఆంధ్ర నాయకులకు తొత్తులుగా పని చేసారని అన్నారు. ఈనాడు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో కొండ లక్ష్మణ్ బాపూజీ గారి పెరు మీద హార్టీ కల్చర్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేశారని, తెలంగాణ వచ్చిన తర్వాత బీద బడుగు బలహీన వర్గాలకు అత్యంత ప్రాధాన్యం కల్పించామని, రైతులకు,సంక్షేమం లో ముందు వరుసలో ఉన్నామని, ఈనాడు పద్మశాలి కులస్తులకు, చేనేతలకు కుల వృత్తుల వారికి మన ప్రభుత్వం అండగా ఉండి, చేనేతలకు నెలకు 20వేల రూపాయలు వచ్చే విధంగా ఉపాధి కల్పిస్తున్నామని, బతుకమ్మ చీరలు ఇతర రకాలుగా ఉపాధి కల్పిస్తున్నామని అన్నారు.

  ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశం,మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి,వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, పద్మశాలి సంఘ అధ్యక్షుడు ఒల్లల గంగాధర్, పద్మశాలి కార్యవర్గం, కౌన్సిలర్లు, పట్టణ పార్టీ ఉపాధ్యక్షుడు ఆనంద్ రావు, యూత్ అధ్యక్షుడు కత్రోజ్ గిరి,ఉపాధ్యక్షుడు కూతురు శేఖర్, రాష్ట్ర వడ్డెర సంఘ అధ్యక్షుడు మోగిలి, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

TSNews

Sep 27 2020, 16:55

చల్ గల్ బస్టాండ్ ప్రయాణ ప్రయాణ ప్రాంగణం లో దారుణ హత్య... 

జగిత్యాల జిల్లా రూరల్ 

  జగిత్యాల రూరల్ మండలం చల్ గల్ బస్టాండ్ ప్రయాణ ప్రయాణ ప్రాంగణం ప్రక్కన గుడిసెలో దారుణ హత్య...

  మేన మామా ను కత్తితో పొడిచి హత్య చేసిన మేనల్లుడు...

  కుటుంబ కలహాలతో శివరాత్రి అంజయ్య అనే వ్యక్తి అతని మేన మామా అయిన గొళ్ళెం రాజయ్య ను కత్తి తో పొడిచి హత్య చేశాడు....

  ఘటన స్థలానికి చేరుకున్న అదనపు ఎస్పీ సురేష్ కుమార్ కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.