/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz కొడుకును చూసి గర్వపడుతున్నా : మంత్రి హరీష్ రావు Yadagiri Goud
కొడుకును చూసి గర్వపడుతున్నా : మంత్రి హరీష్ రావు

ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల్లో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయాల్లో మాత్రమే కాక.. సోషల్‌ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటారు. రాజకీయాలు మాత్రమే కాక.. అన్ని విషయాల గురించి రియాక్ట్‌ అవుతారు.

ఇక సోషల్‌ మీడియాలో ఎంత యాక్టీవ్‌గా ఉన్నప్పటికి.. తన పర్సనల్‌ విషయాల గురించి మాత్రం షేర్‌ చేయరు. ఆయన కుటుంబం గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ఈ క్రమంలో తాజాగా హరీష్‌ రావు.. ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. తన కుమారుడికి సంబంధించిన ఫొటోలు షేర్‌ చేసిన హరీష్‌ రావు.. పుత్రోత్సాహంతో పొంగిపోతున్నట్లు వెల్లడించారు.

హరీష్‌ రావు కుమారుడు అర్చిష్మాన్ అమెరికాలోని కొలరాడో యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేసి.. పట్టా అందుకున్నాడు. ఈ మేరకు యూనివర్సిటీ స్నాతకోత్సవం అమెరికాలోని కొలరాడో కౌంటీ బౌల్డర్‌లో జరగింది.

హరీష్‌ రావు ఈ వేడుకలో పాల్గొనడం కోసం అమెరికా వెళ్లాడు. ఇక ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో అర్చిష్మాన్‌ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టాతో పాటు గ్లోబల్ ఎంగేజ్‌మెంట్ అవార్డు కూడా అందుకున్నాడు. ఇక దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు హరీష్ రావు.

ఈవేడుకకు సంబంధించిన ఫొటోలు షేర్‌ చేస్తూ.. ‘‘మా అబ్బాయి ఆర్చిష్మాన్ సాధించిన ఈ అద్భుతమైన ఘనత పట్ల గర్వించకుండా ఎలా ఉంటాను. ఇది నీలోని పట్టుదలకు, మార్పు తీసుకురావాలన్న నీ ఆకాంక్షకు నిదర్శనం. తనలోని ఈ నైపుణ్యం ద్వారా ప్రపంచంపై సానుకూల ప్రభావాన్ని చూపడానికి అర్చిష్మాన్ సిద్ధంగా ఉన్నాడు. అచ్చూ.. ఈ ఘనమైన మైలురాయిని అందుకున్న సందర్భంగా నీకు అభినందనలు. నిన్ను చూసి గర్వంగా ఫీలవుతున్నాను’’ అంటూ తన కొడుకు గురించి గర్వంగా చెప్పుకొచ్చారు హరీశ్‌ రావు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరలవుతోంది.

అడవులే కేంద్రంగా ఉగ్రవాద శిక్షణ

ఆయుధాలుసమీకరించింది మహ్మద్‌ సలీం

అక్కడి బృందానికీ ఇతడితోనే శిక్షణ

ఈ ఐదుగురి నుంచి విదేశాలకు ఫోన్‌ కాల్స్‌

నగరంతో పాటు భోపాల్‌లో పట్టుబడిన 16 మంది ఉగ్రవాదులు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాల్లోనే శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారు. నగర శివార్లలో ఉన్న వికారాబాద్‌లోని అనంతగిరి అడవుల మాదిరిగానే భోపాల్‌ సరిహద్దుల్లోని రైసెన్‌ అడవిని ఎంచుకున్నట్లు ఏటీఎస్‌ అధికారులు నిర్థారించారు. అక్కడ అరెస్టయిన 11 మందితో పాటు నగరంలో చిక్కిన ఐదుగురినీ ప్రస్తుతం ఏటీఎస్‌ తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది.

భోపాల్‌లోని సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సయ్యద్‌ డానిష్‌ అలీ ఇంటిలో సూత్రధారి యాసిర్‌ ఖాన్‌ నిర్వహించిన సమావేశాలకు నగరం నుంచి సలీంతో పాటు అబ్దుల్‌ రెహా్మన్, షేక్‌ జునైద్‌ కూడా హాజరయ్యారని ఏటీఎస్‌ చెప్తోంది. దానికి సంబంధించిన ఆధారాలు సైతం తమకు లభించినట్లు స్పష్టం చేస్తోంది...

SB NEWS

SB NEWS

బైక్ కొనిస్తేనే తాళి కడతానంటూ తేల్చేసిన వరుడు!

కరీంనగర్:

మరికొద్ది క్షణాల్లో సందడిగా ఉన్న పెళ్లి మండపంలో ఇద్దరు ఒక్కటవ్వబోతున్నారు. అయితే, వరుడు మాత్రం తనకు బైక్ కొనిస్తేనే పెళ్లి చేసుకుంటానంటూ పట్టుబట్టాడు. లేదంటే తాను వధువు మెడలో తాళి కట్టేది లేదంటూ తెగేసి చెప్పేశాడు.

దీంతో వధువు కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అదే సమయంలో అక్కడికొచ్చిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తన ఉదారతను చాటుకున్నారు. బైక్ తాను కొనిస్తానని పెళ్లి ఆగకూడదని చెప్పడంతో.. వరుడు వధువు మెడలో తాళి కట్టాడు. దీంతో అక్కడంతా సంతోషకర వాతావరణం నెలకొంది.

SB NEWS

SB NEWS

SB NEWS

కర్నాటక ఎన్నికల ఓట్ల లెక్కింపు : ఆధిక్యంలో కొనసాగుతోన్న కాంగ్రెస్‌

పోస్టల్‌ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్‌ ఆధిక్యం 50 దాటింది. 8 గంటల 40 నిముషాల వరకు వచ్చిన ఫలితాలలో... కాంగ్రెస్‌ 54, బిజెపి 40, జెడిఎస్‌ 13, ఇతరులు 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 36 కేంద్రాల్లో కౌంటింగ్‌ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్లు, వయో వృద్ధుల ఓట్లను సిబ్బంది లెక్కిస్తున్నారు.

కర్నాటక అసెంబ్లీ స్థానాలు 224, మ్యాజిగ్‌ ఫిగర్‌ 113, కాంగ్రెస్‌ అనుకూలంగా ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు ఉండగా, జేడీఎస్సే మళ్లీ కింగ్‌ మేకర్‌ అంటూ జోరుగా చర్చ సాగుతోంది. పోస్టల్‌ బ్యాలెట్‌లో తొలుత ఆధిక్యంలో బిజెపి కొనసాగింది.. ఆ తరువాత కాంగ్రెస్‌ ఆధిక్యంలోకి వచ్చింది. జేడీఎస్‌ పుంజుకుంటోంది.

SB NEWS

SB NEWS

ఎంఐఎం ఒత్తిడితోనే జగిత్యాల ఎస్సై సస్పెండ్ .? : బండి సంజయ్

కరీంనగర్ జిల్లా

జగిత్యాల ఎస్సై అనిల్ ను సస్పెండ్ చేయడం సభ్యసమాజం తలదించుకునే ఘటన అని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ శుక్రవారం అన్నారు. ఈ ఘటనపై ఎలాంటి విచారణ చేయకుండానే ఎంఐఎం నేతల ఫోన్ ఆదేశాలతో ఎస్సై అనిల్ పై చర్యలు తీసుకోవడం దారుణమన్నారు. ఎస్సై అనిల్, ఆయన భార్య చేసిన తప్పేంటని ప్రశ్నించారు.

అనిల్ ను సస్పెండ్ చేయడం ఎంతవరకు కరెక్టో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సై దాడి చేసిన వీడియోలు ఏమైనా ఉన్నాయా? ఏ ఆధారాలతో ఎస్సైని సస్పెండ్ చేశారో చెప్పాలన్నారు. మానవత్వం లేకుండా ఎస్సైని సస్పెండ్ చేయడమే గాకుండా న్యూసెన్స్ కేసు పెట్టారని ధ్వజమెత్తారు.

పోలీస్ స్టేషన్ పై దాడికి వచ్చిన వాళ్లను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు బండి సంజయ్. ఓ భర్తగా ఎస్సై తన భార్యను కాపాడుకోవడానికి మాట్లాడితే సస్పెండ్ చేస్తారా అని ప్రశ్నించారు. వెంటనే ఎస్సై అనిల్ సస్పెన్షన్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

ఎస్సైని సస్పెండ్ చేస్తే పోలీస్ సంఘాలు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు. ఎలాంటి విచారణ లేకుండానే ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రేపు జగిత్యాల బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు బండి సంజయ్. జగిత్యాల కొంత మంది సంఘవిద్రోహ శక్తులకు అడ్డగా మారిందన్నారు.

SB NEWS

అక్టోబర్ నవంబర్లోనే అసెంబ్లీ పోరు.. కర్ణాటక ఫలితాలపై బీఆర్‌ఎస్‌లో ఉత్కంఠ!

శనివారం వెలువడనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో అప్పుడే వేడి పెంచేశాయి. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా పోరాడిన కర్ణాటకలో.. కాంగ్రెస్‌ స్వల్పంగా పైచేయి సాధిస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు వెలువడటం, అదేమీకాదు బీజేపీ మెజార్టీ సాధిస్తుందన్న అభిప్రాయాలూ వినిపించడంపై రాష్ట్రంలో ఆసక్తికర చర్చ సాగుతోంది.

ముఖ్యంగా అధికార భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)లో కర్ణాటక ఫలితాలపై ఆసక్తి కనిపిస్తోంది. నిజానికి ఈ ఏడాది అక్టోబర్, నవంబర్‌ నెలల్లో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరగనుండటంతో.. కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే తమ కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. మరోవైపు కర్ణాటక ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్యే ప్రధాన పోరు జరగడంతో.. అక్కడ రాబోయే ఫలితాలు తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేయవచ్చని బీఆర్‌ఎస్‌ అంచనా వేస్తోంది.

కాంగ్రెస్, బీజేపీలలో ఏది గెలిచినా.. తెలంగాణలో ఏ తరహా వ్యూహాన్ని అమలు చేస్తాయన్న దానిపై బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ లెక్కలు వేస్తున్నట్టు సమాచారం. కర్ణాటక ఎన్నికల ఫలితాలను అనువుగా ఎలా మలుచుకోవాలనే వ్యూహాలను సిద్ధం చేయడంపైనా దృష్టి సారించినట్టు తెలిసింది.

బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు..

కర్ణాటకలో బీజేపీ అమలు చేసిన పలు విధానాలు, వ్యవహరించిన తీరు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారిందని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో నలుగురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ బలమున్న బీజేపీ.. ప్రధానంగా హైదరాబాద్‌ నగరం, శివారు నియోజకవర్గాల్లో మాత్రమే కొంత బలంగా ఉందని అంచనా వేస్తోంది.

పట్టణ ప్రాంతాల్లో 8 నుంచి 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుందని, గ్రామీణ ప్రాంతాల్లో మూడు, నాలుగు నియోజకవర్గాలు మినహా.. కాంగ్రెస్‌ పార్టీయే ప్రధాన పోటీదారుగా ఉంటుందని బీఆర్‌ఎస్‌ సంస్థాగత నివేదికల ఆధారంగా భావిస్తున్నట్టు తెలిసింది.

కర్ణాటకలో బీజేపీకి మెజార్టీ వచ్చి నా.. మేజిక్‌ ఫిగర్‌కు దగ్గరగా వచ్చి నా... అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు సర్వశక్తులు ఒడ్డుతుందని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. అక్కడ అధికారంలోకి వస్తే తెలంగాణలో దూకుడు పెంచుతుందని అభిప్రాయపడుతోంది. ఒకవేళ కర్ణాటకలో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టకుంటే.. ఇక్కడ ఆ పార్టీ దూకుడుకు అడ్డుకట్ట వేయడం సులువు అవుతుందని బీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారు.

కాంగ్రెస్‌తోనే ప్రధాన పోటీ..

గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ కాంగ్రెస్‌కు బలమైన కేడర్‌ ఉన్నట్టు ఆత్మీయ సమ్మేళనాలకు ఇన్‌చార్జులుగా వ్యవహరించిన బీఆర్‌ఎస్‌ నేతలు పార్టీ అధినేత కేసీఆర్‌కు సమర్పించిన నివేదికల్లో పేర్కొన్నట్టు తెలిసింది. హైదరాబాద్, శివారు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ సాధించే ఓట్లు బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయిస్తాయని స్పష్టం చేసినట్టు సమాచారం.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కాంగ్రెస్‌కు ఉన్న ఓటు బ్యాంకు ఒక ఏడు శాతం తగ్గితే.. తాము గెలుపు కోసం శ్రమించాల్సి వస్తుందని ఓ ఎమ్మెల్యే వ్యా ఖ్యానించడం పరిస్థితికి అద్దం పడుతోంది. హుజూరాబాద్‌ తరహాలో గ్రేటర్‌ పరిధిలో కాంగ్రె స్‌ నామమాత్ర పోటీకి పరిమితమైతే ఇబ్బంది త ప్పవని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ వైపు మొగ్గుచూపే అవకాశము న్న వర్గాలపై ఫోకస్‌ పెట్టి.. బీఆర్‌ఎస్‌ వైపు తిప్పు కొనేలా వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం

కెసిఆర్ ముఖ్య సలహాదారుడిగా బాధ్యతలు స్వీకరించిన సోమేశ్ కుమార్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముఖ్య సలహాదారుగా మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ బాధ్యతలను స్వీకరించారు. ఈ ఉదయం ఆయన కొత్త బాధ్యతలను చేపట్టారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో వుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత సోమేశ్ కుమార్ ను ఏపీకి కేటాయించారు. అయినప్పటికీ క్యాట్ ఉత్తర్వుల మేరకు ఆయన తెలంగాణలోనే కొనసాగారు.

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ సుదీర్ఘ కాలం పని చేశారు. అయితే, ఆయనను తెలంగాణలో కొనసాగిస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను డీవోపీటీ తెలంగాణ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ నేపథ్యంలో తక్షణమే ఏపీలో రిపోర్ట్ చేయాలంటూ సోమేశ్ కుమార్ ను హైకోర్టు ఆదేశించింది.

దీంతో సోమేశ్ కుమార్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏపీ జీఏడీలో రిపోర్ట్ చేశారు. అయితే సీఎస్ గా పని చేసిన ఆయన.. అంతకంటే తక్కువ పోస్టులో పని చేయడానికి ఇష్టపడలేదు. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. కొన్ని రోజుల తర్వాత ఆయన స్వచ్చంద పదవీ విరమణ చేశారు. తాజాగా ఆయనకు కేసీఆర్ తన ముఖ్య సలహాదారుడిగా బాధ్యతలను అప్పగించారు.

SB NEWS

SB NEWS

ముఖ్యమంత్రి పదవి లక్ష్యం కాదు

ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పదవి డిమాండ్ చేయడం లేదని పరోక్షంగా సూచించారు.40 సీట్లుంటే సీఎం పదవి అడిగేవాడినన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా జనసేన పొత్తు పెట్టుకుంటుందని తెలిపారు.

ఇటీవల కొద్దికాలంగా సినిమాలపై ఫోకస్ చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ మరోసారి పర్యటన చేపట్టారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఈరోజు మీడియా సమావేశం ద్వారా పొత్తులపై తన వైఖరిని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సీఎం పదవి డిమాండ్ లేదని పరోక్షంగా సూచించారు. బలం చూపించి పదవి తీసుకోవాలని, షరతులు పెట్టితే కుదరదని చెప్పారు. వైసీపీ నుంచి అధికారం లాక్కుని ప్రజలకు అప్పగించడమే పార్టీ లక్ష్యమన్నారు. తాను ముఖ్యమంత్రి అభ్యర్ధి అయితేనే పొత్తు పెట్టుకోవాలని చెబుతున్న వ్యాఖ్యలపై సైతం స్పందించారు. రాష్ట్ర ప్రజలు 40 స్థానాలు ఇచ్చుంటే సీఎం పదవి డిమాండ్ చేసేవాడినని చెబుతూ పరోక్షంగా ఆ డిమాండ్ ఇప్పుడు చేయడం లేదనే సంకేతాలిచ్చేశారు.

2014లో కూడా అన్నీ అధ్యయనం చేసిన తరువాతే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. గతంలో కూడా బీజేపీ, బీఆర్ఎస్ వంటి పార్టీలు పొత్తులతోనే బలపడ్డాయనే సంగతి గుర్తుంచుకోవాలన్నారు. గౌరవానికి భంగం కలగకుండా పొత్తులుంటాయన్నారు. గతంతో పోలిస్తే జనసేన బలం గణనీయంగా పెరిగిందని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీకు సగటున 7 శాతం ఓట్లు రాగా, ఈసారి ఆ బలం 18-19 శాతానికి పెరిగిందన్నారు. 2019 నుంచి పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉన్నామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకునే పొత్తుల గురించి మాట్లాడానన్నారు. 2019 ఎన్నికల్లో 137 స్థానాల్లో పోటీ చేశామని..అప్పట్లో కనీసం 30-40 స్థానాలు గెల్చుకునుంటే కర్ణాటక తరహా పరిస్థితి ఉండేదన్నారు.

పొత్తులకు కొన్ని పార్టీలు ఒప్పుకోకుంటే ఒప్పిస్తామన్నారు. కచ్చితంగా రానున్న ఎన్నికల్లో పొత్తులుంటాయని తెలిపారు. సీఎం పదవి డిమాండ్ చేయాలంటే 30-40 సీట్లు ఉండాలన్నారు. కర్ణాటకలో కుమారస్వామి 30 సీట్లతోనే ముఖ్యమంత్రి అయిన సంగతిని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు

కొండగట్టులో అంజన్న ఉత్సవాలు : భద్రాది నుంచి పట్టు వస్త్రాలు

మల్యాల మండలం కొండగట్టులో పెద్ద హనుమాన్ జయంతి వేడుకలకు రంగం సిద్ధమైంది. కొండగట్టు అంజన్న ఆలయంలో హనుమాన్ పెద్ద జయంతి వేడుకల ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ వెంకటేశం తెలిపారు.

మొదటి రోజు ఉదయం స్వస్తిక్వచనం, రక్షాబంధనం, రుత్విక్ వరణం, అరుణి మథనం, దేవతాహవనం, ఉత్సవ మూర్తి యాగశాల ప్రవేశం, దేవతాపూజలు, అగ్నిప్రతిష్ట, హవనం, స్వామివారికి అభిషేకాలు, సహస్ర నామార్చన ఏర్పాటు చేశారు. సాయంత్రం విష్ణసహస్రనామ పారాయణం, స్థాపిత దైవం, బలిహరణం, సుందరకాండ పారాయణం, అమ్మవారి సహస్రమమకుంకుమార్చన, బలిహరణం, మంత్రపుష్ప జరుగుతాయని పేర్కొన్నారు.

కొండగట్టులో నేడు హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15 వరకు వేడుకలు జరగనుండగా.. అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 14న హనుమంతుని జయంతి కావడంతో లక్షలాది మంది అంజనా దీక్షాపరులు రానున్నారు. హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా భద్రాచలం సీతారాచంద్రస్వామి ఆలయం నుంచి స్వామివారికి పట్టువస్త్రాలు పంపారు. వాటిని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్‌కుమార్‌, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌, స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ స్వామికి అందజేయనున్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం ముందస్తుగా 3.60 లక్షల లడ్డూలను సిద్ధం చేశారు.

ఇవి సరిపోకపోతే వెంటనే సిద్ధం చేసేందుకు అదనపు సిబ్బందిని నియమించినట్లు ప్రసాద తయారీ ఇన్ చార్జి ధర్మేందర్ తెలిపారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా వెంటనే పులిహోర సిద్ధం చేస్తామని తెలిపారు. 14 కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం వైశాఖ ముల్దశమి రోజున హనుమంతుని తిరునక్షత్ర జయంతి వేడుకలను ఆలయ సంప్రదాయం ప్రకారం నిర్వహిస్తారు.

మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆలయంలో త్రికుండమంతిమ యజ్ఞం నిర్వహించి వార్షికోత్సవం రోజున పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఉత్సవాల సందర్భంగా కొండగట్టు ఆలయంలో నిఘా పెంచేందుకు 104 సీసీ కెమెరాలతో పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ఆలయం తరపున ఆలయం లోపల, బయట ఏర్పాటు చేసిన 64 సీసీ కెమెరాలకు అదనంగా 40 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

హైదరాబాదులో మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు

ఐటీ కారిడార్‌ లో మూడు నెలల పాటు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. శిల్పా లేఅవుట్‌ ఫేజ్‌ -2 ఫ్లైఓవర్‌ పనుల కోసం గచ్చిబౌలి జంక్షన్‌ నుంచి కొండాపూర్‌ వరకు పలుచోట్ల ఈ మళ్లింపులు విధిస్తున్నట్లు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. ఈ నెల 13 నుంచి ఆగస్టు 10 వరకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు. ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా జాగ్రత్త తీసుకోవాలని సూచించారు.

అందుకోసం అధికారులు రూట్‌ మ్యాప్‌ ను విడుదల చేశారు

ఔటర్‌ రింగ్‌రోడ్‌ నుంచి హఫీజ్‌పేట్‌కు వెళ్లాల్సిన వాహనదారులు శిల్పా లే అవుట్‌ ఫ్లైఓవర్‌-మీనాక్షి టవర్స్‌-డెలాయిట్‌-ఏఐజీ ఆస్పత్రి- క్యూమార్ట్‌- కొత్తగూడ ఫ్లైఓవర్‌ ద్వారా హఫీజ్‌పేట్‌ చేరుకోవాలి.

లింగంపల్లి నుంచి కొండాపూర్‌ వెళ్లాల్సిన వాహనదారులు గచ్చిబౌలి ట్రాఫిక్‌ పీఎస్‌- డీఎల్‌ఎఫ్‌ రోడ్‌- రాడిసన్‌ హోటల్‌- కొత్తగూడ మీదుగా కొండాపూర్‌ చేరుకోవాలి.

విప్రో జంక్షన్‌ నుంచి ఆల్విన్‌ క్రాస్‌రోడ్స్‌ వెళ్లే వాహనాలను ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌- లెఫ్ట్‌ టర్న్‌- గచ్చిబౌలి స్టేడియం వద్ద యూటర్న్‌- డీఎల్‌ఎఫ్‌ రోడ్‌- రాడిసన్‌ హోటల్‌- కొత్తగూడ ఫ్లైఓవర్‌, ఆల్విన్‌ వైపు అనుమతిస్తారు.

టోలీచౌకీ నుంచి ఆల్విన్‌ క్రాస్‌రోడ్స్‌ వెళ్లే వాహనదారులు బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌- మైండ్‌స్పేస్‌ జంక్షన్‌- సైబర్‌ టవర్స్‌ జంక్షన్‌- లెఫ్ట్‌ టర్న్‌ హైటెక్స్‌ సిగ్నల్‌- కొత్తగూడ జంక్షన్‌ ద్వారా ఆల్విన్‌ వైపు వెళ్లాలి.

టెలికామ్‌ నగర్‌ నుంచి కొండాపూర్‌ వెళ్లాల్సిన వాహనదారులు గచ్చిబౌలి అండర్‌ ఫ్లైఓవర్‌ వద్ద యూటర్న్‌ తీసుకుని- శిల్పా లే అవుట్‌ ఫ్లైఓవర్‌ బస్టాప్‌ పక్క నుంచి- మీనాక్షి టవర్స్‌- డెలాయిట్‌- ఏఐజీ ఆస్పత్రి- క్యూ మార్ట్‌- కొత్తగూడ ద్వారా కొండాపూర్‌ చేరాలి.

బస్సులూ ప్రత్యామ్నాయ మార్గాల్లోనే..

ట్రాఫిక్‌ మళ్లింపుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో బస్సుల రాకపోకలు కొనసాగుతాయని టీఎస్‌ఆర్టీసీ సికింద్రాబాద్‌ రీజియన్‌ రీజనల్‌ మేనేజర్‌ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. లింగంపల్లి నుంచి మెహిదీపట్నం వెళ్లే 216కే బస్సు రాడిసన్‌ హోటల్‌ Xరోడ్‌ నుంచి మీనాక్షి టవర్‌, ఐకియా, బయో డైవర్సిటీ Xరోడ్‌ మీదుగా వెళ్తుందన్నారు.

మియాపూర్‌ మెట్రోస్టేషన్‌ నుంచి మంచిరేవులకు వెళ్లే 221బస్సు రాడిసన్‌ హోటల్‌ నుంచి డీఎల్‌ఎఫ్‌, ఐఐఐటీ Xరోడ్‌ నుంచి గచ్చిబౌలి మీదుగా, సికింద్రాబాద్‌ నుంచి వేవ్‌రాక్‌కు వెళ్లే 10హెచ్‌డబ్ల్యూ బస్సు డీఎల్‌ఎఫ్‌, ఐఐటీ Xరోడ్‌, విప్రో సర్కిల్‌ మీదుగా రాకపోకలు సాగించనుంది.