/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz అరూరులో శ్రీ మల్లికార్జున గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం నూతన కమిటీ ఎన్నిక Vijay.S
అరూరులో శ్రీ మల్లికార్జున గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం నూతన కమిటీ ఎన్నిక

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని అరూరు గ్రామంలోని శ్రీ మల్లికార్జున గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. శ్రీ మల్లికార్జున గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం నూతన అధ్యక్షులుగా కసర బోయిన లింగయ్య, ఉపాధ్యక్షులు జినుకల వెంకటేశం, కార్యదర్శి తుమ్మల సంతోష్ కుమార్, డైరెక్టర్లు మర్రి ముత్యాలు, బుర్ర అనిత , మోదాల సుధాకర్, చెముడాల మంజుల ఎన్నికైనారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహకార సంఘం పెద్దలు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ములాయం సింగ్ యాదవ్ యూత్ బ్రిగ్రేడ్ రాష్ట్ర అధ్యక్షులు మేకల బాలు యాదవ్ ఆధ్వర్యంలో ములాయం సింగ్ యాదవ్ జయంతి వేడుకలు

తెలంగాణ ములాయం సింగ్ యాదవ్ యూత్ బ్రిగేడ్ రాష్ర్ట అధ్యక్షులు మేకల బాలు యాదవ్ *కాకలుతీరిన యోధుడు నేడు ములాయం 85 వ జన్మదినం* అరవై ఏళ్ళ రాజకీయ జీవితం* ఎన్నికల బరిలో 18 సార్లు* తాతతండ్రులకు పెద్దగా ఆస్తులూ లేవు,చదువసంధ్యలు లేవు. అసలే కులాల సమాజం. అలాగని పెత్తందారీ కులమూ కాదు. దానికి తగ్గట్టుగా రహదారి కూడా లేని చిన్న పల్లెటూరు. ఇదిగో ఈ నేపథ్యంలో సాధారణ యాదవ కుల కుటుంబంలో 85 ఏళ్ళ క్రితం 1939 నవంబరు 22న జన్మించాడు ములాయం సింగ్ యాదవ్. బీసీ కులస్థుడైన ఆయన పుట్టిన ఊరు పేరు ఉత్తర ప్రదేశ్ లోని ఇటావా జిల్లా సేఫయీ. కనీసం బడి కూడా లేని పల్లె. తండ్రి షుగర్ సింగ్ కు ఐదుగురు కొడుకులు, ఒక కూతురులలో మూలయం మూడో సంతానం. చిన్న వ్యవసాయ కమతం, ఆవులు, గేదెలు వీటి సంరక్షణే ఆ తండ్రి జీవనవృత్తి. పిల్లలు కూడా పశువుల పెంపకంలో కొనసాగాలని ఆయన కోరుకున్నారు. కానీ బాలుడు ములాయం చదువుకుంటానని మారంచేసి విద్యాభ్యాసం చేశాడు. సమీపంలో ఉన్న పట్టణంలో డిగ్రీ పూర్తి చేసి ఉపాధ్యాయ వృత్తి చేయాలనే మమకారంతో బీయిడీ చేశాడు. కొద్ది కాలం పాఠాలు కూడా బోధించాడు. విద్యార్థిగా ఉంటూనే కుస్తీ పోటీల్లో పాల్గొని మల్లయోధుడుగా పేరొంది ఎక్కడ పోటీకెళ్ళినా ఆయనే విజేత. 14 ఏళ్ళ వయసులో 1953లో వ్యవసాయ నీటి పన్ను పెంపుదలకు వ్యతిరేకంగా సోషలిస్టు పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా చేపట్టిన ఆందోళనలో పాల్గొని అరెస్టయి నెల రోజులు జైల్లో ఉన్నాడు. అదిగో అలా రాజకీయ ప్రజాజీవితంలో ప్రవేశించిన ములాయం సింగ్ యాదవ్ ఇప్పటి వరకూ 11 అసెంబ్లీ ఎన్నికల్లో, 7 లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 18 సార్లు పోటీ చేసాడు. 16 సార్లు గెలిచాడు. 1967లో 27 ఏళ్ళ వయసులో తన స్వంత నియోజకవర్గం జశ్వంత్ పూర్ అసెంబ్లీకి తొలిసారి తన రాజకీయ గురువు, మార్గదర్శి రామ్ మనోహర్ లోహియా ప్రోత్సాహంతో ఆయన పార్టీ సంయుక్త సోషలిస్టు పార్టీ టికెట్ పై పోటీ చేసి గెలిచాడు. అప్పటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వాళ్ళల్లో ములాయమే చిన్న వయస్కుడు. అదే స్థానంలో స్థానంలో రెండు సార్లు 1969,1980 లలో పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఏడు సార్లు పోటీ చేసిన లోక్ సభ ఎన్నికల్లో ఏనాడూ ఓటమి లేదు. ప్రస్తుతం ఆయన తన స్వగ్రామం ఉన్న మైనాపురి లోక్ సభ నియోజకవర్గం నుండి ఎంపీగా కొనసాగుతున్నారు. "సోషలిస్టు సింద్ధాంతం అలవర్చుకుని అది నేర్పిన పోరాట పటిమ ములాయంను ఎప్పుడూ పోటీకి జంకని వ్యక్తిగా తీర్చిదిద్దింది" అని ఆయన కజిన్ బ్రదర్ రామ్ గోపాల్ యాదవ్ ఒక సందర్భంలో అన్న మాట నిజం. అలాగే దంగల్ పోటీల్లో (కుస్తీ) ఎప్పుడూ ప్రత్యర్ధిని చిత్తుచేసే అలవాటు రాజకీయాల్లో కూడా ములాయంను ప్రభావితం చేసింది. ఆరు దశాబ్దాల ములాయం రాజకీయం ఏడు రాజకీయ పార్టీల గుండా గడిచింది. ఈ ప్రయాణంలో ఆయన ఎక్కడా మత తత్వ పార్టీ వైపు గానీ, సుధీర్ఘ కాలం పరిపాలన చేసిన కాంగ్రెస్ వైపు గానీ మరలలేదు. 1967లో గురువు లోహియా మరణంతో సోషలిస్టు పార్టీ చీలికలు పేలికలైంది. ములాయంకు రాజకీయ నిర్ధేశకత్వం కొరవడింది. ఈ దశలో ఆయన రైతు నాయకుడు, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తర్వాత దేశ ప్రధానిగా పని చేసిన చౌదరీ చరణ్ సింగ్ నాయకత్వంలో పని చేయలని నిర్ణయించుకున్నారు. చరణ్ సింగ్ పార్టీ భారతీయ లోక్ దళ్ తో పాటు పలు పార్టీలు 1977లో ఇందిర ను ఓడించడానికి జనతా పార్టీ గా ఏకమయ్యాయి. 77లో దేశంలో పాటు ఉత్తర ప్రదేశ్ లో కూడా రామ్ నరేష్ యాదవ్ నాయకత్వంలో జనతా పార్టీ విజయం సాధించింది. రామ్ నరేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఏర్పడిన మంత్రి వర్గంలో మొదటి సారి సహకార శాఖా మంత్రి పదవి చేపట్టారు. ఇందిర 1980లో మళ్ళీ ప్రధానై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని రద్దు చేయడంతో జరిగిన ఉపఎన్నికలో ములాయం ఓడిపోయారు. ఇది ఆయనకు రెండో ఓటమి. తర్వాత జరిగిన శాసనమండలి ఎన్నికల్లో చరణ్ సింగ్ ప్రోత్సాహంతో ఆయన పోటీ చేసి ఎన్నికై మండలిలో లోక్ దళ్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నుకోబడి అధికార పార్టీని ముప్పు తిప్పలు పెట్టారు. 1985 యు.పి అసెంబ్లీ కి జరిగిన ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసి గెలిచాడు. ఈసారి 425 స్థానాలున్న అసెంబ్లీకి లోక్ దళ్ పార్టీ నుండి 86 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అసెంబ్లీ లో లోక్ దళ్ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ప్రధాన ప్రతిపక్ష నేతగా ములాయం ఎన్నికై ఆ అసెంబ్లీ కాలమంతా అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొని రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన నాయకుడుగా గుర్తింపు పొందారు. బోఫోర్స్ ఉదంతంతో 1989లో ప్రధాని రాజీవ్ ను ఓడించడానికి నాలుగు పార్టీల కలయికతో ఏర్పడిన జనతాదళ్ లో ములాయం ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్ దళ్ కూడా విలీనం అయ్యింది. లోక్ సభ, అసెంబ్లీ కి 89లో ఏక కాలంలో జరిగిన ఎన్నికల్లో జనతాదళ్ కేంద్రంలోను ఇటు యు.పి.లో విజయం సాధించింది. ములాయం ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్రంలో జనతాదళ్ ప్రభుత్వం ఏర్పడ్డానికి అవసరమైన మెజారిటీ లేదు. కమ్యూనిస్టుల మద్దతుతో ములాయం సింగ్ యాదవ్ 24 కోట్ల జనాభాతో దేశంలో అతిపెద్ద ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి మొదటి సారి ముఖ్యమంత్రి అయ్యారు. జనతాదళ్ ప్రభుత్వం మండల్ బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించడంతో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బిజెపి ఆందోళన అనంతర పరిణామాల మధ్య బీజేపీ తన ఎంపీల మద్దతు ఉపసంహరించుకోవటంతో అటు కేంద్రంలో ఇటు యు.పి.లో ప్రభుత్వాలు పడిపోయాయి. తర్వాత 1993లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ మద్దతుతో ములాయం రెండో సారి ముఖ్యమంత్రి అయ్యారు. *కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా* 1996లో ములాయం మొదటి సారి లోక్ సభకు పోటీ చేసి విజయం సాధించారు. అది మొదలు గత 2019 వరకూ జరిగిన అన్ని లోక్ సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేసి వరసగా విజయం సాధించడం పెద్ద విశేషం. 1996లో కేంద్రంలో ఏర్పడిన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో ములాయం కీలకమైన రక్షణ శాఖ మంత్రి పదవి దక్కించుకోవటం విశేషం. 2003 లో మూడో దఫా ములాయం యు.పి ముఖ్యమంత్రి అయ్యారు. చేజారిన ప్రధాన మంత్రి పదవి* బహుశా దేశంలో ఇప్పటి రాజకీయ నాయకులందరికంటే ప్రధాన మంత్రి సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన అర్హతలున్న నాయకుడు ఎవరని పరిశీలిస్తే....మొదటి వినిపించే పేరు ములాయం సింగ్ యాదవ్ పేరునే. కోట్ల మంది అభిమానానికి తోడు సుధీర్ఘ 60 ఏళ్ళ పాటు క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొనటం, మెజారిటీ ప్రజల ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే విధానాన్ని వ్యవహరశైలిగా మార్చుకునే స్వభావం, అటు సామాజిక జీవితానుభవం, ఇటు రాజకీయ రంగ అనుభవం, మొత్తంగా ఆయన నేపధ్యం ప్రధాన మంత్రి పదవి కి అర్హతకు ముందుంచుతుంది. ఇలా అన్ని అర్హతలు ఉన్న ఆయనకు ఒక సందర్భంలో ప్రధాని అయ్యే అవకాశం సంపూర్ణంగా ఏర్పడింది. కానీ కొందరి చేసిన వెన్నుపోటు రాజకీయాల వల్ల ఖరారైన ములాయం పేరు స్థానంలో ఐ.కె.గుజ్రాల్ పేరు ఆఖరిలో వచ్చి చేరింది. ఆనాడు 1997లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో దేవగౌడ ప్రధాని పదవికి రాజీనామా చేసిన సందర్భంలో ఇది జరిగింది. అప్పుడు లోపల,బయట జరిగిన పరిణామాలను ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక మాజీ సంపాదకుడు శేఖర్ గుప్తా 2012 సెప్టెంబర్ నెలలో వివరంగా రాశాడు. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడటంలో, అలాగే కూటమిలో తలెత్తే ఘర్షణలను సర్దుబాటు చేసి సంక్షోభ నివారణా నిపుణుడిగా పేరొందిన అప్పటి సిపిఎం కేంద్ర కమిటీ కార్యదర్శి హరికిషన్ సూర్జిత్ సింగ్ ను ఎన్.డి.టి.వి. ఇంగ్లీషు ఛానల్ తరపున "వాక్ అండ్ టాక్ " లో ఇంటర్వ్యూ చేసిన సందర్భంలో ఈ వివరాలు తనక తెలిసాయని గుప్తా రాశాడు. ములాయం లోహియా సోషలిస్టు సింద్ధాంత వాది అయినా కమ్యూనిస్టు నాయకుడు సూర్జిత్ తో కూడా సన్నిహితంగా ఉండేవాడని, అలాగే అందరినీ కలుపుకుని వెళ్లే స్వభావం ములాయమదని, ములాయం ను ప్రధాని చేయడానికి తాను ప్రయత్నాలు చేసిన సంగతులు, అలాగే పార్టీలో ఆయనకు వచ్చిన మద్దతుతో ములాయం పేరు ఖరారైన తర్వాత కొందరి నిరోధక చర్యలు వల్ల ఆయన ప్రధాని కాలేకపోయారు" అని సూర్జిత్ తనతో జరిగిన సంభాషణల్లో చెప్పారని శేఖర్ గుప్తా రాశాడు.
మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి ధర్మకర్త బండి రవికుమార్ కు ఘన సన్మానం

యాదాద్రి భువనగిరి జిల్లా అరూరు గ్రామంలో శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామి గుట్ట ధర్మకర్తగా బండి రవికుమార్ నియామకం అయిన సందర్భంగా అరూరు గ్రామానికి చెందిన యూత్ సభ్యులు మంగళవారం రాత్రి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చిట్టేడి జనార్దన్ రెడ్డి, వలిగొండ మండల కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ అధ్యక్షులు చిలకమర్రి కనకాచారి, మాజీ ఎంపీటీసీ పోలే పాక చంద్రయ్య ,మాజీ సర్పంచ్ పోలేపాక చెమ్మయ్య, పిట్టల సుధాకర్, బత్తిని వెంకటేష్, ఎలిమినేటి సంతోష్, ఓరుగంటి మధు, లోతుకుంట నాగరాజు, బైకాన్ని మల్లేశం, ఎలిమినేటి రాము, ఆకుల గణేష్, బత్తిని మచ్చ గిరి, బుర్ర శివ, నిమ్మల నిఖిల్, నిమ్మల నరేష్ ,కళ్లెం ఉమేష్, ఎండి సలీం, మహేష్ తదితరులు పాల్గొని ఘనంగా సన్మానించారు.

వలిగొండ: AJR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వెలువర్తి గ్రామానికి చెందిన ఎడవెల్లి మీనమ్మ అనారోగ్యంతో మరణించారు. వారి కుటుంబ దీనస్థితిని తెలుసుకున్న AJR ఫౌండేషన్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డి రూ .5000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో వెలువర్తి గ్రామ ప్రజలు, యువకులు, ఏజేఆర్ టీం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
చేరాల నరసింహ మరణం సిపిఐ - ఏఐటియూసి కి తీరని లోటు

యాదాద్రి భువనగిరి జిల్లా CPI పోచంపల్లి మాజీ మండల కార్యదర్శి మరియు భవన నిర్మాణ కార్మిక సంఘం ఉమ్మడి నల్గొండ జిల్లా మరియు పోచంపల్లి మండల మాజీ అధ్యక్షులు చేరాల నరసింహ నిన్న 13.11.24 రోజున ఆకస్మికంగా మరణించడంతో ఈరోజు పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రంలోని తాపీ సంఘ భవనం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం ఆయన ఇంటికి వెళ్లి చేరాల నరసింహ పార్థివ దేహం పై పూలమాలలు వేసి నివాళులు అర్పించి మృతునికి సంతాపo మరియు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు బోడ సుదర్శన్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్, సిపిఐ మండల కార్యదర్శి గోడల్ల భూషణ్, పట్టణ కార్యదర్శి మిర్యాల కిష్టమూర్తి, పోచంపల్లి భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు చేరాల లింగయ్య, కార్యదర్శి నరేష్, చెరుకు నరసింహ, కొండమడుగు బాలయ్య, ట్రాలీ ఆటో యూనియన్ అధ్యక్షులు కొండమడుగు సత్తయ్య, కార్యదర్శి కుక్క బిక్షపతి, శ్రీను, సిపిఐ మండల సహాయ కార్యదర్శి ముసునూరి రాములు, సంగం గణేష్, సీనియర్ నాయకులు సాయి రెడ్డి మరియు భవన నిర్మాణ, ఆటో కార్మికులు పాల్గొన్నారు.

డయల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి : బందారం శ్రీనివాస్ యాదగిరిగుట్ట డిపో మేనేజర్

యాదగిరిగుట్ట డిపో పరిధిలోని ప్రజలు నవంబర్ 15, శుక్రవారం రోజున ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు నిర్వహించే "డయల్ యువర్ డిపో మేనేజర్" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో మేనేజర్ బందారం శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డిపో పరిధిలోని ప్రజలు, ప్రయాణీకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. యాదగిరిగుట్ట డిపో,ఆర్టీసీ కి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం *9959226310* నెంబరుకు ఫోన్ చేసి మీయొక్క సలహాలు, సూచనలను తెలుపాలని ఆయన కోరారు.
మత్స్యగిరి ఘాట్ రోడ్డుకు లింకు సిసి రోడ్డు వేయాలని ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డికి వినతి

వలిగొండ మండలం అరూరు గ్రామం పరిధిలో మత్స్యగిరి గుట్ట కాలనీ నుండి వేదశ్రీ వెంచర్ ఘాట్ రోడ్డుకు లింకు సిసి రోడ్డు వేయుటకు మత్స్యగిరి గుట్ట కాలనీవాసులు అందరూ మరియు అరూరు పెద్దలు గ్రామస్తులు సుమారు వందమంది అధిక సంఖ్యలో ఘాట్ రోడ్డు పైకి వెళ్లి మన ప్రియతమ నాయకులు భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారిని కలసి వినతి పత్రం అందజేయడం జరిగింది దానికి ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి రోడ్డు వేయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వలిగొండ మాజీ ఎంపీపీ చిట్టి రెడ్డి జనార్దన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వాకిటి అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
AITUC శిక్షణ తరగతులకు పూర్తయిన ఏర్పాట్లు

రేపు 12.11.2024 నాడు చౌటుప్పల్ లో జరుగుతున్న ఏఐటీయూసీ యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి శిక్షణా తరగతులకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఆహ్వాన సంఘం అధ్యక్షులు బచ్చనగోని గాలయ్య తెలిపారు. సోమవారం రోజున చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన ఏఐటీయూసీ ముఖ్య నాయకుల సమావేశంలో బచ్చనగొని గాలయ్య మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడే భారతదేశ తొలి కార్మిక సంఘం ఎఐటియుసి అని, ఏఐటీయూసీ యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి శిక్షణ తరగతులు చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని జయశ్రీ గార్డెన్స్ లో జరుగుతున్నాయని ఈ శిక్షణ తరగతులకు వచ్చే ప్రతినిధుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అయన తెలిపారు. రేపు ఉదయం 9 గంటలకు గంటలకు జెండావిష్కరణ అనంతరం క్లాసులు ప్రారంభిస్తారని, ఈ శిక్షణ తరగతులకు ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ గారు, ఏఐటీయూసీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉజ్జిని రత్నాకర్ రావు గారు మరియు ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి పర్వతాలు గార్లు (టీచర్స్ గా) వ్యవహారిస్తారని మరియు సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, సహాయ కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి, మరియు జిల్లా నలుమూలల నుండి ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. శిక్షణ తరగతుల ద్వారా జిల్లాలోని నాయకులకు చట్టాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి పల్లె శేఖర్ రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు గోరెటి రాములు, ప్రధాన కార్యదర్శి ఎండి ఇమ్రాన్, ఉపాధ్యక్షులు పిలిశంకర్, ఏఐటీయూసీ మండల అధ్యక్షులు టంగుటూరి రాములు, సివిల్ సప్లై జిల్లా ఉపాధ్యక్షులు పాపగళ్ల శంకరయ్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు కొండూరి వెంకటేష్, ఎండీ రెహ్మాన్ తదితరులు పాల్గొన్నారు.
DYFI యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా పల్లె మధు కృష్ణ ,గడ్డం వెంకటేష్ ఎన్నిక

యాదాద్రి భువనగిరి జిల్లా నూతన అధ్యక్ష కార్యదర్శులుగా పల్లె మధు కృష్ణ, గడ్డం వెంకటేష్ ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ద్వితీయ జిల్లా మహాసభలో వారు మూడు సంవత్సరాల కాలంలో డివైఎఫ్ఐ విస్తరణ ప్రజా, యువత సమస్యలపై చేసిన పోరాటాలను సమీక్షించుకొని భవిషత్ పోరాటాలకు రూపకల్పన చేసి యువత ఎదుర్కొంటున్న అనేక అంశాలపై చర్చించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ భవిష్యత్ కార్యాచరణను మహాసభలలో తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లాను పట్టిపీడిస్తున్న కాలుష్యానికి వ్యతిరేకంగా, మూసి ప్రక్షాళన కోసం, మెరుగైన వైద్యం విద్య కోసం డివైఎఫ్ఐ గా అనేక పోరాటాలు నిర్వహిస్తామని వారు అన్నారు. వీరితోపాటు జిల్లా ఉపాధ్యక్షులుగా ఎండి సలీం, భువనగిరి గణేష్, ఉప్పలపల్లి బాలకృష్ణ, ఎండి ఖయ్యూం, జిల్లా సహాయ కార్యదర్శులుగా కవిడే సురేష్, దయ్యాల మల్లేష్, గుడ్డేటి సుర్జిత్, మెట్టు శ్రవణ్, 21 మంది జిల్లా కమిటీ సభ్యులతో నూతన జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది.
కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని డిసెంబర్ 4న చలో... ఢిల్లీ గోడ పత్రికల ఆవిష్కరణ

ఆర్బిఐ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఫోటోను, కరెన్సీ నోట్ల పై ముద్రించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 4 న చలో ఢిల్లీ గోడ ప్రతులను సోమవారం జిల్లా కేంద్రంలోని ఎస్ వి హోటల్ లో నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు డాక్టర్ జేరిపోతుల పరశురామ్ మాట్లాడుతూ 1921 లో ఇంపీరియల్ బ్యాంకు కుప్పకూలినప్పుడు 1923లో డా బి ఆర్ అంబేద్కర్ ఆర్థిక కోణాన్ని దృష్టిలో ఉంచుకొని "రూపాయి దాని సమస్య- పరిష్కార మార్గం" అనే పుస్తకాన్ని వ్రాసి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం యొక్క హిల్టాన్ యంగ్ కమిషన్, రాయల్ కమిషన్, సైమన్ కమిషన్ లకు అందజేసిన ఫలితంగా 1935 ఏప్రిల్ 1న "రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా" ను బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు. కానీ ఇంతవరకు అంబేద్కర్ ఫోటో కరెన్సీ నోట్లు పై లేకపోవడం విచారకరమని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే కరెన్సీ నోట్లపై డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఫోటో ముద్రించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 4, 5 6, తేదీలలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించే మహా ధర్నాను జయప్రదం చేయాలని ఆయన కోరారు. చలో ఢిల్లీ గోడ ప్రతుల ఆవిష్కరణ కార్యక్రమం లో కరెన్సీ నోట్ల పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ కొడారి వెంకటేష్, జిల్లా సలహాదారులు బట్టు రాంచంద్రయ్య, జిల్లా నాయకులు జాగిల్లపురం ఐలయ్య, బత్తిని సుమన్, ఇంజ పద్మ తదితరులు పాల్గొన్నారు.