/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz బోటులో ఘోర అగ్ని ప్రమాదం..మత్స్యకారులకు తీవ్రగాయాలు Yadagiri Goud
బోటులో ఘోర అగ్ని ప్రమాదం..మత్స్యకారులకు తీవ్రగాయాలు

ఏపీలో ఈరోజు ఉదయం మరో ప్రమాదం చోటు చేసుకుంది. మత్స్యకారుల బోటులో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.

విశాఖ తీరం నుండి 65 నాటికల్ మైళ్ళ దూరంలో చేపల వేట కొనసాగిస్తుం డగా బోటులో సిలిండర్ పేలింది అయితే.. ఈ ప్రమాదంలో 5 మంది మత్స్యకారులకు తీవ్రగా యాలు,కాగా నలుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి.

బోటు సిబ్బంది సమాచారం తో ఘటన స్థలానికి చేరు కొని సహాయం చేసింది ఇండియన్ కోస్ట్ గార్డ్. దీంతో మత్స్యకారులను ఆస్పత్రికి తరలించారు.

ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. బోటులో సిలిండర్ ఎలా పేలిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు

నేడు రాజస్థాన్ రాయల్స్ తో RCB "డీ "

ఇవాళ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జైపూర్‌లోని సవాయ్ మన్ సింగ్ స్టేడి యంలో పోటీ పడబోతు న్నాయి.

రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవు తుంది. ఈ సీజన్‌లో రాజస్థాన్‌కి ఇది నాలుగు, బెంగళూరుకు ఐదో మ్యాచ్‌ కానుంది.అలాగే, ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు జట్లు మొత్తం 30 సార్లు పోటీ పడగా.. రాజస్థాన్ కంటే బెంగళూరు అగ్రస్థానంలో ఉంది.

ఇక, ఆర్సీబీ 15 మ్యాచ్‌లు గెలవగా, రాజస్థాన్ రాయల్స్ 12 మ్యాచ్‌ల్లో విజయాలను నమోదు చేసుకుంది. ఇక, 3 మ్యాచ్‌ల ఫలితం రాలేదు.. 2020 నుంచి రాజస్థాన్ vs బెంగళూరు మధ్య మొత్తం 9 మ్యాచ్‌లు జరగ్గా.. ఈ 9 మ్యాచ్‌ల్లో రాజస్థాన్ ఒక్క విజయం మాత్రమే నమోదు చేసింది.

2022లో పూణెలోని ఎంసీ ఏ స్టేడియంలో బెంగళూరు పై రాజస్థాన్ 29 రన్స్ తేడాతో విజయం సాధిం చింది.ఇక, జైపూర్ పిచ్ వేదికగా ఆడిన రెండు మ్యాచ్‌లలో బ్యాటింగ్‌లకు మద్దతు ఇస్తుంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు దాదాపు 185 పరుగులకు పైగా స్కోర్ చేసింది.

అయితే రెండు పర్యాయా లు తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు లక్ష్యాన్ని కాపాడు కుంది. ఇది సవాయ్ మన్ సింగ్ స్టేడియం యొక్క పిచ్ ఆట సాగుతున్నప్పుడు ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉంటుంది. అయితే, ఇవాళ వర్షాలు కురిసే అవకాశం లేదు.. ఉష్ణోగ్రతలు సాయం త్రం 20 శాతం తేమతో 30 డిగ్రీల సెల్సియస్‌గా నమోద వుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

రాజస్థాన్ జట్టు: సంజు శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, షిమ్రాన్ హెట్మెయర్, యశస్వీ జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, నాంద్రే బెర్గర్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ కృష్ణ, సందీప్ శర్మ.

బెంగళూరు జట్టు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, రజత్ పటీదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, యశ్ దయాల్, రీస్ టాప్లీ, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, లాకీ ఫెర్గూసన్...

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు అడవి లో తుపాకీ మోతలు

తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో ఈరోజు ఎదురు కాల్పులు జరిగాయి.

పోలీసు బలగాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలిలో 3 తుపాకులు, పేలు డు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

ములుగు జిల్లా కర్రిగుట్ట లు-ఛత్తీస్ గఢ్ లోని కాంకేర్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పులకు సంబంధించి పూర్తి వివ రాలు తెలియాల్సి ఉంది.

కాగా, సోమవారం బీజాపూర్‌లో జరిగిన ఎన్ కౌంటర్‌లో 13 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.

నేడు కాంగ్రెస్‌ భారీ బహిరంగ సభ

•హాజరుకానున్న ఖర్గే, రాహుల్‌, ప్రియాంకగాంధీ, రేవంత్‌

కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటు ఎన్నికల శంఖారావం నేడు పూరించనుంది. పది లక్షల మందితో భారీ బహిరంగ సభ తలపెట్టింది.

రంగారెడ్డి జిల్లా తుక్కు గూడలో జన జాతరను తలపించేలా భారీ జన సమీకరణకు ఏర్పాట్లు చేసింది. ఈవేదిక నుంచి దేశ ప్రజలకు ఐదు గ్యారంటీలతో భరోసా ఇవ్వనుంది. శుక్రవారం ఢిల్లీలో ఇప్పటికే ఏఐసీసీ మ్యానిఫెస్టోను విడుదల చేసిన కాంగ్రెస్‌… శనివారం జనజాతర సభలో తెలుగు అనువాద మ్యానిఫెస్టోను విడుదల చేయనుంది.

సభకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, ఆయా రాష్ట్రాల కాంగ్రెస్‌ ముఖ్య మంత్రులు హాజరుకాను న్నారు.

మూడు భారీ వేదికలు…ఏర్పాట్లు పూర్తి

కాంగ్రెస్‌ బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. 70 ఎకరాల్లో రాజీవ్‌గాంధీ పేరుతో ప్రాంగణం, 50 ఎకరాల్లో పార్కింగ్‌ స్థలాన్ని ఏర్పాటు చేసింది. ఈ సభకు పది లక్షల జనాన్ని తరలిం చనున్నారు. మ్యానిఫెస్టోను రాహుల్‌గాంధీ విడుదల చేయనున్నారు.

సభా ప్రాంగణంలో మూడు భారీ వేదికలు ఏర్పాటు చేసింది. మొదటి వేదికపై ఏఐసీసీ అగ్రనేతలతోపాటు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రు లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, ఎంపీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు హాజరు కానున్నారు.

రెండో వేదికపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, సీనియర్‌ నాయకులు కూర్చొనేలా ఏర్పాటు చేసింది. మూడో వేదిక కళాకారుల కోసం ఏర్పాటు చేశారు. వంద లాది మంది కళాకారులతో ఆటా,పాటలతో ప్రజలను ఉత్తేజపరించేందుకు రెడీ అవుతున్నది.

పదేండ్ల నరేంద్రమోడి ప్రభుత్వ నియంతృత్వ, దుష్పరిపాలనకు తెరదించి దేశంలో ప్రజాస్వామ్య వాతావరణాన్ని పునరు ద్ధరించేందుకు తుక్కుగూడ సభను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ వేదిక నుంచే మోడీకి దీటైన సమాధానం ఇవ్వాలని భావిస్తున్నది.

తాము అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నామో తెలియజేసే మ్యానిఫెస్టోను కాంగ్రెస్‌ విడుదల చేయనుం ది. దీంతో తుక్కుగూడ సభపై తెలంగాణ ప్రజల తోపాటు దేశంలోని ప్రతి ఒక్కరిలోనూ, ఇతర రాజకీయ పార్టీల్లోనూ ఆసక్తి నెలకొంది.

రేపు బీజేపీ పార్టీలో చేరనున్న సినీనటి సుమలత

ప్రముఖ నటి, మాండ్య ఎంపీ సినీ నటి,సుమలత రేపు బీజేపీలో చేరుతున్న ట్లు ప్రకటించారు.

బెంగళూరులో బీజేపీ నేతల సమక్షంలో ఆ పార్టీలో జాయిన్ కానున్నట్లు తెలిపారు.

మాండ్య పార్లమెంట్ నియో జకవర్గం అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా, మోదీనే మళ్లీ ప్రధాని కావాలనే ఆకాంక్షతో బీజేపీకి మద్దతు తెలుపుతు న్నట్లు చెప్పారు.

కాగా గత ఎన్నికల్లో సుమ లత ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచారు..

రేపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కెసీఆర్ పర్యటన

బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుం ట్ల చంద్రశేఖరరావు పొలం బాట కొనసాగుతున్నది. ఇటీవల నల్లగొండ, సూర్యా పేట, జనగామ జిల్లాల్లో గులాబీ దళపతి పర్యటిం చారు.

నీరులేక ఎండిపోయిన పంటలను పరిశీలించారు. పంటలు నష్టపోయిన రైతు లను ఆయన పరామర్శిం చారు. దీనిలో భాగంగా శుక్రవారం నాడు కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించను న్నారు.

రెండు జిల్లాలకు పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ ఖరారైంది. ఉదయం 8.30 గంటలకు ఎర్రవెల్లి వ్యవసా య క్షేత్రం నుంచి బయలు దేరి వెళ్తారు. 10.30 గంటలకు ముక్దుంపూర్‌ చేరుకొని ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారు

మధ్యాహ్నం ఒంటిగంటకు మాజీ మంత్రి, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ నివాసంలో మధ్యాహ్నం భోజనం చేస్తారు. 2గంటల కు రాజన్న సిరిసిల్లలోని బోయినపల్లికి చేరుకుం టారు.

అక్కడ నీరందక ఎండిపో యిన పంటలను పరిశీలి స్తారు. శాభాష్‌పల్లి వద్ద మధ్యమానేరు జలాశయా న్ని సందర్శిస్తారు. సాయం త్రం 4 గంటలకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో మీడియా సమావే శం నిర్వహిస్తారు.

సాయంత్రం 5 గంటలకు బయలుదేరి రాత్రి 7 గంటల వరకు మళ్లీ ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకోవడంతో పర్యటన పూర్తవుతుంది...

గుజరాత్ పై పోరాడి గెలిచిన పంజాబ్ కింగ్స్

గుజరాత్ పై పంజాబ్ థ్రిల్లిం గ్ విజయం సాధించింది. ఒక బాల్ మిగిలి ఉండగానే 200 పరుగుల టార్గెట్ ను చేదించింది. ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో మ‌రో ఉత్కంఠ పోరులో భారీ స్కోర్లు న‌మో దైన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్అద్భుత విజ‌యం సాధించింది.

శ‌శాంక్ సింగ్‌(61 నాటౌట్) అస‌మాన పోరాటానికి.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్ అశుతోష్ మెరుపు ఇన్నింగ్స్ తోడ‌వ్వ‌ డంతో 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. భారీ ఛేద‌న‌ లో టాపార్డ‌ర్ విఫ‌లమైనా.. మిడిలార్డ‌ర్ ప‌ట్టువ‌ద‌ల‌ని విక్రమార్కుల్లా పోరాడారు.

శ‌శాంక్, అశుతోష్‌లు సిక్స‌ర్ల‌ తో హోరెత్తించి లక్ష్యాన్ని క‌రిగించారు. దాంతో, గుజ‌ రాత్ అనూహ్యంగా ఓట‌మి పాలైంది.ఆఖ‌రి ఓవ‌ర్ పోరా టాల‌తో ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అద‌ర‌గొట్టింది.

గుజ‌రాత్‌ను సొంత మైదా నంలో చిత్తు చేసింది. ద‌ర్శ‌న్ న‌ల్కంద వేసిన 20వ ఓవ‌ర్‌ లో పంజాబ్ విజ‌యానికి 7 ప‌రుగులు కావాలి. తొలి బంతిని లాంగాఫ్‌లో ఆడిన అశుతోష్ ర‌షీద్ చేతికి చి క్కాడు. ఆ త‌ర్వాత బంతి వైడ్‌. మూడో బంతికి సింగిల్ వ‌చ్చింది.

నాలుగో బంతిని శశాంక్ బౌండ‌రీకి త‌ర‌లించాడు. రెండు బంతుల‌కు ఒక్క ర‌న్ అవ‌స‌ర‌మైంది. అప్పుడు లెగ్‌బై తీయ‌డంతో పంజాబ్ సూప‌ర్ విక్ట‌రీ కొట్టింది.భారీ ఛేద‌న‌లో పంజాబ్ కింగ్స్ 70 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయింది.

టాపార్డ‌ర్ బ్యాట‌ర్లు శిఖ‌ర్‌ ధావ‌న్(1), జానీ బెయిర్‌ స్టో(22), ప్ర‌భ్‌సిమ్రాన్ సింగ్‌(35), సామ్ క‌ర‌న్‌(5) లు విఫ‌ల‌మ‌య్యారు. అయితే అశుతోష్‌, శ‌శాంక్‌ లు సుడిగాలిలా చెల‌రేగి గుజ‌రాత్‌ను ఓడించారు..

అంతకు ముందు సొంత మైదానంలో గుజ‌రాత్ టైటాన్స్ శుభ్‌మ‌న్ గిల్(89 నాటౌట్) శివాలెత్తిపోయా డు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన అత‌డు పంజాబ్ బౌల‌ర్ల‌ను ఉతికారేశాడు.

గిల్ విధ్వంసానికి సాయి సుద‌ర్శ‌న్‌(33), కేన్ విలియ‌ మ్స‌న్(26), రాహుల్ తెవాటియా(23 నాటౌట్)ల మెరుపులు తోడ‌వ్వ‌డంతో గుజ‌రాత్ వికెట్ల 4 న‌ష్టానికి 199 ప‌రుగులు చేసింది.

Liquor Scam Case: కవితదే మాస్టర్ మైండ్.. ఈడీ సంచలన కామెంట్స్..

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులు సంచలన కామెంట్స్ చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha) అని ఆరోపించారు..

గురువారం నాడు కవిత బెయిల్ పిటిషన్‌పై రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈడీ దాఖలు చేసిన కౌంటర్‌పై రీజాయిన్డెర్లు ఫైర్ చేశారు కవిత తరఫు న్యాయవాదులు. కుమారుడికి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఒక పిటిషన్, మధ్యంతర బెయిల్‌పై ఒక పిటిషన్‌పై విదానలు వినిపిస్తున్నారు అభిషేక్ మను సింఘ్వి. బెయిల్ పిటిషన్‌పై వాదనల సందర్భంగా ఈడీ తన వాదనలు బలంగా వినిపించింది. కవితపై షాకింగ్ కామెంట్స్ చేసింది.

అవినీతి కార్యకలాపాల్లో ఉన్న మహిళకు బెయిల్ ఇవ్వకూడదని ఈడీ బలంగా వాదించింది. ఒకవేళ బెయిల్ ఇస్తే ఆధారాలు, సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని కోర్టుకు తెలియజేసింది. కవితకు వ్యతిరేకంగా అనేక ఆధారాలు ఉన్నాయని ఈడీ స్పష్టం చేసింది. లిక్కర్ స్కామ్‌ను ప్లాన్ చేసిందే కవిత అని ఆరోపించారు. ఫోన్ డేటా మొత్తాన్ని డిలీట్ చేశారని ఆరోపించారు. తాము అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వలేదన్నారు.

విచారణ సమయంలో మొత్తం 10 ఫోన్లను కవిత ఇచ్చారని, కానీ అవి మొత్తం ఫార్మాట్ చేసినవేనని కోర్టుకు వివరించింది ఈడీ. ఈ కేసులో విచారణ సందర్భంగా నోటీసులు ఇచ్చిన తరువాత 4 ఫోన్లను ఫార్మాట్ చేశారని ఆరోపించారు. ఈ కేసులోని నిందితులు వందల డిజిటల్ డివైజ్లను ధ్వంసం చేశారన్నారు. అప్రూవర్‌గా మారిన వ్యక్తిని తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దంటూ కవిత బెదిరించారని ఆరోపించారు. అంతేకాదు.. కవితకు వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలను జడ్జికి సమర్పించారు ఈడీ తరపు న్యాయవాది..

కాంగ్రెస్‌కు షాక్‌.. పార్టీకి జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ రాజీనామా

లోక్‌సభ ఎన్నికలకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే, కాంగ్రెస్ మాత్రం మునిగిపోయే పడవలా కనిపిస్తోంది. దీనిపై రైడర్లు ఒక్కొక్కరుగా దిగుతున్నారు. ఒకదాని తర్వాత ఒకటిగా కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీ పెద్దలు మాత్రమే చేతులు ఊపుతున్నారు. కాంగ్రెస్‌ను వీడిన వారికి మరో పేరు చేరింది. కాంగ్రెస్ ఆవేశపూరిత అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అన్ని పదవులకు గౌరవ్ వల్లభ్ రాజీనామా చేశారు.పార్టీకి రాజీనామా చేస్తూ సనాతన్ వ్యతిరేక నినాదాలు చేయలేనని గౌరవ్ వల్లభ్ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం కష్టం.

'నాకు సుఖం లేదు'

గౌరవ్ వల్లభ్ తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపారు. ఆయన ఖర్గేకు పంపిన రాజీనామా లేఖ ఫోటోను షేర్ చేస్తూ ఇలా వ్రాశారు - 'ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతున్న దిక్కులేని తీరుతో నేను సుఖంగా లేను. నేను సనాతన్ వ్యతిరేక నినాదాలు చేయలేను లేదా దేశంలోని సంపద సృష్టికర్తలను ఉదయం మరియు సాయంత్రం దుర్వినియోగం చేయలేను. అందుకే కాంగ్రెస్ పార్టీ అన్ని పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.

'నిజాన్ని దాచడం కూడా నేరమే, నేను అందులో భాగం కానక్కర్లేదు'

ఖర్గేకు పంపిన రాజీనామా లేఖలో, తాను భావోద్వేగానికి గురయ్యానని, హృదయవిదారకంగా ఉన్నానని రాశారు. నేను చాలా చెప్పాలనుకుంటున్నాను, వ్రాయాలనుకుంటున్నాను మరియు చెప్పాలనుకుంటున్నాను. కానీ నా విలువలు అలా మాట్లాడకుండా నిషేధించాయి. అయినా నిజాన్ని దాచడం కూడా నేరంగా భావించి ఈ రోజు నా అభిప్రాయాలను మీ ముందు ఉంచుతున్నాను. అటువంటి పరిస్థితిలో, నేను నేరంలో భాగం కాకూడదనుకుంటున్నాను.

యువతను, ఆలోచనలను కాంగ్రెస్ పార్టీ గౌరవించదు

గౌరవ్ వల్లభ్ మాట్లాడుతూ - 'నేను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు, యువకులు, మేధావులు మరియు వారి ఆలోచనలకు విలువ ఇచ్చే దేశంలో కాంగ్రెస్ అత్యంత పురాతనమైన పార్టీ అని నేను నమ్మాను, కాని గత కొన్నేళ్లలో పార్టీ ప్రస్తుత రూపం అని నేను గ్రహించాను. కొత్త ఆలోచనలతో యువతతో సరిపెట్టుకోలేక ఐఏఎస్. పార్టీ యొక్క గ్రౌండ్ లెవెల్ కనెక్షన్ పూర్తిగా విచ్ఛిన్నమైంది, ఇది నవ భారతదేశం యొక్క ఆకాంక్షను అస్సలు అర్థం చేసుకోలేకపోతుంది, దాని కారణంగా పార్టీలో చేరలేకపోతుంది లేదా బలమైన ప్రతిపక్ష పాత్రను పోషించలేకపోయింది. ఇది నాలాంటి కార్మికులను నిరుత్సాహపరుస్తుంది.

‘పెద్ద నాయకులు, కిందిస్థాయి కార్యకర్తలకు దూరం పెరిగింది’

గౌరవ్ వల్లభ్ మాట్లాడుతూ, 'కాంగ్రెస్ యొక్క గ్రౌండ్ లెవల్ కనెక్షన్ పూర్తిగా విచ్ఛిన్నమైంది. పెద్ద నాయకులు మరియు అట్టడుగు ఉద్యోగుల మధ్య అంతరాన్ని తగ్గించడం చాలా కష్టం. అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్ఠాపన కార్యక్రమానికి సంబంధించి కాంగ్రెస్ చర్యపై కూడా ఆయన ప్రశ్నలు సంధించారు. శ్రీరాముడి జీవితానికి సంబంధించి కాంగ్రెస్ వైఖరి పట్ల నేను కలత చెందుతున్నాను. నేను పుట్టుకతో హిందువుని మరియు వృత్తి రీత్యా ఉపాధ్యాయుడిని. పార్టీ యొక్క ఈ వైఖరి నాకు ఎప్పుడూ అసౌకర్యంగా ఉంది. పార్టీలోనూ, కూటమిలోనూ చాలా మంది వ్యక్తులు సనాతన్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే ఆ పార్టీ మౌనం దానికి మౌనంగా ఆమోదం తెలిపినట్లే.

హైదరాబాద్ జిల్లా లో 25 లక్షల నకిలీ కరెన్సీ పట్టుకున్న పోలీసులు

హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు ఫేక్ కరెన్సీ ముఠా లు బయట పడుతున్నా యి. ఈరోజు బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 25 లక్షల రూపాయల నకిలీ కరెన్సీని మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు.

ఇది, మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ కు కారులో 25 లక్షల రూపాయల నకిలీ కరెన్సీ తరలించేందుకు ప్రయత్నించిన నలుగురు అడ్డంగా దొరికిపోయారు.

బాలాపూర్ పోలీస్ స్టేషన్ ఎర్రకుంట దగ్గర అనుమా నంగా కనిపించిన కారును ఆపి తనిఖీ చేయగా అందు లో 25 లక్షల నకిలీ కరెన్సీ ఎస్ఓటీ పోలీసులకు పట్టుబడింది.

ఇక, నిందితులు మూడిం తల నకిలీ కరెన్సీ ఇచ్చి ఒకింత ఒరిజినల్ కరెన్సీ తీసుకుని చలామణి చేసేందుకు ప్రయత్నిస్తు న్నట్టు మహేశ్వరం ఎస్ఓటి పోలీసులు గుర్తించారు.

కాగా, షేక్ హరుణ్, సయ్య ద్ సగీర్, జాకీర్ సయ్యద్, అలీ ఆఫ్తాబ్ అత్తర్ అనే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

నిందితులంతా మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన వారిగా ఎస్ఓటి పోలీసులు గుర్తిం చారు. నిందితుల నుంచి చిల్ద్రెన్ బ్యాంక్ కు సంబం ధించిన 25 లక్షల రూపాయ ల నకిలీ కరెన్సీతో పాటు నిస్సాన్ కంపెనీకి చెందిన కారు, నాలుగు మొబైల్ ఫోన్స్ కీ ప్యాడ్ మొబైల్, 8240 వేల ఒరిజినల్ కరెన్సీ రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు....