/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz TG: దసరా కు రైతు భరోసా డబ్బులు..! Mane Praveen
TG: దసరా కు రైతు భరోసా డబ్బులు..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలుపనుంది. దసరా లోపు రైతు భరోసా నిధులు రిలీజ్ చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈనెల 20 న తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఉంది. ఈ సమావేశంలో రైతు భరోసా నిధుల పైన ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన రైతు భరోసా నిధులను రిలీజ్ చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఎకరానికి 15 వేల రూపాయల చొప్పున, ఏడాది మొత్తంలో రైతుల ఖాతాలో జమ చేస్తామని కాంగ్రెస్..ఎన్నికల ప్రచారంలో చెప్పింది.ఇప్పుడు ఆ డబ్బులను దసరా లోపు వెయ్యాలని అనుకుంటుంది.

ప్రస్తుత లెక్కల ప్రకారం 1. 53 కోట్ల ఎకరాలకు రూ. 11475 కోట్లు ఖర్చు అవుతుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంచనా వేసింది. ఇక రేపు తెలంగాణ కేబినెట్ సమావేశంలో ఈ డబ్బులు రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.
TG: చెరువులు, కుంటలు, నాళాల పై ఉన్న అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలి: బిఎస్పి
ఖమ్మం పట్టణంలో చెరువులు, కుంటలు, నాళాలపై అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను వెంటనే తొలగించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుర్ర ఉపేంద్ర సాహు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం పట్టణం, అంబేద్కర్ చౌరస్తాలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, బుధవారం జిల్లా అధ్యక్షుడు చెరుకుపల్లి నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన నిరసన ప్రదర్శన కార్యక్రమంలో ఉపేంద్ర సాహు మాట్లాడుతూ.. ఖమ్మం పట్టణ పరిసర ప్రాంతాలైన లకారం చెరువు, దంసలాపురం చెరువు, ఖానాపురం చెరువు, కుంటలు, నాళాలు, అలుగులపై అక్రమంగా భూ కబ్జాదారులు యదేచ్ఛగా కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారని అన్నారు.

చెరువులతోపాటు పట్టణంలోని నాళాలపై కూడా అక్రమ నిర్మాణాలు చేయడం వల్ల తీవ్రమైన వర్షాలు కురిసినప్పుడు పట్టణంలో నీళ్లు బయటకు వెళ్లడానికి అవకాశం లేకుండా పోయిందని అన్నారు.
మున్నేరు వరదలతో దానవాయి గూడెం కాలనీ, కరుణగిరి, సాయి కృష్ణ నగర్, వెంకటేశ్వర నగర్, బొక్కల గడ్డ,  మోతి నగర్ కాలనీలు, బస్తీలలోకి వరద రావడంతో ఆ ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని, ఇండ్లు ఖాళీ చేశారని అన్నారు. వరదలలో ఇండ్లతో పాటు సమస్తం కోల్పోయి, కట్టుబట్టలతో రోడ్డునపడితే ముఖ్యమంత్రి పర్యటించి కంటితుడుపు చర్యగా కేవలం 16,500/- ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందని అన్నారు.వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలు మొత్తం పేద ప్రజలే కాబట్టి కుటుంబానికి 2 లక్షల రూపాయల నష్ట పరిహారంతో పాటు ఇండ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

వైరా రోడ్ మొత్తం చెరువుని తలపించేలా నీటితో నిండిందన్నారు. జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు హైదరాబాద్ లో హైడ్రా తరహాలో ఖమ్మం లో చెరువులు, కుంటలు, నాలాలపై ఉన్న ఆక్రమణ లని తొలగించి తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని అన్నారు. లేని పక్షంలో అక్రమ నిర్మాణాలను తొలగించేంత వరకు బహుజన్ సమాజ్ పార్టీ ఎంతటి పోరాటాలకైనా సిద్దపడుతుందని పేర్కొన్నారు.

నిరసన కార్యక్రమం అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ మధుసూధన్ నాయక్ కు మెమోరాండం అందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ ఎం. పుల్లయ్య, శ్రీనివాస్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మిరియాల నాగరాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పల్లెపోగు విజయ్, జిల్లా కార్యదర్శులు బి. ఉపేందర్, దారెల్లి రమేష్, ఆదూరి కోటయ్య, మహిళా నాయకురాలు కుమారి, యూ. నవీన్, డి. రాజశేఖర్, ఆర్. రమేష్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
NLG: బాలికల గురుకుల పాఠశాల విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి: బీసీ రాజ్యాధికార సమితి
నల్గొండ జిల్లా:
హాలియా పట్టణం లోని తుమ్మడం బీసి గురుకుల బాలికల పాఠశాలను బుధవారం జిల్లా  బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో సందర్శించారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ.. గురుకుల బాలికల  పాఠశాల లో మధ్యాహ్నం భోజనంలో నిత్యం పురుగుల అన్నం, చికెన్, సాంబార్ లలో నీళ్లు ఉన్నాయని తినలేక ఆకలితో అలమటిస్తున్నారని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు.

విద్యార్థులు తమ సమస్యలను  ప్రిన్సిపల్ కు విషయం చెప్తే ప్రిన్సిపాల్  నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందని, ఈ ప్రిన్సిపాల్ ఉంటే మేమే మూకుమ్మడిగా టీసి తీసుకొని వెళ్ళిపోతామని విద్యార్థుల అంటున్నారని తెలిపారు.

ఇకనైనా జిల్లా అధికారులు ఆర్సిఓ ఈ విషయంపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షులు కర్నాటి యాదగిరి, లింగ యాదవ్, రమేష్, వెంకన్న, సతీష్, రాములు, తదితరులు పాల్గొన్నారు.
TS: సీఎం సహాయ నిధికి టెక్నో పెయింట్స్ డైరెక్టర్స్ విరాళం
HYD: వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి టెక్నో పెయింట్స్ డైరెక్టర్స్ విరాళం అందజేశారు. ఈ మేరకు రూ.20 లక్షల చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు.

ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల తెలంగాణలో పలు చోట్ల భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభివించిన విషయం తెలిసిందే. ఈ వరదల వల్ల చాలా మంది నిరాశ్రయులయ్యారు.ఈ నేపథ్యంలోనే వరద బాధితులకు సహాయం చేసేందుకు దాతలు ముందుకు వస్తున్నారు.

జూబ్లీ హిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టెక్నో పెయింట్స్ డైరెక్టర్స్ ఆకునూరి శ్రీనివాస్ రెడ్డి, సీవీఎల్ఎన్ మూర్తి, అనిల్ కొండోత్ లు ఈ విరాళానికి సంబంధించిన చెక్ ను రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తాండ్ర కాశీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కు అందజేశారు.ఈ సందర్భంగా వరద బాధితులకు  సహాయం చేసిన దాతలకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.
నకిరేకల్: క్షేత్రస్థాయి ఆర్గానిక్ రైతు సదస్సు
నకిరేకల్ మండలం, కడపర్తి గ్రామంలో కే.ఎన్. బయోసెన్సెస్ మరియు
శ్రీసత్యం వర్మి బయో ఆర్గానిక్స్ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో బుధవారం, నిమ్మ తోటల రైతులతో క్షేత్రస్థాయి ఆర్గానిక్ రైతు సదస్సును నిర్వహించామని కన్సల్టెన్సీ డైరెక్టర్ అక్కినపల్లి కిరణ్ తెలిపారు. వారంలో 2 రోజులు రైతు పొలాల్లో, తోటలలో ఉచిత అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని.. వర్మి కంపోస్ట్ ,బయోసాంకేతిక పరిజ్ఞానాన్ని మరియు సహజ ఎరువులు, కెమికల్ ఎరువుల మధ్య సమతుల్యతను పాటించే విధానాన్ని, భూమి నుంచి వచ్చే తెగుళ్ల నివారణకు సహజమైన పద్ధతులను వివరించే కార్యక్రమాన్ని కంపెనీ ఇన్చార్జ్
వై.రామానుజ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు.
కేతేపల్లి: రూ. 2,15,000 పలికిన గణేష్ లడ్డు
నల్లగొండ జిల్లా, నాంపల్లి మండలం: కేతేపల్లి గ్రామంలో శ్రీ రాఘవేంద్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణేష్ లడ్డు వేలం పాటను సోమవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా వడ్లకొండ ప్రవీణ్ యాదవ్ తండ్రి భీమయ్య రూ. 2,15,000 లకు వేలం పాటలో లడ్డు ను సొంతం చేసుకున్నాడు. ఈ వేలం పాటలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆ వినాయకుడి ఆశీషులు వడ్లకొండ ప్రవీణ్ కుటుంబీకులకు, గ్రామ ప్రజలకు ఎల్లవేళలా ఉండాలని కమిటి సభ్యులు కోరుకున్నారు.
యరగండ్లపల్లి: సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన నాయకులు
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ మండలం యరగండ్లపల్లి గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్, యరగండ్లపల్లి కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు పులిమామిడి నరసింహారెడ్డి, ఏడు దొడ్ల కృష్ణారెడ్డి సొంత ఖర్చులతో సీసీ కెమెరా లను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత 20 రోజుల క్రితం గ్రామంలో తోడేటి వెంకటయ్య యాదవ్, మారగోని జంగయ్య లకు సంబంధించిన గొర్లను రాత్రి సమయంలో దొంగలు కారులో వచ్చి అపహరించాలని తెలిసి, మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా భద్రతా చర్యల్లో భాగంగా ప్రజా శ్రేయస్సు కోసం సీసీ కెమెరాలు రూ. 2,80,000/- ఖర్చుతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు గ్రామ ప్రజలు సీసీ కెమెరాల ఏర్పాటుచేసిన నాయకులను అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.




NLG: బొట్టుగూడ హైస్కూల్ లో ప్రజాపాలన దినోత్సవం
నల్లగొండ: సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా స్థానిక బొట్టుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తీగల శంకరయ్య ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతాన్ని పాడారు.

ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామని అన్నారు. సీనియర్ ఉపాధ్యాయుడు డా. వై.శ్యాంసుందర్ రెడ్డి సెప్టెంబర్ 17 విశిష్టత, ఆపరేషన్ పోలో, పర్యవసానాలు, విజయాల గురించి విద్యార్థులకు వివరించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయనీ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
బాల గణేష్ యూత్ లడ్డు రూ. 25,000/-
నల్లగొండ జిల్లా
మర్రిగూడ మండలం, యరగండ్లపల్లి గ్రామంలో బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో నవరాత్రులు పూజలందుకున్న గణనాధుని లడ్డు ను వేలం పాటలో రూ.25,000/- లకు గొడ్డెటి పెద్ది రాములు యాదవ్  కైవశం చేసుకోవడం జరిగింది. 

బాల గణేష్ యూత్ సభ్యులు వారిని శాలువా తో సన్మానించి, వారికి వారి కుటుంబ సభ్యులకు గణనాధుని ఆశీస్సులు ఎల్లవేళలా  ఉండాలని మనసారా  కోరుకున్నారు.
'యువతను చెడు నుండి మంచి వైపు మల్లెలా చూడాలి' : ఎమ్మెల్యే
నల్లగొండ జిల్లా, మునుగోడు:
యువత చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇవాళ తన క్యాంపు కార్యాలయంలో మునుగోడు మండల నాయకులు, పోలీసులతో మండలంలోని గ్రామాలలో బెల్ట్ షాపుల నిర్మూలన పై సమావేశం నిర్వహించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ..యువతను చెడు నుండి మంచి వైపు మల్లెలా చూడాలని నాయకులకు పోలీసులకు సూచించారు. నియోజకవర్గాన్ని గంజాయి డ్రగ్స్ రహిత, బెల్ట్ షాపు ల నిర్మూలన  నియోజకవర్గంగా తీర్చిదిద్దడం కోసం పనిచేయాలన్నారు.

గంజాయి, బెల్టు షాపు ల నిర్మూలనపై రిజిస్టర్ మెయింటైన్ చేయాలని, ఈ రిజిస్టర్ లో ఏ ఏ గ్రామాలలో ఎంతమంది తాగుడుకు బానిసయ్యారు. ఎంతమంది యువత గంజాయి డ్రగ్స్ కి అలవాటు పడ్డారు అనే వివరాలు పొందుపరచాలని పోలీసులకు సూచించారు. ఈ రిజిస్టర్ మెయింటెనెన్స్ వల్ల గంజాయికి, డ్రగ్స్ కి, మద్యానికి బానిసలుగా మారిన వాళ్ళని కౌన్సిలింగ్ ద్వారా ఆ మత్తు నుండి బయటపడేసే విధంగా కార్యచరణ  రూపొందిస్తున్నామని తెలిపారు.

నియోజకవర్గాన్ని గంజాయి డ్రగ్స్ రహిత, బెల్ట్ షాపుల నిర్మూలన  నియోజకవర్గంగా తీర్చిదిద్దడం కోసం సరికొత్త ఆలోచనలతో కార్యాచరణ రూపొందించామన్నారు. ఆ కార్యాచరణ ప్రకారం నాయకులు పోలీసులు పనిచేయాలన్నారు.

ఎక్సైజ్ అధికారుల సమీక్ష సమావేశంలో నల్గొండ ఎక్సైజ్ సూపర్డెంట్ సంతోష్, చండూరు సీఐ కరుణ నాయక్, నాంపల్లి సీఐ సైదులు, చండూర్ ఎక్సైజ్ అధికారి స్వాతి పాల్గొన్నారు.