/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz ఈనెల 9న జిల్లా కేంద్రంలో నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన విజయవంతం చేయండి ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి Vijay.S
ఈనెల 9న జిల్లా కేంద్రంలో నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన విజయవంతం చేయండి ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి

యాదాద్రి భువనగిరి జిల్లా: ఎమ్మార్పియాస్,యం యస్ పీ అనుబంధ సంఘాల జిల్లా కార్యవర్గ సమావేశం ఈనెల 9న జిల్లా కేంద్రంలో నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన విజయవంతం చేయండి ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండానే మాదిగలను మోసం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ నిలుపుదల చేయాలని ఈరోజు స్థానిక రహదారి బంగ్లా లో ఎమ్మార్పీఎస్, యం యస్ పీ అనుబంధ సంఘాల జిల్లా కార్యవర్గ సమావేశం ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ మాదిగ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యం యస్ పీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ హాజరై మాట్లాడుతూ... ముప్పై ఏండ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత భారత సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ కు అనుకూలంగా తీర్పును ఆగష్టు1న వెలువరించడం జరిగింది, తీర్పును ఇచ్చిన మరుక్షణమే నిండు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు వర్గీకరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇప్పటికే ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ కి మరియు రాబోయే నోటిఫికేషన్ లో కూడా వర్గీకరణకి అనుగుణంగా ఉంటుందని, అలాగే గ్రూపు 1 & 2 మరియు మెడిసిన్ సీట్ల కేటాయింపు, విశ్వ విద్యాలయాల్లో సీట్ల కేటాయింపు, ప్రయివేటు రంగం లో కూడా వర్గీకరణ కి అనుగుణంగా చేస్తామని హామి ఇచ్చి ఇటీవల వెలువడిన డీఎస్సీ ఫలితాలలో 11,062 ఉపాధ్యాయ నియామకాల్లో వర్గీకరణ అనుగుణంగా న్యాయమైన వాటా 1200ల ఉద్యోగాలు మాదిగలు మరియు ఉపకులాలకి రావాల్సి ఉండగా కేవలం 200 మందికే ఉద్యోగాలు రావడం మరియు ఈ నెల 9న నియామక పత్రాలు ఇవ్వడం మాదిగలకు మరియు ఉపకులాలకి తీరని అన్యాయం చేసినట్టేనని అన్నారు. తక్షణమే నియామకాలు ఆపాలని, మాట తప్పిన కాంగ్రెస్ పార్టీ కి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాదిగల మరియు ఉపకూలాల ఆవేదనను తెలియజేసేందుకు ఎమ్మార్పియాస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 9న జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహాల నుండి జరిగే నిరసన ర్యాలీలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి అనుబంధ సంఘాలతో పాటు డీఎస్సీలో వెనకబడ్డ ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని మరియు ఈనెల 15వ తారీకున హైదరాబాద్ నగర కేంద్రంలో జరిగే ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఎస్సీల వర్గీకరణ లేకుండానే నియామకాలను నోటిఫికేషన్లు నిలిపివేయాలని లేకుంటే ఈ నెల 15 తర్వాత మందకృష్ణ మాదిగ నాయకత్వంలో నిరంతర కార్యచరణ రూపంలో తెలంగాణ ప్రభుత్వాన్ని మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండబెట్టడానికి కార్యాచరణ రూపొందించుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. -------------------------------------------- ఈ కార్యక్రమంలో యం యస్ పీ జాతీయ నాయకులు మంద శంకర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఇటుకల దేవేందర్ మాదిగ, ఎంఎస్పి జిల్లా నాయకులు దుబ్బ దానయ్య మాదిగ, జిల్లా కార్యదర్శి బోయ లింగ స్వామి, బండారు శివ శంకర్ మాదిగ , నారికడప నర్సింగ్ రావ్ మాదిగ,నల్ల స్వామి మాదిగ, మద్దూరి నర్సింగ్ రావ్ మాదిగ, మొగిలిపాక సత్తయ్య మాదిగ, మోత్కూపల్లి నవీన్ మాదిగ, కోయ సమ్మయ్య మాదిగ,కోళ్ల జహంగీర్ మాదిగ,గాయపాక పృథ్వీ మాదిగ, వాసాలమర్రి రవి మాదిగ,కొండగడప నరేష్ మాదిగ ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
గోపరాజు పల్లి లో కీసర్ల సావిత్రమ్మకు నివాళులర్పించిన నాయకులు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోపరాజుపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కీసర్ల మహేందర్ రెడ్డి మాతృమూర్తి కీసర్ల సావిత్రమ్మ గురువారం మృతి చెందారు. శుక్రవారం గోపరాజుపల్లి లో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా వలిగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి, నాయకులు నరేష్ రెడ్డి,బత్తిని సహదేవ్ గరిసే రవి ,కొండూరు భాస్కర్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తుమ్మల వెంకట్ రెడ్డి, జిల్లా నాయకులు మొగుళ్ళ శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచులు, పాల్గొని వారి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గోపరాజు పల్లి మాజీ సర్పంచ్ కీసర్ల సత్తిరెడ్డి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు సలిగంజి బిక్షపతి, చిల్లర స్వామి, యాస అయిల్ రెడ్డి, పాలకూర్ల యాదయ్య, గాజుల అంజయ్య, పాలకూర అంజయ్య,సంగిశెట్టి రమేష్, బంధువులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

బునాది గాని కాలువ పనులు వెంటనే పూర్తి చేయాలి: CPI

బునాదిగాని కాలువ పనులను వెంటనే పూర్తి చేయాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేసింది. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఐదు మండలాల కార్యదర్శుల, జిల్లా కార్యవర్గ సభ్యుల సమావేశంలో సిపిఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు మండలం,మోత్కూరు, మోటకొండూరు,వలిగొండ, అడ్డగూడూరు మండలాల్లో బునాది కాల్వ పనుల ద్వారా త్రాగు సాగునీరు అందేలా బునాదికాలువ లో పనులను వెంటనే పూర్తి చేయాలని కోరారు. ఆనాడు రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2005లో వారు ప్రారంభిoచి కాల్వ ఎస్టిమేషన్ ప్రకారం14 కోట్లు కేటాయించినారు 2014లో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడినంక రీ ఎస్టిమేషన్ వేసి 71 కోట్లు ప్రకటించి అందులో 31 కోట్లు విడుదల చేసినారు అందుకు పూర్తి కాకుండా నిలిచిపోయింది బునాది కాలువ పనులకు 269 కోట్ల నిధులతో పనులు పూర్తికావని, 400 కోట్ల వరకు బునాది కాల్వ పనులకు నిధులు పెంచాలని కోరారు. ఆత్మకూరు సిపిఐ మండల కార్యదర్శి మారుపాక వెంకటేశం అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పల ముత్యాలు,బోడ సుదర్శన్, కుస్మని హరిచంద్ర, వలిగొండ మండల కార్యదర్శి ,పోలేపాక యాదయ్య,మోటకొండూరు మండల సహ కారదర్శి ఆలేటి బాలరాజు,జిల్లా మహిళాసంఘo గౌరవ అధ్యక్షురాలు గుర్రం రాజమణి తదితరులు పాల్గొన్నారు.
MPPS చిత్తాపురంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల చిత్తపురం లో మంగళవారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే పండుగ బతుకమ్మ పండుగ అని , విద్యార్థులకు చదువుతోపాటు సాంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానోపాధ్యాయులు పి విజయానంద్ అన్నారు .రంగురంగుల పూలతో బతుకమ్మలను ఒకచోట పేర్చి పాఠశాలలో విద్యార్థులు బతుకమ్మ ఆటలు ఆడారు .బతుకమ్మ ఆటలతో పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. విజయానంద్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేయాలని ఉద్దేశంతో పాఠశాలలో బతుకమ్మ వేడుకలను నిర్వహించడం జరిగిందని అన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు సమాజం పట్ల అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమంలో టీచర్స్ డి వెంకటరమణ, ఎస్ విజయ్ కుమార్ ,ఎండి హర్సియా బేగం, విద్యార్థులు పాల్గొన్నారు.

వలిగొండ మండల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బందికి బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన డాక్టర్ జ్యోతి

యాదాద్రి భువనగిరి జిల్లా  వలిగొండ మండల పరిధిలోని వర్కట్ పల్లి గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ జ్యోతి వారి తండ్రి గారు దాసరి నందం జ్ఞాపకార్థంగా మండలంలోని 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని సూపర్ వైజర్స్ కి , ఏ ఎన్ ఎం లకి , నర్సులకు , ఆశా కార్యకర్తలకి , ఆయామ్మలకి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు . ఈ సందర్భంగా డాక్టర్ జ్యోతి మాట్లాడుతూ వలిగొండ , వర్కట్ పల్లి , వేముల కొండ , వెల్వర్తి గ్రామాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వివిధ హోదాలో పని చేస్తున్న వైద్య సిబ్బందికి మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది మహిళలకు మా నాన్న గారు స్వర్గీయ దాసరి నందం గారి జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం నా వంతుగా ఈ బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నానని అన్నారు . అందరికి బతుకమ్మ , దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు . ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .
సమాచార సేకరణ మహోత్సవం జరపాలి : కొడారి వెంకటేష్ ఆర్టిఐ యాక్టివిస్ట్


సమాచార హక్కు చట్టం-2005, ఏర్పడి రెండు దశాబ్దాలు అవుతున్న సందర్భంగా అక్టోబర్ మాసాన్ని "సమాచార సేకరణ మాసోత్సవంగా" జరపాలని ఆర్టీఐ ఆక్టివిస్ట్, సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ కోరారు. మంగళవారం భువనగిరి జిల్లా హెడ్ పోస్ట్ ఆఫీస్ లో మొదటి సమాచార దరఖాస్తును రిజిస్టర్ పోస్టు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సమాచార హక్కు చట్టం -2005 , అక్టోబర్ 12 నుండి అమల్లోకి వచ్చిన సందర్భాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. సహ కార్యకర్త లు అక్టోబర్ 1 నుండి 31 వరకు ప్రతి రోజు ఆయా ప్రభుత్వ శాఖలకు సమాచారం కోసం దరఖాస్తు చేసి, సమాచారాన్ని సేకరించాలని ఆయన పిలుపునిచ్చారు. పాలనలో పారదర్శకత జవాబుదారీతనం, మరియు అవినీతి రహిత సమాజం కోసం సమాచార హక్కు చట్టం -2005 ను పకడ్బందీగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం గత 18 నెలలుగా ఖాళీగా ఉన్న సమాచార (చీప్ ) ప్రధాన కమీషనర్ మరియు సమాచార కమీషనర్ లను, అన్ని అర్హతలు ఉన్న వారిని యుద్ద ప్రాతిపదికన నియామకం చేయాలని ఆయన ముఖ్యమంత్రి ని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఆర్టీఐ ఆక్టివిస్ట్ గా చురుకైన పాత్ర పోషించారని, ఆర్టీఐ చట్టం -2005 ను సమర్థవంతంగా అమలు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
వలిగొండ మండల కేంద్రంలో TUF నాయకులకు ఘన సన్మానం

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు నాయకురాళ్లకు సోమవారం వలిగొండ మండల కేంద్రంలోని టీయూఎఫ్ కార్యాలయంలో తాజా మాజీ రాష్ట్ర కార్యదర్శి జానకి రెడ్డి ఉమ్మడి జిల్లా తాజా మాజీ అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా తాజా మాజీ రాష్ట్ర కార్యదర్శి జానకి రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులు ఎవరు అధర్య పడవద్దని. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉద్యమకారులకు న్యాయం జరుగుతున్నదని నమ్మకం ఉందన్నారు ఈ కార్యక్రమనికి. వలిగొండ మండల ఉద్యమకారుల ఫోరం తాజా మాజీ అధ్యక్షులు మారగొని శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షత వహించగా ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి జోగు అంజయ్య యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా విభాగం మాజీ అధ్యక్షులు రాలు గంధ మల్ల. మల్లమ్మ . మల్లం వెంకటేశం.చౌటుప్పల్ మండల అధ్యక్షులు గట్టు సుధాకర్ రామన్నపేట టీయూఎఫ్..నాయకులు. బొడ్డుపల్లి లింగయ్య. ఎండి ఖలీల్ చీమకండ్ల శ్రీనివాస్ .ఇమామ్ .బాబు. ఎక్కల దేవి .శ్రీనివాస్.. పబ్బు లక్ష్మయ్య. గంగ దారి సత్తయ్య. గంధ మల్ల. గోపాలు. ఏ స్వామి మంటి లింగయ్య. ఐటిపాముల పుష్ప. కదిరే ని స్వామి.. కీర్తి కలమ్మ. నాగేల్లి రాములు. ఎదురుగట్ల రాములు. తదితరులు పాల్గొన్నారు.
భువనగిరి 8వ వార్డులో హరితహారం ,మొక్కలు పంపిణీ చేసిన కౌన్సిలర్ పంగరెక్క స్వామి

భువనగిరి జిల్లాభువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టీ వెంకటేశ్వర్లు 8 వార్డు కౌన్సిలర్ పంగ రెక్క స్వామి ఆధ్వర్యంలో హరితహారంలో భాగంగా సోమవారం వార్డులో ఉన్న ప్రతి కుటుంబానికి ఆరు పూవుల మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా కౌన్సిలర్ మాట్లాడుతూ..ఇంటికి ఓ చెట్టు ప్రగతికి మెట్టు అన్నారు. ప్రజలందరూ హరితహారంలో భాగం అయి వార్డుని హరితమయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కో ఆప్షన్ సభ్యులు ఇట్టబోయినా సబిత గోపాల్,వార్డ్ ఇన్చార్జి శబయొద్దిన్ ఆర్పీ,ధనలక్ష్మి,పావని,రమేష్ అనిత,మొగ్గ లక్ష్మి,వార్డు మహిళలు, మహిళల సంఘాలు పాల్గొన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరైన మందులు ల్యాబ్ లను ఏర్పాటు చేయాలి:AIYF జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్

వలిగొండ మండలంలోనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 24 గంటల అత్యవసర వైద్య సదుపాయాలు, కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక భువనగిరి శాసనసభ్యులకు వినతి పత్రం అందజేయడం జరిగినది. ఈ సందర్భంగా *ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్ మాట్లాడుతూ* గత పది సంవత్సర కాలం నుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో గత పాలకుల అండతో వైద్య సిబ్బంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో తిస్ట వేసి ప్రజలకు సరైన వైద్యము అందించడం లేదని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సరైన మందులు లేక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు అలాగే సరైన ఆధునాతనమైన యంత్రాలు అందించి ల్యాబ్ టెక్నీషియన్ సెంటర్ లను కూడా ఏర్పాటు చేయాలని అన్నారు వెంటనే మండలంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సిబ్బందిని ప్రక్షాళన చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ను కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి సుద్దాల సాయికుమార్, ఉన్నారు.
షరతులు లేని రెండు లక్షల రూపాయలు రుణమాఫీనీ రైతులందరికీ వెంటనే అమలు చేయాలి: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్న పేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నిర్వహించిన రైతు ధర్నా కార్యక్రమం లో మాజీ ఎంఎ
ల్ఏ చిరుమర్తి లింగయ్య గారు ఈ సందర్భంగా మాజీ ఎంఎల్ఏ చిరుమర్తి లింగయ్య గారు మాట్లాడుతూ ఋణ మాఫికి 18 వేల కోట్లు ఇచ్చినము,ఇంకా 13 వేలకోట్లు ఇవ్వాల్సి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రకటించారు మిగిలిన రైతులకు డబ్బులు సమకూరే వెసులుబాటును బట్టి డేట్ ఇస్తాం అంటారు ఋణ మాఫీపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రం లోని రైతులందరికీ రుణమాఫీ చేశాం అని మాయ మాటలు చెప్తున్నారు ఒక్కో మంత్రి ఒక్కో రకంగా పొంతన లేకుండా సమాధానం చెప్తూ రైతులను మోసం చేస్తున్నారు అర్హులైన రాష్ట్రం లోని ప్రతి రైతుకు ఎటువంటి నిబంధలను లేకుండా రెండు లక్షల రూపాయల ఋణ మాఫీ చేయాలి రేషన్ కార్డులు లేవని రైతులకు రుణ మాఫీ చేయకపోవడం చాలా దుర్మార్గం వానాకాలం సీజన్ ముగుస్తున్న ఇంత వరకు రైతుబందు రైతుల అకౌంట్ల లో వేయలేదు,వెంటనే అందరికీ రైతు బంధు నిధులు వేయాలి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ వంద రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది ఆరు గ్యారంటీ లు అమలు చేయలేక హైడ్రా పేరుతో అమాయకుల ఇళ్లను పడగొడుతూ ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు ఈ ధర్నా కార్యక్రమం లో రామన్న పేట మండల పార్టీ నాయకుల,రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.