ఋణమాఫీ కాకా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే రేవంత్ రెడ్డి సర్కార్ చోద్యం చూస్తుంది! రైతు సోలిపేట సురేందర్ రెడ్డి మరణానికి రేవంత్ రెడ్డి బాధ్యత
ఋణమాఫీ కాకా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే రేవంత్ రెడ్డి సర్కార్ చోద్యం చూస్తుంది!
రైతు సోలిపేట సురేందర్ రెడ్డి మరణానికి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి!
జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్
బిఆర్ఎస్ సీనియర్ నాయకులు
తేది:07-09-2024 శనివారం
చిన్నకోడూర్ న్యూస్
ఆత్మహత్య చేసుకున్న రైతు సోలిపేట సురేందర్ రెడ్డి మరణాకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత వహించి అతని కుటుంబాన్ని ఆదుకోవాలని మాజీ వైఎస్ యంపిపి కీసరి పాపయ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ లు అన్నారు.
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన గాడిదప్పిందని ఇచ్చిన హామీలను సైతం మర్చిపోయి సొంత లాభాలను చూసుకుంటూ రేవంత్ రెడ్డి పబ్బం గడుపుతున్నాడని రుణమాఫీ పూర్తి చేయకపోవడంతో కోటి ఆశలు పెట్టుకున్న రైతులు ఈనాడు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారని వారన్నారు.
నమ్మి నాన్నబోతే పుచ్చి బుర్రలైనట్లు రేవంత్ రెడ్డి మాటలకు మోసపోయిన ప్రజలు ఓట్లేసి గద్దెనెక్కిస్తే రేవు దాటినంక్క తెప్ప తగిలేసినట్లు రేవంత్ రెడ్డి గట్లుందని అన్నారు.
తక్షణమే పూర్తి ఋణమాఫీ చేసి రైతుల ఆదుకోకుంటే మా నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు గారి అనుమతి తీసుకొని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి చేస్తామని త్వరలోనే రైతులతో సమీక్ష నిర్వహించి కార్యాచరణ చేస్తామని అన్నారు.
Sep 21 2024, 16:37