/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz అడ్డగూడూరు CPI మండల నూతన కౌన్సిల్ ఏకగ్రీవ ఎన్నిక Vijay.S
అడ్డగూడూరు CPI మండల నూతన కౌన్సిల్ ఏకగ్రీవ ఎన్నిక

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అడ్డగూడూరు మండల నూతన కౌన్సిల్ మంగళవారం నాడు సాయంత్రం అడ్డగూడూరు మండల కేంద్రంలో జరిగిన మండల కౌన్సిల్లో నూతన కౌన్సిల్ మండల కార్యదర్శి అసిస్టెంట్ మండల కార్యదర్శి లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది . ఈ సమావేశానికి సిపిఐ జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి గారు ముఖ్య అతిధులుగా హాజరైనారు .ఈసందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు గారు మాట్లాడుతూ అడ్డగూడూరు మండలంలో భారత కమ్యూనిస్టు పార్టీ ని బలోపేతం చేయాలని నూతన మండల కార్యదర్శి కౌన్సిల్ సభ్యులు కు విజ్ఞప్తి చేశారు వివిధ గ్రామాల శాఖల నుండి ఎంపిక చేయబడిన 13మంది తో నూతన కౌన్సిల్ ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది నూతన మండల కార్యదర్శిగా రేకల శ్రీనివాస్ (బొడ్డుగూడెం) సహాయ కార్యదర్శిగా కందుకూరి వెంకన్న (కంచనపల్లి) కౌన్సిల్ సభ్యులుగా చెడే భిక్షం, చెడిపల్లి రవీందర్, ఉప్పుల శాంతి కుమార్, బోనుగా సుదర్శన్ రెడ్డి, బెల్లి శ్రీకాంత్, సోలిపురం నాగిరెడ్డి, గొలుసుల శ్రీకాంత్, ముక్కర్ల వెంకటయ్య ,గూడెల్లి యాదయ్య, యాట రామచంద్రు, పోగుల కనకయ్య లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.నూతన కార్యదర్శి, అసిస్టెంట్ కార్యదర్శి మాట్లాడుతూ మాపై నమ్మకంతో భాధ్యతలు ఇచ్చినందుకు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తామని అన్నారు. ఈకార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చేడే చంద్రయ్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్, సిపిఐ మండల మాజీ కార్యదర్శి చేడే బిక్షం, వివిధ గ్రామ శాఖ కార్యదర్శులు ,సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మూసి లో పడి మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన భాజపా రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఏలే చంద్రశేఖర్

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణ కేంద్రంలో దీపావళి పండుగ రోజున వలిగొండ మూసీ నదిలో పడి మరణించిన చిన్నారుల కుటుంబాలను పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు 5000/- రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించిన బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యులు ఏలే చంద్రశేఖర్. మృతుల కుటుంబాలకు వద్ద కు వెళ్ళి వారి తల్లిదండ్రులను ఓదార్చి, ధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాజాపా మండల అధ్యక్షుడు బోళ్ల సుదర్శన్, ఎదురుగట్ల వెంకటేశం, అప్పిశెట్టి సంతోష్, యువమోర్చా అసెంబ్లీ కన్వీనర్ బుంగమట్ల మహేష, యువ మోర్చా మండల అధ్యక్షుడు మందాడి రంజిత్ రెడ్డి, యువ ప్రధాన కార్యదర్శి ఆమగంటి శివ, రేగు శ్రీధర్, ఎర్రబోలు జంగయ్య, కీర్తి వెంకటేశం, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక సహాయం అందజేసిన డిసిసి ఉపాధ్యక్షులు వాకిటి అనంతరెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని  ఆరూరు గ్రామానికి చెందిన సారగండ్ల నవీన్ కుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బుధవారం  డీసీసీ ఉపాధ్యక్షులు వాకిటి అనంతరెడ్డి.. 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు .ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు .. బుర్ర నరసింహ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎలిమినేటి సురేష్ , దామెర అంజయ్య, పరమేశ యూత్ అధ్యక్షులు రేఖ మచ్చ గిరి, ఎర్ర సాయి ,మాటూరు సాయి, oనిమ్మల గుట్ట చిలకమర్రి శ్రీనివాస్ చారి ,బండి రవి ,బుర్ర శ్రీకర్ ,బోగారం ఎల్లయ్య, క్యాదరి నరేష్ ,బుర్ర శివ తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక సహాయం అందజేసిన మాజీ MPP చిట్టెడి జనార్దన్ రెడ్డి


యాదాద్రి భువనగిరి జిల్లా తేదీ 6-11-2024'మంగళవారం రోజున ఆరూరు గ్రామం వలిగొండ మండలం యాదాద్రి భువనగిరి జిల్లా సారగండ్ల నవీన్ రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది వారి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీపీ చిట్టి డి జనార్ధన్ రెడ్డి .వారి కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది .ఈ కార్యక్రమంలో వలిగొండ కాంగ్రెస్ ఓబీసీ సెల్ అధ్యక్షులు చిలకమర్రి కనకాచారి మాజీ సర్పంచ్ జినుకల దానయ్ కాంగ్రెస్ నాయకులు బండి రవికుమార్ మత్స్య కార్మిక సంఘం నిమ్మల రవికుమార్ మాజీ ఎంపిటిసి బైకానీ ముత్యాలు, మాజీ సర్పంచ్ పోలేపాక చెమ్మయ్య, కసిర బోయిన లింగయ్య ,జాడ నవీన్, నిమ్మల బిక్షం, ఎర్ర గుట్ట వెరుపుల అబ్బయ్య ,నిమ్మల స్వామి, బోగారం మైపాల్ తదితరులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది.
వలిగొండ లో AJR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల్ లో  బుధవారం  వలిగొండ పట్టణానికి చెందిన మాదగోని అంజమ్మ గారు ఇటీవల అనారోగ్యంతో మరణించారని సమాచారం తెలిసిన వెంటనే AJRఫౌండేషన్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డి గారు ఆ కుటుంబ సభ్యులకి (AJR ఫౌండేషన్) ఎలిమినేటి జంగారెడ్డి సహకారంతో వారి దశదినకర్మ కు (5000వేల రూపాయలు ) అందజేశారు.. ఈ కార్యక్రమంలో వలిగొండ గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ లో ఉద్యమకారుల సదస్సు లో పాల్గొన్న యాదాద్రి భువనగిరి జిల్లా ఉద్యమకారుల ఫోరం నాయకులు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్యమ కళాకారుల సదస్సును ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డా" చీమ శ్రీనివాస్ పిలుపుమేరకు వరంగల్ సదస్సుకు యాదాద్రి భువనగిరి జిల్లా ఉద్యమకారుల ఫోరం నాయకులు పాల్గొన్నారు. ఉద్యమ కళాకారుల డిమాండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని సదస్సు నిర్వహించినట్లు వారు తెలిపారు వారి యొక్క డిమాండ్లు 250 గజాల ఇంటి స్థలం 25 వేల పింఛన్ గుర్తింపు కార్డులతో పాటు సంస్కృతిక సారధిలో కళాకారులకు 1000ఉద్యోగాలు కళాకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చి ఉద్యమ కళాకారుల ఆకాంక్షను మరియు గత ప్రభుత్వంలో కన్న కలలను సాకారం కాకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఉద్యమ కళాకారులు ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా ఈ సదస్సులో గుర్తు చేశారు ముఖ్యమంత్రి వెంటనే ఇచ్చిన హామీలను మంజూరు చేయించి ఉద్యమ కళాకారులను ఆదుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగు అంజన్న ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు గంధమల్ల బాలయ్య ఉమ్మడి జిల్లా మహిళా ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షురాలు గంధమల్ల మల్లమ్మ యాదాద్రి భువనగిరి ,మండల ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు మారగొని శ్రీనివాస్ గౌడ్ ,జిల్లా ఉద్యమ కళాకారుల సాంస్కృతిక కార్యదర్శి మల్లం వెంకటేశం గౌడ్ ఉద్యమకారుల ఫోరం జిల్లా కార్యదర్శి కదిరిని స్వామి జిల్లా ఉద్యమ కళాకారుల కన్వీనర్ సురుపంగా గణేష్ పాల్గొన్నారు*
AJR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత

యాదాద్రి భువనగిరి జిల్లా:- వలిగొండ మండల పరిధిలోని  వెలువర్తి గ్రామానికి చెందిన ఎర్ర ఎల్లయ్య అనారోగ్యంతో మరణించారని సమాచారం తెలిసిన వెంటనే AJRఫౌండేషన్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డి గారు టీముని పంపించి, ఆ కుటుంబ సభ్యులకి వారి యొక్క కుమారుడికి ఎర్ర నరసింహ గారికి (AJR సేవ ఫౌండేషన్) ఎలిమినేటి జంగారెడ్డి సహకారంతో (5000వేల రూపాయలు ) అందజేశారు.. ఈ కార్యక్రమంలో వెలువర్తి గ్రామ ప్రజలు, యువత AJR Team పాల్గొన్నారు.
వలిగొండ: మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఐటిపాముల రవీంద్ర

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణ కేంద్రానికి చెందిన మాజీ వార్డ్ నెంబర్ మాధగోని యాదగిరి గౌడ్ మాతృమూర్తి మాధగోని అంజమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది .మృతురాలి కుటుంబ సభ్యులను మంగళవారం మండల కేంద్రానికి చెందిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐటిపాముల రవీంద్ర పరామర్శించి పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు .ఈ కార్యక్రమంలో బత్తిని పాండుగౌడ్ ,ఆదిమూలం సోమేశ్ ,బత్తిని నాగేష్ గౌడ్ ,బత్తిని వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సమగ్ర సర్వే నుండి ప్రభుత్వ ఉపాధ్యాయులను మినహాయించాలి; వెంకట్ రెడ్డి జాతీయ కన్వీనర్ ఎం వి ఫౌండేషన్

తేదీ: 04-11-2024 గౌరవ శ్రీ . ఎనుముల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి, హైదారాబాద్, తెలంగాణ రాష్ట్రం. విషయం : విద్యా హక్కు చట్టాన్ని మరియు బాలల విద్యను దృష్టిలో ఉంచుకొని “సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే” నుండి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను మినహాయించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి ఆర్యా ! రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన “సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే” కోసం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల సేవలను తీసుకోవడానికి విద్యాశాఖప్రధాన కార్యదర్శి 1.11.2024 నాడు మెమో నెంబర్ 1112 ద్వారా 36,559 SGT ఉపాధ్యాయులను, 3414 ప్రధానోపాధ్యాయులకు ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాకుండా పాఠశాలలను ఉదయం 9 గంటల నుండి మ. 1 గంటల వరకే (ఒంటి పుట)నే నిర్వహించాలని ఈ ఉత్తర్వుల సారాశం. ప్రభుత్వ పాఠశాలపై దిగజారుతున్న విశ్వాసానికి ఈ ఆదేశాలు తల్లిదండ్రులలో మరింత ఆవేదనకు గురి చేస్తుంది. విద్యా హక్కు చట్ట ప్రకారం సంవత్సరం లో ప్రాథమిక పాతాశాలలు 200 పనిదినాలు మరియు 8౦౦ బోధనా గంటలుగా నిర్దారించాడమైనది. అంతే కాకుండా ఉపాధ్యాయులకు జనాభా గణన లెక్కలు, ప్రకృతి వైపరిత్యాలలో సహాయ విధులు మరియు పార్లమెంటు, రాష్ట్ర శాసన సభ, స్థానిక ప్రభుత్వాలకు జరిగే ఎన్నికలకు సంబందించిన విధులను మినహాయించి టిచర్లను ఏ ఇతర విద్యేతర పనులకు పంపకూడదని విద్యా హక్కు చట్టం నిర్దేశిస్తుంది.రాష్ట్ర ప్రభుత్వం కుల గణన కోసం ఉపాధ్యాయులను వినియోగించుటకు జారీచేసిన ఉత్తర్వులు విద్యా హక్కు చట్ట ఉల్లంఘన కిందికి రావడమే కాకుండా బాలల విద్యా హక్కు ను కూడా ఉల్లంగించినట్లు అయితుంది. మనందరికి తెలుసు ప్రభుత్వ బడులలో చదివే పిల్లల తల్లిదండ్రులు అత్యధిక శాతం కూలి నాలి చేసుకునే వారే .దళిత బహుజనులే . సగం పూట బడులు నడపడం వలన పిల్లలు ఇంటికి వస్తే ఎవరు ఉండరు కాబట్టి ఆ సగం పూట కూడా బడికి కాకుండా పనికి వెళ్లే తల్లిదండ్రులు పిల్లలను తమ వెంట తీసుకుపోతారు . చాలా ప్రమాదం ఈ చర్య. మళ్లీ బడులకు రావడం అలవాటు కు సమయం పడుతుంది. దసరా దీపావళి పండుగల తరువాత ఇంకా అందరు పిల్లలు బడులకు తిరిగి రాలేదు. అంతలోనే ఈ సర్వే పనుల వలన బడులు మూత. పిల్లల సామర్థ్యాల పై చాలా ప్రభావం పడుతుంది . అసలే నాణ్యమైన విద్య అందించడంలో రాష్ట్రం చాలా వెనుకబడి ఉంది. దేశవ్యాప్తంగా నిర్వహించిన నేషనల్ అచీవ్ మెంట్ సర్వే (NAS) నివేదిక ద్వారా తెలియ వచ్చింది. ఇక ప్రభుత్వ పాఠశాలలల్లో ఎస్ సి, బి సి, ఎస్టీ సామజిక వర్గాల విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలు ఇంకా ఎక్కువ ఆందోళనకరంగా ఉన్నాయి. మొత్తంగా ఈ మన రాష్ట్రం, అన్ని రాష్ట్రాలలో కంటే మన రాష్ట్రం బాలలు తక్కువ అభ్యసన సామర్ధ్యాలు కలిగి ఉన్నారు. ఈ మద్యనే మీ ప్రభుత్వ హయాంలో నాణ్యమైన విద్య అందించడానికి వేలాది మంది ఉపాధ్యాయులను నియమించి నందుకు తల్లిదండ్రులు ఫౌర సమాజం హర్షించింది. కాని ఈ సంతోషం ప్రాథమిక పాతశాల్ల ఉపాధ్యాయులను బోదనేతర పనులు అప్పజెప్పడం వలన విద్యార్థుల బోధన కుంటుపదడమే కాకుండా విద్యార్థులు బడిమానేసి ప్రమాదం ఎంతైనా ఉంది. విద్యా హక్కు చట్టాన్ని దృష్టిలో ఉంచుకొని సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నుండి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను మినహాయించాలని విజ్ఞప్తి ఇట్లు ఆర్. వెంకట రెడ్డి జాతీయ కన్వీనర్, ఎం. వి. ఫౌండేషన్
DYFI భువనగిరి మండల అధ్యక్ష కార్యదర్శులుగా మైలారం శివప్రసాద్ , దయ్యాల మల్లేష్ ఎన్నిక

భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI) భువనగిరి మండల అధ్యక్ష కార్యదర్శులుగా మైలారం శివప్రసాద్, దయ్యాల మల్లేష్ లను ఎన్నుకున్నట్లు సంఘం జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్ అన్నారు. ఆదివారం జరిగిన మండల మహాసభలో DYFI అభివృద్ధి కోసం యువత ఉపాధి అవకాశాల కోసం స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని భవిష్యత్తులో అనేక పోరాటాలు నిర్వహిస్తామని వారు తెలిపారు వీరితోపాటు మండల ఉపాధ్యక్షులుగా కుసుమ మధు, గడ్డం కనకరాజు, సహాయ కార్యదర్షులుగా పల్లెర్ల వినోద్, చందుపట్ల బిక్షపతి కమిటి సభ్యులుగా జాన సురేష్,ముడుగుల శేఖర్, గడ్డం చాణక్య లను ఎన్నుకున్నారు.