/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం Yadagiri Goud
నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్ ,

అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారంలో నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఊట్కూర్ గ్రామానికి చెందిన వేముల లింగస్వామి కుమార్తె వివాహానికి ఆదివారం నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరయ్యారు.

ఈ సందర్భంగా నూతన వధువరువులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వేముల వీరేశం అనుచరులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.

SB NEWS

యూపీ బారబంకిలో ఘోరం.. కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. శిథిలాల కింద పలువురు

లక్నో: ఉత్తర ప్రదేశ్‌ బారబంకిలో ఘోర ప్రమాదం చోటు చేసకుంది. మూడంతస్థుల భవనం ఒకటి కుప్పకూలి.. ఇద్దరు మృతి చెందారు. చికిత్సలో శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండడం, క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది.

ఆదివారం అర్ధరాత్రి దాటాక ఉన్నట్లుండి.. భవనం కుప్పకూలింది. సమాచారం అందుకున్న పోలీసులు.. సహాయక బృందాలతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. పన్నెండు మందిని శిథిలా నుంచి బయటకు తీశారు. వీళ్లలో ఇద్దరు ఆస్పత్రికి తరలించాక మృతి చెందారు.

ఈ ఘటనకు సంబంధించి అదనపు సమాచారం అందాల్సి ఉంది..

తిరుపతి లో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ నేడు సోమవారం కొనసాగుతోంది. నేడు శ్రీవారి దర్శనం కోసం 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

శ్రీవారి సర్వదర్శనానికి నేడు 12 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.05 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఆదివారం స్వామివారిని 81,459 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.05 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న శ్రీవారికి 32,899 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు....

Hyderabad: ఇంట్లోకి చొరబడి ప్రేమోన్మాది దాడి.. తమ్ముడి మృతి, అక్కకు తీవ్ర గాయాలు

హైదరాబాద్‌: ఎల్బీనగర్‌ ఆర్టీసీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంట్లోకి చొరబడిన యువకుడు.. యువతి, ఆమె తమ్ముడిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో యువకుడు మృతి చెందగా, అతని సోదరికి తీవ్ర గాయాలయ్యాయి..

పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం 2.45 గంటలకు ఆర్టీసీ కాలనీలోని సంఘవి ఇంటికి రామంతపూర్‌కి చెందిన శివకుమార్‌ వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో సంఘవి, ఆమె తమ్ముడు చింటూ ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత చింటూ, శివకుమార్‌ మధ్య వాగ్వాదం జరిగింది.

ఈక్రమంలో శివకుమార్‌ తన వెంట తెచ్చుకున్న కత్తితో సంఘవి, చింటూపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. భవనంలోని మొదటి అంతస్థులో ఘర్షణ జరిగి కిటికీ అద్దాలు పగులగొట్టిన శబ్ధం రావడంతో స్థానికులు చేరుకుని దాడికి పాల్పడిన యువకుడిని ఇంట్లోనే బంధించారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న సంఘవి, చింటూలను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చింటూ మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. సంఘవికి చికిత్స అందిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు..

Udhayanidhi Stalin : ఉద‌య‌నిధి స్టాలిన్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన‌ కాంగ్రెస్

స‌నాత‌న ధ‌ర్మాన్ని డెంగ్యూ, మ‌లేరియాతో పోల్చుతూ డీఎంకే నేత‌, త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉద‌య‌నిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) చేసిన వ్యాఖ్య‌లు పెను దుమారం రేపాయి. ఉద‌య‌నిధి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డంతో కాంగ్రెస్ అప్ర‌మ‌త్త‌మైంది. విప‌క్ష కూటమి ఇండియాలో డీఎంకే భాగ‌స్వామ్య ప‌క్షంగా ఉండ‌టంతో కాంగ్రెస్ పార్టీ న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టింది.

ఉద‌య‌నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్య‌ల‌తో త‌మ పార్టీకి సంబంధం లేద‌ని కాంగ్రెస్ స్ప‌ష్టం చేసింది. అన్ని మ‌తాలు ఒక‌టే అన్న అంబేడ్క‌ర్ వ్యాఖ్య‌ల‌ను మ‌హారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా ప‌టోలె ఉటంకిస్తూ త‌మ పార్టీ ఏ ఒక్క మ‌తస్తుల మ‌నోభావాల‌నూ కించ‌ప‌ర‌చ‌ద‌ని పేర్కొన్నారు. అన్ని మ‌తాలు స‌మాన‌మే అనేది త‌మ వైఖ‌రని స్ప‌ష్టం చేశారు. ఎవ‌రో చేసిన ప్ర‌క‌ట‌న త‌మ‌కు ఆపాదించ‌బోర‌ని, త‌మ పార్టీ వైఖ‌రిని తేటతెల్లం చేస్తున్నామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. కాగా స‌నాత‌న ధ‌ర్మాన్ని మ‌లేరియా, డెంగ్యూ, క‌రోనాతో పోల్చిన ఉద‌య‌నిధి మార‌న్ స‌నాత‌న ధ‌ర్మాన్ని వ్య‌తిరేకిస్తే స‌రిపోద‌ని దాన్ని నిర్మూలించాల‌ని వ్యాఖ్యానించారు.

ఇక ఉద‌య‌నిధి స్టాలిన్ ప్ర‌సంగ వీడియోను హిందీ స‌బ్‌టైటిల్స్‌తో బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల‌వీయ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. రాహుల్ గాంధీ ప్రేమ దుకాణం గురించి మాట్లాడుతుంటే కాంగ్రెస్ భాగ‌స్వామ్య ప‌క్షం డీఎంకే స‌నాత‌న ధ‌ర్మాన్ని నిర్మూలించాల‌ని కోరుతోందని, డీఎంకే న‌ర‌మేధం పిలుపుపై కాంగ్రెస్ మౌనం దాల్చింద‌ని మండిప‌డ్డారు. విప‌క్ష ఇండియా కూట‌మి అధికారంలోకి వస్తే వంద‌ల ఏండ్ల నాటి భార‌త్ సంస్కృతిని మంట‌గ‌లుపుతార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

సింగరేణి ప్రాంతాల్లో ఎమ్మెల్యే స్థానాలను గెలిపించి కేసీఆర్ కు బహుమతిగా ఇవ్వండి: ఎమ్మెల్సీ కవిత

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి ప్రాంతాల్లో గులాబీ జెండా ఎగరాలని, ఆ ప్రాంతాల్లో ఉన్న అన్ని ఎమ్మెల్యే స్థానాలను గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు.

సింగరేణి సంస్థకు చెందిన పాఠశాలల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న టీచింగ్‌, నాన్ టీచింగ్ సిబ్బంది తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆదివారం హైదరాబాదులో ఎమ్మెల్సీ కవితను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..సింగరేణిని ప్రైవేటీకరించే పరిస్థితి నుంచి సీఎం కేసీఆర్ తప్పించారని తెలిపారు. ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించి ఆ సంస్థను కాపాడారని పేర్కొన్నారు. ఆర్టీసీ సంస్థను కూడా ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని తేల్చి చెప్పండి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమస్యలను రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నారని అన్నారు.

తెలంగాణ రాకముందు వారసత్వ ఉద్యోగాల అంశం తీవ్రమైన సమస్యగా ఉండేదని, అప్పట్లో కేవలం 4000 ఉద్యోగాలు మాత్రమే ఇస్తే తెలంగాణ ఏర్పడిన తర్వాత 20 వేల ఉద్యోగాలు కల్పించాలని స్పష్టం చేశారు.

కేవలం మానవతా దృక్పథంతో ఆలోచించి సీఎం కేసీఆర్ వారసత్వం ఉద్యోగాలను కల్పించారని పేర్కొన్నారు.

అదే రకంగా సింగరేణి సంస్థలోని పాఠశాలల టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యలను కూడా ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. తాను కూడా చొరువ తీసుకొని సీఎం కేసీఆర్‌తో చర్చిస్తానని హామీనిచ్చారు. అవసరమైతే సింగరేణి కార్మిక నాయకులతో సీఎంతో సమావేశం ఏర్పాటు చేయించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పారు.

ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ జనరల్ సెక్రెటరీ మిరియాల రాజిరెడ్డి, టీబీజీకేస్ నాయకులు పాల్గొన్నారు...

Simultaneous polls: 'జమిలి' అంటే రాష్ట్రాలపై దాడి చేయడమే: రాహుల్‌ గాంధీ

దిల్లీ: జమిలి ఎన్నికల (Simultaneous Polls) సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీపై కాంగ్రెస్‌ పార్టీ మరోసారి అనుమానాలు వ్యక్తం చేసింది..

అంతేకాకుండా జమిలీ ఎన్నికల ఆలోచన భారత ఐక్యత, రాష్ట్రాలపై దాడి చేయడమేనని మండిపడింది. ముఖ్యంగా కమిటీ ఏర్పాటు చేసిన సమయం, విధివిధానాలను నిర్దేశించిన తీరును చూస్తుంటే సిఫార్సులు కూడా ఇప్పటికే నిర్ణయించినట్లు ఆరోపించింది. కమిటీ కూర్పుపైనా అనుమానాలు ఉన్నాయని.. అందుకే అందులో ఉండేందుకు తమ నేత నిరాకరించారని కాంగ్రెస్‌ పార్టీ స్పష్టం చేసింది..

'ఒకే దేశం-ఒకేసారి ఎన్నికలు.. భారత్‌ ఐక్యత, అన్ని రాష్ట్రాలపై దాడి చేసే ఆలోచనే' అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు. భారత్‌ అంటే రాష్ట్రాల సమైఖ్యత అన్నారు. 'జమిలి ఎన్నికలపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయడం నామమాత్రపు ప్రక్రియే. దీన్ని ఏర్పాటు చేసిన సమయంపైనా అనుమానాలున్నాయి. దాని నియమ నిబంధనలను చూస్తే కమిటీ సిఫార్సులను ఇప్పటికే నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందుకే కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌధరి ఆ కమిటీలో ఉండేందుకు నిరాకరించడం సరైనదే' అని కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ పేర్కొన్నారు..

ఇక ఒకేసారి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఛైర్మన్‌గా 8 మంది ప్రముఖులతో ఓ కమిటీ ఏర్పాటయ్యింది. వెంటనే పని ప్రారంభించి సాధ్యమైనంత త్వరగా సిఫార్సులు చేయాలని కమిటీకి సూచించింది. అయితే, ఇందుకు స్పష్టమైన గడువు మాత్రం నిర్దేశించలేదు. సమావేశాలు, ఇతర కార్యక్రమాలకు సంబంధించిన విధివిధానాలను అదే రూపొందించుకోవచ్చని.. ఇది ప్రజల సూచనలనూ వింటుందని తాజా గెజిట్‌లో పేర్కొంది. వినతులు, లేఖలు స్వీకరించి, అవసరమైనవాటిని తుది సిఫార్సుల్లో పొందుపరచడానికి వీలు కల్పించింది..

చేతిలో కంకి కొడవలి, సుత్తి కొడవలి

రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు వాడివేడిగా నడుస్తున్నాయి. ముఖ్యంగా పొత్తుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హ్యాండ్ ఇవ్వడంతో కామ్రేడ్లు అప్పటి నుంచి అసంతృప్తిలో ఉన్నారు. దీంతో ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా కాంగ్రెస్‌తో జత కట్టాలని అనుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్‌ను మరోసారి గద్దె ఎక్కకుండా కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవాలనే అడుగులు వేసింది.

ఇందులో భాగంగానే ఇటీవల సీపీఐ, సీపీఎంల రాష్ట్ర నాయకులతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్ రావు థాక్రే ఫోన్ చేసి మాట్లాడారు. వారితో థాక్రే రహస్య చర్చలు జరిపారనే టాక్ సైతం ఉంది. అయితే.. ఇప్పటివరకు పొత్తులపై మాత్రం అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్ రాలేదు. ఎవరికివారుగా మౌనమే ప్రదర్శిస్తున్నారు.

సీపీఐకి రెండు, సీపీఎంకు రెండు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు.. కమ్యూనిస్టులు ఇండియా కూటమిలో ఉన్నారు.

దీంతో పొత్తు పెట్టుకునే అవకాశాలు లేకపోలేదు. కానీ.. పొత్తులపై టీ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మాత్రం బహిరంగంగా ఎలాంటి చర్చలు జరపలేదు. పొత్తులపై కనీసం క్లారిటీ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే కమ్యూనిస్టులు అడుగుతున్న అసెంబ్లీ సీట్లలో ఆల్రెడీ కాంగ్రెస్ నేతలు ఫిక్స్ అయి ఉన్నట్లు తెలుస్తోంది.

పాలేరు, కొత్తగూడెం, భద్రాచలం, వైరా, మధిర, హుస్నాబాద్, బెల్లంపల్లి, మిర్యాలగూడ, నకిరేకల్, మునుగోడు, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సీట్లను వామపక్షాలు అడుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ.. ఈ సెగ్మెంట్లలో కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్థులు ఉన్నారని, ఆ స్థానాలను కమ్యూనిస్టులకు ఇస్తే ఎలా అని నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీకి నష్టం జరిగేలా ఉందని అనుకుంటున్నట్లు సమాచారం. అందుకే టీ కాంగ్రెస్‌ నేతలు పొత్తులపై క్లారిటీ ఇవ్వలేకపోతున్నారని తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా చేరికలపై దృష్టి పెట్టింది. తుమ్మల నాగేశ్వరరావు, వైఎస్ఆర్టీపీ అధినేత షర్మిలపై అధిష్టానం దృష్టి పెట్టింది. గత ఎన్నికల్లో పాలేరు నుంచి తుమ్మల పోటీ చేశారు. షర్మిల ఒకవేళ కాంగ్రెస్‌లో విలీనం చేస్తే పాలేరు టికేట్ ఆశించే అవకాశం లేకపోలేదు.

మరోవైపు ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పాలేరు టికెట్ కోసం చూస్తున్నారు. కాంగ్రెస్‌లో కమ్యూనిస్టులు అడుతున్న ప్రతీ సెగ్మెంట్‌లో బలమైన నేతలు ఉన్నారు. కమ్యూనిస్టులా, చేరికలా అనే డైలామాలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఉన్నారు. మరోవైపు ఎవరి బలం ఎంత అని నేతలు బేరీజు వేస్తున్నారు. కాగా, కమ్యూనిస్టులు మాత్రం ఎవరితో పొత్తులు కుదరకపోతే బలమైన స్థానాల్లో ఉమ్మడిగా పోటీచేయాలని ఇదివరకే నిర్ణయించుకున్నారు...

హైదరాబాద్‌ ప్రజలు బయటకు రావొద్దు: తలసాని

హైదరాబాద్‌ ప్రజలు బయటకు రావొద్దని కోరారు తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.

మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఆదివారం తెల్లవారు జాము నుండి ఏకధాటిగా వర్షం కురుస్తున్నందున ఎక్కడ ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా చూడాలని ఆదేశించారు.

ప్రజలు అత్యవసర సేవల కోసం GHMC కంట్రోల్ రూమ్ కు పిర్యాదు చేయండని కోరారు. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

కాగా.. ఇవాల్టి నుంచి తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం, సోమవారం, మంగళవారం ఇలా మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది...

ఆస్పత్రిలో చేరిన సోనియాగాంధీ..

న్యూఢిల్లీ : కాంగ్రెస్ చైర్పర్సన్ సోనియాగాంధీ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. తేలికపాటి జ్వరం లక్షణాలతో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి..

ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉన్నట్లు వెల్లడించాయి. ఈ ఏడాదిలో ఆమె ఆస్పత్రిలో చేరడం ఇది మూడోసారి. గతంలో రెండు సార్లు ఆస్పత్రిలో చేరారు. వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ చికిత్స కోసం జనవరి 12న సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరారు.

ఐదు రోజుల పాటు చికిత్స తీసుకుని జనవరి 17న డిశ్చార్జ్ అయ్యారు. మార్చి 2న కూడా జ్వరంతో ఇదే ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల క్రితం ముంబయిలో జరిగిన ప్రతిపక్షాల కూటమి ఇండియా సమావేశానికి సోనియా గాంధీ హాజరయ్యారు. కాంగ్రెస్ ఎంపితో కలిసి ఆమె సమావేశాల్లో పాల్గన్నారు..