/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని డిసెంబర్ 4న చలో... ఢిల్లీ గోడ పత్రికల ఆవిష్కరణ Vijay.S
కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని డిసెంబర్ 4న చలో... ఢిల్లీ గోడ పత్రికల ఆవిష్కరణ

ఆర్బిఐ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఫోటోను, కరెన్సీ నోట్ల పై ముద్రించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 4 న చలో ఢిల్లీ గోడ ప్రతులను సోమవారం జిల్లా కేంద్రంలోని ఎస్ వి హోటల్ లో నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు డాక్టర్ జేరిపోతుల పరశురామ్ మాట్లాడుతూ 1921 లో ఇంపీరియల్ బ్యాంకు కుప్పకూలినప్పుడు 1923లో డా బి ఆర్ అంబేద్కర్ ఆర్థిక కోణాన్ని దృష్టిలో ఉంచుకొని "రూపాయి దాని సమస్య- పరిష్కార మార్గం" అనే పుస్తకాన్ని వ్రాసి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం యొక్క హిల్టాన్ యంగ్ కమిషన్, రాయల్ కమిషన్, సైమన్ కమిషన్ లకు అందజేసిన ఫలితంగా 1935 ఏప్రిల్ 1న "రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా" ను బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు. కానీ ఇంతవరకు అంబేద్కర్ ఫోటో కరెన్సీ నోట్లు పై లేకపోవడం విచారకరమని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే కరెన్సీ నోట్లపై డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఫోటో ముద్రించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 4, 5 6, తేదీలలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించే మహా ధర్నాను జయప్రదం చేయాలని ఆయన కోరారు. చలో ఢిల్లీ గోడ ప్రతుల ఆవిష్కరణ కార్యక్రమం లో కరెన్సీ నోట్ల పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ కొడారి వెంకటేష్, జిల్లా సలహాదారులు బట్టు రాంచంద్రయ్య, జిల్లా నాయకులు జాగిల్లపురం ఐలయ్య, బత్తిని సుమన్, ఇంజ పద్మ తదితరులు పాల్గొన్నారు.
ఆలేరు లో కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి 40వ వర్ధంతి

దున్నే వారికే భూమి నినాదం నేటికీ కీలకమే. విప్లవోద్యమం లో ప్రతిఘటన పోరాటం ప్రధానాంశమే.. ప్రజా యుద్ద పంథా ను సమున్నతంగా నిలబెట్టిన కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి నూతన ప్రజాస్వామిక విప్లవానికి మార్గదర్శకుడు ఆర్.జనార్ధన్,మామిడాల బిక్షపతి, జిల్లా కార్యదర్శులు, సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ... దున్నే వారికే భూమి నినాదం నేటికీ కీలకంగానే ఉంటుందని,నేడు చూడడానికి భూస్వాములు అంతగా లేనప్పటికీ ప్రజలకు చెందాల్సిన భూమి వివిధ రూపాలలో ఆక్రమణలోనే ఉన్నదని,భవిషత్ లో భూపొరాటాలు పెద్ద ఎత్తున తన్నుకు వస్తాయని,విప్లవోద్యమం లో ప్రతిఘటన పోరాటం అనేది అత్యంత ప్రధానంగా ఉంటుందని, సీపీఐ ఎం.ఎల్ కేంద్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి దీర్ఘ కాలిక ప్రజా యుద్ద పంథా ను సమున్నతంగా నిలబెట్టాడని ఆ పంథాలో మరింత బాధ్యతా యుతంగా,దృఢంగా ముందుకు సాగాలని రెండు సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ ల జిల్లా కార్యదర్శులు ఆర్.జనార్ధన్, మామిడాల బిక్షపతి లు పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం నాడు కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి 40 వ వర్ధంతి సందర్భంగా ఆలేరు కమలమ్మ - జనార్ధన్ ఫంక్షన్ హాల్ లో బహిరంగ సభ జరిగింది. ఈ సభకు సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ భువనగిరి డివిజన్ కార్యదర్శి బేజాడి కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా భారత విప్లవోద్యమంలో పశువులు బాసిన కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి తో పాటు, అనేకమంది కమ్యూనిస్టు విప్లవకారులకు రెండు నిమిషాలు సంతాప సూచకంగా మౌనం పాటించి విప్లవ జోహార్లు తెలిపారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో జనార్ధన్, బిక్షపతి లు మాట్లాడుతూ, ముళ్ళు,రాళ్ళు అవాంతరాలు, ఆటు పోట్లు,ఇబ్బందులు,అక్రమ అరెస్టులు,జైల్ జీవితం, నిర్భందాలన్నింటిని ఎదుర్కొని దీర్ఘ కాలిక సాయుధ ప్రజా యుద్ద పంథాలో జీవితాంతం కొనసాగడం కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి లాంటి విప్లవ కారులకే సాధ్యమని అన్నారు. భూస్వామ్య వ్యవస్థ ను నాశనం చేస్తూ, రాజ్యం సాగిస్తున్న దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడుతూ,ప్రజలు,రైతులు,కార్మికులు మొత్తం అశేష ప్రజానీకాన్ని ఒక్కటి చేసి వేలాది ఎకరాల పంట భూములను ప్రజా పోరాటాల ద్వారా సాధించి పెట్టిన కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి విప్లవానికి మార్గదర్శకుడని అన్నారు. నేడు దేశంలో అధికారంలో ఉన్న బీ జే పీ మోడీ ప్రభుత్వం మావో హిస్టు కమ్యూనిస్టు విప్లవకారులను నెలలో,రెండు నెలల్లో లేకుండా చేస్తామని చెప్పడమంటే ఈ దేశంలో ఉన్న కోట్లాది రూపాయల ప్రజా సంపదను సామ్రాజ్యవాదులకు, బడా కార్పోరేట్ సంస్థలకు దోచిపెట్టడంలో భాగంగానే అనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని,మోడీ లాంటి దేశ తిరోగమన విధానాలను అనుసరిస్తున్న,దేశ ద్రోహ కరమైన ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ పోరాటాలలోకి ముందుకు రావాలని కోరారు. బీ జే పీ అనుసరిస్తున్న మతోన్మాదం,హిందూత్వం, కాశాయికరణ, ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే మతం అనే ఆలోచన ప్రజల విచ్చిన్నతకు,ఐక్య మతాన్ని దెబ్బతీయడానికి బీ జే పీ రాజకీయ ప్రయోజనాలకు అంతిమంగా ఈ దేశాన్ని సామ్రాజ్యవాదులకు అమ్మివేయడానికి దారితీస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నప్పటికి ఎన్నికలలో చేసిన ప్రధానమైన హామీలు మహిళలకు నెలకు 25 వందల రూపాయలు లాంటివి అమలు చేయలేకపోతుందని,హైడ్రా,మూసీ ప్రక్షాళన పేరుతో అసలు విషయాల నుండి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు పూనుకుంటుందని,హైడ్రా చర్యల వల్ల ముప్పయి సంవత్సరాలుగా నివాసం ఉంటున్న పేదలను దౌర్జన్యంగా వెళ్లగొడుతున్నారని విమర్శించారు. ఇంకా ఈ సభలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి ఇక్కిరి సహదేవ్, ఏ ఐ కే ఎం ఎస్ జిల్లా అద్యక్షులు కల్లెపు అడవయ్య, చిర బోయిన రాజయ్య, ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు పద్మ సుదర్శన్, గడ్డం నాగరాజు, పీ వై ఎల్ జిల్లా అద్యక్షులు మారజోడు సిద్దేశ్వర్, రాచకొండ ఉదయ్ లు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ, ప్రజా సంఘాల నాయకులు మామిడాల సోమయ్య, కర్రె పాండరి, అన్ రెడ్డి బాల్ రెడ్డి,వగ్గు మల్లయ్య, పిన్నపురెడ్డి రాఘవ రెడ్డి,చిర బోయిన కొమురయ్య, ఏనుగుల నరసమ్మ,ఇక్కిరి శ్రీనివాస్,వంగాల మధుసూదన్ రెడ్డి, చిర బోయిన బాలయ్య, వంగాల నర్సింహారెడ్డి, మోటే అంజయ్య, మామిడాల బాలమల్లెష్, కుర్రి సత్యనారాయణ, శికిలం వెంకటేష్ శికిలం కుమారస్వామి పంజాల మురళి కొంగర సాయిరాం, ఏనుగుల ఎల్లయ్య,ఏనుగుల ఉదయ్,గడ్డం యాదగిరి, మామిడాల భాను చందర్, మామిడాల మధు, గోవిందు పరమేష్, పుప్పాల సిద్దులు,పుండరీకం, బరిగే రాములు, మారజోడు కుమార్, అయిల యాకయ్య, గిరి రాంచందర్, బూష శ్రీశైలం, కడకంచి అంజయ్య, కడకంచి బీరయ్య తదితరులు పాల్గొన్నారు.
వలిగొండ: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల కమిటీ ఎన్నిక

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల కమిటీ శనివారం ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర జిల్లా నాయకుల ఆధ్వర్యంలో శనివారం ప్రకటించారు. అధ్యక్షునిగా మారగోని శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులుగా పుసునూరి లింగస్వామి, ఎడవల్లి కిరణ్, ఓరుగంటి స్వామి, ప్రధాన కార్యదర్శిగా ఎక్కల దేవి శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా దండ మల్లికార్జున్, సంయుక్త కార్యదర్శిగా ఎదురుగట్ల రాములు, కోశాధికారిగా కొండూరు సత్తయ్యలను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం యాదాద్రి భువనగిరి జిల్లా గౌరవాధ్యక్షులు కళ్లెం లక్ష్మారెడ్డి, ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న, రాష్ట్ర కో కన్వీనర్ శీలం స్వామి, ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధికార ప్రతినిధి చంద్రబాబు నాయక్ భువనగిరి జిల్లా ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడు గంధమల్ల బాలయ్య, ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి నల్లగొండ జిల్లా మహిళా అధ్యక్షురాలు గంధ మల్లమ్మ, జిల్లాసాంస్కృతిక కార్యదర్శి మల్లం వెంకటేశం గౌడ్, ఉద్యమకారుల ఫోరం జిల్లా నాయకులు బత్తిని రవీందర్ గౌడ్ ,రామన్నపేట ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడు నోముల శంకర్, వలిగొండ ఉద్యమకారుల ఫోరం మండల మహిళ అధ్యక్షురాలు ఐటి పాముల పుష్ప, తదితరులు పాల్గొన్నారు.
త్రిప్ట్ ,నూలుపై సబ్సిడీ పథకాలను పునః ప్రారంభించాలి

చేనేత కార్మికులకు ఎంతగానో ఉపయోగ పడుతున్న త్రిప్ట్, నూలుపై సబ్సిడీ పథకాలను ప్రభుత్వం వెంటనే పునర్ ప్రారంభించాలని, వృత్తి దారుల జిల్లా కన్వీనర్ మాటూరి బాలరాజు, చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండు వెంకటనర్సు, ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసారు. చేనేత కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు గుర్రం నర్సింహా గారి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ... చేనేత కార్మికులు రోజువారి కూలిపనిలో పొదుపు చేసి, కార్మికుడు 1200/ రూ లు, అనుబంధ కార్మికులు 800/రూ లు, చొప్పున ప్రతి నెల RD 1 బ్యాంక్ ఖాతలో జమచేస్తే, ప్రభుత్వం RD 2 లో రెండింతలు 4000/ రూల చొప్పున జమచేసి, మూడు సంవత్సరాలకు తీసుకునే విధంగా గత ప్రభుత్వం త్రిప్ట్ పథకం ప్రవేశపెట్టిందని, అది కరోనా కష్టకాలంలో, చేనేత కార్మికులకు ఎంతగానో ఉపయోగ పడిందని తెలిపారు. ఆగస్టు నెలలో ముగిసిన ఈ త్రిప్ట్ పతకాన్ని మళ్ళీ పునర్ ప్రారంభించాలని కోరారు. నూలుపై 40/ శాతం సబ్సిడీ నేరుగా కార్మికుల ఖాతల్లో జమచెయ్యాలని, ప్రతి చేనేత కుటుంబానికి పెట్టుబడి సాయంగా 5 లక్షల రూపాయల సాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇండ్లు లేని నిరుపేద చేనేత కార్మికులకు హౌజ్ కం వర్క్ షెడ్ నిర్మించి ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుర్రం నర్సింహా, జిల్లా ఉపాధ్యక్షులు కూరపాటి రాములు, గంజి రామచంద్రం, బోడ ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
AITUC జిల్లాస్థాయి శిక్షణ తరగతులను జయప్రదం చేయండి: ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం డి ఇమ్రాన్

చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని జయశ్రీ గార్డెన్స్ లో ఈనెల 12వ తేదీన జరిగే ఏఐటీయూసీ యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ పిలుపునిచ్చారు. గురువారం రోజున వలిగొండ మండల కేంద్రంలో జరిగిన ఏఐటీయూసీ ముఖ్య నాయకుల సమావేశం అనంతరం శిక్షణ తరగతులకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్బంగా ఇమ్రాన్ మాట్లాడుతూ 1920 అక్టోబర్ 31న ముంబై మహానగరంలో ఆవిర్భావించిన భారతదేశ మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీయూసీ అని అన్నారు. నాటి నుండి నేటి వరకు కార్మికుల కోసం అనేక సంక్షేమ చట్టాలు సాధించిన ఘనత ఏఐటీయూసీ కే దక్కుతుందన్నారు. బ్రిటిష్ కాలం నాటి నుండి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నేడు అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం వాటిని మార్చేసి 4 లేబర్ కోడ్ లుగా మర్చి కార్మికుల పైన దాడి చేస్తుందని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని కార్మిక నాయకులకు, కార్యకర్తలకు కార్మిక చట్టాలతో పాటు హక్కులు, బాధ్యతలు పై రాజకీయ చైతన్యం పెంచడానికై ఈ నెల 12.11.2024 మంగళవారం రోజున జయశ్రీ గార్డెన్స్ లో జరిగే శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఇమ్రాన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి పోలేపాక యాదయ్య, మారుపాక వెంకటేష్, ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్, కట్ల యాదగిరి, మారుపాక మల్లేష్,మండల ఎఐటియూసి నాయకులు బొడిగే సుదర్శన్, సుధగాని మచ్చగిరి,పావురాల మల్లేష్, భూష శివ, బొలుగుల యాదగిరి, ఏ సురేష్, తదితరులు పాల్గొన్నారు.
గురునాథ్ పల్లి - లోతుకుంట గ్రామాల మధ్య డిసిసి ఉపాధ్యక్షులు వాకిటి అనంతరెడ్డి సౌజన్యంతో గుంతలు పూడ్చివేత

యాదాద్రి భువనగిరి జిల్లా  డిసిసి ఉపాధ్యక్షులు వాకిటి అనంతరెడ్డి. సౌజన్యంతో. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గురునాథ్ పెళ్లి గ్రామం నుండి లోతుకుంటకు వెళ్లే దారిలో. రోడ్డు గుంతలమయం కావడం వలన. ఆరోడ్డులో ప్రయాణించే ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్న విషయం తెలుసుకున్న. డిసిసి ఉపాధ్యక్షులు వాకిటి అనంతరెడ్డి ఆయన సొంత నిధులతో టిప్పర్లను ఏర్పాటు చేయించి ఎర్రమట్టిని గుంతలు ఉన్న ప్రాంతంలో పోయించి జెసిబి తో సదును చేయించినారు. అక్కడి ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో నర్రాముల కొమురయ్య సంగి రమేష్. తోట వెంకటయ్య మోహన్ తదితరులు పాల్గొన్నారు.
ఇంద్రపాల నగరం లో కన్నెబోయిన మదార్ పార్థివ దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం

యాదాద్రి భువనగిరి జిల్లా  రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన కన్నెబోయిన మదర్  అకాలమరణం చెందగా వారి పార్దివాదేహానికి పూలమాల వేసి కుటుంబ సభ్యులను పరమార్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి మనోధైర్యం చెప్పి ఎల్లపుడు కుటుంబానికి అండగా ఉంటా అని తెలియజేసిన నకిరేకల్ శాసన సభ్యులు శ్రీ వేముల వీరేశం . వారి వెంట జిల్లా నాయకులు పూస బాలకిషన్ గారు మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెద్దగోని వెంకటేష్, మాజీ సింగల్ విండో డైరెక్టర్ నాగు ఆంజనేయులు, మందడి గోపాల్ రెడ్డి,మండల జానీ, బంధారపు వెంకటేష్,కృష్ణ పార్, మేకల నరేష్, కేస సాయి, తదితరులు పాల్గొనడం జరిగింది
తుమ్మల నర్సయ్య సేవాసమితి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని 'అరూరు గ్రామానికి చెందిన సార గండ్ల నవీన్ కుమార్ రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పి వారి కుటుంబానికి సేవ సమితి ఆధ్వర్యంలో ఆరువేల రూపాయలు మరియు జక్కుల నరసింహ యాదవ్ మాజీ ఉపసర్పంచ్ ఐదువేలు ఆర్థిక సాయం అందియడం జరిగినది .ఈ కార్యక్రమంలో సేవా సమితి గౌరవ అధ్యక్షులు బండారు నరసింహారెడ్డి , అధ్యక్షులు కసిర బోయిన లింగయ్య ,సింగల్ విండో డైరెక్టర్ ఆవులస్వామి, వలిగొండ మండల్ అధ్యక్షులు చిలకమర్రి కనకాచారి, మాజీ సర్పంచ్ పోలేపాక చెన్నయ్య కాంగ్రెస్ నాయకులు ఆవుల సత్యనారాయణ ఆవుల అంజయ్య నల్ల రామచంద్రం జినుకల మల్లేష్ మత్స్య కార్మిక సంఘం అధ్యక్షుడు నిమ్మల రవికుమార్ నిమ్మల భిక్షం నాయకులు అంజయ్య కసిర బోయిన నరసింహ సుంకి ఆనంద్ మర్రి నాగరాజు సుంకి అజిత్ ,మీసాల మచ్చ గిరి పాల్గొని శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది.
AJR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని పహిల్వాన్ పూర్ గ్రామానికి చెందిన బొట్టు బిక్షపతి గారు చాలా రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందగా వారి , యొక్క కుటుంబ సభ్యులకి, (AJR ఫౌండేషన్) ఎలిమినేటి జంగారెడ్డి సహకారంతో గురువారం రూ.5000 అందజేశారు.. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు AJR టీం సభ్యులు పాల్గొన్నారు.

అడ్డగూడూరు CPI మండల నూతన కౌన్సిల్ ఏకగ్రీవ ఎన్నిక

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అడ్డగూడూరు మండల నూతన కౌన్సిల్ మంగళవారం నాడు సాయంత్రం అడ్డగూడూరు మండల కేంద్రంలో జరిగిన మండల కౌన్సిల్లో నూతన కౌన్సిల్ మండల కార్యదర్శి అసిస్టెంట్ మండల కార్యదర్శి లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది . ఈ సమావేశానికి సిపిఐ జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి గారు ముఖ్య అతిధులుగా హాజరైనారు .ఈసందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు గారు మాట్లాడుతూ అడ్డగూడూరు మండలంలో భారత కమ్యూనిస్టు పార్టీ ని బలోపేతం చేయాలని నూతన మండల కార్యదర్శి కౌన్సిల్ సభ్యులు కు విజ్ఞప్తి చేశారు వివిధ గ్రామాల శాఖల నుండి ఎంపిక చేయబడిన 13మంది తో నూతన కౌన్సిల్ ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది నూతన మండల కార్యదర్శిగా రేకల శ్రీనివాస్ (బొడ్డుగూడెం) సహాయ కార్యదర్శిగా కందుకూరి వెంకన్న (కంచనపల్లి) కౌన్సిల్ సభ్యులుగా చెడే భిక్షం, చెడిపల్లి రవీందర్, ఉప్పుల శాంతి కుమార్, బోనుగా సుదర్శన్ రెడ్డి, బెల్లి శ్రీకాంత్, సోలిపురం నాగిరెడ్డి, గొలుసుల శ్రీకాంత్, ముక్కర్ల వెంకటయ్య ,గూడెల్లి యాదయ్య, యాట రామచంద్రు, పోగుల కనకయ్య లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.నూతన కార్యదర్శి, అసిస్టెంట్ కార్యదర్శి మాట్లాడుతూ మాపై నమ్మకంతో భాధ్యతలు ఇచ్చినందుకు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తామని అన్నారు. ఈకార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చేడే చంద్రయ్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్, సిపిఐ మండల మాజీ కార్యదర్శి చేడే బిక్షం, వివిధ గ్రామ శాఖ కార్యదర్శులు ,సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.