రైతులకు కాళేశ్వరంతో సాగునీటిని అందించ్చిన ప్రదాతలు కేసీఆర్, హరీష్ రావులే! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు
రైతులకు కాళేశ్వరంతో సాగునీటిని అందించ్చిన ప్రదాతలు కేసీఆర్, హరీష్ రావులే!
కేసీఆర్, హరీష్ రావులు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఉండకుంటే నేడు రైతు కండ్లల్లో ఆనందం ఉండేదా?
అడ్డగోలు హామీలు అబద్ధపు మాటలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ రైతులను నమ్మించ్చి ముంచ్చింది!
జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్
తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలంగా మారి రైతులు రెండు పంటలు పండిస్తూ ఆ కుటుంబాలలో సుఖ సంతోషాలు ఉన్నాయంటే అది కేవలం కెసిఆర్ హరీష్ రావుల దృఢ సంకల్పంతో నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు పుణ్యమేనని బిఆర్ఎస్ సీనియర్ నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, వైస్ యంపిపి కీసరి పాపయ్య, గుండెల్లి వేణు, గుజ్జ రాజులు అన్నారు.
శనివారం రోజు రంగనాయక సాగర్ నుండి రైతుల వ్యవసాయానికి నీళ్లు వదిలిన సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు, కెసిఆర్ హరీష్ రావుల చిత్రపటానికి పాలాభిషేకం చేసి మాట్లాడుతూ కేసీఆర్ హరీష్ రావులు తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించి మొక్కవోని దీక్షతో రైతు కలలో సంతోషాన్ని చూడాలని రైతుకు కరువు ఏర్పడకుండా ఉండాలని ప్రాజెక్టును నిర్మించి తద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన గొప్ప మహనీయులు కేసీఆర్ హరీష్ రావు లని వారు అన్నారు అడ్డగోలు హామీలతో అబద్ధపు మాటలతో తెలంగాణ రైతులను ప్రజలను నమ్మించి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఇచ్చిన మాటకు కట్టుబడకుండా హామీలను తుంగలో తొక్కి సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్పితే తెలంగాణ సమాజానికి ఒరిగింది ఏమీ లేదు అన్నారు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లు పెంచలేదని తూతూ మంత్రంగా రుణమాఫీ చేశారని రైతు భరోసా నేటికీ రాలేదని పేదలకు ఇండ్ల ఊసే లేదని స్త్రీలకు 2500 మాటే లేదని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లేదని కల్యాణ లక్ష్మి లో తులం బంగారం మాయమైందని డెలివరీ స్త్రీలకు కేసీఆర్ కిట్టు ఇవ్వడం లేదని హాస్టల్లో నాణ్యమైన తిండి పెట్టడం లేదని ఇవన్నీ గాలికి వదిలి రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నాడని ఇవాళ ప్రాజెక్టులు నిర్మితమై ఉండకుంటే తెలంగాణ ప్రజలకు తాగు సాగునీరు కరువు అయ్యేదని ప్రపంచంలోనే ఎవరు ఊహించని విధంగా కాలేశ్వరం నిర్మించి తెలంగాణ రైతాంగానికి సాగునీరు ప్రజలకు తాగునీరు అందించిన ఘనత కెసిఆర్ హరీష్ రావులకు దక్కుతుందని వారన్నారు.
ఈ కార్యక్రమంలో జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, కీసర పాపయ్య, గుండెల్లి వేణు, గుజ్జ రాజు, మన్నే ఆనంద్, గొళ్లపల్లి రాజశేఖర్ రెడ్డి, కంకటి మహేష్, కొత్త శంకర్, రామచంద్రం, ఎలుక అనిల్. చెట్టిపెల్లి భాను, జంగిటి ఆనందం, పడిగె లింగం, అయ్యా రాజయ్య, కోరమేన రవి తదితరులు పాల్గొన్నారు.
Jan 23 2025, 15:23