ఇబ్రహీంపట్నంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన ఆర్పీలు
రంగారెడ్డి జిల్లా: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆర్పి ల ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలో గురువారం, సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఆర్పి ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మరియు జిల్లా అధ్యక్షురాలు భరతాకి హంసమ్మ మాట్లాడుతూ.. రూ.4000 ఉన్న తమ గౌరవ వేతనాన్ని సీఎం కేసీఆర్ మరో రూ. 2000 పెంచుతూ.. రూ. 6000 చేసి జీవో విడుదల చేశారని, ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు మెప్మా ఆర్పీల తరఫున ధన్యవాదాలు అని తెలిపారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మరియు రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు భారతాకి హంసమ్మ, , ఇబ్రహీం పట్నం అధ్యక్షురాలు పార్వతమ్మ అమీర్పేట అధ్యక్షురాలు సుగుణ, జిల్లెలగూడ అధ్యక్షురాలు అనిత, తుర్కయంజాల్ అధ్యక్షురాలు ఝాన్సీ, బడంగ్ పేట అధ్యక్షురాలు ఎం.డి సఖిన, అంబర్పేట అధ్యక్షురాలు సువర్ణ, తదితరులు పాల్గొన్నారు.
Sep 28 2023, 17:41