/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz నల్లగొండ నియోజకవర్గంలోని 20 నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం కొరకు నాలుకోట్ల రూపాయల విడుదల Miryala Kiran Kumar
నల్లగొండ నియోజకవర్గంలోని 20 నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం కొరకు నాలుకోట్ల రూపాయల విడుదల

నల్లగొండ నియోజకవర్గంలోని 20 నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం కొరకు నాలుకోట్ల రూపాయల విడుదల

 నల్లగొండ నియోజకవర్గం లోని 20 నూతన గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం కొరకు నాలుగు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం పట్ల... నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు తమ హర్షం వ్యక్తం చేశారు... ఇందుకు ముఖ్యమంత్రికి కేసీఆర్ గారికి, పంచాయతీరాజ్ శాఖామాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి జిల్లా మంత్రివర్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి గారికి తమ ధన్యవాదాలు తెలియజేశారు...

 దీనితో నూతనంగా గ్రామ పంచాయతీగా ఏర్పడ్డ అన్ని గ్రామాలకు మరియు పాత భవనాలు కలిగి శిథిలావస్త లో ఉన్న గ్రామాలకు కూడా... 20 లక్షల రూపాయల చొప్పున నిధులు మంజూరు అయ్యాయని..

 దీంతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు స్వంత భవనాలు ఏర్పడ్డట్టు అయిందన్నారు ...

 తిప్పర్తి మండలం లోని.. గోదావరి గూడెం, మామిడాల, గడ్డి కొండారం, కంకణాలపల్లి, జంగారెడ్డిగూడెం, యాపలగూడెం, వెంకటాద్రిపాలెం, సోమోరిగూడెం..

 నల్లగొండ మండలం లోని... నర్సింగ్ బట్ల,తొరగల్, జీకే అన్నారం, ఖాజీరామారం...

 కనగల్ మండలంలోని... తేలకంటి గూడెం, తుర్కపల్లి, బచ్చన్న గూడెం, శాబ్దుల్లాపురం, చర్లగౌరారం, తిమ్మన్నగూడెం, బాబాసాహెగూడం, ఏమి రెడ్డిగూడెం...

 మొత్తం 20 గ్రామాలకు ఒక్కో గ్రామపంచాయతీకి 20 లక్షల రూపాయల చొప్పున మంజూరు అయినట్టు తెలియ చేశారు...

 

వెంటనే ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు.. సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు... వెంటనే పనులు ప్రారంభించి.. పూర్తి చేయవలసిందిగా ఆదేశించారు.

ఆర్టీసీ విలీన ప్రక్రియ వేగవంతం చేయాలి:SWF(CITU )

ఆర్టీసీ విలీన ప్రక్రియ వేగవంతం చేయాలి:SWF(CITU )

తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఆగస్టు 6 శాసనసభలో ఆమోదం పొందిన ఆర్టీసీ విలీన బిల్లు ప్రక్రియను వేగవంతం చేస్తూ విలీనం వల్ల కార్మికులకు జరిగే నష్టాలను నివారించి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు పెంచాలనీ ఆర్టీసీ స్టాఫ్ &వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ అనుబంధం ) నల్లగొండ డిపో గౌరవాధ్యక్షులు దండెం పల్లి సత్తయ్య డిమాండ్ చేశారు.

        

శుక్రవారం నల్లగొండ డిపోలో ఎస్ డబ్ల్యూ ఎఫ్ సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వం నియమించిన విలీన కమిటీ చైర్మన్, రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావుకి, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్, ఆర్టీసీ ఛైర్మెన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు ఇచ్చిన మెమోరాండం కాపీలను నల్లగొండ డిపోలో కార్మికులకు పంచడం జరిగింది.

ఈ సందర్బంగా సత్తయ్య మాట్లాడుతూ ఆర్టీసీ విలీనం పట్ల జరిగే లాభనష్టాలను కలుపుకొని దాదాపు  88 అంశాలను ఈ మెమోరాండంలో పందుపరచడం జరిగిందని  ప్రభుత్వం నియమించిన కమిటీ లో కార్మికసంఘాలకు చోటు కల్పించాలని అన్నారు. కార్మికులకు పాత పద్దతిలోనే మెడికల్ సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పెన్షన్ సౌకర్యం ఉండాలన్నారు. విలీనానికంటే ముందుగా 2017, 2021 వేతన సవరణ చేయాలనీ లేని పక్షంలో కార్మికులకు భారీగా నష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు. డిపో స్పేర్ విధానం ఎత్తివేసి భారత రాజ్యాంగానికి, చట్టాలకు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగావున్న ఆర్టీసీ రెగ్యులేషన్స్ సమూలంగా మార్చాలని డిమాండ్ చేశారు. 2013 వేతన సవరణ బకాయిలు సీసీఎస్, పిఎఫ్ సంస్థల కు చెల్లించాల్సిన డబ్బులను వేంటనే విడుదల చేయాలన్నారు. ఓవర్ టైం డ్యూటీ లు రద్దుచేసి 8 గంటల పని విధానం అమలు చేయాలన్నారు. ఎలక్షన్స్ కోడ్ సమీపిసున్నా తరుణంలో వెంటనే విలీన ప్రక్రియ త్వరిగతిన చేపట్టి కార్మికులకు విలీనం వల్ల నష్టం జరగకుండా ప్రభుత్వం సానుకూల దృక్పతంతో వ్యవ హరించాలన్నారు. 

        

ఈ కార్యక్రమంలో రీజియన్ అధ్యక్షులు కందుల నర్సింహ, డిపో కార్యదర్శి బొడ స్వామి, రీజియన్ సహాయ కార్యదర్శి కె శ్యామ్ సుందర్,డిపో ఉపాధ్యక్షురాలు ch రేవతి,కె విజయ, జ్యోతిబసు,జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ బ‌హుజ‌న ఆత్మగౌర‌వానికి స‌ర్వాయి పాపన్న గౌడ్ ప్ర‌తీక సీఎం కేసీఆర్

తెలంగాణ బ‌హుజ‌న ఆత్మగౌర‌వానికి స‌ర్వాయి పాపన్న గౌడ్ ప్ర‌తీక సీఎం కేసీఆర్

తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీకగా నిలిచారని, సబ్బండ వర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. ఈ నెల 18వ తేదీన సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా వారి కృషిని, పోషించిన చారిత్రక పాత్రను కేసీఆర్ స్మరించుకున్నారు.

కుల, మతాల వివక్ష లేకుండా అన్ని వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలనే సమ సమాజ ప్రజాస్వామిక స్ఫూర్తితో ఆనాటి కాలంలోనే పాపన్నగౌడ్ పోరాడడం గొప్ప విషయమన్నారు. విశ్వకీర్తిని పొందిన పాపన్న గొప్పతనాన్ని స్మరించుకునేందుకు ప్రతి ఏటా వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వహిస్తున్నదని సీఎం తెలిపారు. తెలంగాణ స్వయం పాలనలో సబ్బండ వర్గాలకు రాజకీయ అధికారంలో భాగస్వామ్యం కల్పించామని, స్వరాష్ట్రంలో వేలాది మంది దళిత, బహుజన బిడ్డలను నాయకులుగా తీర్చిదిద్దడం ద్వారా పాపన్నగౌడ్ ఆశయాలను అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.

ఆర్య సమాజంలో గురువారం ధ్వజారోహణ, నూతన యజ్ఞశాల, చతుర్వేద పారాయణ మహా కృత కార్యక్రమాన్ని ప్రారంభించి మొక్కలు నాటిన ఎమ్మెల్యే కంచర్ల

శ్రావణమాస చతుర్వేద పారాయణ మహా కృతువు సందర్భంగాఆర్య సమాజంలో గురువారం ధ్వజారోహణ, నూతన యజ్ఞశాల, చతుర్వేద పారాయణ మహా కృత కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి లు ప్రారంభించి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్య సమాజం ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టడం , ఆర్య సమాజంలో నిత్యం యజ్ఞం యోగ కూచిపూడి నృత్యాలు కరాటే శిక్షణ ఇవ్వడం అభినందనీయమని అన్నారు. ఆర్య సమాజ్ అధ్యక్షుడు మాజీ మున్సిపల్ చైర్మన్ బోయినపల్లి కృష్ణారెడ్డి మాట్లాడుతూ యజ్ఞం చేయడం వల్ల వాతావరణ కాలుష్యం తొలగి సకాలంలో వర్షాలు కురుస్తాయని, వేద విజ్ఞాన ప్రచారం వల్ల మూడాచారాలు మూడ విశ్వాసాలు కుల భేదాలు మత భేదాలు నశించి, భారతీయ సంస్కృతి వృద్ధి చెందుతుందని అన్నారు. శ్రావణమాసంలో ఆర్య సమాజంలోని ప్రతి ఒక్కరికి ఉచితంగా యజ్ఞం చేసుకునే అవకాశం కల్పించమని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్ గౌడ్, కాంచన పల్లి రవీందర్రావు, కంది సూర్య నారాయణ, గోపాల్ రెడ్డి ,శంకర్, నరసింహ చారి, శంకరయ్య, సాయిబాబా, లక్ష్మీ నర్స్, సత్తయ్య, కోటయ్య, శశిరేఖ, వెంకటేశ్వర్లు, పండిత్ వేద మిత్ర తదితరులు పాల్గొన్నారు

సీఎం కేసీఆర్‌కు వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపిన ఆర్టీసీ సిబ్బంది

సీఎం కేసీఆర్‌కు వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపిన ఆర్టీసీ సిబ్బంది

గోదావరిఖని ఆర్టీసీ సిబ్బంది ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వినూత్న తరహాలో కృతజ్ఞతలు తెలిపారు.

సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని హర్షిస్తూ ఆర్టీసీ బస్‌ డిపోలో కేసీఆర్‌ (KCR) అనే అక్షరాలతో బస్సులను నిలిపి అభిమానాన్నిచాటుకున్నారు. స్థానిక జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, ఆర్టీసీ సిబ్బంది కలిసి సుమారు 19 బస్సులను కేసీఆర్‌ ఇంగ్లిష్‌ అక్షరాలతో కూడిన అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించారు.

కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు పడుతున్న ఇబ్బందులను చూసిన కేసీఆర్ ఎవరూ ఊహించని విధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, దానికి అసెంబ్లీ ఆమోదించడంతో వెనువెంటనే జరగడం కార్మికుల పట్ల సీఎంకు ఉన్న చిత్తశుద్ధిని మరోసారి నిరూపించిందని అన్నారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు.

రాబోయే ఎన్నికల్లో మరోసారి కేసీఆరే సీఎం అవుతారని వెల్లడించారు. ఈకార్యక్రమంలో టీబీజీకేఎస్ జనరల్ సెక్రటరీ మిర్యాల రాజి రెడ్డి, సంఘటిత,అసంఘటిత కార్మిక సంఘం నాయకులు పాతిపెల్లి ఎల్లన్న, డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

90కి పైగా స్థానాలు గెలుస్తాం... సీఎం కేసీఆర్

90కి పైగా గెలుస్తాం

అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో 90కి పైగా స్థానాలు గెలుస్తామని, ఖమ్మం జిల్లా పరిధిలో ఆరేడు సీట్లు గెలవడం ఖాయమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ధీమా వ్యక్తంచేశారు.

బుధవారం ఆయన ఖమ్మం జిల్లా నేతలతో ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. వారిని కార్యోన్ముఖులను చేశారు.

ఖమ్మంలో మెజార్టీ సీట్లు మనవే

జిల్లాలో 6-7 సీట్లలో విజయం

పెండింగ్‌ హామీలన్నీ పూర్తి చేశాం

ఏమేం పథకాలు, కార్యక్రమాలు చేశామో ప్రజలకు వివరించాలి

ఖమ్మం నేతలతో సీఎం కేసీఆర్‌

 రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో 90కి పైగా స్థానాలు గెలుస్తామని, ఖమ్మం జిల్లా పరిధిలో ఆరేడు సీట్లు గెలవడం ఖాయమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ధీమా వ్యక్తంచేశారు. బుధవారం ఆయన ఖమ్మం జిల్లా నేతలతో ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. వారిని కార్యోన్ముఖులను చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు ఒకే సీటు వచ్చిందని, అయినా రాష్ట్రవ్యాప్తంగా 83 సీట్లు సాధించామని గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 90కి పైగా సీట్లు వస్తాయని చెప్పారు. ఖమ్మం జిల్లా కాకుండానే రాష్ట్రవ్యాప్తంగా 85 సీట్ల వరకు వచ్చేలా ఉన్నాయని వివరించారు.

ఖమ్మంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో 6-7 సీట్లు ఖాయమని పేర్కొన్నారు. జిల్లా నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ప్రజలకు సంబంధించిన అన్ని అంశాలను నెరవేర్చామని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించామని, రుణమాఫీ పూర్తి చేశామని, రైతులకు పోడు పట్టాలు పంపిణీ చేశామని, ఇరిగేషన్‌ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు ఇస్తున్నామని, ఇలా ప్రజలకు సంబంధించిన పెండింగ్‌ అంశాలన్నీ పూర్తి చేశామని వివరించారు. ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడి లేకుండా చేశామని తెలిపారు. దీంతోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, ఆసరా పెన్షన్లు, దళితబంధు, బీసీబంధు వంటి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రజలకు ఏమేం చేశామో వివరించి చెప్పి ఓట్లు అడగాలని దిశానిర్దేశం చేశారు. ఖమ్మం జిల్లా నేతలంతా ఎన్నికలకు పకడ్బందీగా సిద్ధం కావాలని సూచించారు. కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, సండ్రవెంకట వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

రేషన్ కార్డు లేని వారికి గృహలక్ష్మి పథకం వర్తింపజేయాలి

రేషన్ కార్డు లేని వారికి గృహలక్ష్మి పథకం వర్తింపజేయాలి

కొత్తపల్లి శివకుమార్ సిపిఐ ఎంఎల్ ప్రజా పంథా జిల్లా ప్రధాన కార్యదర్శి

      రేషన్ కార్డు లేని అర్హులైన పేదలందరికీ గృహలక్ష్మి పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ ప్రజా పంథా ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి ఏవో కు  వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో గృహలక్ష్మి పథకం పేదల కోసం పెట్టడం దానికి మూడు లక్షల కేటాయించడం అభినందనీయం.

కానీ రేషన్ కార్డు ఉన్నవారికి ఈ పథకం వర్తిస్తుందని ఆంక్షలు పెట్టడం సరైన విధానం కాదని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేటి వరకు రేషన్ కార్డు కోసం కొన్ని లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారనీ కానీ ఏ ఒక్కరికి కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదనీ దీనివల్ల చాలామంది పేదలు నేటి వరకు రేషన్ కార్డు లేక అవస్థలు పడుతున్నారనీ తెలిపారు కాబట్టి అర్హులైన పేదలకు వారి ఇతర ఆధారాలను పరిగణలోకి తీసుకొని  అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డు లేకున్నా మూడు లక్షల రూపాయల గృహ లక్ష్మీ పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమం పి ఓ డబ్ల్యు జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పి డి ఎస్ యు జిల్లా కార్యదర్శి అఖిల్, ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి రామోజీ, పి ఓ డబ్ల్యు జిల్లా అధ్యక్షులు చంద్రకళ జిల్లా నాయకులు సూరం రేణుక జయమ్మ పార్టీ జిల్లా నాయకులు నాగన్న ఈరబాబు శ్రీదేవి అనూష లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

రైతుబీమా పథకానికి ఐదేండ్లు పూర్తి.. ..

రైతుబీమా పథకానికి ఐదేండ్లు పూర్తి.. 

ఇప్పటి వరకు రూ. 5,402 కోట్ల ఆర్థిక సాయం

రైతుల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. అన్నదాతల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు చేసి రైతుల గుండెల్లో కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారు.

రైతుబీమా పథకానికి నేటితో ఐదేండ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు.

రైతుల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. అన్నదాతల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు చేసి రైతుల గుండెల్లో కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారు. రైతుబీమా పథకానికి నేటితో ఐదేండ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు.

ఏ కారణంతో రైతు చనిపోయినా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2018, ఆగస్టు 15న ప్రారంభించిన రైతు బీమా పథకం నేటితో ఐదేండ్లు పూర్తి చేసుకున్నదని హరీశ్‌రావు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అర్హులైన రైతులందరి తరపున ప్రభుత్వమే ఎల్ఐసి (LIC)కి ప్రీమియం చెల్లిస్తూ, ఇంటి పెద్దను కోల్పోయిన ఆ కుటుంబానికి రూ. 5లక్షల ఆర్థిక సాయం అందిస్తూ తెలంగాణ సర్కార్ బాసటగా నిలుస్తున్నదని మంత్రి స్పష్టం చేశారు.

పథకం ప్రారంభించిన తొలి ఏడాది 2018-19లో 31.25 లక్షల మంది రైతులు తమ పేరు నమోదు చేసుకోగా, 2023-24 నాటికి ఆ సంఖ్య 41.04 లక్షలకు పెరిగిందన్నారు. 2018 రూ.602 కోట్లు ప్రీమియంగా చెల్లిస్తే, నేడు రూ. 1477 కోట్లు ప్రీమియంగా చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు రైతుల తరుపున ప్రభుత్వం రూ. 6861 కోట్లు ప్రీమియం రూపంలో చెల్లించగా, వివిధ కారణాలతో ప్రాణం కోల్పోయిన రైతు కుటుంబాలకు రూ. 5,402 కోట్ల ఆర్థిక సాయం అందించిందని హరీశ్‌రావు పేర్కొన్నారు.

గుంట భూమి ఉన్నా చాలు, రైతుగా గుర్తించి, ఆ రైతన్న మరణిస్తే ఆ కుటుంబానికి రూ. 5 లక్షలు అందించే అద్భుతమైన రైతు బీమా పథకం ప్రపంచంలో మరెక్కడా లేదని హరీశ్‌రావు స్పష్టం చేశారు. రైతుల గురించే కాదు, రైతుల కుటుంబాల గురించి కూడా ఆలోచించే మనసున్న ముఖ్యమంత్రి, రైతు బాంధవుడు కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు హరీశ్‌రావు.

బీసీ టైగర్ ఎంపీ ఆర్ కృష్ణయ్య గారి వెంటనే విడుదల చేయాలి:బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ

బీసీ టైగర్ ఎంపీ ఆర్ కృష్ణయ్య గారి వెంటనే విడుదల చేయాల చేయాలి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ డిమాండ్

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య తెలంగాణలో బీసీ సమస్యలపై ఆందోళన చేస్తున్న సందర్భంగా వారిని అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించడ అప్రాజస్వామయం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వెంటనే వారిని విడుదల చేయాలని లేని పక్షంలో తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

కృష్ణయ్య గారితో పాటుత ధర్నా చేస్తున్నటువంటి జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ నీలం వెంకటేష్ రాజ్ కుమార్ భూపేష్ సాగర్ జిల్లేపల్లి అంజి వేములపల్లి రామకృష్ణ అనంతయ్య ఉద్యమ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ప‌దేండ్ల కింద‌టి తెలంగాణను త‌లుచుకుంటే.. ఇప్ప‌టికీ దు:ఖం తన్నుకొస్తది: సీఎం కేసీఆర్

ప‌దేండ్ల కింద‌టి తెలంగాణను త‌లుచుకుంటే.. ఇప్ప‌టికీ దు:ఖం తన్నుకొస్తది సీఎం కేసీఆర్

దేశ స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో అహింసాయుతంగా, శాంతియుత పంథాలో మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. గోల్కొండ కోట‌పై త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగుర‌వేసిన అనంత‌రం రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్ర‌సంగించారు.

సమైక్య పాలనలో తెలంగాణలోని అన్నిరంగాలూ విధ్వంసమైపోయాయని కేసీఆర్ పేర్కొన్నారు. నాటి తెలంగాణ నాయకత్వం సమైక్య నాయకులకు కొమ్ముకాస్తూ చేవచచ్చి చేష్టలుడిగి ప్రవర్తించడం వల్లనే తెలంగాణ తీవ్రమైన వివక్షకు, దోపిడీకి గురైంది. తెలంగాణ ప్రజలందరూ ఒక్కతాటిపై నిలిచి చేసిన సుదీర్ఘ ప్రజాఉద్యమం ఫలితంగా స్వరాష్ట్ర స్వప్నం సాకారమైందని తెలిపారు.

తెలంగాణ పున‌ర్నిర్మాణం ఒక పవిత్ర యజ్ఞం

పది సంవత్సరాల కిందటి తెలంగాణ సంక్షుభిత జీవనచిత్రాన్ని తలుచుకుంటే ఇప్పటికీ గుండెలు పిండేసినట్లయి దు:ఖం తన్నుకొస్తది అని కేసీఆర్ అన్నారు. ఎటుచూసినా పడావుపడ్డ పొలాలు, పూడుకపోయి తుమ్మలు మొలిచిన చెరువులు, ఎండిపోయి దుబ్బతేలిన వాగులు, అడుగంటిన భూగర్భ జలాలు, ఎండిపోయిన బావులు, పాతాళం లోతుకు పోయినా సుక్క నీరు కానరాని బోర్లు, ఎడతెగని కరెంటు కోతలు, అర్ధరాత్రి మోటరు పెట్టబోయి కరంటు షాక్‌కో, పాము కాటుకో బలైపోయిన రైతన్నల జీవితాలు, అప్పుల ఊబిలో చిక్కి ఆశలు సైతం అడుగంటి ఆఖరుకు ఆత్మహత్యలే శరణ్యమైన అన్నదాతలు, బతుకుమీద ఆశ చచ్చి ఉరి పెట్టుకుంటున్న చేనేత కార్మికులు, యువకులంతా వలసెల్లిపోతే ముసలివాళ్లే మిగిలిన పల్లెలు, ఇండ్లకు తాళాలు పడి గడ్డి మొలుస్తున్న గోడలు, మొరం తేలిన వాకిళ్లు, ఎటుచూసినా ఆకలిచావులు, హాహాకారాలు, గంజి కేంద్రాలతో ఆదుకోవాల్సిన గడ్డు పరిస్థితులు ఉండే అని కేసీఆర్ పేర్కొన్నారు. ఇటువంటి అగమ్య గోచర పరిస్థితుల నడుమ అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ పునర్నిర్మాణాన్ని ఒక పవిత్రయజ్ఞంగా నిర్వహించింద‌ని సీఎం తెలిపారు. నిజాయితీతో, నిబద్ధతతో, నిరంతర మేధోమధనంతో అవిశ్రాంతంగా శ్రమించింది. విధ్వంసమైపోయిన తెలంగాణను విజయవంతంగా వికాసపథం వైపు నడిపించిందని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

తెలంగాణ ఆచరిస్తుంది – దేశం అనుసరిస్తుంది

ప్రజల అవసరాలు, ఆకాంక్షలు ఎరిగిన ప్రభుత్వం కనుక, దానికి అనుగుణంగా అన్నిరంగాలనూ ప్రక్షాళన చేసిందని కేసీఆర్ తెలిపారు. అనతి కాలంలోనే తిరుగులేని ఫలితాలను సాధించింది. అనేక రంగాలలో రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టింది. దార్శనిక దృక్పథంతో, పారదర్శక విధానాలతో, అభివృద్ధిలో, సంక్షేమంలో కొత్త పుంతలు తొక్కింది. “తెలంగాణ ఆచరిస్తుంది – దేశం అనుసరిస్తుంది” అనే దశకు చేరుకొని దశాబ్ది ముంగిట సగర్వంగా నిలిచింది అని కేసీఆర్ పేర్కొన్నారు.

పంట కాల్వలతో, పచ్చని చేన్లతో కళకళలాడుతున్న తెలంగాణ

నేడు తెలంగాణ జీవన దృశ్యాన్ని చూస్తే.. నిరంతర విద్యుత్ ప్రసారంతో వెలుగులు వెదజల్లుతున్నది అని కేసీఆర్ తెలిపారు. పంట కాల్వలతో, పచ్చని చేన్లతో కళకళలాడుతున్నది. మండే ఎండలలో సైతం చెరువులు మత్తడి దుంకుతున్నయి. వాగులు, వంకలు, వాటిపై నిర్మించిన చెక్ డ్యాములు నీటి గలగలలతో తొణికిసలాడుతున్నాయి. తరలివస్తున్న కాళేశ్వర జలధారలతో గోదావరి సతత జీవధారయై తెలంగాణ భూములను తడుపుతున్నది. ఒకనాడు చుక్క నీటికోసం అలమటించిన తెలంగాణ ఇపుడు ఇరవైకి పైగా రిజర్వాయర్లతో పూర్ణకలశం వలె తొణికిసలాడుతున్నది. మూడు కోట్ల టన్నుల వరిధాన్యం దిగుబడితో నేడు తెలంగాణ దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా విలసిల్లుతున్నది. సంక్షేమంలో, అభివృద్ధిలో సువర్ణాధ్యాయాన్ని లిఖిస్తున్నది. దశాబ్దకాలంలో తెలంగాణ సాధించిన అపూర్వ ప్రగతిని చూసి యావద్దేశం సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నది. ఈ అద్భుతమైన పురోగమనం ఇదే రీతిన కొనసాగే విధంగా తెలంగాణ ప్రజలు తమ సంపూర్ణమైన ఆశీర్వాద బలాన్ని ఇదే రీతిన అందించాలని హృదయ పూర్వకంగా మనవి చేస్తున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు.

త‌లస‌రి ఆదాయం, త‌ల‌స‌రి విద్యుత్ వినియోగంలో నంబర్ 1

ప్రపంచంలో ఎక్కడైనా ఒక దేశం గానీ, ఒక రాష్ట్రం గానీ సాధించిన ప్రగతికి ప్రమాణంగా చూసే ప్రబల సూచికలు.. త‌లస‌రి ఆదాయం, త‌ల‌స‌రి విద్యుత్ వినియోగం అని కేసీఆర్ చెప్పారు. ఈ రెండింటిలోనూ తెలంగాణ దేశంలో నంబర్ 1 స్థానంలో నిలిచింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పటిష్టమైన క్రమశిక్షణతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసింది. సంపద పెంచింది. ప్రజలకు పంచింది. దేశంలో స్థిరపడిన పెద్ద రాష్ట్రాలను అధిగమించి నూతన రాష్ట్రం తెలంగాణ రూ. 3 లక్షల 12 వేల 398 తలసరి ఆదాయంతో అగ్రస్థానంలో నిలిచింది. అదేవిధంగా తలసరి విద్యుత్తు వినియోగంలో జాతీయ సగటు అయిన 1,255 యూనిట్లను అధిగమించింది. దేశ సగటు కంటే 70 శాతం అత్యధికంగా 2,126 యూనిట్ల సగటు వినియోగంతో తలసరి విద్యుత్తు వినియోగంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వ‌న్‌గా నిలిచింది అని కేసీఆర్ తెలిపారు.

వెలుగు జిలుగుల తెలంగాణ

విద్యుత్తు రంగంలో తెలంగాణది స్ఫూర్తిదాయకమైన విజయగాథ అని కేసీఆర్ పేర్కొన్నారు. అనతికాలంలోనే అన్నిరంగాలకూ 24 గంటలపాటు, వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. విద్యుత్తు రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన అభివృద్ధి అన్నిరంగాలనూ ప్రభావితం చేసింది. రాష్ట్రం ప్రగతిపథంలో పయనించేందుకు నిరంతర విద్యుత్తు చోదకశక్తిగా పనిచేసింది అని కేసీఆర్ తెలిపారు.