భాజపా-జేడీఎస్ దోస్తీ.. దేవెగౌడ కీలక వ్యాఖ్యలు..
ల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ భాజపా(BJP)తో తమ పార్టీ దోస్తీ కట్టడాన్ని జేడీఎస్(JDS) అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ(Deve Gowda) సమర్థించుకున్నారు..
అవకాశవాద రాజకీయాలను చేయబోమన్నారు. ఇటీవల భాజపాతో పొత్తు, ఎన్డీయేలో చేరిక అంశంపై జేడీఎస్‌కు చెందిన కొందరు నేతలు విభేదిస్తున్నారంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో ఆయన బెంగళూరులో విలేకర్ల వద్ద కీలక వ్యాఖ్యలు చేశారు.
తమ పార్టీ లౌకిక ప్రమాణాలకు కట్టుబడి ఉందని.. మైనార్టీలను ఎప్పటికీ నిరాశపరచబోమన్నారు.
కర్ణాటకలో రాజకీయ పరిస్థితులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah)కు వివరించినట్టు చెప్పారు.
గత పదేళ్లలో తొలిసారి హోంమంత్రి అమిత్ షాతో చర్చించానన్నారు. తమ పార్టీని కాపాడుకొనే లక్ష్యంతోనే 2014లోక్‌సభ ఎన్నికల్లో భాజపాతో పొత్తు పెట్టుకున్నట్టు దేవెగౌడ తెలిపారు..
Sep 27 2023, 21:49