/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz కోరమాండల్ ప్రమాదం అత్యంత విషాదకరం: బీఎస్పీ నాయకులు పెండెం ధనుంజయ్ Mane Praveen
కోరమాండల్ ప్రమాదం అత్యంత విషాదకరం: బీఎస్పీ నాయకులు పెండెం ధనుంజయ్
కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైల్ ప్రమాదం అత్యంత విషాదకరమని నల్లగొండ జిల్లా, మునుగోడు  నియోజకవర్గ బీఎస్పీ నాయకులు పెండెం ధనుంజయ్ నేత అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. సంబంధిత అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని, ప్రధానమంత్రి ప్రతి ఇంటికి స్వయంగా వెళ్లి మృతుల కుటుంబాలని పరామర్శించాలని ఒక ప్రకటన కోరారు. మృతుల కుటుంబాలకు 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని, అదేవిధంగా రైల్వే శాఖలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలని, క్షతగాత్రులకు రూ. 30 లక్షలు అందజేయాలని ధనంజయ్ డిమాండ్ చేశారు.
లెంకలపల్లి: ఘనంగా రైతు దినోత్సవం

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా, ఈరోజు నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామంలో, రైతు దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎడ్ల బండి, ట్రాక్టర్ లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రైతు వేదిక వద్ద సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వం  రైతులకు అందిస్తున్న  రైతు సంక్షేమ పథకాల గురించి అధికారులు వివరించారు, మరియు వాటిని సద్వినియోగపరచుకోవాలని అన్నారు. తదుపరి సామూహిక భోజనాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాక నగేష్ యాదవ్, డిప్యూటీ తహశీల్దార్ తారకరామన్, ఎంపీఓ ఝాన్సీ, ఏఈఓ సుజాత,  గ్రామపంచాయతీ సెక్రెటరీ ఉమాదేవి, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
కంచనపల్లిలో ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం
నల్లగొండ: రూరల్ గ్రామం కంచనపల్లిలో శ్రీశ్రీశ్రీ శంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో 3 రోజులు పాటు నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట పూజలు ఘనంగా నిర్వహించి, నేడు ధ్వజస్తంభాన్ని ప్రతిష్టింపజేశారు. గ్రామ సర్పంచ్ మన్నే కృష్ణార్జున్ రెడ్డి, ఆలయ చైర్మన్ మర్రి చిన్న మల్లయ్య  దంపతుల ఆధ్వర్యంలో, ఆలయ ప్రధాన అర్చకులు చెన్నోజు నాగేంద్ర శర్మ పురోహిత బృందం చే ఘనంగా ధ్వజస్తంభ ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. ధ్వజస్తంభ దాత వందనపు ప్రకాష్-మనేమ్మ, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ నాయకులు
నల్లగొండ జిల్లా కొండామల్లేపల్లి మండలం లో ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ మండల  ఉపాధ్యక్షుడు ఆడెపు సహదేవ్  వివాహానికి, ఆదివారం ఆలిండియా సమతా సైనిక్ దళ్ నల్లగొండ జిల్లా మరియు దేవరకొండ నియోజకవర్గ నాయకులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎస్డి జిల్లా అధ్యక్షులు మద్దిమడుగు బిక్షపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి బరుపటి వెంకటయ్య, నియోజకవర్గ అధ్యక్షులు చిట్యాల గోపాల్, నియోజకవర్గ కోశాధికారి అనిల్ కుమార్, చింతకుంట్ల సర్పంచ్ పంది శీను, ఉప సర్పంచ్ ఏకుల సురేష్, హెల్త్ సూపర్వైజర్ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
NLG: నూతన వధూవరులను ఆశీర్వదించిన బిజెపి నాయకులు
నల్గొండ: పట్టణంలోని బండారు గార్డెన్స్ లో మంగళవారం జరిగిన బీజేవైఎం జిల్లా కార్యదర్శి దుబ్బాక సాయి కిరణ్ -పావని ల వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి   బిజెపి జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర నాయకురాలు కన్మంతరెడ్డి శ్రీదేవి రమేష్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్యామ్ సుందర్, బిజెపి నాయకులు ప్రముఖ న్యాయవాది నూకల నరసింహారెడ్డి, సూర్యపేట బిజెపి అధ్యక్షుడు బొప్ప బాగ్యరెడ్డి, జిల్లా కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు సిద్దు, పాలకూర రవి, గడ్డం మహేష్, సూర్య తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల విద్యార్థిని ఐశ్వర్య కు ఘనంగా సన్మానం
ఇండియా తరఫున అంతర్జాతీయ స్థాయిలో కెప్టెన్ గా వ్యవహరించిన నల్గొండ లోని నాగార్జున కళాశాల విద్యార్థిని ఐశ్వర్యను.. ఎన్జీ కళాశాల వాకర్స్ అసోసియేషన్, అల్యూమిని వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు.
అంకెపాక శ్రీనివాస్ ఆధ్వర్యంలో 'తెలంగాణ భరోసా' సభకు బయలుదేరిన నాయకులు
నల్గొండ: బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి బెహన్ జీ కుమారి మాయావతి, నేడు సరూర్నగర్ లో నిర్వహిస్తున్నటువంటి "తెలంగాణ భరోసా" సభకు ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్న సందర్భంగా.. నల్లగొండ పట్టణం నుండి నియోజకవర్గ బీఎస్పీ ఇన్చార్జి అంకెపాక శ్రీనివాస్ ఆధ్వర్యంలో తిప్పర్తి, కనగల్, నల్లగొండ కార్యకర్తలు భారీ బహిరంగ సభకు బయలుదేరారు.బీఎస్పీ జిల్లా ఇంఛార్జీ ఆదిమల్ల గోవర్ధన్, నియోజకవర్గ అధ్యక్షులు దున్న లింగస్వామి, ఎస్ఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనుముల సురేష్, తదితరులు ఉన్నారు.
మర్రిగూడెం: పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మెకు సంఘీభావం తెలిపిన మండల సర్పంచ్ లు
నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలో జూనియర్ పంచాయతి కార్యదర్శులు చేస్తున్న నిరవధిక సమ్మె నేటికి 6వ రోజుకు చేరుకుంది. వీరి సమ్మెకు మండల సర్పంచ్ లు అందరూ దీక్షాస్థలికి వచ్చి సంఘీభావం తెలిపారు. ఆ తరువాత అందరూ కలిసి స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి రెగ్యులర్ చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భము గా సర్పంచ్ లు మాట్లాడుతూ.. పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్ ల కృషి వల్లనే ఈరోజు తెలంగాణ కు జాతీయ అవార్డులు వచ్చినాయని JPS/OPS వెంటనే రెగ్యులర్ చేయాలని, 4 సంవత్సరాల ప్రోబేషన్ కాలాన్ని కూడా సర్వీసు గా పరిగణించాలని, వీరి డిమాండ్ల పరిష్కారం వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక ముందు కూడా తమ సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో లెంకలపల్లి సర్పంచ్ మరియు సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పాక నగేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
రేపు కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే వివోఏ ల ధర్నాను విజయవంతం చేయాలి
మర్రిగూడ: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఐకెపి వివోఏ లు చేస్తున్న న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సానుకూల నిర్ణయం చేపట్టాలని, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మర్రిగూడ లో మాట్లాడుతూ.. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించే ధర్నాలో మండలం నుండి ప్రతి ఒక్క వివోఏ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
నాగార్జున ప్రభుత్వం కళాశాలలో జాతీయ వెబినార్
నల్గొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాల గ్రంథాలయ శాస్త్ర విభాగం మరియు బలానీ ఇన్ఫోటెక్, నోయిడా సౌజన్యంతో జాతీయ వేబినార్ “ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ మరియు పరిశోధన నైపుణ్యాలపై” గూగుల్ మీట్ ద్వారా  నిర్వహించామని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఘన శ్యామ్  తెలిపారు. ఈ నేషనల్ వేబీనార్ లో ముఖ్య వక్తగా డాక్టర్.నికిత వంజరి, అని ఇన్ఫోటెక్ సైన్స్ కమ్యూనికేటర్ మాట్లాడుతూ ..శాస్త్రీయ పరిశోధన వ్యాసాలు రాయడం ఉన్నత విద్యలో ఎంతో అవసరమని, అంతర్జాలం ద్వారా అధికారిక పరిశోధన సమాచారాన్ని వెతికే విధానం, రీసెర్చ్ రైటింగ్ ఆన్లైన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ , అకాడమిక్ రైటింగ్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020, ఉన్నత విద్యలో పరిశోధన వ్యాసాలు రాయడం సంబంధించిన అంశాలను తెలిపారు. వేబినా ర్ కన్వీనర్ డాక్టర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ..  ఈ సదస్సులో దేశంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల నుంచి  అధ్యాపకులు, గ్రంథ పాలకులు, పరిశోధకులు, డిగ్రీ మరియు పీజీ చదువుతున్న విద్యార్థులు 600 మందికి పైగా నమోదు చేసుకొని వెబ్ నార్ కి హాజరైనారు అని వేబీనార్ కన్వీనర్ డాక్టర్. దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్  సయ్యద్ మునీర్, అంతటి శ్రీనివాసులు, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రసన్న కుమార్, అకాడమిక్ కోఆర్డినేటర్ వెంపటి శ్రీనివాసులు, పరీక్షల నియంత్రణ అధికారి నాగరాజు, అధ్యాపకులు యాదగిరి, దీపిక, యాదగిరి రెడ్డి, నాగుల వేణు, భాగ్యలక్ష్మి, కృష్ణ కౌండిన్య, లవెందర్ రెడ్డి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సుబ్బారావు, శ్రీనివాస్, చంద్రశేఖర్, మల్లేష్ , శివరాణి, విష్ణువర్ధన్, స్రవంతి, మణెమ్మ వేబినార్ కో-కన్వీనర్  గ్రంథాలయ సిబ్బంది వెంకట్ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.