మీ ఫోన్ సిమ్ కార్డు సడెన్‌గా బ్లాక్ అయ్యిందా, ఐతే మీ బ్యాంకు ఖాతాలో సొమ్ము హాం ఫట్!
HYD: హ్యాకర్లు కొత్త తరహా మోసం.. ఆదమరిస్తే ఇక పోలీస్ స్టేషన్ నే గతి.. స్మార్ట్ ఫోన్ వచ్చాక వ్యక్తిగత సమాచారం సులువుగా ఇతరులు చేతుల్లోకి వెళ్లిపోతోంది. క్షణాల్లో బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. రోజుకో కొత్త మార్గంలో అమాయకుల ఫోన్ల నుంచి కేటుగాళ్లు నగదు దోచుకుంటున్నారు. తాజాగా నగరానికి చెందిన ఓ విశ్రాంత ఉద్యోగి ఫోన్ మూడు రోజులుగా పనిచేయడం మానేసింది. నెట్‌వర్క్ సమస్య వచ్చి ఉంటుందని భావించాడు. సమీపంలోని ఏటీఎంలో నగదు విత్ డ్రా చేసుకోవడానికి వెళ్లితే అకౌంట్ లో జీరో బ్యాలెన్స్ చూపించే సరికి ఉలిక్కిపడ్డాడు. ఏం జరిగిందో తెలుసుకోవడానికి బ్యాంక్ కు వెళ్లి ఆరా తీస్తే తన అకౌంట్ నుంచి దాదాపు రూ.3 లక్షల నగదు వేరే అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ అయినట్లు బ్యాంకు సిబ్బంది తెలిపింది.
హబ్సిగూడకు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగికు ఈ చేదు అనుభవం ఎదురైంది. మెహిదీ పట్నం కి చెందిన మరో వ్యక్తి అకౌంట్ నుంచి రూ.20 వేలు డెబిట్ అయినట్లు ఫోన్‌కు సందేశం వచ్చింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపు దఫాలుగా అతని అకౌంట్ నుంచి 6 లక్షల రూపాయలు మాయం చేశారు. నేరుగా అతని ఫోన్‌కు కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు తన ఫోన్‌కు వచ్చిన లింక్ క్లిక్ చేయవల్సిందిగా కోరారు. అనంతరం బాధితుడి ఫోన్‌కు వచ్చిన ఓటీపీ తెలుసుకొని దశల వారీగా మొత్తం డబ్బు కొట్టేశారు.
ఈ మధ్యకాలంలో ఫోన్ సిమ్ కార్డులు ఉన్నట్లుండి బ్లాక్ అవుతున్న సంగతి తెలిసిందే. అనేక మంది ఫోన్‌లలో సిమ్‌లు అలాగే ఉంటున్నాయి. అకస్మాత్తుగా సిమ్‌కార్డులు బ్లాక్ అవుతున్నాయి. ఏం జరిగిందో గుర్తించేలోపుగానే బ్యాంకు అకౌంట్‌లో డబ్బు గుట్టుచప్పుడుకాకుండా మాయం అవుతోంది. రెండేళ్ల క్రితం ఈ తరహా స్విమ్‌కార్డు క్లోనింగ్, సిమ్‌స్వాపింగ్‌లతో సైబర్ నేరగాళ్లు వరుస మోసాలకు పాల్పడ్డారు. ఇప్పుడు మళ్లీ అచ్చం అదేమాదిరి ఫోన్ సిమ్‌కార్డుల ద్వారా అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు. గ్రేటర్‌లోని 3 కమిషనరేట్ల పరిధిలో వస్తున్న సైబర్ ఫిర్యాదుల్లో ఓటీపీ బాధితులే అధికంగా ఉంటున్నారు. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయాలంటే అవగాహనే సరైన మార్గమని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. తద్వారా హ్యాకర్లు, మాయగాళ్లు కలసి చేస్తున్న మోసాలకు పుల్‌స్టాప్ పెట్టవచ్చని అంటున్నారు.
అసలు ఫోన్ నెంబర్లతో వీళ్లేం చేస్తారంటే.. చేతి తిరిగిన నైజీరియన్ హ్యాకర్లు, మెయిల్ ఐడీలు లక్ష్యంగా ఈ విధమైన మోసాలకు పాల్పడుతున్నారు. సులువైన పాస్‌వర్డ్ ఉన్నవాటిని తేలికగా హ్యాక్ చేసి వాటి సాయంతో బ్యాంకు ఖాతా, ఫోన్ నంబర్లను సేకరిస్తారు. అలా సేకరించిన సమాచారాన్ని రాజస్థాన్, ఢిల్లీలోని సైబర్ నేరస్థులకు చేరవేస్తారు. ఆయా సెల్‌నంబర్లకు వేర్వేరు సిమ్‌కార్డుల నుంచి 5 సార్లు ఫోన్లు చేస్తారు. వాటి ఆధారంగా సమీపంలోని సర్వీస్‌ప్రొవైడర్ ఆఫీస్‌కు వెళ్లి తమ సెల్‌ఫోన్ పోయిందని, సిమ్‌కార్డు బ్లాక్ చేయమని కోరతారు. సర్వీస్ ప్రొవైడర్ల నిబంధనల ప్రకారం చివరిగా ఫోన్‌చేసిన 5 నంబర్లు అడుగుతారు. వాటి ద్వారా అదే నంబర్‌తో కొత్త సిమ్‌లు సేకరిస్తారు. ఇలా సేకరించిన సిమ్ కార్డులను ఫోన్ వేస్తారు. బ్యాంకు లావాదేవీల సమయంలో ఆ నెంబర్‌కు ఓటీపీలు వస్తాయి. అలా వచ్చిన ఓటీపీతో ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఇలాంటి మోసాలు నిందితులు శని, ఆదివారాల్లో మాత్రమే చేస్తారు. ఈ రెండు రోజులు బ్యాంకులకు సెలవు దినాలు. బాధితులు ఫోన్ చేసినా బ్యాంకు సేవలు పొందేందుకు ఆలస్యమవుతుండటమే అందుకు కారణం. ఈ మోసాల నుంచి బయటపడాలంటే.. గుర్తు తెలియని ఫోన్ల ఉంచి ఐదు ఫోన్‌కాల్స్ వస్తే వెంటనే అప్రమత్తం కావాలి. వరుసగా రెండు మూడ్రోజులు సిమ్ పనిచేయకపోతే వెంటనే సర్వీస్ ప్రొవైడర్‌కు ఫిర్యాదు చేయాలి. బ్యాంకు ఖాతా నుంచి ఆన్‌లైన్ సేవలు నిర్వహించకుండా ఆ నంబర్‌ను బ్లాక్ చేయాలి. అలాగే బ్యాంకులపేరిట వచ్చే లింకులను క్లిక్ చేయకూడదు. ఎవరైనా ఈ తరహాలో మోసపోతే వెంటనే 1930 నంబరుకు ఫిర్యాదు చేయాలని సైబర్ క్రైం పోలీసులు సూచిస్తున్నారు.

HYD: హ్యాకర్లు కొత్త తరహా మోసం.. ఆదమరిస్తే ఇక పోలీస్ స్టేషన్ నే గతి.. స్మార్ట్ ఫోన్ వచ్చాక వ్యక్తిగత సమాచారం సులువుగా ఇతరులు చేతుల్లోకి వెళ్లిపోతోంది. క్షణాల్లో బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. రోజుకో కొత్త మార్గంలో అమాయకుల ఫోన్ల నుంచి కేటుగాళ్లు నగదు దోచుకుంటున్నారు. తాజాగా నగరానికి చెందిన ఓ విశ్రాంత ఉద్యోగి ఫోన్ మూడు రోజులుగా పనిచేయడం మానేసింది. నెట్‌వర్క్ సమస్య వచ్చి ఉంటుందని భావించాడు. సమీపంలోని ఏటీఎంలో నగదు విత్ డ్రా చేసుకోవడానికి వెళ్లితే అకౌంట్ లో జీరో బ్యాలెన్స్ చూపించే సరికి ఉలిక్కిపడ్డాడు. ఏం జరిగిందో తెలుసుకోవడానికి బ్యాంక్ కు వెళ్లి ఆరా తీస్తే తన అకౌంట్ నుంచి దాదాపు రూ.3 లక్షల నగదు వేరే అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ అయినట్లు బ్యాంకు సిబ్బంది తెలిపింది.
హబ్సిగూడకు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగికు ఈ చేదు అనుభవం ఎదురైంది. మెహిదీ పట్నం కి చెందిన మరో వ్యక్తి అకౌంట్ నుంచి రూ.20 వేలు డెబిట్ అయినట్లు ఫోన్‌కు సందేశం వచ్చింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపు దఫాలుగా అతని అకౌంట్ నుంచి 6 లక్షల రూపాయలు మాయం చేశారు. నేరుగా అతని ఫోన్‌కు కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు తన ఫోన్‌కు వచ్చిన లింక్ క్లిక్ చేయవల్సిందిగా కోరారు. అనంతరం బాధితుడి ఫోన్‌కు వచ్చిన ఓటీపీ తెలుసుకొని దశల వారీగా మొత్తం డబ్బు కొట్టేశారు.
ఈ మధ్యకాలంలో ఫోన్ సిమ్ కార్డులు ఉన్నట్లుండి బ్లాక్ అవుతున్న సంగతి తెలిసిందే. అనేక మంది ఫోన్‌లలో సిమ్‌లు అలాగే ఉంటున్నాయి. అకస్మాత్తుగా సిమ్‌కార్డులు బ్లాక్ అవుతున్నాయి. ఏం జరిగిందో గుర్తించేలోపుగానే బ్యాంకు అకౌంట్‌లో డబ్బు గుట్టుచప్పుడుకాకుండా మాయం అవుతోంది. రెండేళ్ల క్రితం ఈ తరహా స్విమ్‌కార్డు క్లోనింగ్, సిమ్‌స్వాపింగ్‌లతో సైబర్ నేరగాళ్లు వరుస మోసాలకు పాల్పడ్డారు. ఇప్పుడు మళ్లీ అచ్చం అదేమాదిరి ఫోన్ సిమ్‌కార్డుల ద్వారా అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు. గ్రేటర్‌లోని 3 కమిషనరేట్ల పరిధిలో వస్తున్న సైబర్ ఫిర్యాదుల్లో ఓటీపీ బాధితులే అధికంగా ఉంటున్నారు. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయాలంటే అవగాహనే సరైన మార్గమని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. తద్వారా హ్యాకర్లు, మాయగాళ్లు కలసి చేస్తున్న మోసాలకు పుల్‌స్టాప్ పెట్టవచ్చని అంటున్నారు.

యాదాద్రి జిల్లా, చౌటుప్పల్: పట్టణ కేంద్రంలోని తాల్లసింగారంలో శ్రీ కృష్ణాష్టమి పండుగ సందర్భంగా, యాదవ సంఘం ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసినటువంటి ఉట్లు కొట్టే కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్ పర్సన్ వెన్ రెడ్డి రాజు పాల్గొన్నారు. వారి చేతుల మీదగా ఉట్ల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో బత్తుల స్వామీ, బి ఆర్ ఎస్ వార్డు అధ్యక్షులు బొంగు నాగేష్, బొంగు మల్లేష్, మాజీ సర్పంచ్ నల్ల అంజయ్య, మాజీ సర్పంచ్ సుర్వి నరసింహా, చిలువేరు శ్రీశైలం,గణేష్, ప్రవీణ్, మల్లేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు ఇచ్చిన గడువును UIDAI మరో 3 నెలలు పొడిగించింది. ఈ గడువు ఈనెల 14తో ముగియాల్సి ఉండగా, తాజాగా డిసెంబర్ 14 వరకు పొడిగించింది.
నల్లగొండ జిల్లా, పిఏ పల్లి మండలం:
కౌవులు రైతులు, కర్షకులు, కూలీల పరిస్థితులు దయనీయంగా దారుణంగా ఉంది. వందల ఎకరాలు ఉన్న వారికి సైతం రైతుబంధు వస్తున్నది, మరి కౌలు రైతులు ఏ పాపం చేశారని ప్రశ్నించారు. గడీ ల పాలన పోయి బహుజన పాలన రావాలని, అందుకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఉన్నతమైన ఉద్యోగాన్ని వదిలి నేడు మనకోసం వచ్చారు. మనమందరం కూడా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ వెంట నిలబడి, బహుజన రాజ్యం సాధించుకుంటే మన కష్టాలన్నీ తీరుతాయని అన్నారు. నియోజకవర్గ కార్యదర్శి బాలునాయక్, అర్జున్ నాయక్, స్వామి నాయక్, సోమ్ల నాయక్, తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ: సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా, పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల గ్రంథ పాలకులు డాక్టర్ దుర్గాప్రసాద్, బీసీ హాస్టల్ విద్యార్థులకు 5000 రూపాయల విలువచేసే కాంపిటీటివ్ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలను అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని, ఆ లక్ష్యాన్ని సాధించడానికి నిరంతర కృషి చేయాలి అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థితిలో ఉండాలని అన్నారు. కార్యక్రమంలో వార్డెన్ రామకృష్ణారెడ్డి, నాగార్జున ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు యాదగిరి రెడ్డి, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
నల్గొండ జిల్లా, చిట్యాల మండల బిఎస్పి పార్టీ మహిళా కన్వీనర్ గా చిట్యాల మున్సిపాలిటీ చెందిన పాల భవాని ని నకిరేకల్ మహిళ కన్వీనర్ మర్రి శోభ ఎంపిక చేశారు. ఈ సందర్భంగా పాల భవాని మాట్లాడుతూ.. చిట్యాల మండలంలో మహిళలు ఎంతో వెనుకబడి ఉన్నారని, వారికోసం కష్టపడి పని చేస్తానని ఆమె అన్నారు. మహిళలకు గుర్తింపు తెచ్చేవిధంగా బిఎస్పీ పార్టీ కీలకమైన పోస్టులు ఇస్తున్నారని అన్నారు.
బహుజన్ సమాజ్ పార్టీలో మండల మహిళా కన్వీనర్ గా పనిచేయడం నాకెంతో ఆనందంగా ఉందని, పార్టీ అధినేత మాయావతి ని స్ఫూర్తిగా తీసుకొని మహిళలు ఎంతో చైతన్యం అవుతున్నారని తెలిపారు. భవిష్యత్ కార్యాచరణలో చైతన్యవంతులు మహిళలు ముందుకు తీసుకెళ్లడమే నా బాధ్యతగా నిర్వహిస్తానని ఆమె అన్నారు.
నల్గొండ: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయిలో నిన్న ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం స్వీకరించిన ఎన్జీ కళాశాల రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ అంతటి శ్రీనివాసులు ను బుధవారం ఎన్జీ కళాశాలలో రసాయన శాఖ విభాగం మరియు పిజి రసాయన శాస్త్ర విద్యార్ధులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వి. శ్రీనివాసులు, అకడమిక్ కోఆర్డినేటర్ మాట్లాడుతూ.. డాక్టర్ అంతటి శ్రీనివాసులు కు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం లభించడం చాలా అభినందనీయమని, టీచింగ్ లో పరిశోధనలో మరియు వివిధ విభాగాల పర్యవేక్షణలో ఆయన కృషికి తగిన గుర్తింపు లభించిందని అన్నారు.
గతంలో వీరు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా, జూనియర్ కళాశాల అధ్యాపకుడిగా పనిచేశారని ప్రస్తుతం డిగ్రీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ గా, పరిశోధనలో గైడ్ గా, గత 20 సంవత్సరాలుగా బోధన వృత్తి లో ఉంటూ అనేక జాతీయ మరియు అంతర్జాతీయ జర్నల్ లలో పరిశోధన పత్రాలను ప్రచురించారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రసాయన శాస్త్ర అధ్యాపకులు నాగి రెడ్డి, చింత ముత్తయ్య, డా.బాల స్వామి, యాదగిరి రావు, చంద్ర శేఖర్, డా.వెంకటేశ్వర్లు మరియు పీజీ విద్యార్ధులు, తదితరులు పాల్గొన్నారు.
మర్రిగూడ: అంగన్వాడి ఉద్యోగులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ఆధ్వర్యంలో మండల తాహశీల్దార్ కు బుధవారం సీఐటీయూ ఏఐటియుసి ఆధ్వర్యంలో సమ్మె నోటీసు అందజేశారు.
ఉద్యోగులు సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వారు కోరారు. పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం తదితర రాష్ట్రాల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ పండుగ బోనస్ తదితర సౌకర్యాలు కల్పిస్తారని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే అంగన్వాడీ కార్మికులకు ఎలాంటి సౌకర్యం కల్పించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలోని అంగన్వాడి ఉద్యోగులకు గ్రాడ్యుయేటి చెల్లించాలని 2017 నుండి టిఏ, డిఏ, ఇంక్రిమెంట్ అలవెన్స్ బకాయిలు మొత్తం చెల్లించాలని, దీనికి సరిపడా బడ్జెట్ ను వెంటనే ప్రభుత్వం రిలీజ్ చేయాలని వారు అన్నారు. తమ 25 డిమాండ్లను పరిష్కరించాలని లేనిపక్షంలో సెప్టెంబర్ 11న సమ్మెలోకి వెళ్తున్నారని చెప్పారు. ఈ లోపుగా వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య, పిఎన్ఎమ్ జిల్లా అధ్యక్షులు చెల్లం పాండురంగారావు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బూడిద సురేష్, రామలింగా చారి ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉద్యోగులు ఆర్.శోభ, కే.రజిత, శారద, అరుణ, సుజాత తదితరులు పాల్గొన్నారు
నల్లగొండ: జిల్లాలోని సమస్త జర్నలిస్ట్ ల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు రాయితీ అవకాశం కల్పించడం ద్వారా, క్షేత్రస్థాయిలో పని చేస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జర్నలిస్టులను ఆదుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కర్ణన్ కు tuwj-143 జిల్లా కమిటీ పక్షాన బుధవారం వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ మాట్లాడుతూ.. జిల్లా విద్యాశాఖ అధికారి తో మాట్లాడి వెనువెంటనే సర్కులర్ జారీ అయ్యేవిధంగా చూస్తామని, అదేవిధంగా పాఠశాలలకు స్పష్టమైన ఆదేశాలు అందే విధంగా చూస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో tuwj -143 జిల్లా అధ్యక్షుడు గుండగోని జయశంకర్ గౌడ్, జిల్లా నాయకులు దీకొండ రవిశంకర్, తెలంగాణ టుడే శ్రీనివాస్, గాదె రమేష్, అంజయ్య, నరసింహ, డెస్క్ జర్నలిస్టులు లక్ష్మి నారాయణ, సురేష్, ఆరీఫ్, వెంకటేశ్వర్లు, నియోజకవర్గ నాయకులు మధు, దండంపల్లి రవి కుమార్, సైదులు ,శివ, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
Sep 08 2023, 12:59
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
21.2k