/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz అమరావతిలో మరో కార్యక్రమానికి శ్రీకారం జనవరి నుంచి పనులు ప్రారంభం Raghu ram reddy
అమరావతిలో మరో కార్యక్రమానికి శ్రీకారం జనవరి నుంచి పనులు ప్రారంభం

రాజధాని అమరావతి నిర్మాణాలకు కూటమి సర్కార్‌ తిరిగి జీవం పోస్తుంది. వైఎస్సార్సీపీ సర్కార్‌ కక్షపూరిత ధోరణితో పునాదుల దశలోనే నిలిచిపోయిన ఐకానిక్‌ భవనాల పనులను ప్రారంభించేందుకు సిద్ధమైంది. దీని కోసం ఐకానిక్‌ ర్యాప్ట్‌ ఫౌండేషన్‌ వద్ద ఉన్న నీటిని తోడే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మరోవైపు అమరావతి ఓఆర్ఆర్ అలైన్‌మెంట్‌ ఎక్కువ మలుపులు లేకుండా నిర్మించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.

రాజధాని అమరావతి పనులను కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోంది. ఇప్పటికే సీఆర్డీఏ భవనం పనులను సీఎం చంద్రబాబు పునఃప్రారంభించారు. ఇప్పుడు ఐకానిక్‌ భవనాల నిర్మాణంపై దృష్టి సారించింది. గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లో భాగమైన జీఏడీ టవర్స్‌, హెచ్ఓడీ టవర్స్‌, హైకోర్టు, అసెంబ్లీ భవనాల ర్యాప్ట్‌ ఫౌండేషన్లు గతంలోనే పూర్తయ్యాయి. అయితే గత ఐదేళ్లుగా వీటిని జగన్‌ సర్కార్‌ గాలికొదిలేయడంతో చుట్టూ నీరు చేరి ఆ ప్రదేశమంతా తటాకాన్ని తలపిస్తోంది.

దీంతో వీటి పటిష్ఠతపై ఇప్పటికే మద్రాస్‌, హైదరాబాద్‌ ఐఐటీ నిపుణుల బృందంతో అధ్యయనం చేయించారు. శాస్త్రీయ అధ్యయనం చేసిన నిపుణుల బృందం ఫౌండేషన్‌కి ఎటువంటి ఢోకా లేదని తేల్చింది. దీంతో ఫౌండేషన్‌ వద్ద నీటిని తోడేస్తున్నారు. రెండు ట్రాక్టర్‌లకు భారీ మోటార్లు బిగించి పైప్‌లైన్ల ద్వారా నీటిని పాలవాగులోకి వదిలి తరలిస్తున్నారు. అక్కడి నుంచి కృష్ణా నదిలోకి పంపిస్తున్నారు.

జీఏడీ టవర్స్‌ బేస్‌మెంట్‌, గ్రౌండ్‌తో పాటు 47 అంతస్థులు, టెర్రస్‌, హెలీప్యాడ్‌తో సహా నిర్మాణం చేపట్టనున్నారు. హెచ్ఓడీ టవర్స్‌ బేస్‌మెంట్‌, గ్రౌండ్‌, 39 అంతస్థులు, టెర్రస్‌లతో నిర్మించనున్నారు. అసెంబ్లీ భవనం 250 మీటర్ల టవర్‌ ఎత్తుతో 103 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నిర్మించేందుకు నిర్ణయించారు. హైకోర్టు నిర్మాణంలో బేస్‌మెంట్‌, గ్రౌండ్‌, 7 అంతస్థులతో 55 మీటర్లు ఎత్తు ఉండేలా నిర్మించనున్నారు. ఇప్పటికే వీటన్నింటికీ ర్యాప్ట్‌ ఫౌండేషన్‌ పూర్తికాగా, జనవరి నుంచి పనులు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

అమరావతి అవుటర్‌ రింగ్‌ రోడ్డుని ఎక్కువ మలుపులు లేకుండా నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇటీవల ఓఆర్ఆర్ అలైన్‌మెంట్‌పై ఎన్హెచ్ఏఐ, ఆర్ అండ్‌ బీ, సీఆర్డీఏ అధికారులతో సమీక్షించిన సీఎం పలు మార్పులు సూచించారు. ఓఆర్ఆర్ అలైన్‌మెంట్‌కి సీఆర్డీఏ ఇప్పటికే ఎన్ఓసీ జారీ చేసింది. ఆర్ అండ్‌ బీ శాఖ కూడా ఎన్ఓసీ జారీ చేస్తే, ఆ ప్రతిపాదనను ఎన్హెచ్ఏఐ కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆమోదం కోసం పంపిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.అలైన్‌మెంట్‌ ఖరారైతే భూసేకరణ ప్రక్రియ ప్రారంభిస్తామన్నాయి. మరోవైపు ఓఆర్ఆర్ నిర్మాణానికయ్యే మొత్తం ఖర్చు భరించేందుకు కేంద్రం ఇప్పటికే అంగీకారం తెలిపింది. ఓఆర్ఆర్ని ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో 189 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్నారు. దీనిని ఏడు జాతీయ రహదారులతో అనుసంధానించనున్నారు. అనంతపురం జిల్లా కొడికొండ చెక్‌పోస్టు నుంచి ముప్పవరం వరకు నిర్మిస్తున్న యాక్సెస్‌ కంట్రోల్డ్‌ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారిని ఓఆర్ఆర్ వరకు పొడిగించనున్నారు.

27న విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త నిరసన జయప్రదం చేయాలి: సజ్జల రామకృష్ణారెడ్డి

కూటమి సర్కార్ విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈ నెల 27న తలపెట్టిన ర్యాలీలు, వినతి పత్రాల సమర్పణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి బుధవారం ఆయన జిల్లా పార్టీ అధ్యక్షులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ప్రజలపై రూ.15 వేల కోట్ల భారం వేయడం దుర్మార్గమన్నారు. పెంచిన చార్జీలను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహించి వినతి పత్రాలను సమర్పించాలన్నారు. అన్ని నియోజకవర్గాల ఇన్‌చార్జిలు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలన్నారు. 

రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల నేతృత్వంలో ఇప్పటికే పార్టీ శ్రేణులతో సమావేశాలు జరిగాయన్నారు. అన్ని జిల్లాల్లోనూ వైసీపీ పోరుబాట పోస్టర్ల ఆవిష్కరణలు నిర్వహించారన్నారు. వైసీపీ చేపట్టిన ఈ నిరసనలపై ఇప్పటికే ప్రజల్లో ఆదరణ కనిపిస్తోందని సజ్జల అన్నారు. ప్రజా సమస్యలపై వైసీపీ బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తోందని తెలిపారు. 

విద్యుత్ చార్జీల పెంపు భారం అన్ని వర్గాలపై పడుతోందన్నారు. దీంతో ఆయా వర్గాలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. వీరంతా వైసీపీ తలపెట్టిన నిరసనల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ క్రమంలో ప్రజా సంఘాలు, సంస్థలను కలుపుకుని నిరసన ప్రదర్శనలు పెద్ద ఎత్తున నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.

మోదీ యోగిపై కుంభమేళాలో దాడి చేస్తాం: పన్నూ

ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిలపై దాడి చేస్తామంటూ ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ బెదిరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిలపై దాడి చేస్తామంటూ ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ బెదిరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. ఇందుకుతన ఉగ్రవాద సంస్థ సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎ్‌ఫజే) కుంభమేళా సందర్భంగా ప్రతీకారం తీర్చుకుంటుందన్నాడు.

నకిలీ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు సిక్కు యువతను చంపినట్టు ఆ వీడియోలో పన్నూ ఆరోపించాడు. చనిపోయిన ఉగ్రవాదుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం చేయనున్నట్టు హామీ ఇచ్చాడు. కుంభమేళాలలో భాగంగా షాహి స్నానాలకు శుభప్రదమైన జనవరి 14, 29, ఫిబ్రవరి 3వ తేదీల్లో దాడులు చేయనున్నట్టు చెప్పాడు. ఆ రోజుల్లో ప్రధాని మోదీ, సీఎం యోగిలు ప్రయాగ్‌రాజ్‌లో ఉంటారని నొక్కిచెప్పాడు.

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ పలు కీలక అంశాలపై చర్చ

ఏపీ సీఎం చంద్రబాబు దిల్లీలో పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం ఎన్డీయే నేతల సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు...సాయంత్రం కేంద్ర ప్రభుత్వ పెద్దలతో భేటీ అవుతున్నారు. తాజాగా ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో చర్చించినట్టు సమాచారం. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానిని కోరినట్లు తెలుస్తోంది. గత ఆరు నెలల్లో ఏపీలో కూటమి ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, పోలవరం ప్రాజెక్టు పనుల్లో పురోగతిని సీఎం చంద్రబాబు ప్రధానికి వివరించినట్టు సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటా, నిధుల కేటాయింపులపై ప్రధానితో సీఎం చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది.

రాజధాని అమరావతి నిర్మాణానికి గత మధ్యంతర బడ్జెట్‌లో రూ.15 వేల కోట్లు ఆర్థిక సాయాన్ని ప్రతిపాదించారు. దీనిని వేగవంతం చేయాలని ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు కోరినట్లు సమాచారం. అలాగే విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సహకారం అందించడంతోపాటు వరద సెస్‌కు అనుమతి ఇవ్వాలని ప్రధాని మోదీని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో చేపట్టే నూతన ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయాలని ప్రధానిని విజ్ఞప్తి చేశారు. దాదాపు గంటకు పైగా ప్రధానితో చంద్రబాబు భేటీ అయ్యారు. మరోవైపు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు.

బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా నివాసంలో బుధవారం ఉదయం ఎన్డీయే నేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎన్డీయే ప్రతినిధులు పాల్గొన్నారు. అంబేడ్కర్‌పై అమిత్‌ షా వ్యాఖ్యల నేపథ్యంలో పార్లమెంట్‌లో చేలరేగిన దుమారం, పలు రాజకీయ అంశాలపై ఎన్డీయే నేతలు ఈ భేటీలో చర్చించినట్లు తెలిసింది. వాజ్‌పేయ్ శత జయంతి వేళ సుపరిపాలన అంశాలపై సమాలోచనలు జరిపారు. జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును జేపీసీకి పంపించడంతో..ఆ అంశంపై చర్చించినట్టు తెలిసింది. మిత్రపక్షాల మధ్య సమన్వయం, కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేసే అంశాలపై చర్చించారు.

ఎన్డీయే సమావేశం అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సుమారు 15 నిమిషాల పాటు వీరి సమావేశం జరిగింది. ఆ తర్వాత నడ్డా నివాసంలోనే కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామిని సీఎం చంద్రబాబును కలిశారు. విశాఖ ఉక్కు పరిశ్రమపై చర్చించారు. అనంతరం రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ను కలిసిన సీఎం చంద్రబాబు... రైల్వే జోన్‌ సహా, వివిధ రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి అంశాలపై చర్చించినట్లు సమాచారం.

శ్రీతేజ్‌ కోసం వేణు స్వామి సంచలన నిర్ణయం

అల్లు అర్జున్ అరెస్ట్ నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్‌ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటనలో తీవ్రంగా గాయపడ్డ తొమ్మిదేళ్ల బాలుడు శ్రీతేజ్‌కు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. అతని పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో దిల్‌సుఖ్‌‌నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. తొమ్మిది సంవత్సరాల వయస్సున్న ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. కిమ్స్ ఆసుపత్రి పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నాడు.

శ్రీతేజ్‌ను ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి, కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పరామర్శించారు. కొద్దిసేపటి కిందటే ఆయన కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. ఆ బాలుడి తండ్రి భాస్కర్‌తో మాట్లాడారు. ధైర్యం చెప్పారు. ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. శ్రీతేజ్‌కు అందుతున్న చికిత్స గురించి డాక్టర్లు, అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం వేణు స్వామి విలేకరులతో మాట్లాడారు. ఆ బాలుడి కుటుంబానికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ మొత్తంతో కూడిన చెక్‌ను భాస్కర్‌కు ఇచ్చారు. భాస్కర్ కుమార్తె కోసం ఈ మొత్తాన్ని ఇచ్చానని వివరించారు. 1,000 సినిమాల వరకు తాను ముహూర్తాలను పెట్టానని, సినిమా సొమ్మును తిన్నానని, అందుకే ఆ మొత్తంలో కొంత భాస్కర్‌కు ఇచ్చానని పేర్కొన్నారు.

శ్రీతేజ్ ఆరోగ్యం గురించి విలేకరులు ప్రశ్నించగా.. 90 శాతం వరకు మెరుగుపడిందని అన్నారు. వెంటిలేటర్, ఆక్సిజన్ సపోర్ట్ లేకుండానే చికిత్స తీసుకుంటోన్నాడని చెప్పారు. శ్రీతేజ్ మృత్యువు బారిన పడకుండా తనవంతు సహాయం అందించాలని నిర్ణయించుకున్నట్లు వేణు స్వామి తెలిపారు. అపమృత్యు దోషం తొలగిపోవడం కోసం మృత్యుంజయ హోమాన్ని నిర్వహిస్తానని చెప్పారు.

శ్రీతేజ్ కోసం ఏం చెస్తే బాగుంటుందని తాను కొంతమందితో మాట్లాడానని మృత్యుంజయ హోమం చేయాలని కొందరు సలహా ఇస్తోన్నారని అన్నారు. తన సొంత ఖర్చుతో మృత్యుంజయ హోమాన్ని నిర్వహిస్తానని, ఈ విషయాన్ని శ్రీతేజ్ తండ్రికి కూడా తెలియజేశానని వేణు స్వామి చెప్పారు.

తెలంగాణను ఫాలో అవ్వండి చంద్రబాబుకు సీపీఐ లీడర్ లేఖ

రాష్ట్రంలో బెనిఫిట్ షోలు, సినిమా టికెట్ రేట్ల పెంపు లేకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ సీఎం నారా చంద్రబాబునాయుడును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఈ మేరకు లేఖ రాశారు. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపునకు అనుమతిస్తారనే కారణంగా భారీ బడ్జెట్ సినిమాలు తీస్తూ.. ఆ భారాన్ని ప్రజలపై మోపుతున్నారని రామకృష్ణ ఆరోపించారు. అయితే సంధ్య థియేటర్ ఘటనతో తెలంగాణ ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్న రామకృష్ణ.. తెలంగాణ మాదిరిగానే బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు లేకుండా ఆదేశాలు ఇవ్వాలని చంద్రబాబును కోరారు.

నూతన సంవత్సరం సమీపిస్తోంది. ఆ వెంటనే ఓ పదిరోజులకే సంక్రాంతి పండుగ రానుంది. ఇక పెద్ద పండుగ అంటే హడావిడి మామూలుగా ఉండదుగా. కోళ్లపందేలు, సంక్రాంతి సంబరాలు ఒకెత్తయితే.. సినిమాల కోలాహలం మరో ఎత్తు. సంక్రాంతి పండుగను మూడు రోజులు జరుపుకుంటే.. ఆ మూడు రోజుల్లో పెద్ద హీరోల సినిమాలు వరుసగా విడుదలకానున్నాయి. సంక్రాంతి సెలవులు కావటంతో థియేటర్ల వద్ద కోలాహలం ఏర్పడనుంది. దీంతో సంక్రాంతి పండుగ సీజన్ క్యాష్ చేసుకునేందుకు సినిమా నిర్మాతలు ప్రయత్నిస్తుంటారు. బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపుతో ఆరంభంలోనే కలెక్షన్లు రాబట్టుకోవాలని ప్రయత్ని్స్తుంటారు. అయితే పెద్ద హీరోల సినిమాలకు బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపునకు అనుమతులు ఇవ్వొద్దంటూ ఏపీ ప్రభుత్వానికి లేఖ అందింది.

సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ ఈ మేరకు.. సీఎం నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వకుండా ఆదేశించాలని సీఎం నారా చంద్రబాబునాయుడును రామకృష్ణ కోరారు. బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపునకు అనుమతులు ఇస్తారనే ధైర్యంతో నిర్మాణ సంస్థలు భారీ బడ్జెట్‌తో సినిమాలను తెరకెక్కిస్తున్నాయని.. ఆ తర్వాత ప్రేక్షకుల జేబుల నుంచి కొల్లగొడుతున్నారంటూ రామకృష్ణ ఆరోపించారు. సినీ ఇండస్ట్రీ ఒత్తిడికి తలొగ్గి తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు..టికెట్ల ధరల పెంపునకు, ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. ఈ రకంగా దేశంలో ఎక్కడా లేదని రామకృష్ణ విమర్శించారు.

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం మేల్కొందన్న సీపీఐ రామకృష్ణ.. టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన అభినందనీయమని లేఖలో ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తరహాలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సినిమా టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతించబోమని ప్రకటించాలని సీఎం నారా చంద్రబాబునాయుడిని రామకృష్ణ కోరారు. ఆ విధంగా ఆదేశాలు ఇవ్వాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. మరి ఈ విజ్ఞప్తి ఏపీ ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందనేదీ చూడాలి.

మెదక్ చర్చితో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న సీఎం రేవంత్

వందేళ్లు పూర్తి చేసుకున్న మెదక్ చర్చి గొప్ప దేవాలయంగా గుర్తింపు పొందిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చారిత్రక చర్చి అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. అలాగే మెదక్ చర్చితో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా రేవంత్ గుర్తుచేశారు. పీసీసీ అధ్యక్షుడుగా ఇక్కడికి వచ్చి ఆశీస్సులు తీసుకున్నట్లు తెలిపారు.

క్రిస్మస్ పర్వదాన్ని పురస్కరించుకుని మెదక్ సీఎస్‌ఐ చర్చ్‌లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఏసు భక్తులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. వందేళ్లు పూర్తి చేసుకున్న మెదక్ చర్చి గొప్ప దేవాలయంగా గుర్తింపు పొందిందని తెలిపారు. చారిత్రక చర్చి అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. అలాగే మెదక్ చర్చితో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా రేవంత్ గుర్తుచేశారు. పీసీసీ అధ్యక్షుడుగా ఇక్కడికి వచ్చి ఆశీస్సులు తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి హోదాలో ఈ చర్చికి వస్తానని ఆనాడు మాట ఇచ్చానని గుర్తుచేసుకున్నారు.

శతాబ్ది ఉత్సవాలు, భక్తులతో క్రిస్మస్ జరుపుకోవాలనే ఇక్కడకు వచ్చానని తెలిపారు. తమది పేదల ప్రభుత్వమని.. పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకంలో దళితులు, గిరిజనులకు మేలు జరుగుతోందన్నారు. మెదక్ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్‌తో పాటు మంత్రులు పొంగులేటి, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ పాల్గొన్నారు.

మెదక్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గామాత అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. సీఎం వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ రఘునందన్ రావు తదితరులు వన దుర్గాదేవిని దర్శించుకున్నారు.

ఈరోజు ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో మెదక్ చేరుకున్న సీఎం రేవంత్.. అక్కడ ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మెదక్ చర్చికి చేరుకున్నారు. అక్కడ చర్చి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆపై అక్కడ నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు.

తిరుపతిలో అన్నమయ్య విగ్రహానికి శాంటాక్లాజ్ టోపీ పెట్టింది ఆయనే

తిరుపతిలో అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాస్ టోపీ పెట్టిన అంశం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. తిరుపతిలో ఈ ఘటనతో అన్య మత ప్రచారం జరుగుతుందని, కావాలని ఎవరో ఈ పనికి ఒడిగట్టారని హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాయల చెరువు రోడ్డు కూడలిలో అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాజ్ టోపీ పెట్టిన ఘటన చోటుచేసుకుంది.

ఈ ఘటన పైన హిందూ సంఘాలు, స్వామీజీలు, బజరంగ్ దళ్ కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు దిగి తిరుమల శ్రీవారి పరమ భక్తుడైన అన్నమయ్య విగ్రహానికి ఇలా శాంటా క్లాస్ టోపీ పెట్టి అపచారం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఇక దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అసలు అక్కడ ఏం జరిగింది అన్నది సిసిటివి ఫుటేజ్ ను పరిశీలించారు.

ఇక సీసీటీవీ ఫుటేజ్ లో ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. తిరుపతి ఈస్ట్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించగా అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాజ్ టోపీ ఒక వ్యక్తి పెట్టినట్టుగా గుర్తించారు. ఆ వ్యక్తి కూడళ్లలో పెన్నులు విక్రయిస్తూ ఉంటాడని గుర్తించిన పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

అయితే అతడు తెలిసీ తెలియక శాంటా క్లాజ్ టోపీ అన్నమయ్యకు పెట్టాడా లేక శాంటా క్లాజ్ టోపీ పెట్టడానికి ఎవరైనా అతనిని ప్రోత్సహించారా అన్న కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ విషయంలో ఎవరు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని ఇదే సమయంలో సంయమనం పాటించాలని కూడా పోలీసులు సూచించారు.

అయితే ఆ వ్యక్తి తెలియకుండా చేశాడా? ఆకతాయితనంగా చేశాడా? లేక మతవిద్వేషాలు రెచ్చగొట్టడానికి ఎవరైనా చెబితే చేశాడా? అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ సాగిస్తున్నారు. క్రైస్తవుల పండుగ అయిన క్రిస్మస్ పండుగకు ముందు రోజు జరిగిన ఈ ఘటన నేపథ్యంలో మత విద్వేషాలు రగలకుండా తిరుపతిలో పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించగా అసలు ఏం జరిగింది అనేది వెలుగులోకి వచ్చింది.

అమెరికాలో ఇక‌ వారికి మరణశిక్షే

డోనాల్డ్ ట్రంప్ పేరువిన‌గానే మ‌న‌కు గుర్తుకు వ‌చ్చేది.. ఆయ‌న ముక్కుసూటిత‌నం. గ‌తంలో అమెరికా ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు క‌ఠిన నిర్ణయాలు తీసుకున్న విష‌యం మ‌న‌కు తెలిసిందే. అమెరికా-మెక్సికో బార్డర్ అక్రమ వ‌ల‌స‌దారులు (illegal immigrants) ఉగ్రవాదానికి వ్యతిరేకం వంటి అనేక క్లిష్టమైన స‌మ‌స్యల‌ను ఒక్క మీటింగ్‌లో ముగించేస్తారు. 2020లో జ‌రిగిన అమెరికా అధ్యక్ష ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోయిన‌ప్పటికీ.. ఈ ఏడాది న‌వంబ‌ర్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ పోటీ చేసి, బంప‌ర్ మెజారిటీతో రెండోసారి అధ్యక్షుడు అయ్యారు.

అమెరికాలో మ‌ర‌ణ‌శిక్షకు గురైన 40 మంది ఖైదీల‌కు పెరోల్ లేకుండానే జీవిత ఖైదుగా మారుస్తున్నట్లు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడ‌న్ ప్రక‌టించారు. ఈ అంశంపై డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. తాను ప్రెసిటెండ్‌గా బాధ్యతలు స్వీక‌రించిన వెంట‌నే రేపిస్టుల‌క తీవ్రమైన నేరాల‌కూ పాల్పడే వారికి మ‌ర‌ణ‌శిక్ష విధిస్తాన‌ని అన్నారు. అమెరికాలోని కుటుంబాలనూ పిల్లల‌నూ ఇలాంటి నేర‌స్తుల నుంచి కాపాడ‌టానికి మ‌ర‌ణ‌శిక్షను క‌ఠినంగా అమ‌లు చేసేలా న్యాయ శాఖ‌ను ఆదేశిస్తాన‌ని తెలిపారు. కాగా, 2025 జనవరి 20వ తేదీన‌ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.

అంతరిక్షంలో భారీ రిజర్వాయర్‌ గుర్తించిన జెట్‌ ప్రొపల్షన్‌ ల్యాబ్‌

అంతరిక్షంలో పెద్ద పరిమాణంలో ఉన్న రిజర్వాయర్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. దాని పరిమాణం భూమిపైనున్న మహాసముద్రాలకంటే 140 ట్రిలియన్‌ రెట్లు పెద్దగా ఉంటుంది. ఇది ఓ సూపర్‌ మాసివ్‌ బ్లాక్‌ హోల్‌కు దగ్గరలో ఉంది.

అంతరిక్షంలో పెద్ద పరిమాణంలో ఉన్న రిజర్వాయర్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. దాని పరిమాణం భూమిపైనున్న మహాసముద్రాలకంటే 140 ట్రిలియన్‌ రెట్లు పెద్దగా ఉంటుంది. ఇది ఓ సూపర్‌ మాసివ్‌ బ్లాక్‌ హోల్‌కు దగ్గరలో ఉంది. మన సూర్యుడి కంటే దాదాపు 20 బిలియన్లు పెద్దది. కాలిఫోర్నియాలోని పసాదేనాలోని నాసాకు చెందిన జెట్‌ ప్రొపల్షన్‌ లాబోరేటరీ శాస్త్రవేత్తల బృందం దాన్ని గురించింది. ప్రస్తుతం ఈ రిజర్వాయర్‌ భూమికి 12 బిలియన్‌ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నది. విశ్వం ఆవిర్భవించిన కొద్ది కాలానికే ఇక్కడ నీరు ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. క్వాసర్‌ అనే బ్లాక్‌హోల్‌ చుట్టూ ఉన్నది. ఇది వేల ట్రిలియన్‌ సూర్యులకు సమానమైన శక్తిని విడుదల చేస్తుంది. ఇది విశ్వంలో ఇప్పటివరకు గుర్తించిన అతిపెద్ద నీటి రిజర్వాయర్‌ ఇదే. శాస్త్రవేత్తలు క్వాసార్ చుట్టూ ఉన్న వాతావరణంలో నీటి ఆవిరిని గుర్తించారు. ఆ ఆవిరి వందల కాంతి సంవత్సరాల వరకు విస్తరించి ఉంది. ఒక కాంతి సంవత్సరం ఆరు ట్రిలియన్‌ మైళ్లకు సమానం.