ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ముదిరాజ్ జేఏసీ నాయకులు! ముదిరాజులను బి.సి "డి" నుండి బి.సి "ఏ" లోకి చేర్చండి! ముఖ్యమంత్రిని కోరిన పోల్కం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ముదిరాజ్ జేఏసీ నాయకులు!
ముదిరాజులను బి.సి "డి" నుండి బి.సి "ఏ" లోకి చేర్చండి!
ముఖ్యమంత్రిని కోరిన పోల్కం లక్ష్మి నారాయణ ముదిరాజ్!
ముదిరాజ్ జేఏసీ చైర్మన్ పొల్కం లక్ష్మి నారాయణ గారి ఆధ్వర్యంలో ముదిరాజ్ సమస్యల మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది .
ముదిరాజ్ ల 60 సంవత్సరాలు ఆశయం , ముదిరాజ్ ల ప్రధాన సమస్య అయిన బీసీ డి నుండి బీసీ ఎ కి మార్చాలని కోరడం జరిగింది.
ముదిరాజ్ లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. అదే విధంగా ముదిరాజ్ కార్పొరేషన్ కి పదివేల కోట్ల రూపాయలు కేటాయించాల్సింది గా విజ్ఞప్తి చేయగా సానుకూలం గా స్పందించారు.60 లక్షల ముదిరాజ్ లు గల ఈ రాష్ట్రం లో ముదిరాజ్ లు రాజకీయం గా వెనబడ్డారని ,రానున్న రోజుల్లో కొత్తగా ఇచ్చే నామినేటేడు మరియు కార్పొరేషన్ చైర్మన్ లు ముదిరాజ్ లకు కేటాయించాలని డిమాండ్ చేయడం జరిగింది. దీనికి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి తప్పకుండా పరిశీలిస్తాం అని హామీ ఇచ్చారు . ఈ సంద్భంగా ముఖ్యమంత్రి గారిని కలిసిన వారి లో ముదిరాజ్ జేఏసీ చైర్మన్ పోల్కాం లక్ష్మి నారాయణ ముదిరాజ్ గారు,మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు లింగాల పుష్పాల త ముదిరాజ్ గారు, వైస్ చైర్మన్ సుధాకర్ ముదిరాజ్, జనరల్ సెక్రటరీ లక్ష్మణ్ ముదిరాజ్ ,నీరజ ముదిరాజ్ లు,ముదిరాజ్ యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దారం యువరాజ్ ముదిరాజ్ కలరు.
Apr 18 2024, 23:05