/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం Yadagiri Goud
సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి ప్ర‌మాదం త‌ప్పింది. రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లోని ల్యాండ్ క్రూజ‌ర్ కారు టైర్ పంక్చ‌ర్ అయి పేలిపోయింది.

కారు స‌డెన్‌గా ఆగిపోయిం ది. దీంతో పోలీసులు ఉలి క్కిప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌ లో ఎవ‌రికీ గాయాలు కాలేదు.

రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ నుంచి కొడంగ‌ల్ వెళ్తున్న స‌మ‌యంలో వికారాబాద్ జిల్లా మ‌న్నెగూడ వ‌ద్ద ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

కాన్వాయ్‌లో వెళ్తున్న నాయ‌ కుల‌కు ఎలాంటి ప్ర‌మాదం సంభ‌వించక‌పోవ‌డంతో పోలీసులు ఊపిరి పీల్చు కున్నారు...

నోట్ల గుట్టలు.. బంగారం సంచులు.. ఎన్నికల వేళ భారీగా పట్టివేత

లోక్‌సభ ఎన్నికలు (Lok sabha Elections) సమీపిస్తున్న వేళ కర్ణాటక (Karnataka)లో భారీగా అక్రమ నగదు, బంగారం బయటపడటం తీవ్ర కలకలం రేపింది..

బళ్లారి (Bellary)లో ఓ వ్యాపారి ఇంట్లో పోలీసులు సోదాలు జరపగా.. రూ.7.6 కోట్ల నగదు, బంగారు, వెండి ఆభరణాలను గుర్తించారు.

బళ్లారిలో హవాలా కార్యకలాపాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం రావడంతో బ్రూస్‌పేట్‌ పోలీసులు రంగంలోకి దిగారు. స్థానిక ఆభరణాల వ్యాపారి నరేశ్‌ సోనీ ఇంట్లో ఆకస్మిక సోదాలు చేపట్టారు. లెక్కల్లోకి రాని భారీ నగదు, ఆభరణాలను గుర్తించారు. రూ.5.6 కోట్ల కరెన్సీ, 103 కిలోల వెండి ఆభరణాలు, 68 వెండి కడ్డీలు, 3 కిలోల బంగారు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

హవాలా మార్గంలో వీటిని తీసుకొచ్చి ఉంటారన్న అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వ్యాపారి నరేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ వివరాలను ఆదాయపు పన్ను విభాగానికి అందజేస్తామని, అనంతరం ఐటీ అధికారులు దీనిపై తదుపరి దర్యాప్తు చేపడుతారని తెలిపారు. పోలింగ్‌ దగ్గరపడుతున్న వేళ ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కర్ణాటకలోని మొత్తం 28 లోక్‌సభ స్థానాలకు రెండు దశల్లో ఏప్రిల్‌ 26, మే 4వ తేదీన పోలింగ్‌ జరగనుంది.

తెలంగాణ మంత్రి పొంగులేటి కుమారుడికి కస్టమ్స్‌ సమన్లు

చెన్నై : తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షారెడ్డికి చెన్నై కస్టమ్స్‌ విభాగం సమన్లు జారీచేసింది. ఆయన డైరెక్టర్‌గా ఉన్న హైదరాబాద్‌లోని కంపెనీకి వాటిని పంపి విచారణకు హాజరవ్వాలని పేర్కొంది..

ఆయన విదేశాల నుంచి అత్యంత ఖరీదైన చేతి గడియారాలను తెప్పించినట్లు ఆరోపించింది. ఈ నెల 4న తమ ఎదుట హాజరవ్వాలని సమన్లు జారీ చేయగా.. తాను డెంగీ జ్వరంతో బాధపడుతున్నందున రాలేకపోతున్నట్లు ఆయన తెలియజేశారు. ఈనెల 27 తర్వాత హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశారు..

పీటీఐ వార్తా సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. హాంకాంగ్‌లో ఉంటున్న భారతీయుడు, లగ్జరీ వాచ్‌ల డీలర్‌ ముహమ్మద్‌ ఫహేరుద్దీన్‌ ముబీన్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 5న అలోకం నవీన్‌కుమార్‌ సింగపూర్‌-చెన్నై విమానంలో గడియారాలను తెచ్చాడు. అతడిపై స్మగ్లింగ్‌ కేసు నమోదైంది. ఆ వాచీల విలువ రూ.1.73 కోట్లు. వాటిని హర్షారెడ్డి కోసం తెచ్చినట్లు కస్టమ్స్‌ ఆరోపిస్తోంది..

తాను హర్షారెడ్డికి, ముబీన్‌కు మధ్యవర్తిగా ఉన్నట్లు నవీన్‌కుమార్‌ తెలిపాడు. క్రిప్టో కరెన్సీ ద్వారా హర్షారెడ్డి ఆ డబ్బులు బదలాయించినట్లు విచారణలో బయటపడింది. చెన్నైలోని అలందూరు కోర్టు ఏప్రిల్‌ 1న ఇచ్చిన ఉత్తర్వుల మేరకు నవీన్‌కుమార్‌ను అరెస్టు చేయడంతో పాటు హర్షారెడ్డిని విచారించేందుకు కస్టమ్స్‌ అధికారులు సిద్ధమయ్యారు. హర్షారెడ్డి పీటీఐతో మాట్లాడుతూ.. కస్టమ్స్‌ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని అన్నారు..

ఏమ్మెల్సీ కవిత బెయిల్ కు కోర్టు నిరాకరణ

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈరోజు తీవ్ర నిరాశ ఎదురయింది.

కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరిం చింది. ఆమె బెయిల్ పిటి షన్ ను కొట్టివేసింది. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్న నేపథ్యంలో… తనకు బెయిల్ మంజూరు చేయా లని కోర్టును కవిత కోరారు.

అయితే, కవిత బెయిల్ పై బయటకు వెళ్తే సాక్షులను ప్రభావితం చేస్తారని కోర్టులో ఈడీ వాదనలు వినిపిం చింది. ఇప్పటికే కొందరిని కవిత బెదిరించిందని కోర్టుకు తెలిపింది.

ఈడీ వాదనలతో ఏకీభ వించిన కోర్టు… కవిత బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది.లిక్కర్ కేసులో కవితను మార్చి 15వ తేదీన ఈడీ అరెస్ట్ చేసింది. తొలుత ఈడీ కస్టడీలో ఉన్న కవితకు కోర్టు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది.

ఈ క్రమంలో, మార్చి 26వ తేదీ నుంచి ఆమె తీహార్ జైల్లో ఉంటున్నారు. రేపటి తో ఆమె జ్యుడీషియల్ రిమాండ్ ముగియబోతోంది. ఆమె జ్యుడీషియల్ రిమాం డ్ ను కోర్టు పొడిగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

ఢిల్లీ పై విజయం సాధించిన ముంబై


ఐపీఎల్‌-17 సీజన్‌లో ముంబయి ఖాతా తెరించింది. ఢిల్లీతో మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో గెలుపొందింది.

235 పరుగుల లక్ష్య ఛేదన కు దిగిన ఢిల్లీ 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులకే పరిమితమైంది. స్టబ్స్‌ (71) పోరాటం వృథా అయ్యింది.

ఓపెనర్‌ పృథ్వీ షా (66), పోరెల్‌ (41), తీవ్ర ప్రయత్నిం చినప్పటికీ దిల్లీకి ఓటమి తప్పలేదు.

ముంబయి బౌలర్లలో కొయెట్జీ 4 వికెట్లు తీయగా, బుమ్రా 2, షెపర్డ్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసిన విషయం తెలిసిందే..

కొండెక్కిన కోడి

చికెన్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ నగరంలో కిలో స్కిన్ లెస్ రూ.294 కి చేరింది.

విత్ స్కిన్ చికెన్ ధర రూ. 258 గా ఉంది. వేసవి తాకిడి కారణంగా కోళ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో ధరలు అమాంతంగా పెరిగిపోయాయని వ్యాపా రస్తులు చెబుతున్నారు.

గత ఆదివారం కిలో స్కిన్ లెస్ చికెన్ ధర ఇప్పటికంటే సుమారు రూ.30 రూపా యలు తక్కువగా ఉంది.

రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారస్థులు అభిప్రాయపడుతున్నారు...

నేడు తెలంగాణ లో 44 డిగ్రీలు దాటిన టెంపరేచర్

తెలంగాణ లో ఆదివారం కూడా భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావ రణ శాఖ హెచ్చరించింది.

దక్షిణ తెలంగాణలో వేడీ తీవ్రత భారీగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం నుంచి ఐదు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఈదురుగాలులు, ఉరు ములు మెరుపులతో కూడిన వానలు పడతా యని వివరించింది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల జిల్లాలతో పాటు జనగామ, సిద్దిపేట, మెదక్​, కామారెడ్డి, ములుగు, మహబూబా బాద్, వరంగల్, హనుమ కొండ, జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది.

ఉత్త‌ర తెలంగాణ‌కు అల‌ర్ట్‌..

మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రికొత్త గూడెం, ఖమ్మం, సూర్యా పేట, నల్గొండ జిల్లాల్లో అత్యధికంగా టెంపరేచర్ల నమోదవుతున్నాయి.

నల్గొండ జిల్లాలోని 30 మండలాలు, సూర్యాపేట లోని 18 మండలాలు, భద్రాద్రిలోని 19 మండలా లు, ఖమ్మంలోని 18, మంచిర్యాలలోని 11 మండలాలు, పెద్దపల్లి జిల్లాలోని 10 మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి..

విశాఖపట్నం కింగ్ జార్జి ఆస్పత్రి నుంచి కరుడుగట్టిన ఖైదీ పరార్

ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదా యిని విశాఖ పట్నం కింగ్ జార్జి హాస్పిటల్ క్రమేపీ నేరగాళ్ల అడ్డగా మారిపో యిందంటే కేవలం ఆరోపణ కాదు. అనారోగ్యం పేరుతో కేజీహెచ్ లో చేరి.. పోలీసు ల కళ్లగప్పి పారిపోయే నేర గాళ్లకు అనువైన ప్రాంతంగా మారిపోయింది. ఈ ఆస్పత్రి..

తాజాగా ఇలాంటి ఘటనే శనివారం తెల్లవారుజా మున మూడు గంటలకు చోటు చేసుకుంది. ఇక్కడ చికిత్స పొందుతున్న ఓ కరుడుగట్టిన ఖైదీ వాష్ రూమ్ కి వెళ్లి తనకు సెక్యూరిటీ పోలీసును పక్కకు నెట్టి అక్కడి నుంచి పారిపోయాడు.

ప్రస్తుతం ఈ ఘటన విశాఖ లో కలకలం రేపింది. కేజీహెచ్ లో ఈ ఘటనతో పోలీసులు, విశాఖ జిల్లా యంత్రాంగం, కేజీహెచ్ సిబ్బంది అవాక్కయ్యారు. అప్రమత్తమయ్యారు.

ఎస్కార్ట్కు ఝలక్ …

తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు మండలం, పెదవలస గ్రామానికి చెందిన బోన్నిధి మహాలక్ష్మి అలియా స్ రాజు పోలీసులు కళ్లు గప్పి ఆసుపత్రి నుంచి పారిపోయాడు.

పోస్కో కేసులో కోర్టు రెండేళ్ల శిక్షను విధించింది. విశాఖ సెంట్రల్ జైలుకు తరలిం చారు. 2022 జూన్ 13 నుంచి ఈ జైలులో ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. జైలు నుంచి పారిపోవ టానికి పక్కా ప్లాన్ రచించాడు.

2024 మార్చి 11న మెటల్ గోర్లు, జీఐ వైర్ ముక్కలు తిన్నాడు. కడుపునొప్పి బాధపడుతున్నాడని చికిత్స కోసం కేజీహెచ్‌కి తరలించి రాజేంద్ర ప్రసాద్ వార్డులో చేర్పించారు.

మార్చి 22న శస్త్రచికిత్స నిమిత్తం సూపర్ స్పెషాలిటీ వార్డులోకి నిందితుడిని మార్చారు. ఇక ఏప్రిల్ 6న రాత్రి రెండు గంటల సమ యంలో డ్యూటీలోని ఎస్కార్ట్ పోలీస్ కు వాష్ రూమ్‌కి వెళ్లాలని చెప్పి అతడిని తోసేసి ఆ వార్డు నుంచి నిందితుడు పారిపోయాడు.వెంటనే ఎస్కార్ట్ రాజనా కళ్యాణ్ (39) పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఖైదీని వెతికే పనిలో పడ్డారు....

మెట్రో స్టేషన్‌లో గన్‌తో కాల్చుకుని జవాన్ ఆత్మహత్య

మెట్రో స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ ఆర్మీ జవాన్ తన గన్ తో కాల్చు కుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనంగా మారింది.

ఢిల్లీ విహార్ వెస్ట్ మెట్రో స్టేషన్‌లో ఈ ఘటన తాజాగా చోటు చేసుకోగా.. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డు అయ్యాయి.

ఆ వీడియో జవన్ తన గన్ తో కాల్చుకుని చనిపోవడం స్పష్టంగా కనిపించింది. కాగా ప్రస్తుతం ఈ వీడియలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అతను మహారాష్ట్ర గడ్చి రోలి కి చెందిన CISF జవాన్ సహరే కిషోర్ గా పోలీసులు తెలిపారు. ఢిల్లీ విహార్ వెస్ట్ మెట్రో స్టేషన్‌లో 2022 నుండి విధులు నిర్వహి స్తున్నారు.

సహరే కిషోర్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది...

సంగారెడ్డి జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత

గంజాయి రవాణాపై పోలీ సులు ఉక్కుపాదం మోపు తున్నారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి గంజాయి అక్రమ రవాణాను కట్టడి చేస్తున్నారు.

తాజాగా సంగారెడ్డి జిల్లా కొల్లూరులో 32 కేజీల గంజాయిని మాదాపూర్‌ ఎస్‌వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే..సంగారెడ్డి కు చెందిన బానోతు లక్ష్మణ్‌ అనే యువకుడు ఏపీ నుంచి గంజాయి తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తు న్నాడు.

సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మణ్‌పై ఎన్‌డీపీఎస్‌ యాక్టు, NDPS,కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...