/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png
NLG: ప్రచార రథాన్ని ప్రారంభించిన కన్మంతరెడ్డి శ్రీదేవి రెడ్డి
నల్లగొండ: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం.. కేంద్రంలో, రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పధకాలకు నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేయడానికి ప్రచార రథాన్ని ప్రారంభించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కన్మంతరెడ్డి
TS: మరో రెండు గురుకులాల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ
రెండు బీసీ గురుకుల 'లా' కాలేజీ లు:
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొత్తగా పలుచోట్ల డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయగా, తాజాగా రెండు బీసీ గురుకుల డిగ్రీ లా కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒకటి హన్మకొండలో ఏర్పాటు చేయనుండగా, మరొకటి రంగారెడ్డి జిల్లా కందుకూరు లో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం శుక్రవారం అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభించనున్నారు. ఈ కాలేజీల్లో బీఏ ఎల్‌ఎల్‌బీ, బీబీఏ ఎల్‌ఎల్‌ఎల్‌బీ 5 ఇంటిగ్రేటెడ్ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు.
Share it
వాట్సప్ సరికొత్త ఫీచర్... ఇప్పుడు సెండ్ అయిన మెసేజ్ లను సవరించవచ్చు...
NEW: వాట్సాప్ మరొక సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. మీరు పంపిన వాట్సాప్ మెసేజ్ లు సవరించుకోవడానికి అవకాశం కల్పించింది. సందేశాన్ని టైప్ చేయడంలో చిన్న పొరపాటు జరిగిందా? పెద్ద గా చింతించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు మెసేజ్ లను పంపిన తర్వాత 15 నిమిషాల వరకు సులభంగా ఎడిట్ చేయవచ్చు, మీరు తప్పు ను రద్దు చేయాలన్నా లేదా ఎమోజీని మార్చాలనుకున్నా సులభంగా మార్చవచ్చు. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మెసేజ్ టైప్ చేసినప్పుడు పొరపాటు జరిగి సెండ్ చేశారా, ఐతే 15 నిమిషాల లోపు కుడివైపు పైన ఉన్న మూడు చుక్కల వద్ద క్లిక్ చేసి ఎడిట్ ఆప్షన్ లోకి వెళ్లి మీరు మార్చాలనుకున్న సందేశాన్ని మార్చి తిరిగి పంపవచ్చు.
NLG: తెలంగాణ తైక్వాండో మహిళా జట్టు కోచ్ గా అంబటి ప్రణీత్
ఈ నెల 9వ తేదీ నుండి 11 వ తేదీ వరకు అస్సాంలో నిర్వహించే 39వ జాతీయ తైక్వాండో సీనియర్ కైరూగీ మరియు 12వ జాతీయ పూమాస్ క్రీడల సందర్భంగా, తెలంగాణ తైక్వాండో మహిళా జట్టు కోచ్ గా అంబటి ప్రణీత్ ను నియమించారు. ఈ సందర్భంగా ఈ అద్భుతమైన అవకాశాన్ని కల్పించిన గ్రాండ్ మాస్టర్ TTA ప్రెసిడెంట్ డి. సతీష్ గౌడ్, TTA జనరల్ సెక్రటరీ గ్రాండ్ మాస్టర్ ఏ. ప్రవీణ్ కుమార్, TTA రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు TTAN నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మాస్టర్ Md. యూనస్ కమల్ లకు ప్రత్యేక ధన్యవాదాలు అని కోచ్ అంబటి ప్రణీత్ తెలిపారు.
NLG: గట్టుప్పల్ మండల ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
నల్లగొండ జిల్లా:
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని గట్టుప్పల్ మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు నేడు సన్మానం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా చండూరు జడ్పిటిసి కర్నాటి వెంకటేశం హాజరై ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో చండూరు ఎంపీపీ పల్లె కళ్యాణి రవి కుమార్, గట్టుప్పల్ ఎమ్మార్వో, చండూరు మండల ఎంఈఓ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు, గ్రామ పెద్దలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.
NLG: ఎన్జీ కళాశాలలో ఓటర్ నమోదు పై అవగాహన సదస్సు
నల్లగొండ: పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈరోజు రాజనీతి శాస్త్రము మరియు ప్రభుత్వ పాలన శాస్త్రం ఆధ్వర్యంలో ఓటర్ నమోదు పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్డీవో రవి విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 18 సంవత్సరాల నిండిన విద్యార్థినీ విద్యార్థులు అందరూ ఓటరుగా తమ పేరు నమోదు చేయించుకోవాలని, అదేవిధంగా విధిగా తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని,సమర్థులైన వారిని తమ ప్రతినిధులుగా ఎన్నుకోవాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఘన శ్యామ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేయాలంటే యువత, తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. విద్యార్థులు నిజాయితీగా నిబద్ధతతో తమ ఓటును వినియోగించుకోగలిగినప్పుడే సరి అయిన ప్రభుత్వాలు ఏర్పడతాయని అన్నారు. అనంతరం 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులందరికీ ఓటర్ నమోదు పత్రాలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారులు నాగుల వేణు, డాక్టర్ ఎస్. యాదగిరి, ఈ. యాదగిరి రెడ్డి, గంజి భాగ్యలక్ష్మి, శివ రాణి, అధ్యాపకులు సీతారాం రాథోడ్, గ్రంథ పాలకులు డాక్టర్ దుర్గాప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ మల్లేష్, డాక్టర్ కృష్ణ కౌండిన్య, వెంకటరమణ, మరియు విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
హోంగార్డ్ రవీందర్ కుటుంబానికి 50 లక్షల పరిహారం చెల్లించి, అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి: వైయస్ షర్మిల
TS: రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల పాలు చేసిన కేసీఆర్ కు.. హోం గార్డు లకు సకాలంలో జీతాలు ఇవ్వాలన్న మనసు లేకపోవడం బాధాకరం అని వైఎస్ఆర్ టిపి అధినేత్రి వైయస్ షర్మిల అన్నారు. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన హోం గార్డు రవీందర్ కు సకాలంలో జీతం అందక పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని, రవీందర్ చావుకు ముమ్మాటికీ కేసీఆర్ ప్రభుత్వమే కారణం అని ఆమె ఆరోపించారు.
హోం గార్డులను రెగ్యులరైజ్ చేస్తామని కేసీఆర్ 2017లో హామీ ఇచ్చినా నేటికీ నెరవేర్చలేదని అన్నారు. హోంగార్డు లకు సమయానికి జీతాలు రావు, కనీస గౌరవం ఉండదని, మీ నిర్లక్ష్యానికి ఇంకెన్ని ప్రాణాలు బలవ్వాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హామీ ఇచ్చిన విధంగా 20 వేల మంది హోంగార్డులను తక్షణమే పర్మినెంట్ చేసి, డబుల్ బెడ్ రూం ఇండ్లు, హెల్త్ కార్డులు ఇచ్చి మాట నిలబెట్టుకోవాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న రవీందర్ కుటుంబానికి 50 లక్షల పరిహారం చెల్లించి, అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నామని షర్మిల తెలిపారు.
SRPT: అమ్మవారి విగ్రహ పున: ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న మంత్రి
సూర్యాపేట: నియోజకవర్గంలోని నెమ్మికల్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ దండు మైసమ్మ అమ్మవారి విగ్రహ పున: ప్రతిష్టాపన మహోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సతీ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో ఆలయాల పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది.
కార్యక్రమంలో పలువురు బి ఆర్ ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
సీసీ రోడ్డు ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే నోముల భగత్
NLG: "మన ఊరు- మన ఎమ్మెల్యే" కార్యక్రమంలో భాగంగా మాడుగుల పల్లి మండలం గోపాలపురం గ్రామంలో శుక్రవారం సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల భగత్ పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నోముల భగత్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల్ని వీలైనంత తొందరగా పరిష్కరించడానికి కృషి చేస్తున్నామన్నారు. ఎన్ఆర్ ఈజీఎస్ నిధులు రూ.20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు ను ఆయన ప్రారంభోత్సవం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Sep 09 2023, 13:17