/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి : AITUC రాష్ట్ర కార్యదర్శి ఎండి ఇమ్రాన్ Vijay.S
డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి : AITUC రాష్ట్ర కార్యదర్శి ఎండి ఇమ్రాన్

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం రోజున భువనగిరి పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తాలో ఇండియన్ ఆటో డ్రైవర్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఎండీ ఇమ్రాన్ ముఖ్యఅతిథిగా హాజరై ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం అయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టడంతో ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు ప్రతి నెల రూ.10 వేలు ఇచ్చేంత వరకు త్వరలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిర్వహించినున్నట్లు అయన తెలిపారు. భువనగిరిలో ఆటోలకు పార్కింగ్ స్థలం కేటాయించాలని, కొత్త బస్టాండ్ లో ఆటో స్టాండ్ ఏర్పాటు చేయాలని, గత ప్రభుత్వాలు ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంతో, చాలా మంది డిగ్రీలు, ఉన్నత చదువులు చదివి ఉపాధి దొరకకపోవడంతో కుటుంబాన్ని పోషించడం కోసం అప్పులు చేసి ఆటోలు కొనుక్కొని కుటుంబాన్ని పోషించుకుంటున్నారని అన్నారు. ఆటో డ్రైవర్లకు జీవనభృతి కింద నెలకు రూ.10,000/- ప్రభుత్వం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. లేనిపక్షంలో ఆటో డ్రైవర్ల బతుకుల కోసం పోరాటం చేయవలసి వస్తుందని అయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు గనబోయిన వెంకటేష్ (రాణా)సీనియర్ నాయకులు గొర్ల లక్ష్మణ్, ఎండీ షరీఫ్, ఇండియన్ ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకులు శానవాజ్, శకూర్, సల్మాన్, శ్రీను, చాంద్, అజయ్, జమీర్, సుల్తాన్, డానియేల్, స్వామి, ఆనంద్, షఫీ, పరమేష్, కృష్ణ, నర్సింహా, తదితరులు పాల్గొన్నారు.

పహిల్వాన్ పురం గ్రామంలో బొడ్రాయికి జలాభిషేకం... ప్రత్యేక పూజలు నిర్వహించిన గ్రామ మహిళలు

యాదాద్రి జిల్లా వలిగొండ మండలం పహిల్వాన్ పురం గ్రామంలో మహిళలు, మహిళలు అందరూ బొడ్రాయికి నీళ్లు పోయడం మరియు పసుపు కుంకుమలతో అభిషేకించడం జరిగినది అందరూ వరుణ దేవుని వేడుకొని భక్తిశ్రద్ధలతో పూజలు చేయడం జరిగినది తర్వాత వాన దేవుని పాటలతో బతుకమ్మ ఆడడం జరిగినది. వర్షాలు కురిపించి తమ పంటలు ఎండిపోకుండా చూడాలని వరుణ దేవుని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో  పహిల్వాన్ పురం మహిళల  బంధారపు బాలమణి ,కళ్లెం కలమ్మ, సరిత, ఒట్టు పెళ్లి అంజమ్మ ,శంకరమ్మ ,బండారి అనిత, బండారి అలివేలు ,వేముల వినోద ,బండారి లక్ష్మమ్మ, పచ్చిమట్ల రేణుక ,రాగిరు లతాశ్రీ తదితర మహిళలు  పాల్గొన్నారు.

జన విజ్ఞాన వేదిక జాతీయ మహాసభలను జయప్రదం చేయండి: కొడారి వెంకటేష్ జిల్లా కన్వీనర్ జన విజ్ఞాన వేదిక

జన విజ్ఞాన వేదిక ఐదవ జాతీయ మహా సభలను, ఈనెల 14 న బెంగుళూరు లోని బసవపుర మేన్ రోడ్డులో గల ఆర్కే కన్వెన్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు జన విజ్ఞాన వేదిక యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ కొడారి వెంకటేష్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత 36 సంవత్సరాలుగా ప్రగతి కోసం సైన్, ప్రజలకోసం సైన్స్, శాంతి కోసం సైన్స్, స్వావలంబన కోసం సైన్స్ అనే నినాదాలతో మెరుగైన పౌర సమాజ నిర్మాణం కోసం జన విజ్ఞాన వేదిక కృషి చేస్తుందని ఆయన అన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, కోల్ కతా, చెన్నై లాంటి నగరాల్లో జన విజ్ఞాన వేదిక పనిచేస్తుందని ఆయన తెలిపారు. విద్యార్థులు, యువతీ యువకులు జన విజ్ఞాన వేదిక సంస్థలో సభ్యులుగా చేరి, మూఢ నమ్మకాలను, మూఢ విశ్వాసాలను విడనాడి "సైన్స్ పురోభివృద్ధికి" కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
అమరజీవి కామ్రేడ్ నోముల రాంరెడ్డి ఆశయాలను సాధిద్దాం: మాటూరి బాలరాజు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు

అమరజీవి కామ్రేడ్ నోముల రాంరెడ్డి గారి ఆశయ సాధనకు కృషి చేయాలని ఆయన ఆశయాలని సాధించినప్పుడే ఆయనకు మనమిచ్చే ఘననివాళని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు,సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి లు అన్నారు . శుక్రవారం  వలిగొండ మండల పరిధిలోని సంగెం గ్రామంలో నోముల రామి రెడ్డి 18 వ వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నోముల రామిరెడ్డి ఉన్నత కుటుంబంలో పుట్టి పెరిగిన సిపిఎం డివిజన్ నాయకులు కందాల రంగారెడ్డి సారధ్యంలో సంగెం గ్రామంలో ప్రభుత్వ బంచరాయి,పోరంబోకు భూములను భూమిలేని పేదలకు పంచాలని వివిధ కులాల వృత్తిదారులకు ఇవ్వాలని పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి ప్రభుత్వాల మెడలు వంచి వారందరికీ ప్రభుత్వ భూములు ఇప్పించారన్నారు* *కల్లుగీత కార్మికుల హక్కుల కోసం,దున్నేవాడికే భూమి అనే నినాదంతో పోరాటాలు నిర్వహించారని అన్నారు* *సంగం గ్రామం తో పాటు పరిసర గ్రామాలుగా ఉన్న వర్కట్ పల్లి, గోకారం,ధర్మారెడ్డిపళ్లి గ్రామాల్లో సిపిఎం పార్టీ విస్తరణ కోసం నిరంతరం కృషి చేశారని పేదల సమస్యల పరిష్కారానికి ఎర్రజెండా నాయకత్వమంలో సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మకంతో ప్రజా పోరాటాలు నిర్వహించారని అన్నారు* *భూస్వాములకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలబడి పోరాటం నిర్వహించారని వారి యొక్క స్ఫూర్తితో నేడు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు* *ఈ కార్యక్రమంలో రాంరెడ్డి సహచరులు సింగిల్ విండో చైర్మన్ సుర్కంటి వెంకట్ రెడ్డి సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు తుర్కపల్లి సురేందర్ మాజీ సర్పంచ్ లు కీసరి రాంరెడ్డి కాసుల కృష్ణ,మాజీ ఎంపీటీసీ పబ్బతి మల్లేశం,సిపిఎం శాఖ కార్యదర్శి మండల కమిటీ సభ్యులు భీమనబోయిన జంగయ్య సీనియర్ నాయకులు ఏనుగు సాయి రెడ్డి, నోముల జంగారెడ్డి,అంగిడి దేవేందర్ రెడ్డి,సురకంటి లక్ష్మారెడ్డి,ఏనుగు ప్రభాకర్ రెడ్డి,బండి గారి శంకరయ్య,వరికుప్పల మల్లేశం,కీసరి రంగారెడ్డి,మెట్టు రవీందర్ రెడ్డి,చేగురి నర్సింహ,నారి రామస్వామి,మాడుగుల వెంకటేశం,జక్కుల వెంకటేశం, రామిరెడ్డి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.వర్థంతి అనంతరం రాంరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి స్థూపం వద్ద మొక్కలు నాటడం జరిగింది.


తెలంగాణ రాష్ట్ర DGP జితేందర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్ర కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం డిజిపి గా ఉన్న రవి గుప్త ను హోం శాఖ స్పెషల్ సిఎస్ గా బదిలీ చేసింది. తెలంగాణ రాష్ట్ర డిజిపిగా జితేందర్ నియామకం కావడంతో డిజిపి కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల  ఐలయ్య గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం  అందజేసి యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి లడ్డు, ప్రసాదాన్ని అందజేశారు.
న్యాయవాదులపై దాడులను నిరసిస్తూ రామన్నపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల నిరసన

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రములో రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ రామన్నపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండి మజీద్, కార్యదర్శి రామదాసు లు మాట్లాడుతూ... న్యాయవాదులపై రోజురోజుకు జరుగుతున్న దాడులకు రక్షణగా న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే తీసుకురావాలని, న్యాయవాదులకు రక్షణగా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

వలిగొండ: సుంకిశాల గ్రామంలో ఆర్థిక సహాయం అందజేత

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని సుంకిశాల గ్రామంలో ఈర్లపల్లి భిక్షపతి  అనారోగ్యంతో మరణించారు. వారి కుటుంబాన్ని మాజీ సర్పంచ్ శ్రీమతి శ్రీ ఫైళ్ల సంధ్యా రాణి- ఉపేందర్ రెడ్డి గార్లు పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి కుటుంబానికి 5000/- రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా  వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. ఈ కార్యక్రమంలో , గూడూరు వెంకటరెడ్డి ,కొండే కిష్టయ్య, మంగ జగన్ (మాజీ సర్పంచ్ ) ,మంగ బాలయ్య, మంగ నర్సింహ, వేముల భిక్షపతి, ఎడవేల్లి బాలదరి, నర్సింహ,ఎల్లస్వామి,ఈర్లపల్లి స్వామి , తదితరులు పాల్గొన్నారు.
OU లో జర్నలిస్టులపై పోలీసుల దాడి అమానుషం: TJU జిల్లా అధ్యక్షులు ఎండి షానూర్

హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో డీఎస్సీ వాయిదా వెయ్యాలని నిరుద్యోగ యువకులు ఆందోళన చేస్తుంటే దానిని న్యూస్ కవర్ చేయడానికి వెళ్లిన జీ తెలుగు న్యూస్ జర్నలిస్టు శ్రీచరణ్ ను పోలీసులు వ్యవహరించే తీరును దారుణమని తెలంగాణ జర్నలిస్టు యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ అన్నారు . విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులను తాము జర్నలిస్టులమని చెబుతున్నా పోలీసులు దురుసుగా వ్యవహరించి, వారిని బలవంతంగా లాక్కొని పోలీస్ వాహనంలో ఎక్కించి పోలీసు స్టేషన్లో నిర్బంధించడం మీడియా భావప్రకటన స్వేచ్ఛను హరించడమేనని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో జర్నలిస్టులపై ఇలాంటి దౌర్జన్యాలు జరగకుండా అరికట్టేందుకు ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి చొరవచూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మొహమ్మద్ ఖాజఫసివుద్దీన్ , జిల్లా ప్రధాన కార్యదర్శి గోపరాజు వెంకన్న, జిల్లా కార్యవర్గ సభ్యులు గట్టికొప్పుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరించిన అంబేద్కర్ రెండో మనవడు యశ్వంత్ అంబేద్కర్, డాక్టర్ జేరిపోతుల పరుశురాం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నాడు అంబేద్కర్ లేకుంటే నేడు ఆర్బిఐ లేదని కరెన్సీ నోట్ల పై అంబేద్కర్ ఫోటో ముదిరించాలని జులై 29,30,31 తేదీలలో జంతర్ మంతర్ న్యూ ఢిల్లీ లో కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు డాక్టర్ జేరిపోతుల పరశురామ్ ఆధ్వర్యంలో జరుగు మహా ధర్నా పోస్టర్ ను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రెండవ మనుమడు భీమ్ రావు యస్వంత్ అంబేద్కర్ చేతుల మీదుగా అంబేద్కర్ స్థాపించిన ప్రింటింగ్ ప్రెస్ ముంబయి లో ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రెండవ మనుమడు భీమ్ రావు యస్వంత్ అంబేద్కర్ మాట్లాడితూ ఈ న్యాయమేనా డిమాండ్ సాధన కోసం నా యొక్క సంపూర్ణ మద్దతు ఉంటుందని దేశంలో ఉన్న అంబేద్కర్ వాదులను ఏకం చేసి పార్లమెంటు సభ్యులు పార్లమెంట్లో మాట్లాడేలా ఒత్తిడి తీసుకురావాలని ఆయన అన్నారు ఈ సందర్భంగా కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు డాక్టర్ జేరిపోతుల పరశురామ్ మాట్లాడుతూ 1921లో ఇంపిరియల్ బ్యాంకు కుప్ప కూలినప్పుడు "రూపాయి దాని సమస్య సమస్య పరిష్కార మార్గం' అనే పుస్తకాన్ని వ్రాసి హిల్టాన్ యాంగ్ కమిషన్, రాయల్ కమిషన్, సైమన్ కమిషన్, బ్రిటిష్ ప్రభుత్వానికిl ఇవ్వడం వల్ల ఇది వాస్తవం అని గ్రహించి 1931 ఏప్రిల్ 1న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడింది అంటే అంబేద్కర్ చేసిన కృషి ఎంతో ఉంది అని ఆయన ఫోటో కరెన్సీ నోట్లపై వేసినప్పుడే ఆయన చేసిన త్యాగానికి ఫలితం ఉంటుందని వెయ్యకుంటే చరిత్రను వక్రీకరించడమే అవుతుందని అయన ఆవేదన వ్యక్తం చేసారు జులై 29,30,31 తేదీలలో జంతర్ మంతర్ న్యూ ఢిల్లీ మహా మహా ధర్నాకు రాజ్యసభ సభ్యులు, పార్లమెంటు సభ్యులు, రాజకీయ పార్టీల అధ్యక్షులు ప్రతి ఒక్కరు పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాము అన్నారు యొక్క కార్యక్రమంలో కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి సంస్కృతిక విభాగం జాతీయ కన్వీనర్ గట్టగల్ల సంజీవ మహారాష్ట్ర రాష్ట్ర బాద్యులు మూల్ నివాసి మాలజీ సంటి శంకర్ మహారాజ్, చాంద్ అహ్మద్ షేక్, డా శ్యాం దావన్ డా రోహన్ సరోల్ పిట్టల రాజు గట్టగల్ల బాబు చింత శ్రీను తదితరులు పాల్గొన్నారు .

భాష సంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం ,నీలం థియేటర్ గోపరాజుపల్లి సంయుక్త ఆధ్వర్యంలో నీలం నాటకం పోస్టర్ ఆవిష్కరణ


భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం, మరియు నీలం థియేటర్, గోపరాజుపల్లి, సంయుక్త ఆధ్వర్యంలో నీలం నాటకం పోస్టర్ ఆవిష్కరణ ఈరోజు డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ డైరెక్టర్ డా" మామిడి కృష్ణ సార్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది, ఈ కార్యక్రమంలో మిమిక్రీ శ్రీనివాస్ , సినీ నటుడు ప్రదీప్ (అంతేగా... అంతేగా ) అజయ్ మంకెనపల్లి అన్న, సింగపంగ ప్రభాకర్, అబ్దుల్ కలీం ఆజాద్, బిర్రు కిరణ్ కుమార్, జితేందర్, జరిగింది,మరియు నీలం నాటకం రచయిత మరియు దర్శకుడు,నీలం నరేష్ జూలై 15 మధ్యాహ్నం రెండు గంటలకు నందమూరి తారక రామారావు ఆడిటోరియంలో, నాంపల్లి, లో నాటకం ప్రదర్శించడం జరుగుతుందని ఈ నాటకానికి ప్రతి ఒక్కరు వచ్చి చూసి ఆనందించాలని నీలం థియేటర్ ప్రెసిడెంట్ నరేష్ మాట్లాడడం జరిగింది.