మర్రిగూడెం:ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీని ఒకేసారి మాఫీ చేయాలి
నల్లగొండ జిల్లా: ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీని ఒకేసారి మాఫీ చేయాలని, వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరించాలని, మర్రిగూడ మండల కేంద్రంలో మండల తాహశీల్దార్ వెంకటేశ్వర్లు కు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మర్రిగూడ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. 2023 ఖరీఫ్ సీజన్ మొదలవుతుందని, రుణమాఫీ చేసి వెంటనే రైతులకు రుణాలు ఇవ్వాలని అన్నారు. మర్రిగూడ మండల రైతు సంఘం అధ్యక్షులు కొట్టం యాదయ్య, కార్యదర్శి ఉప్పునూతల వెంకటయ్య, రైతు మేకల రాంరెడ్డి పాల్గొన్నారు.
Jun 18 2023, 17:44