/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz బుడమేరుకు మళ్లీ పెరిగిన వరద.. టెన్షన్.. టెన్షన్ Raghu ram reddy
బుడమేరుకు మళ్లీ పెరిగిన వరద.. టెన్షన్.. టెన్షన్

బెజవాడ వాసులను బుడమేరు (Budameru) ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేదు..విజయవాడ (Vijayawada) పట్ల బుడమేరు.పగ.. మేరులా మారి పట్టి పీడిస్తోంది. ఒకటా రెండా సుమారు పది రోజులుగా ప్రజలను ముప్పు తిప్పలు పెడుతోంది హమ్మయ్యా.. వానలు, వరద తగ్గాయ్ అనుకునే లోపే మళ్లీ బుడమేరు భయపెడుతోంది.

బెజవాడ వాసులను బుడమేరు (Budameru) ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేదు. విజయవాడ (Vijayawada) పట్ల బుడమేరు.. పగ.. మేరులా మారి పట్టి పీడిస్తోంది.ఒకటా రెండా సుమారు పది రోజులుగా ప్రజలను ముప్పు తిప్పలు పెడుతోంది.హమ్మయ్యా.. వానలు, వరద తగ్గాయ్ అనుకునే లోపే మళ్లీ బుడమేరు భయపెడుతోంది.దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జనాలు బతుకుతున్న పరిస్థితి. కూటమి ప్రభుత్వం ఎంతో కష్టపడి ఆర్మీ సాయంతో బుడమేరు మూడు గండ్లు పూడ్చేసరికి కాస్త ఊపిరి పీల్చుకున్న నగరవాసులకు గంటల వ్యవధిలోనే మరో షాకింగ్ న్యూస్ వచ్చేసింది. విజయవాడ నగరంలో మళ్లీ వర్షం కురుస్తోంది. దీంతో క్రమక్రమంగా బుడమేరుకు వరద పెరిగిపోతోంది. దీనికి తోడు భారీ వర్షాలకు పులివాగు ప్రవాహం కూడా పెరిగిపోయింది. పులివాగు థాటికి బుడమేరు మరింత పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఇప్పటికే పూడ్చిన మూడు గండ్లను యుద్ధ ప్రతిపాదికన అధికారులు మరింత ఎత్తు పెంచుతున్నారు. అర్ధరాత్రి నుంచి దగ్గరుండి.. నీటి పారుదల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు పనులు పర్యవేక్షిస్తున్నారు. హుటాహుటిన రంగంలోకి దిగిన అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాలకు చేరవేస్తున్నారు. ఈ ప్రక్రియను కలెక్టర్ సృజన దగ్గరుండి చూస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. పులివాగు వరద థాటికి ముగ్గురు ఇరిగేషన్ అధికారులు చిక్కుకుపోయారు. ఎప్పుడేం జరుగుతుందో అని బెజవాడ వాసులు మరింత భయపడిపోతున్నారు.

అసలే వరద భయంతో బిక్కు బిక్కు మంటున్న విజయవాడ ప్రజలను వాతావరణ శాఖ హెచ్చరికలు మరింత భయపెడుతున్నాయి. మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం బలపడింది. ఒడిశా, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. దీంతో ఇవాళ, రేపు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏలూరు, అల్లూరి, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. అయితే.. ఎన్టీఆర్ జిల్లాలో మాత్రం అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తాలోని కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.

కాగా.. ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి మట్టం మళ్లీ పెరిగింది. బ్యారేజి వద్ద 3, 82, 662 క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. పులిచింతల, సాగర్ నుంచి పెరిగిన వరద నీరు విడుదల చేయడం జరిగింది. కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షంతో వరద ప్రవాహం మరింత పెరుగుతున్నది. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పడుతున్న వర్షాలతో వరద ప్రవాహం మరింత పెరుగుతున్నదని అధికారులు చెబుతున్నారు. బ్యారేజి దిగువన నదీతీర గ్రామాల ప్రజలను అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. ఇదిలా ఉంటే.. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ పలుచోట్ల విస్తారంగా కురుస్తున్న వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. ఒరిస్సాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లాలోని నాగావళి నదీ పరివాహక ప్రాంతవాసులను జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ అప్రమత్తం చేశారు. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో అల్లకల్లోలంగా సముద్ర తీరం ఉంది. మత్స్యకారులు చేపలు వేటకు వెళ్లకుండా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

విచారణను సెప్టెంబర్‌ 9కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

బెంగాల్‌లోని ఆభయ హత్యాచార కేసులో తదుపరి విచారణను సెప్టెంబర్‌ 9న సుప్రీంకోర్టు జాబితా చేసింది. ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి. పార్ధివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది.

ఈ కేసును కోర్టు సుమోటోగా స్వీకరించి ఆగస్ట్‌ 22న ప్రాథమిక విచారణ చేపట్టింది. కోల్‌కతా ఆర్‌జి కార్‌ ఆస్పత్రిలో భద్రత కల్పిస్తున్న సెంట్రల్‌ ఇండిస్టియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సిఐఎస్‌ఎఫ్‌)కి సహకరించలేదని మమతా బెనర్జీ ప్రభుత్వం ఆరోపిస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా విచారణ చేపట్టనుంది.

రిక్లెయిమ్‌ ది నైట్‌’ పేరిట కోల్‌కతా వైద్యులు సోమవారం (సెప్టెంబర్‌ 8న) మరోసారి నిరసన చేపట్టనున్నారు. గణేష్‌ చతుర్థి సందర్భంగా ..

గణేష్‌ మండపాల ద్వారా బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నట్లు గణేష్‌ పూజా కమిటీలు తెలిపాయి.

నాగార్జునసాగర్ కు కొనసాగుతున్న వరద ప్రవాహం... 24 గేట్లు ఎత్తిన అధికారులు

కృష్ణా నది ఇంకా ఉద్ధృతంగానే ప్రవహిస్తోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దాంతో అధికారులు సాగర్ ప్రాజెక్టులో 24 గేట్లు ఎత్తి 2.21 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో 2.63 లక్షల క్యూసెక్కులుగా ఉంది. 

సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా... ప్రస్తుతం ప్రాజెక్టులో 311.4 టీఎంసీల నీరు ఉంది.

మహారాష్ట్ర, కర్ణాటకలో ఇప్పటికీ వర్షాలు కురుస్తుండడంతో కృష్ణా నది పోటెత్తుతోంది.

2వేల లోపు డిజిటల్ పేమెంట్లకు జీఎస్టీ?

నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఖర్చు చేసే ప్రతి రూపాయికి జీఎస్టీ వసూలు చేసే కేంద్రంలోని మోడీ సర్కారు ఇప్పుడు చిన్న పేమెంట్ల (రూ.2వేల కంటే తక్కువ డిజిటల్ పేమెంట్లు) మీదా కన్నేసిందా? అంటే అవునన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు రూ2వేల లోపు లావాదేవీలపై జీఎస్టీ విధించమని చెప్పిన మోడీ సర్కారు ఇప్పుడు ఆ భారం మోపేందుకు వీలుగా కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. రోజర్ పే.. పైన్ లాబ్స్ లాంటి పేమెంట్ అగ్రిగేటర్ల ద్వారా జరిపే చెల్లింపులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా సమాచారం.

ఇప్పటివరకు ఈ పేమెంట్లను డెబిట్ కార్డులు.. క్రెడిట్ కార్డుల ద్వారా చేస్తున్నారు. వీటితో రూ.2 వేల కంటే ఎక్కువ చెల్లంపులపై జీఎస్టీ ఇప్పటికే వసూలు చేస్తున్నారు. తాజాగా రూ.2వేల లోపు డిజిటల్ చెల్లింపులపైనా 18శాతం జీఎస్టీ వసూలు చేసేలా కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనను జీఎస్టీ మండలి పరిశీలిస్తున్నట్లు తెలుసతోంది. సోమవారంఢిల్లీలో జరిగే జీఎస్టీ సమావేశంలో ఇందులో చర్చిస్తారని చెబుతున్నారు.

ఇప్పటికే ఈ ఆగ్రిగేటర్లు ఒక్కో లావాదేవీ మీద 0.5 శాతం నుంచి 2 శాతం వరకు పేమెంట్ గేట్ వే ఫీజును వసూలు చేస్తున్నాయి. ఇలాంటి వేళ.. అదనంగా జీఎస్టీ విధిస్తే.. అది కూడా వినియోగదారుడి మీదే భారం పడుతుంది. మరి..

ఈ అంశంపై జీఎస్టీ కౌన్సిల్ ఏ నిర్ణయాన్ని తీసుకుంటుందో చూడాలి. ఒకవేళ.. దీన్ని జీఎస్టీ కిందకు చేర్చాలని భావిస్తేమోడీ సర్కారు మరో భారీ దెబ్బ వేసినట్లేనన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.

మురళి మోహన్ కు షాక్.. జయభేరికి నోటీసులు ఇచ్చిన హైడ్రా..

హైదరాబాద్ లోని ప్రభుత్వ భూములు, పార్కులు, చెరువులు కబ్జాకు గురికాకుండా ఉండడానికి తెలంగాణ ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసింది. అనుకున్నట్లుగానే హైడ్రా హైదరాబాద్ లోని అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. చెరువులను అక్రమించి కట్టిన కట్టడాలను కూల్చేస్తోంది. ఆక్రమణదారులు ఎవరైనా డొంట్ కేర్ అంటూ.. ముందుకెళ్తోంది. ఇప్పటికే 18 ఎకరాల భూమిని అక్రమార్కుల చెర నుంచి విడిపించింది.

మాదాపూర్ లో తుమ్మడికుంట చెరువు అక్రమించి కట్టిన ఎన్ కన్వెషన్ కొద్ది రోజుల క్రితం హైడ్రో కూల్చివేసింది. అలాగే దుర్గంచెరువు బఫర్ జోన్, ఎఫ్ టీఎల్ లో ఉన్న నిర్మాణాలకు నోటీసులు ఇచ్చింది. దీంతో హైడ్రాపై ప్రశంసలు కురుస్తున్నాయి. హైడ్రా ఇలానే ముందుకెళ్తే హైదరాబాద్ ను వరదల నుంచి కాపాడుకొవచ్చని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

తాజాగా హైడ్రా సిని నటుడు, నిర్మాత, మురళి మోహన్ కు చెందిన జయభేరి షాకిచ్చింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని రంగళాల్ కుంట చెరువు ఎఫ్ టి ఎల్ మరియు బఫర్ లో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని నోటీసులు జారీ చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ భాగీరథమ్మ చెరువును పరిశీలించారు. నోటీసులపై జయభేరీ సంస్థ ఇంకా స్పందించలేదు. అయితే చాలా మంది అక్రమార్కులు చెరువులు కుంటలు కబ్జా చేశారు.

తర్వాత జీహెచ్ఎంసీ, ఇరిగేషన్ అధికారులుక లంచాలు ఇచ్చి నిర్మాణాలకు అనుమతి తీసుకున్నారు. నిర్మాలు చేపట్టారు. ఇప్పుడు వారికి నోటీసులు ఇస్తే కోర్టు వెళ్తున్నారు. తమకు అధికారులే ఇళ్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారని కోర్టుకు చెబుతున్నారు. అయితే లంచాలు తీసుకుని పర్మిషన్ ఇచ్చిన అధికారులు అరెస్ట్ చేయాలని డిమాండ్ వస్తుంది. అధికారుల తీరు వల్లే చెరువులు కబ్జాకు గురవుతున్నాయని చెబుతున్నారు.

హైద‌రాబాద్ సీపీగా రెండోసారి సీవీ ఆనంద్ నియామ‌కం

హైద‌రాబాద్ న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్‌గా సీనియ‌ర్ ఐపీఎస్ ఆఫీస‌ర్ సీవీ ఆనంద్‌ను నియ‌మిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్‌గా ఆనంద్ నియామ‌కం కావ‌డం ఇదే తొలిసారి కాదు.

హైద‌రాబాద్ న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్‌గా సీనియ‌ర్ ఐపీఎస్ ఆఫీస‌ర్ సీవీ ఆనంద్‌ను నియ‌మిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్‌గా ఆనంద్ నియామ‌కం కావ‌డం ఇదే తొలిసారి కాదు. స‌రిగ్గా ఏడాది క్రితం వ‌ర‌కు ఆనంద్.. హైద‌రాబాద్ సీపీగా సేవ‌లందించారు.

1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్.. 2021 డిసెంబ‌ర్ నుంచి 2023 అక్టోబ‌ర్ వ‌ర‌కు హైద‌రాబాద్ సీపీగా ప‌ని చేశారు. తెలంగాణ కేడ‌ర్‌కు చెందిన సీవీ ఆనంద్.. 2017లో అదన‌పు డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ పోలీసుగా ప‌దోన్న‌తి పొందారు. కేంద్ర స‌ర్వీసుల‌కు వెళ్లిన ఆయ‌న 2021లో తిరిగి తెలంగాణ‌కు చేరుకున్నారు.

2023 ఆగ‌స్టులో డీజీపీ హోదా క‌ల్పిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. 2023 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న‌ను సీపీ ప‌ద‌వి నుంచి త‌ప్పించారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొలువుదీరిన త‌ర్వాత ఆనంద్‌కు ఏసీబీ డీజీగా బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఇప్పుడు మ‌ళ్లీ హైద‌రాబాద్ సీపీగా నియామ‌కం అయ్యారు.

హైడ్రా.. ఆపరేషన్‌ నాలా..!

వర్షాలు.. ముంపు ముప్పు నేపథ్యంలో హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) వరద నీటి నిర్వహణ మెరుగుదలపై దృష్టి సారించింది. చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణల ఫిర్యాదులపై క్షేత్రస్థాయి పరిశీలన కొనసాగిస్తూనే, ఆపరేషన్‌ నాలా కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది.

వర్షాలు.. ముంపు ముప్పు నేపథ్యంలో హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) వరద నీటి నిర్వహణ మెరుగుదలపై దృష్టి సారించింది. చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణల ఫిర్యాదులపై క్షేత్రస్థాయి పరిశీలన కొనసాగిస్తూనే, ఆపరేషన్‌ నాలా కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. నాలాల్లో వరద నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న నిర్మాణాల తొలగింపునకు రంగం సిద్ధం చేస్తోంది. నాలాలకు అడ్డుగా ఉన్న, కబ్జా చేస్తు చేపట్టిన నిర్మాణాలకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని పౌరులను కోరుతోంది. రాంనగర్‌(Ramnagar)లోని మణెమ్మ బస్తీలో స్థానికుల ఫిర్యాదు మేరకు పలు ప్రభుత్వ విభాగాలు ఇటీవల ఆక్రమణలు తొలగించాయి. అదే తరహాలో ఇతర ప్రాంతాల్లోనూ చర్యలు చేపట్టాలని హైడ్రా భావిస్తోంది. జీహెచ్‌ఎంసీ(GHMC)తోపాటు ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు ఉన్న ఏరియాల్లో నాలాల విస్తరణకు ప్రస్తుతం ప్రాధాన్యతమిస్తున్నారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో 370 కి.మీల మేర మేజర్‌ నాలాలు, 1250 కి.మీల వరద నీటి కాలువలు (స్ర్టామ్‌ వాటర్‌ డ్రైన్‌) ఉన్నాయి. వీటి ప్రవాహ వ్యవస్థ సామర్థ్యం గంటకు 2 సెం.మీలు మాత్రమే . కొన్నాళ్లుగా తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదవుతోన్న నేపథ్యంలో రహదారులు జలమయమవుతున్నాయి. నాలాల పక్కనున్న కాలనీలు, బస్తీలు నీట మునుగుతున్నాయి. పట్టణీకరణ నేపథ్యంలో నగరంలో పరిస్థితులు మరింత తీసికట్టుగా మారుతున్నాయి. ఈ ఇబ్బందులకు చెక్‌పెట్టేలా హై-సిటీ కార్యక్రమంలో భాగంగా నాలాల విస్తరణ, అ భివృద్ధి పనులు చేపడుతున్నారు. దీనికి సమాంతరంగా ఆక్రమణల తొలగింపూ చేపట్టాలన్నది సర్కారు యోచనగా తెలుస్తోంది.

ఈ క్రమంలో దీర్ఘకాలంగా ఉంటోన్న ప్రజలకు ఇబ్బంది లేకుండా నివాసేతర నిర్మాణాలను మాత్రమే తొలగించాలని నిర్ణయించారు. గతంలో జీహెచ్‌ఎంసీ నిర్వహించిన సర్వేలో నగరంలోని నాలాలపై 12 వేలకుపైగా ఆక్రమణలు ఉన్నట్టు గుర్తించారు. ఇందులో దాదాపు 35 శాతం వరకు నివాసేతర నిర్మాణాలే. నాలాలకు అడ్డంగా రెండు, మూడంతస్తుల భవనాలు నిర్మించారు. కొన్నిచోట్ల 30 అడుగుల వెడల్పు ఉన్న నాలాలు.. పది అడుగుల లోపునకు కుచించుకుపోయాయి. ఇంకొన్ని చోట్ల నాలాలు రెండు, మూడు అడుగుల కంటే వెడల్పు లేకపోవడం గమనార్హం. దీంతో పరిసర ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. నాలాల సమగ్రాభివృద్ధికి రూ.10 వేల కోట్లు అవసరమని గతంలో ప్రణాళికలు రూపొందించారు.

నిధుల కొరత, ఆక్రమణల తొలగింపు, పునరావాసం తదితర ఇబ్బందుల నేపథ్యంలో కార్యరూపం దాల్చలేదు. ‘నివాసేతర ఆక్రమణల తొలగింపు ద్వారా వరద ప్రవాహ వ్యవస్థ మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం’ అని హైడ్రా వర్గాలు చెబుతున్నాయి. చెరువుల్లో ఆక్రమణల ఫిర్యాదులనూ హైడ్రా పరిశీలిస్తోంది. చెరువులను రంగనాథ్‌ పరిశీలిస్తున్నారు. వర్షాల నేపథ్యంలో పలు చెరువుల్లో నీటి నిల్వల ఆధారంగా ఎఫ్‌టీఎల్‌ను సూత్రప్రాయంగా అంచనా వేస్తున్నారు.

తెలంగాణ బీజేపీలో ముసలం..!

తెలంగాణలో బీజేపీకి బలం పెరిగిందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ఆ పార్టీ దూసుకెళ్తోన్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీట్లు సాధించడం.. ఆ తర్వాత నిజామాబాద్, కరీంగనర్, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం చూపింది. హుజూరాబాద్, దుబ్బాక ఉపఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధించి సత్తా చాటింది. మునుగోడులో కూడా గట్టి పోటీ ఇచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నకల్లో కూడా

ప్రభావం చూపింది.

బీజేపీ నుంచి ఏకంగా 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇక లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ను వెనక్కు నెట్టి 8 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో కాషాయ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగింది. తెలంగాణ నుంచి ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు కూడా దక్కాయి. దీంతో భవిష్యత్ లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ కార్యకర్తలు ఆశతో ఉన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర బీజేపీలో విభేదాలు తలెత్తుతున్నాయి. బీజేఎల్బీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఇతర నేతల మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

తెలంగాణ బీజేపీ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయించింది. రెండు బృందాలుగా ఏర్పాటు చేసి పర్యటనలు చేయాలని భావించింది. ఒక బృందానికి కేంద్ర మంత్రి బండి సంజయ్, మరో బృందానికి మాజీ మంత్రి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ నాయకత్వం వహిస్తారని ప్రకటించారు. బీజేఎల్పీ నేతగా ఉన్న తనకు ఎలాంటి బాధ్యతలు అప్పజెప్పకపోవడంపై ఏలేటి అలకబూనినట్లు తెలుస్తోంది. బృందంలో ఏలేటి ఉన్నా.. అయన బాధితుల పరామర్శకు వెళ్లలేదని ప్రచారం జరుగుతోంది.

ఈటల బృందంలో తనను సభ్యుడిగా చేర్చడంపై మహేశ్వర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు ఆ పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారు. ప్రజా సమస్యలపై ఫ్లోర్ లీడర్‌గా అసెంబ్లీలో గళమెత్తే బాధ్యత ఏలేటిపై ఉండగా ఆయనకు నేతృత్వం ఇవ్వకపోవడం ఏంటని ఆయన అనుచరులు ప్రశ్నిస్తున్నారు. దీంతో కిందస్థాయి నేతలు పార్టీలోని పరిస్థితులపై ఆందోళన చెందుతున్నారు.

కోట్లు వసూలు చేసి.. బోర్డు తిప్పేసిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థ

భూమి కొంటే.. ఇచ్చిన డబ్బులకు నెలనెలా వడ్డీ చెల్లిస్తామన్నారు... ఇచ్చిన కాలవ్యవధిలో వడ్డీతోసహా అసలు చెల్లించి.. రిజిస్ట్రేషన్‌ చేసిన భూమిని తిరిగి తీసుకుంటామని నమ్మించారు. అలా కోట్లాది రూపాయలు వసూలు చేసిన ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ చివరికి బోర్డు తిప్పేసింది.

కేపీహెచ్‌బీ కాలనీ, సెప్టెంబర్‌ 6 : భూమి కొంటే.. ఇచ్చిన డబ్బులకు నెలనెలా వడ్డీ చెల్లిస్తామన్నారు… ఇచ్చిన కాలవ్యవధిలో వడ్డీతోసహా అసలు చెల్లించి.. రిజిస్ట్రేషన్‌ చేసిన భూమిని తిరిగి తీసుకుంటామని నమ్మించారు. అలా కోట్లాది రూపాయలు వసూలు చేసిన ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ చివరికి బోర్డు తిప్పేసింది. మోసం పోయామని గుర్తించిన బాధితులు కేపీహెచ్‌బీ కాలనీ పోలీస్‌స్టేషన్‌కు క్యూ కట్టారు.

పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ కాలనీ, సర్దార్‌ పటేల్‌ నగర్‌లో కె.సురేశ్‌కుమార్‌, వెంకటేశ్‌ రెండేండ్ల కిందట వీ వన్‌ ఇన్‌ ఫ్రా గ్రూపు పేరుతో రియల్‌ ఎస్టేట్‌ సంస్థను ఏర్పాటు చేశారు. వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలం, నర్సాపూర్‌ గ్రామంలో సంస్థకు చెందిన 30 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టారు. ఈ స్థలంలో గుంటకు ఐదు లక్షలుగా రేటు ఫిక్స్‌చేసి.. మార్కెట్‌ చేయడం మొదలు పెట్టారు.

ఐదు లక్షలు చెల్లించిన వారికి గుంట భూమిని రిజిస్ట్రేషన్‌ చేస్తారు. ఆ తర్వాత నెల నుంచి చెల్లించిన ఐదు లక్షలకు గాను.. ప్రతి నెలా రూ.20వేల చొప్పున వడ్డీ చెల్లిస్తారు. 25 నెలల కాలవ్యవధి తర్వాత వడ్డీతోపాటు అసలు చెల్లించి.. కొనుగోలు చేసిన భూమిని తిరిగి తీసుకుంటామనేది సంస్థ వాగ్ధానం. దీన్ని నమ్మిన చాలామంది వడ్డీతో పాటు.. అసలు కూడా వస్తుందని ఆశతో భూములను కొన్నారు. మొదట్లో భూమిని కొన్నవారికి నమ్మకంగా వడ్డీ చెల్లించారు. దీంతో ఒకరికి తెలియకుండా మరొకరు భూమిని కొనుగోలు చేశారు.

అయితే అందులో కొందరికీ నెలనెలా వడ్డీ రాకపోవడంతో సంస్థ కార్యాలయానికి వచ్చి ఆరా తీయగా.. సరైన సమాధానం రాలేదు. అలాగే.. ఎండీ సురేశ్‌కుమార్‌ కూడా కనిపించలేదు. దీంతో మోసపోయామని గుర్తించిన దాదాపు 80 మంది బాధితులు.. శుక్రవారం కేపీహెచ్‌బీ కాలనీ పీఎస్‌ను ఆశ్రయించారు. అయితే ఏడుగురు మాత్రమే ఫిర్యాదు చేశారని, ఈ కేసును ఇవోడబ్ల్యూ పోలీసు విభాగం దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేశ్వర్‌రావు తెలిపారు.

సిఎం రేవంత్‌తో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో కొత్త పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ భేటీ కానున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా నియామకం అయ్యాక.. తొలిసారి మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు.

తన నియామకానికి సహకరించిన రేవంత్‌ రెడ్డికి మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ కృతజ్ఞతలు చెప్పనున్నారు. రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నప్పటి నుంచి పీసీసీ చీఫ్‌గా ఎవరుంటారనే ప్రశ్న అందరినీ వెంటాడింది.

మహేష్‌ కుమార్‌ గౌడ్‌ నియామకంతో క్వశ్చన్‌మార్క్‌కు పుల్‌ స్టాప్‌ పడింది. ప్రస్తుతం ఎమ్మెల్సీతో పాటు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న మహేష్‌ కుమార్‌ గౌడ్‌కు సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు పార్టీ సీనియర్లందరితో సత్సంబంధాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో అధిష్టానం ఆయనకే పట్టం కట్టింది. బీసీ నేతకు పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టడంపై బీసీ నాయకులు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.