/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz SSC - 2024 పరీక్షా ఫలితాలలో ప్రతిభ కనబరిచిన లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థులు Vijay.S
SSC - 2024 పరీక్షా ఫలితాలలో ప్రతిభ కనబరిచిన లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థులు


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని లోతుకుంట తెలంగాణ మోడల్ స్కూల్ లో SSC - 2024  పరీక్షా ఫలితాలలో విద్యార్థులు 90.5% సాధించినట్లు ప్రిన్సిపాల్ జి రాము ఒక ప్రకటనలో తెలిపారు.

రేఖ మమత 9.5, జినుకల ప్రత్యూష 9.3, కొమిరెల్లి స్పందన 9.3 , గోగు మయూరి 9.0 GPA లు సాధించారని అన్నారు. విద్యార్థులను ప్రిన్సిపల్ ,ఉపాధ్యాయులు కే పరమేష్ ,కే అనసూయ, ఈ పూర్ణిమ, బి పృధ్విరాజ్, జెంతిలాల్, వెంకటేశం ,ఐలయ్య మరియు లింగస్వామి అభినందించారు.

రెవరెండ్ ఎస్ సుదర్శన్ వైస్ చైర్మన్ డయాసిస్ ఆఫ్ కరీంనగర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన గోపరాజుపల్లి సిఎస్ఐ సంఘ పెద్దలు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోపరాజు పల్లి గ్రామానికి చెందిన సిఎస్ఐ చర్చ్ సంఘ పెద్దలు రెవరెండ్ ఎస్ సుదర్శన్ వైస్ చైర్మన్, డయాసిస్ ఆఫ్ కరీంనగర్ వారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చర్చి కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం సహకారం అందించాల్సిందిగా కోరామని తెలిపారు. ఇందుకు వారు సానుకూలంగా స్పందించి కాంపౌండ్ వాల్ నిర్మాణ కోసం తగిన సహకారం అందిస్తామని హామీ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రెస్ బీటర్ రెవరెండ్ రాజారత్నం, స్థానిక పాస్టర్ విద్యాసాగర్, మాజీ సర్పంచ్ సంగిశెట్టి రాములు సంఘ పెద్దలు రావుల డానియల్ డిసిసి మెంబర్ సంగిశెట్టి విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఎర్రజెండా గెలుపుతోనే భువనగిరి పార్లమెంటు అభివృద్ధి: సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్


   ఎర్ర జెండా గెలుపుతోనే భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ తెలియజేసినారు. సోమవారం భువనగిరి మండల వ్యాప్తంగా సిపిఎం అభ్యర్థి ఎండి. జహంగీర్ గారి గెలుపును కోరుతూ నిర్వహించే ప్రచార జాతాను సుందరయ్య భవన్ భువనగిరిలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భువనగిరి నియోజకవర్గం హైదరాబాద్ రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న విద్యా, వైద్యం, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నదని గత మూడు దఫాలుగా గెలిచిన కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించి, సమస్యల పరిష్కారం గురించి ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా నడికుడి నుండి బీబీనగర్ వరకు సింగిల్ లైన్ తో రైల్వే మార్గం ఏర్పడిందని కానీ ఈ పాలకులు డబుల్ లైన్ వేసేకాడ అన్ని స్టేషన్లను అభివృద్ధి చేసి అన్ని ట్రైన్లను ఆపే కాడ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. భువనగిరి జిల్లా కేంద్రమైన నేటికీ డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు లేవని ఎందుకు గత పాలకులు పట్టించుకోలేదని ప్రశ్నించారు. పేరుకే బీబీనగర్ లో ఎయిమ్స్ హాస్పిటల్ ని ప్రారంభించిన ఇంకా అన్ని రకాల వైద్యము అందడం లేదని బిజెపి ఎయిమ్స్ హాస్పిటల్ కు నిధులు కేటాయించెదాంట్లో వివక్షత చూపుతుందని విమర్శించారు. భువనగిరి ప్రాంతం విద్య పరంగా, వైద్యపరంగా, ఉపాధిపరంగా, సాగు తాగునీరు సమస్య పరిష్కారం కావాలంటే, ఈ ప్రాంతము అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే నిరంతరం ప్రజల మధ్య ఉండి పోరాడే నాయకుడు, ప్రశ్నించే నాయకుడు జహంగీర్ గారు గెలవాలని, వారి గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తని ఆ గుర్తుపైన అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని భాస్కర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జే. వెంకటేష్, కొండమడుగు నర్సింహ, జిల్లా కార్యదర్శి వరక సభ్యులు దాసరి పాండు, మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, నాయకులు పల్లెర్ల అంజయ్య, గుమ్మడి రాజు నరేష్, సాయి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.

        

పొద్దుటూరు లో సిపిఎం ఎన్నికల ప్రచార వాహనాన్ని ప్రారంభించిన సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారీ ఐలయ్య


 సిపిఎం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి ఎండి జహంగీర్ గారి ఎన్నికల ప్రచార వాహనాన్ని ఈరోజు పొద్దుటూరు గ్రామంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నిరంతరం ప్రజల కోసం పోరాడుతున్న సిపిఎం ఎంపీ అభ్యర్థి జహంగీర్ గారి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ ప్రచార వాహనం పొద్దుటూరులో ప్రారంభమై ఏదులగూడెం,టేకుల సోమారం,రెడ్ల రేపాక,దాసిరెడ్డిగూడం,వలిగొండ,నాగారం,నెమలి కాలువ,గోల్నేపల్లి,జాలుకాలువ  గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు,జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య,మండల కార్యదర్శి సిర్పంగి స్వామి,మండలకార్యదర్శివర్గ సభ్యులు తుర్కపల్లి సురేందర్, కల్కురి రామచందర్,కూర శ్రీనివాస్,మండల కమిటి సభ్యులు మాజీ సర్పంచ్ ఏలే కృష్ణ, కవిడే సురేష్,వలిగొండ పట్టణ కార్యదర్శి గార్దసు నర్సింహ,సింగిల్ విండో మాజీ డైరక్టర్ పలుసం బాలయ్య,శాఖ కార్యదర్శి పలుసం లింగం,పిఎన్ఎం జిల్లా అధ్యక్ష-కార్యదర్శులు గంటేపాక శివ,ఈర్లపల్లి ముత్యాలు,నాయకులు వేముల నాగరాజు,ఆకుల రాజు,పరమేష్,వేముల జ్యోతి బస్,నాయకులు గడ్డం సుదర్శన్,పెద్దబోయిన శివశంకర్,తదితరులు పాల్గొన్నారు.

వలిగొండ మండల కేంద్రంలో వాహనాల తనిఖీలో పట్టుబడ్డ రూ.2.80 లక్షల నగదు, 16.9 లీటర్ల మద్యం: వలిగొండ ఎస్సై డి మహేందర్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని తొర్రూరు ఎక్స్ రోడ్ వద్ద వలిగొండ పోలీసులు సోమవారం సాయంత్రం ఏడు గంటలకి పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలు వలిగొండ నుండి చిత్తం పురం వైపు తన బైక్ పై వెళ్తున్న ఏనుగు నరేందర్ రెడ్డి తండ్రి మల్లారెడ్డి వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా మల్లారెడ్డి వద్ద గల బ్యాగులో సరైన పత్రాలు లేని రూ.2,80,000 నగదును పట్టు కున్నామని వలిగొండ ఎస్సై డి మహేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఉన్నతాధికారులకి సమాచారం నిమిత్తం మరియు తదుపరి చర్య నిమిత్తము రెవెన్యూ అధికారులకు తెలిపామని అన్నారు. అలాగే మండలంలో అక్రమంగా తరలిస్తున్న రూ. 4225 విలువగల 16.9 లీటర్ల మద్యాన్ని సీజ్ చేయడం జరిగిందని వలిగొండ ఎస్ఐ డి మహేందర్ తెలిపారు.

నరేంద్ర మోడీ పాలన దేశానికి చాలా అవసరం : బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి మచ్చ వివాకర్ రెడ్డి


నరేంద్ర మోడీ పాలన దేశానికి చాలా అవసరం

- కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బిజెపి ఎంపీ అభ్యర్థి నీ గెలిపించాలి

 - బూర నర్సయ్య గౌడ్ నీతి నిజాయితీపరుడు

-బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి మచ్చ వివాకర్ రెడ్డి*

దేశానికి నరేంద్ర మోడీ పరిపాలన ప్రస్తుత పరిస్థితిలో చాలా అవసరమని బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి మచ్చ వివాకర్ రెడ్డి అన్నారు.సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భువనగిరి పార్లమెంట్ బిజెపి ఎంపీ అభ్యర్థి అయిన బూర నర్సయ్య గౌడ్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని పేర్కొన్నారు. బూర నర్సయ్య గౌడ్ నీతి నిజాయితీపరుడని,అవినీతి మచ్చలేని నాయకుడని కొనియాడారు. ప్రపంచంలో దేశాన్ని అగ్రభాగాన నిలిపిన అలుపెరుగని నాయకుడు నరేంద్ర మోడీ అని, ఆయన పరిపాలన దేశానికి చాలా అవసరమని అన్నారు.హిందువుల చిరకాల కోరిక అయిన రామ మందిరం నిర్మాణం నరేంద్ర మోడీ తోనే సాధ్యమైందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కరోనా సమయంలో ప్రతి ఒక్కరికి ధైర్యం చెప్పడమే కాకుండా వ్యాక్సిన్ తయారు చేసి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకునే విధంగా మోడీ చూశాడని అన్నారు. ప్రపంచంలో భారతదేశం ఆర్థికంగా ఐదవ స్థానంలో ఉందని,త్వరలో మోడీ ఆధ్వర్యంలో మూడవ స్థానానికి చేరుకుంటుందని అన్నారు.

అన్ని వర్గాల ప్రజలు బిజెపి వైపు: పాశం భాస్కర్


భారతీయ జనతా పార్టీ మండల శాఖ అద్యక్షులు బోల్ల సుదర్శన్ మరియు బూత్ అద్యక్షులు కాలే పరమేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఈరోజు 2 వ విడత ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో భాగంగా వలిగొండ మండలం నాతల్లగూడెం గ్రామంలో ఇంటింటికి బిజెపి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు శ్రీ పాశం భాస్కర్ గారు విచ్చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ కూలీలను కలిసి వారితో మాట్లాడడం జరిగింది, గ్రామంలో జరిగే ప్రతి అభివృద్ధి సంక్షేమ ఫలాలు కేంద్రం నుండి వస్తుందని వారికి తెలియజేసారు, ఈ సందర్భంగా వారు బిజెపి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారిని కోరడం జరిగింది అదేవిధంగా నాతల్ల గూడెం గ్రామంలోని చెరువును మరియు మూసి కాల్వను వారు సందర్శించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మూసి నదిని పరివాహక ప్రాంతంలో ఉన్న చెరువులల్లో రసాయన ఎరువుల కర్మాగారంల నుండి వెలువడే కాలుష్యం మూసి నదిలో కలవకుండా ప్రక్షాళన చేసి రైతులకు ,తెలంగాణ ప్రజలకు మంచి నీటి నదిగా మార్చాలని, నది పరివాహక ప్రాంతంలో గొలుసు చెరువులను మంచి నీటి చెరువులుగా మార్చాలని వ్యవసాయం కు,ప్రజలకు ఉపయోగ పడే విధంగా చేయాలని మరియు మూసి పరివాహక ప్రాంతాల్లో వున్న చెరువులలో , కాలువలలో విపరీతంగా పేరుకపోయిన గుర్రపు డెక్క ఆకును ఆధునిక యంత్రాలతో తొలగించి,రైతులకు , తెలంగాణ ప్రజలకు ఉపయోగ పడే విధంగా చేయాలని ఈ సందర్బంగా వారు అన్నారు ఆదేవిధంగా గ్రామంలో వున్న ఐకేపీ సెంటర్ ను సందర్శించి ఒడ్ల కొనుగోళ్లు ,రైతు సమస్యల గురించి తెలుసుకోవడం జరిగిందిఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు CN రెడ్డి ,స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఏలే చంద్రశేఖర్,జిల్లా కార్యదర్శి కొప్పుల యాదిరెడ్డి,అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ , దంతూరి సత్తయ్య ,జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చు శ్రీనివాస్,మాజీ ఉప సర్పంచ్ మైసొల్ల మచ్చగిరి,కిసాన్ మోర్చా జిల్లా సెక్రెటరీ కందుల తానీషా గౌడ్,మారోజు అనిల్ కుమార్, లోడే లింగ స్వామి, దయ్యాల వెంకటేష్, డోగిపర్తి సంతోష్ , వట్టిపల్లి సంతోష్,గంగధారీ దయాకర్, మైసొల్ల చిన్న మచ్చగిరి, మందుల నాగరాజు, గంగపురం నరేష్, అప్పిశేట్టి సంతోష్, మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి మందుల లక్ష్మి,BJYM మండల అధ్యక్షులు రంజిత్ రెడ్డి,BJYM జిల్లా నాయకులు రెగురి అమరేందర్,బంగమట్ల మహేష్, దంతూరి అరుణ్, బూత్ అద్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

వరంగల్ లో కవుల పై జరిగిన దాడిని ఖండిస్తున్నాం ఏఐవైఎఫ్


భారతదేశంలో రాజ్యాంగం పునాదిలా నిలిచింది.లౌకిక విలువలు-సాహిత్యం అనే అంశంపై సెక్యులర్ రైటర్స్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఏబీవీపీ కార్యకర్తలు చేసిన దాడిని ఖండిస్తూ...బిజెపి ప్రభుత్వం ఈ పది సంవత్సరాల కాలంలో అనేకమైన చట్టాలను మార్పులు చేస్తూ చివరికి ఈ ఎన్నికలలో బిజెపి ప్రభుత్వం మరోసారి గద్దెనెక్కి రాజ్యాంగాన్ని తీసివేయాలని కుట్ర పన్నుతున్నారు ఈ పది సంవత్సర కాలంలో మేధావులపైన,కవుల పైన దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల పైన అనేకమైన దాడులు చేస్తున్నది. నిన్న వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో జరిగిన సమూహ సదస్సు పై ఏబీవీపీ కార్యకర్తలు సదస్సులోకి దూసుకొచ్చి రచయితల పైన మేధావుల పైన వారి ప్రసంగాలను అడ్డుకొని,వారి వద్ద ఉన్న పుస్తకాలను గుంజుకొని వారి పైన దాడులకు పాల్పడ్డారు. ఫాసిస్టు అల్లరి మూకలైన.ఏబీవీపీ కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలని *ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్ డిమాండ్ చేశారు.

పెద్దమ్మతల్లి వార్షిక బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలకేంద్రంలో ఆదివారం ముదిరాజుల ఆరాధ్య దైవం అయిన శ్రీ శ్రీ శ్రీ పెద్దిరాజు పెద్దమ్మ తల్లి వార్షిక బ్రహ్మ్మోత్సవాలలో భాగంగా ఆదివారం కళ్యాణo నిర్వహించి అనంతరం డప్పు చప్పుళ్లతో, భాజా భాజంత్రీలతో శివశత్త్తులతో. మహిళలు ఘనంగా బోనాలతో వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం స్థానిక శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోళ్ల శ్రీనివాస్, సోమనబోయిన సతీష్ కుల నరసింహ, కుందారపు కొమురయ్య, చెరకు శివయ్య, బోళ్ల రాం చెంద్రమ్, సతీష్, కాసుల వెంకన్న, మాటూరు రాజు, బోళ్ల భాస్కర్ , కూర రవీందర్,కూర వెంకటేష్, తాళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

వలిగొండలో ఘనంగా పెద్దమ్మ తల్లి బోనాలు


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలకేంద్రంలో ఆదివారం ముదిరాజుల ఆరాధ్య దైవం అయిన శ్రీ శ్రీ శ్రీ పెద్దిరాజు పెద్దమ్మ తల్లి వార్షిక బ్రహ్మ్మోత్సవాలలో భాగంగా ఆదివారం కళ్యాణo నిర్వహించి అనంతరం డప్పు చప్పుళ్లతో, భాజా భాజంత్రీలతో శివశత్త్తులతో. మహిళలు ఘనంగా బోనాలతో వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం స్థానిక శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోళ్ల శ్రీనివాస్, కుందారపు కొమురయ్య, చెరకు శివయ్య, బోళ్ల రాం చెంద్రమ్, సతీష్, కాసుల వెంకన్న, మాటూరు రాజు, బోళ్ల భాస్కర్ , కూర రవీందర్,కూర వెంకటేష్, తాళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.