విప్లవాల ఆస్తివమ్మ చాకలి ఐలమ్మ సాంగ్ ప్రోమో రిలీజ్
ఉస్మానియా యూనివర్సిటీ: చాకలి ఐలమ్మ 38వ వర్ధంతి సందర్భంగా చాకలి ఐలమ్మ సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో విప్లవాల ఆస్తివమ్మ చాకలి ఐలమ్మ సాంగ్ ప్రోమోను అనేక ఉద్యమాలు పోరాటాలకు వేదిక అయిన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల సాక్షిగా చాకలి ఐలమ్మ సంఘం కోఆర్డినేటర్ కొలుకులపల్లి రాధిక చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ సంఘం తెలంగాణ ఫౌండర్ చైర్మన్ నాగిళ్ల శంకర్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ అస్తిత్వ పోరాటాలకు దిక్చూచి అని అన్నారు. తెలంగాణ సాయుధ సమరంలో చాకలి ఐలమ్మ భూస్వాములు పెత్తందారులు విసునూర్ దేశముఖ్ లపై తిరుగుబాటు జెండా
ఎగురవేసిందన్నారు నేటి తరం యువత చాకలి ఐలమ్మ పోరాటాలను పూర్తిగా తీసుకొని ముందుకు నడవాలన్నారు. అదే విధంగా ట్యాంక్ బండ్ పై చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్రంలో ఏదైనా ఒక యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని ఐలమ్మ పోరాటం చేసిన జనగామ జిల్లాకు చాకలి ఐలమ్మ జిల్లాగా నామకరణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం కొత్తపేటలో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ పగిళ్ల సందీప్,ఉదయ్, చంద్రకాంత్, మల్లేష్, గోవింద్,ఏకాంబరం, వీరన్న,వెంకటేష్,గణేష్ శ్రీనులు పాల్గొన్నారు.
Sep 10 2023, 19:00