మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ: మంత్రులు హరీష్ రావు శ్రీనివాస్ యాదవ్
చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయించారని, అధికారికంగా నిర్వహించడం మనందరికి గర్వ కారణం అని రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు అన్నారు.
జిల్లా కేంద్రమైన సిద్ధిపేట హౌసింగ్ బోర్డు సర్కిల్ లో చాకలి ఐలమ్మ వర్థంతి పురస్కరించుకుని ఆదివారం ఉదయం చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
జోహార్ చాకలి ఐలమ్మ అంటూ మంత్రులు నినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తిని పునికి పుచ్చుకుని తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకున్నాం.
కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేలా సీఎం కేసిఆర్ కృషి చేస్తున్నారని, సిద్దిపేటలో అన్ని సౌకర్యాలతో మోడరన్ దోబి ఘాట్ రజకుల సౌకర్యార్థం నిర్మించాం. ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా రజకులకు పెద్ద ఎత్తున రుణాలు, స్వయం ఉపాధి యూనిట్లను మంజూరు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
మంత్రి వెంట ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు... ..
Sep 10 2023, 13:39