గురి చూసి కొట్టారు
ఆసియా క్రీడల్లో భాగంగా జరుగుతున్న ఈవెంట్స్లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు.
25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో భారత షూటర్లు స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. మను బాకర్, రిథమ్ సంగ్వాన్, ఈశా సింగ్లతో కూడిన టీమ్.. ఆసియా క్రీడల్లో గోల్డ్ గెలుచుకుంది.
1759 పాయింట్లతో ఈ త్రయం తొలి స్థానాన్ని కైవసం చేసుకుని పసిడి పతకాన్ని ముద్దాడింది. అలా భారత్కు ఈ టీమ్ నాలుగో స్వర్ణ పతకాన్ని అందించింది.
అంతకుముందు జరిగిన రాపిడ్-ఫైర్ సిరీస్‌ను మను 98 పాయింట్లతో ముగించి టాప్ పొజిషన్లో నిలిచింది. ఇక ఈ గేమ్లో ఆతిథ్య చైనా జట్టు 1756తో రజత పతకాన్ని కైవసం చేసుకోగా, సౌత్ కొరియా షూటర్లు1742 స్కోరు సాధించి మూడో ర్యాంక్‌తో సరిపెట్టుకున్నారు.
Sbnews
















Sep 27 2023, 15:31
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2.2k