35 సంవత్సరాలుగా ప్రజల కోసం పోరాడుతున్న సిపిఎం అభ్యర్థి జహంగీర్ ని గెలిపించండి : సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య
35 సంవత్సరాలుగా ప్రజా సమస్యల పరిష్కారమే తన ధ్యేయంగా పోరాడుతున్న ప్రజా నాయకుడు సిపిఎం భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఎండి జహంగీర్ కు ఓటు వేసి గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య ఓటర్లను కోరారు
మంగళవారం మండల పరిధిలోని వర్కట్ పల్లి గ్రామంలో సిపిఎం అభ్యర్థి జహంగీర్ గెలుపును కాంక్షిస్తూ ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా ఉన్నత చదువులు చదివిన ఉద్యోగాలు వెతుక్కోకుండా వచ్చిన ఉద్యోగాలను పక్కకు పెట్టి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా విద్యార్థి,యువజన సమస్యలతో పాటు ప్రజా సమస్యల కోసం తన జీవితాన్ని అంకితం ఇచ్చి పనిచేస్తున్న పేదలబిడ్డ జహంగీర్ ఎన్నికల్లో పార్లమెంట్ కు పోటీ చేస్తున్నారని ప్రజలందరూ నిరంతరం ప్రజల కోసం పనిచేసే పేదల అభ్యర్థి జహంగీర్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వామపక్ష పార్టీల పోరాట ఫలితంగా ఏర్పడిన ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ రద్దు చేసే కుట్రలు చేస్తుందన్నారు ఈ చట్టం వల్ల పనులు లేని అనేక పేద కుటుంబాలకు ఉపాధి దొరుకుతుందని పేదల నోటికాడి ముద్దను లేకుండా చేయాలని కుట్ట చేస్తున్న బిజెపిని ఈ ఎన్నికల్లో ఓడించాలని, ఉపాధి హామీ చట్టరక్షణకై పోరాడే సిపిఎం అభ్యర్థి జహంగీర్ ను ఈ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు జహంగీర్ ఈ ప్రాంత అనేక ప్రజా సమస్యలపై పోరాటాలు నడిపారని మూసి జల కాలుష్య నివారణకై మూసి ప్రాంతంలో గోదావరి జలాల సాధనకై స్థానిక పరిశ్రమలలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, భూమి లేని పేదలకు భూమి పంచాలని,ఇండ్లు,ఇండ్ల స్థలాల సాధన డిమాండ్ తో అనేక ప్రజా పోరాటాలు నిర్వహించారని గుర్తు చేశారు అందుకే ప్రజల కోసం పోరాడే అభ్యర్థిని గెలిపిస్తే నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తారని ఈ ఎన్నికల్లో ప్రజలందరూ ఒకసారి ఆలోచించి సిపిఎం అభ్యర్థి జహంగీర్ కు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ ప్రచారంలో సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి,సిపిఎం శాఖ కార్యదర్శి మెట్టు రవీందర్ రెడ్డి,సిపిఎం నాయకులు మాజీ ఉపసర్పంచ్ లు ఆకుల మారయ్య,మాడుగుల వెంకటేశం,సీనియర్ నాయకులు చేగురి నర్సింహా,సిపిఎం సహాయ కార్యదర్శి రొండి మల్లేశం, ఎస్ఎఫ్ఐ మండల ఉపాధ్యక్షుడు వేముల జ్యోతిబసు,తదితరులు పాల్గొన్నారు.
Apr 23 2024, 17:28