/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz అవధులు లేని ఆశయంతో ముందుకు వెళుతున్న శ్రీ పగడాల కనకయ్య మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్ పగడాల ముత్తు Mane Praveen
అవధులు లేని ఆశయంతో ముందుకు వెళుతున్న శ్రీ పగడాల కనకయ్య మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్ పగడాల ముత్తు
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ గ్రామ వాసి చిలివేరు వెంకటేష్, ఆకస్మాత్తుగా గుండె పోటుతో మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న శ్రీ పగడాల కనకయ్య మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్ పగడాల ముత్తు,  తన ఫౌండేషన్ ద్వారా పదివేల రూపాయల ఆర్ధిక సహాయం అందించి పేద కుటుంబాన్ని ఆదుకున్నారు. బాధిత కుటుంబ ముగ్గురు పిల్లలను చూసి చలించి పోయిన ముత్తు, భవిష్యత్తులో వారికి ఎలాంటి సమయంలోనైనా  అండగా ఉంటానని హామీ ఇచ్చి ధైర్యం కల్పించారు.
దళిత రత్న అవార్డు గ్రహీత బుర్రి వెంకన్న కు సన్మానం
HYD: రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ క్యాంపు కార్యాలయంలో, మహనీయుల జయంతి ఉత్సవాల సందర్భంగా పలువురికి అవార్డులు ప్రధానం చేశారు. అందులో భాగంగా నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గానికి చెందిన ఆల్ ఇండియా సమతా సైనిక్  దళ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బుర్రి వెంకన్న 'దళిత రత్న' అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా సమతా సైనిక్
దళ్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి లక్ష్మయ్య మరియు స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో బుర్రి వెంకన్న ను శాలువతో ఘనంగా సన్మానించారు. బుర్రి వెంకన్న మాట్లాడుతూ.. బాబాసాహెబ్ అంబేద్కర్ చేత స్థాపించబడిన 'ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్' లో పనిచేయడం తన అదృష్టమని, ఈ సంస్థను నల్లగొండ జిల్లాలో విస్తరింప చేయడానికి కృషి చేస్తూ, సామాజిక కార్యక్రమాలు చేసినందుకు ప్రభుత్వం గుర్తించి అవార్డు అందించినట్లు తెలిపారు.
మద్దిమడుగు బిక్షపతి కి దళిత రత్న అవార్డు
NLG: ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ నల్లగొండ జిల్లా శాఖ అధ్యక్షుడు, దేవరకొండ నియోజకవర్గానికి చెందిన మద్దిమడుగు బిక్షపతి కి దళిత రత్న అవార్డు లభించింది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ జయంతి ఉత్సవాల సందర్భంగా హైదరాబాదులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా ఆదివారం అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా బిక్షపతి మాట్లాడుతూ.. ఏఐఎస్ఎస్డి నాయకుడిగా గత 5 సంవత్సరాల నుండి దళిత సమస్యలపై, సామాజిక సమస్యలపై పోరాడి, ప్రజలకు అండగా నిలిచినందుకు, ప్రభుత్వం వారు గుర్తించి అవార్డును అందజేసినట్లు తెలిపారు. అవార్డుకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని అన్నారు.