/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz నల్లగొండ కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ ఉద్యోగుల మహాధర్నా Mane Praveen
నల్లగొండ కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ ఉద్యోగుల మహాధర్నా
నల్లగొండ: ఐసిడిఎస్ బడ్జెట్ పెంచాలని, అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు సలీం మాట్లాడుతూ.. అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం రూ 26,000 చెల్లించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీ ఉద్యోగులకు గ్రాట్యుటి చెల్లించాలని అన్నారు. కార్యక్రమంలో పలువురు అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
ఎన్జీ కళాశాల జాబ్ డ్రైవ్ ఇంటర్వ్యూ లో 77 మంది విద్యార్థులు ఎంపిక
నల్గొండ: ఈరోజు ఎన్జీ కళాశాలలో రసాయన శాస్త్రం విభాగం ఆధ్వర్యంలో ఎంఎస్ఎన్ కెమికల్ ల్యాబ్ సహకారంతో జాబ్ డ్రైవ్ నిర్వహించినట్లు ప్రిన్సిపల్ ఘన శ్యామ్ తెలిపారు.       రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ అంతటి శ్రీనివాసులు మాట్లాడుతూ.. జాబ్ డ్రైవ్ ఇంటర్వ్యూకి 136 మంది హాజరు కాగా, 77 మంది  విద్యార్థులు ఎంపికయ్యారని, ఎంపికైన విద్యార్థులకు ఉచిత భోజన వసతి మరియు ఉన్నత విద్యలో కూడా అవకాశం ఇస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ వెంపటి శ్రీనివాసులు, నాగిరెడ్డి, చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు,ముత్తయ్య, యాదగిరి, దుర్గాప్రసాద్ తదితరులు అధ్యాపకులు, ఎమ్ ఎస్ ఎన్ ల్యాబ్ మేనేజర్ బ్రహ్మానంద రెడ్డి, మోహన్ , ప్రశాంత్ పాల్గొన్నారు.
'హోటల్ కుటీరం' ను ప్రారంభించిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్లగొండ జిల్లా, చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులో హైదరాబాద్ - విజయవాడ హైవే పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన "హోటల్ కుటిరం" ను తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య లు  ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హోటల్ యాజమాన్యం నాణ్యమైన సేవలను అందిస్తూ మంచి పేరు పొందాలని అన్నారు.
జులై 10న నల్లగొండ కలెక్టరేట్ ముందు ధర్నా
నల్లగొండ జిల్లా: గీత కార్మికులు హక్కుల కోసం పోరాటాలకు సిద్ధం కావాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జెర్రీపోతుల ధనుంజయ గౌడ్ అన్నారు. ఆదివారం మర్రిగూడ మండల పరిధిలోని లెంకలపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో మంత్రి కేటీఆర్ గీత కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం గీత కార్మికుల ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే జులై 10న నల్లగొండ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. కల్లుగీత కార్మికుల సొసైటీలో సభ్యులందరికీ మోటార్ బైకులు, సేఫ్టీ మోకులు అందించాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కుల వృత్తిదారులకు ప్రభుత్వం ఇస్తామన్నా లక్ష రూపాయల ఆర్థిక సహాయంచేయాలని, సొసైటీలకు భూమి, కల్లుకు మార్కెట్, నీరా, తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమలకు ప్రభుత్వం 5వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించాలని అన్నారు. 560 జీవో ప్రకారం ప్రతి సొసైటీకి 5 ఎకరాల భూమి ఇవ్వాలని, గీత కార్మికులకు మెడికల్ బోర్డు నిబంధన తొలగించాలని వారు అన్నారు. జులై 10న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాకు  వేలాది మంది గీత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు అయితగోని పాపయ్య, సొసైటీ ఉపాధ్యక్షులు బోడ అంజయ్య, కార్యదర్శి అయితగోని మల్లయ్య, కారింగి నరసింహ గౌడ్, బురుకల లక్ష్మయ్య గౌడ్, అయితగోని అంజయ్య గౌడ్, అయితగోని వెంకటయ్య గౌడ్, తిరుపతయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
విజయసంకల్ప సభకు బయలుదేరిన బిజెపి నాయకురాలు కన్మంత రెడ్డి శ్రీదేవి
చలో వరంగల్ విజయసంకల్ప సభకు 50 మంది కార్యకర్తలతో నల్లగొండ నియోజకవర్గం నుండి బిజెపి రాష్ట్ర నాయకురాలు కన్మంత రెడ్డి శ్రీదేవి రమేష్ రెడ్డి బయలుదేరారు. వారి వెంట బిజెపి  నాయకులు యాదగిరి చారి, గుండా నవీన్ రెడ్డి, మంగళపల్లి కిషన్, బాకీ నరసింహ, దాసరి ఈశ్వర్, బిఎస్వి ప్రసాద్, భిక్షమాచారి అదిమల్ల దేవేందర్, వంగూరి రవి, ముత్యం శివశంకర్, నాగరాజు, లింగం ప్రసాద్, బ్రహ్మచారి, నకిరేకంటి యాదగిరి, జిల్లా శేఖర్ కట్టమోహన్, కట్ట హరి, చనగోని యాదగిరి గారు. తదితరులు ఉన్నారు.
అడ్డంగా రోడ్డును త్రవ్వారు.. గుంతను పూడ్చడం మరిచారు...
నల్లగొండ జిల్లా, చండూరు మండలం దోనిపాముల గ్రామపంచాయతీ శివారులో గల జోగుగూడెం సమీపాన, ఓ మొబైల్ కంపెనీ  టవర్ పనుల నిమిత్తం ప్రధాన రహదాన్ని  అడ్డంగా తవ్వి తమ పనిని కానించుకున్నారు. తిరిగి గుంతను పూడ్చడం మరిచారు. రోడ్డుకు అడ్డంగా గుంత ఉండడంవల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు అంటున్నారు. ఇకనైనా గుంతను పూడ్చి రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని వాహనదారులు కోరుచున్నారు.
TS PECET ఫలితాల లో ఎన్జీ కళాశాల విద్యార్థుల విజయకేతనం
నల్లగొండ: ఇటీవల విడుదల చేసిన TS PECET ఫలితాల లో స్థానిక నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో శ్రీరాములు 17 వ ర్యాంక్ , లోకేష్ 22 వ ర్యాంక్, యూసుఫ్ 54 వ ర్యాంక్ , అశోక్ 62, శివ శంకర్ 122, పవన్ 415 ప్రశాంత్,568, ర్యాంక్ లు సాధించడం జరిగింది. వీరిని కళాశాల ప్రిన్సిపాల్ డా.ఘన్ శ్యామ్, కళాశాల ఫీజికల్ డైరెక్టర్ కడారి మల్లేష్ , లైబ్రరీయన్ డా. దుర్గా ప్రసాద్, డాక్టర్ రాజారాం లు శుక్రవారం నాడు అభినందిస్తూ అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఘనంగా ఎమ్మార్పీఎస్ 29వ ఆవిర్భావ దినోత్సవం
నల్లగొండ: కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడే దళిత గిరిజన బహుజనుల జాతులు, తమ పేరు చివరన కులం పేరు పెట్టుకోని ఆత్మగౌరవాన్ని నిలుపుకునేలా చేసింది ఎమ్మార్పీఎస్ ఉద్యమమేనని ఎంఎస్పి నియోజకవర్గ ఇన్చార్జ్ బకరం శ్రీనివాస్ మాదిగ, మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేపాక వెంకన్న మాదిగ, జిల్లా అధ్యక్షులు లంకపల్లి నగేష్ మాదిగ, ఎంఎస్పి మండల ఇన్చార్జి బొజ్జ దేవయ్య మాదిగ లు అన్నారు. ఆ సంఘం 29వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నల్లగొండ పట్టణంలోని స్థానిక గొల్లగూడలో మరియు 14వ వార్డు మర్రిగూడలో ఆ సంఘం జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎస్సీల రిజర్వేషన్ల ఏ బి సి డి వర్గీకరణ కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో ఏర్పడిన ఎమ్మార్పీఎస్ ఉద్యమం 29 సంవత్సరాలు పూర్తి  చేసుకుందన్నారు. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని విస్తరింపజేసి వర్గీకరణతో పాటు అనేక సామాజిక ఉద్యమాలను నిర్మించారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం మాదిగలను ఓటు బ్యాంక్ గానే చూస్తున్నారే తప్ప మా చిరకాల కోరిక అయిన ఎస్సీల రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు.
ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ పథకాలైన ఆరోగ్యశ్రీ, వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు పెన్షన్ ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ చట్టాన్ని పరిరక్షించుకోవడం కోసం అనేక పోరాటాలు చేసి విజయాలు సాదించారని గుర్తు చేశారు. మందకృష్ణ మాదిగ నాయకత్వం ద్వారానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మెడలు వంచైనా ఎస్సీల ఏబిసిడి వర్గీకరణను సాధించుకుంటామని అన్నారు. ఇప్పటికైనా బిజెపి పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి ఎస్సీల ఏబిసిడి వర్గీకరణను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు.  కార్యక్రమంలో కురుపాటి కమలమ్మ, పెరిక శ్రీనివాసులు, కొత్త వెంకన్న, కత్తుల మారయ్య, దుబ్బ సత్యనారాయణ, మాసారం వెంకన్న, బొజ్జ నాగరాజు, తోరకొప్పుల రాజు, బొజ్జ శంకరయ్య, బీపంగి యాదయ్య, బీపంగి చంటి, మల్లెపాక రాంబాబు, బొజ్జ నాగయ్య, బొజ్జ లింగస్వామి, కొప్పోలు వెంకన్న, బొజ్జ పాండు, బీపంగి అర్జున్, చిలుముల ప్రభాకర్, బాగిడి స్వప్న, చిలుముల జలంధర్, అశోక్, కత్తుల యాదగిరి, పరమేష్, తోలకొప్పుల గిరి, పోలే జయకుమార్,  పేర్ల లింగస్వామి, నారపాక శేషగిరి, కత్తుల ప్రసాద్, బొజ్జ రవి, బొజ్జ ఎల్లేష్, బొజ్జ నరేందర్, బొజ్జ శ్రీను మరియు ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
పురాతన శివాలయం పునఃనిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కూసుకుంట్ల
మునుగోడు నియోజకవర్గంలోని నారాయణపురం మండలం రాచకొండ లో గల  అతి పురాతన శివాలయం పునఃనిర్మాణ పనులకు నియోజకవర్గ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేసి, ఆలయ నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం వారు నియోజకవర్గంలోని కొయ్యలగూడెం నుండి దేవాలమ్మనగారం వరకు గల బిటి రోడ్డు పునరుద్దరణ పనులను పర్యవేక్షించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: ఏర్పుల యాదయ్య
మర్రిగూడ: మండలంలో ఎంపీడీవో ఆఫీస్ ముందు తెలంగాణ గ్రామ పంచాయతి వర్కర్స్ యూనియన్ నిరవధిక సమ్మె రెండో రోజుకు చేరింది. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా చూస్తుందని, గ్రామాల్లో పారిశుద్ధం చేసే దాంట్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న కార్మికులకు కనీస వేతనము ఇవ్వాలని, సిబ్బంది అందరిని చేయాలని, సిబ్బందికి పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా గ్రాడ్యుయేట్ ఇవ్వాలని, ప్రమాదం జరిగి మరణించిన కార్మికుల కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని, డ్రైవర్లు కారోబార్ బిల్ కలెక్టర్కు రూ. 19,500 చెల్లించాలని, 11వ పిఆర్సి లో నిర్ణయించిన మినిమం బేసిక్ రూ .19,000 వేతనంగా చెల్లించాలి, ఆలోపు జీవో నెంబర్ 60 ప్రకారం స్వీపర్లకు 15600 ఇవ్వాలనే సమస్యల మీద మండల కేంద్రంలో సమ్మె చేయడం జరుగుతుంది. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే గ్రామాల్లో చెత్త చెదారం పేరుకుపోయే ప్రమాదం లో పడుతుందని, దాన్ని ఆలోచించి గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్ సీనియర్ మండల అధ్యక్షుడు వట్టిపల్లి హనుమంతు, ఊరి పక్క లింగయ్య పోలేపల్లి రాములు, యాచారం రమేష్, పెరమండ్ల మంజుల, అమ్రాబాద్ సునీత, ఏరుకొండ లచ్చయ్య, వెంకటేష్, ఆవుల ముత్తయ్య, ఒంపు ముత్తమ్మ, ఏపూరి ముత్తయ్య, మైలారం నరసింహ, గుండెపురి నరసింహ, వంపు వెంకటయ్య, ఎడ్ల నరసింహ కటికల భారతమ్మ, ఊరికి పక్క నరసింహ, తదితరులు పాల్గొన్నారు