ఏపీలో రూ.50 కోట్లతో రహదారి భద్రతా నిధి..
అమరావతి: రహదారి భద్రత కోసం రూ.50 కోట్ల రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రహదారి ప్రాజెక్టుల అంచనాలో 2 శాతం రహదారి భద్రతా నిధికి జమ చేయాలని ఆయన స్పష్టం చేశారు..
సచివాలయంలో రహదారి భద్రతా అంశంపై సీఎస్ సమీక్ష నిర్వహించారు. ప్రధాన రహదారుల్లో జంక్షన్‌లను మెరుగుపర్చి, బ్లాక్ స్పాట్లను సరిదిద్దాలని సూచించారు.
అలాగే ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారు, ఇతర నాలుగు చక్రాల వాహనాలు నడిపే వారికి సీటు బెల్టు వాడకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాల్సిందిగా సూచనలు ఇచ్చారు.
మరోవైపు మద్యం సేవించి వాహనాలు నడిపై వారిపై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
పాఠశాలలు, కళాశాలలు, ప్రార్ధనా మందిరాల పరిసరాల్లో ప్రమాదాల నివారణకు సైన్ బోర్డులు ఏర్పాటు చేయటంతో పాటు ప్రధాన రహదారుల వెంబడి ప్రమాదకరమైన హోర్డింగ్లు, ఫ్లెక్సీల తొలగింపునకు సీఎస్ ఆదేశాలు ఇచ్చారు..
Sep 27 2023, 19:37