/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz మూడు రోజుల్లో చిక్కిన రెండో చిరుత Yadagiri Goud
మూడు రోజుల్లో చిక్కిన రెండో చిరుత

నరసింహ స్వామి ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన బోన్‌లో మరో చిరుత చిక్కింది. గతంలో బాలిక పై దాడి చేసిన ప్రదేశానికి సమీపంలోనే బోనులో చిరుత చిక్కడం గమనార్హం.

చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసి చంపేసిన తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం అనుమానాస్పద ప్రదేశాల్లో బోన్‌లను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా చిరుతను బంధించేందుకు మూడు ప్రాంతాల్లో బోనులను ఏర్పాటు చేశారు.

మోకాలి మిట్ట, లక్షీనరసింహస్వామి ఆలయం, 35వ మలుపు వద్ద బోనులను ఏర్పాటు చేయడం జరిగింది. 50 రోజుల వ్యవధిలో మూడు చిరుతలను అధికారులు బంధించడం గమనార్హం.

తిరుమలలో చిన్నారి లక్షితను చిరుత చంపేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

బాలికను చంపేసిన రెండు రోజుల్లోనే ఆ చిరుతను అటవీ అధికారులు పట్టుకున్నారు.

తిరుమల కాలిబాట మార్గానికి సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. బాలికపై దాడి చేసిన ప్రదేశానికి సమీపంలోనే బోనులో చిరుత దొరికింది. బోనులో పడిన చిరుత ఆడదిగా అటవీ అధికారులు గుర్తించారు.

ఇప్పుడు ఆ చిరుత చిక్కిన ప్రదేశానికి దగ్గరలోనే మరో చిరుత చిక్కడం గమనార్హం....

మరోసారి ఆశీర్వదించండి.. కరీంనగర్ జిల్లాను గొప్పగా అభివృద్ధి చేసి చూపిస్తా – మంత్రి గంగుల

ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలను కట్టబెట్టిన కరీంనగర్ నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా… అభివృద్ది చేస్తున్నానమని, మరోసారి ఆశీర్వదిస్తే మరింత గొప్పగా కరీంనగర్ జిల్లాను అభివృద్ది చేసి చూపిస్తానని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో బుదవారం పర్యటించిన మంత్రి గంగుల కమలాకర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

మొదట చింతకుంట రేణుక ఎల్లమ్మ ఆలయానికి చేరుకున్న మంత్రి గంగుల… అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గౌడసంఘం నూతన కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 10 లక్షల రూపాయలు… సిసి రోడ్డు నిర్మాణానికి మరో 5 లక్షలు… మొత్తం 15 లక్షల రూపాయలు కెటాయించారు. గౌడన్నల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం… సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారన్నారు మంత్రి గంగుల. గౌడన్నలు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామి ఇచ్చారు.

అక్కడి నుండి శాంతి నగర్ కు చేరుకున్న మంత్రి గంగుల కమలాకర్ కు… స్థానిక ఎంపిటిసి భూక్యా తిరుపతి నాయక్ ఆధ్వర్యంలో… బంజార మహిళలు ఘన స్వాగతం పలికారు. వారితో డప్పుచఫ్ఫుళ్ల మధ్య సంత్ సేవాలాల్ ఆలయం వద్దకు చేరుకుని 10 లక్షల నిధులతో నూతనంగా నిర్మించనున్న సంత్ సేవాలాల్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు.

అక్కడి నుండి సంత్ సేవాలాల్ ఆలయానికి చేరుకున్న మంత్రి గంగుల… మేరిమా యాడి పతాకావిష్కరణ చేసి… భోగ్ భండార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మేరి మా యాడి ని దర్శించుకుని… ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం… సంత్ సేవా లాల్ ను దర్శించుకున్నారు. సంత్ సేవాలాల్ ఆలయ అభివృద్ధి కోసం గతంలోనే 5 లక్షల రూపాయలు మంజూరు చేశామన్నారు మంత్రి గంగుల. బంజారా బిడ్డలకు దైవభక్తి ఎక్కువని… మేరీ మా యాడి కృపా కటాక్షాలతో సమస్త జనులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

అన్ని మతాలను గౌరవించుకుందామన్న మంత్రి గంగుల… సంత్ సేవాలాల్ ఆలయ అభివృద్ది కోసం సహాయసహకారాలు అందిస్తానని హామి ఇచ్చారు. పెళ్లి కానీ యువతులకు త్వరగా పెళ్లి కావాలని జరుపుకునేదే తీజ్ పండుగ అని… బంజార బిడ్డలకు తీజ్ పండగ శుభాకాంక్షలు తెలిపారు.

సమైక్య పాలనలో శాంతినగర్ మురికికూపంగా ఉండి… అభివృద్దికి ఆమడ దూరంలో నిలిచిందని… కానీ… స్వయంపాలనలో శాంతినగర్ అభివృద్ధి చెంది దాదాపుగా కరీంనగర్లో కలిసిపోయిందన్నారు. ఎమ్మెల్యేగా… మంత్రిగా శాంతినగర్ అభివృద్ధి కోసం కృషి చేశానన్న మంత్రి గంగుల… మరోసారి ఆశీర్వదిస్తే మరింత గొప్పగా అభివృద్ధి చేస్తానని ఉద్ఘాటించారు.

అనంతరం చింతకుంట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు చేరుకున్న మంత్రి గంగుల… మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా సుమారు 31. 80 లక్షలతో చేపట్టిన కాంపౌండ్ వాల్, టాయిలెట్లు… ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

అనంతరం… 5 లక్షల రూపాయలతో నిర్మించనున్న మైనార్టీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించారు

ఈ కార్యక్రమంలో ఎంపిపి పిల్లి శ్రీలత మహేష్, జడ్పీటిసి పిట్టల కరుణ- రవిందర్… ఏఎంసి చైర్మెన్ రెడ్డవేన మధు, ఎంపిటిసి భూక్యా తిరుపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.......

Hyderabad: విదేశాలకు టికెట్లు బుక్‌ చేస్తామని రూ.లక్షల్లో మోసం..

హైదరాబాద్: అమెరికా, యూకే, కెనడా దేశాలకు వెళ్లే విద్యార్థులకు టికెట్స్ బుక్ చేస్తామని చెప్పి ఓ సంస్థ బోర్డు తిప్పేసింది. లక్షల్లో డబ్బులు వసూలు చేసి ట్రావెల్ ఏజెంట్ పరారయ్యాడు..

వివరాల్లోకి వెళ్తే.. కుతుబుద్దీన్ అనే ట్రావెల్‌ ఏజెంట్‌ అబిడ్స్‌లోని.. ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్‌లో సీటీఎస్‌ కార్పొరేట్ సొల్యూషన్స్‌ పేరుతో గత కొంతకాలంగా ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు.

అమెరికా, యూకే, కెనడా.. ఇలా విదేశాలకు వెళ్లే విద్యార్థులకు టికెట్స్ బుక్ చేస్తామని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ. లక్షన్నర నుంచి 2 లక్షల వరకు వసూలు చేశాడు.

ఈ నెల 15, 16వ తేదీల్లో అమెరికా వెళ్లేందుకు టికెట్లు బుక్‌ చేసుకోవాలని దాదాపు 40 మంది ఏజెన్సీని సంప్రదించారు. వారిలో 30 మంది నుంచి రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేసిన ఏజెంట్‌ కుతుబుద్దీన్‌.. బోర్డు తిప్పి పరారయ్యాడు..

టికెట్లకు సంబంధించిన వివరాలు రాకపోవడంతో బాధితులు ట్రావెల్ ఏజెన్సీ వద్దకు వెళ్లారు. అయితే, గత రెండు రోజులుగా ఏజెన్సీ ఓపెన్ చేయలేదని చుట్టుపక్కల వారు తెలిపారు.

దీంతో మోసపోయామని గ్రహించి బాధితులు అబిడ్స్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు అబిడ్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఏజెన్సీపై ఇప్పటికే పలు చీటింగ్‌ కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు..

Nara Lokesh: ఎలాంటి భవిష్యత్తు కావాలో యువత తేల్చుకోవాలి: లోకేశ్‌

మంగళగిరి: ఎలాంటి భవిష్యత్తు కావాలో యువత తేల్చుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.

యువగళం పాదయాత్రలో భాగంగా మంగళగిరిలోని డాన్ బోస్కో స్కూల్ ప్రాంగణంలో విద్యార్థులు, యువతతో లోకేశ్‌ ముఖాముఖి నిర్వహించారు..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ''చంద్రబాబు సీఎంగా ఉండగా రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వచ్చాయి. తెదేపా హయాంలో యువతకు 6 లక్షలకుపైగా ఉద్యోగాలిచ్చాం.

కానీ, ఇప్పటి సీఎం గంజాయికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారు. ఫాక్స్ కాన్ వంటి కంపెనీలను పక్క రాష్ట్రాలకు తరిమేస్తున్నారు..

మనం గొప్పగా చెప్పుకొనే ఆంధ్రప్రదేశ్‌ ఇప్పుడు కామెడీగా మారింది. యువత సమస్యలు పరిష్కరించేందుకే యువగళం చేపట్టా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కేసులు పెడుతున్నారు. పోరాటానికి భయమెందుకు.. తగ్గేదే లేదు. చిన్న జీతంతో సరిపెట్టుకుంటారా.. రూ.50వేల జీతం తీసుకుంటారా? 3 రాజధానులు కావాలా? అమరావతి రాజధాని కావాలా?మీరే తేల్చుకోవాలి.

తెదేపా అధికారంలోకి వచ్చాక 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 32వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారు. చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యాక రాష్ట్రంలో పెండింగ్‌ పోస్టులన్నీ భర్తీ చేస్తాం. ఏపీపీఎస్సీని ప్రక్షాలన చేసి.. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తాం. కేజీ నుంచి పీజీ వరకు విద్యాప్రణాళికలో మార్పులు తెస్తాం. సామాజిక బాధ్యత, నైతిక విలువలకు ప్రాధాన్యం ఇస్తాం'' అని లోకేశ్‌ వెల్లడించారు..

Pawan Kalyan: ఎర్రమట్టి దిబ్బలు అరుదైన వారసత్వ సంపద.. కాపాడుకోవాలి: పవన్‌

విశాఖ: భీమిలిలో ఎర్రమట్టి దిబ్బల వద్ద జరిగిన ప్రకృతి విధ్వంసాన్ని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇవాళ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..

''ఎర్రమట్టి దిబ్బలు అరుదైన వారసత్వ సంపద. వాటిని రక్షించుకునే అవగాహన మనకు లేదు.

దాదాపు 1200 ఎకరాల్లో ఉండే ఎర్రమట్టి దిబ్బలు ఇప్పుడు కేవలం 292 ఎకరాలే మిగిలాయి. ఎర్రమట్టి దిబ్బల రక్షణపై పర్యావరణ శాఖ దృష్టికి తీసుకెళ్తాం.

జాతీయ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఎర్రమట్టి దిబ్బలు ఉన్న ప్రాంతాల్లో బఫర్‌ జోన్‌ ఏర్పాటు చేయాలి. రక్షణ కంచె ఏర్పాటు చేయాలి.

దీనిపై వైకాపా ప్రభుత్వం స్పందించకపోతే.. ఎర్రమట్టి దిబ్బల రక్షణ కోసం గ్రీన్‌ ట్రైబ్యునల్‌ వరకు వెళ్తాం. ఉత్తరాంధ్రలో ప్రకృతి విధ్వంసం, దోపిడీ ఆగాలి'' అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు..

SB NEWS

SB NEWS

Chandrayaan-3: చివరి కక్ష్యలోకి చంద్రయాన్‌-3.. ఇక జాబిల్లిపై అడుగే తరువాయి

బెంగళూరు: జాబిల్లి (Moon)పై పరిశోధనలకు రోదసిలోకి వెళ్లిన భారత వ్యోమనౌక చంద్రయాన్‌-3 (Chandrayaan-3) లక్ష్యం దిశగా విజయవంతంగా దూసుకెళ్తోంది. చంద్రుడి ఉపరితలంపై దిగే చరిత్రాత్మక ఘట్టానికి ఇది మరింత చేరువైంది..

బుధవారం జాబిల్లి చివరి కక్ష్యలోకి ప్రవేశించింది.

చంద్రయాన్‌-3 (Chandrayaan-3) కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని (Orbit Reduction Maneuvre) నేడు మరోసారి విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో (ISRO) ప్రకటించింది. నేటి విన్యాసంతో కక్ష్య తగ్గింపు ప్రక్రియలు పూర్తయ్యాయి.

జాబిల్లి చుట్టూ చక్కర్లు కొట్టేందుకు ఇదే చివరి కక్ష్య. తాజా విన్యాసంతో వ్యోమనౌక కక్ష్యను 153 km x 163 kmలకు తగ్గించినట్లు ఇస్రో వెల్లడించింది. దీంతో ఈ అంతరిక్ష నౌక.. ఇప్పుడు చంద్రుడిపై 100 కిలోమీటర్ల ఎత్తున ఉన్న కక్ష్యలోకి చేరింది..

ఇప్పటివరకు ఇస్రో చేపట్టిన దశలన్నీ విజయవంతంగా పూర్తయ్యాయి. ఇక, ఆగస్టు 17న వ్యోమనౌకలోకి ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి ల్యాండింగ్‌ మాడ్యూల్‌ విడిపోయే ప్రక్రియను చేపడతారు.

అది సజావుగా జరిగితే ల్యాండింగ్‌ మాడ్యూల్‌ విడిపోయి సొంతంగా జాబిల్లిని చుట్టేస్తుంది. అంతా సజావుగా సాగితే ఈ నెల 23న సాయంత్రం 5.47 గంటలకు ల్యాండర్‌ చంద్రుడిపై అడుగుపెట్టనుందని ఇస్రో (ISRO) వెల్లడించింది.

'చంద్రయాన్‌-3 (Chandrayaan-3)'ని జులై 14న ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్‌ ద్వారా విజయవంతంగా భూకక్ష్యలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మరుసటిరోజు తొలిసారి దీని కక్ష్యను పెంచారు. ఇలా 18 రోజుల వ్యవధిలో దశలవారీగా అయిదుసార్లు కక్ష్యను పెంచారు. అయిదో భూకక్ష్య పూర్తయిన అనంతరం.. జాబిల్లి దిశగా ప్రయాణానికిగానూ ఆగస్టు 1న 'ట్రాన్స్‌ లూనార్‌ కక్ష్య'లోకి ప్రవేశపెట్టారు. అక్కడినుంచి ఆగస్టు 5న విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి చేర్చారు. క్రమంగా కక్ష్యలను తగ్గిస్తూ చందమామకు చేరువ చేశారు..

Kadapa: నకిలీ వేలిముద్రలతో బ్యాంక్‌ అకౌంట్‌ ఖాళీ.. ఐదుగురు సైబర్‌ నేరగాళ్లు అరెస్ట్

కడప: నకిలీ వేలిముద్రల ఆధారంగా ఖాతాదారులకు తెలియకుండానే వారి ఖాతా నుంచి నగదును డ్రా చేస్తున్న ఐదుగురు అంతర్ జిల్లా సైబర్ నేరగాళ్లను కడప పోలీసులు అరెస్టు చేశారు..

అరెస్టు అయిన వారిని వైఎస్‌ఆర్‌ జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ మీడియా ఎదుట హాజరు పరిచారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం..

ఈ ఐదుగురిపై దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నాలుగు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. వారిపై 412 ఫిర్యాదులు రాగా.. 416 మంది బాధితులను గుర్తించారు.

కడప చిన్నచౌక్‌కు చెందిన శంకరయ్య ఖాతా నుంచి రూ.5,500 నగదును అతడికి తెలియకుండా సైబర్‌ నేరగాళ్లు కాజేశారు. తనకి ఓటీపీ రాలేదని.. ఎలాంటి లింక్‌లు కూడా క్లిక్‌ చేయలేదని శంకరయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో అప్రమత్తమైన పోలీసులు విచారణ ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా విచారించగా నకిలీ వేలిముద్రల ద్వారా నగదును డ్రా చేసినట్టు విచారణలో తేలింది.

దీంతో నిందితుల వివరాలను పోలీసులు సేకరించి ఐదుగురు అంతర్ జిల్లా సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు. ఇప్పటివరకు నిందితులు 12 ఖాతాల ద్వారా రూ.5.9 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు గుర్తించామని ఎస్పీ తెలిపారు..

TSPSC పేపర్ లీక్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్

రాష్ట్రంలో సంచలనం రేపిన టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ మరో ముగ్గురిని అరెస్ట్ చేసింది.

ఈ కేసులో ప్రధాని నిందితుడిగా ఉన్న ప్రవీణ్‌కు సహకరించిన ఆరోపణల నేపథ్యంలో ఈ ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, తాజా మూడు అరెస్ట్‌లతో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 99కి చేరింది.

ఈ కేసు దర్యాప్తులో స్పీడ్ పెంచిన సిట్.. నిందితుల ఇచ్చిన సమాచారం ఆధారంగా అరెస్ట్‌లు చేస్తున్నారు. ఈ కేసులో అరెస్ట్‌ల త్వరలోనే 100 దాటనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. ఈ పేపర్ లీక్ కేసులో ఏ2గా ఉన్న టీఎస్పీఎస్సీ మాజీ ఉద్యోగి రాజశేఖర్ రెడ్డి బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు.

ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన నాంపల్లి కోర్టు రాజశేఖర్ రెడ్డికి బెయిల్ తిరస్కరించింది........

SB NEWS

డబుల్ బెడ్‌రూం ఇండ్ల పంపిణీపై కేటీఆర్ సమీక్ష

పేద ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న డబుల్ బెడ్‌ రూం ఇండ్లకు సంబంధించి మంత్రి కేటీఆర్ గుడ్‌న్యూస్ చెప్పారు.

వారంలో తొలివిడత డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ పూర్తి చేయాలంటూ అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీపై మంత్రి కేటీఆర్ బుధవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారంరోజుల్లో తొలివిడత ఇండ్ల పంపీణీ పూర్తి చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వెరిఫికేషన్ ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చిందని కేటీఆర్ తెలిపారు.

70 వేల ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని అధికారుల తెలిపారని.. 70 వేల ఇండ్లను 5 లేదా 6 దశల్లో వేగంగా అందిస్తామన్నారు. వచ్చే వారంలోనే తొలి దశ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

ఈ సమావేశానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ సబితా ఇంద్రా రెడ్డి మహమూద్ అలీ మల్లారెడ్డి పద్మారావు జీహెచ్ఎంసీ అధికారులు హాజరయ్యారు.

కాగా.. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇటివల పలు కార్యక్రమాలను వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం.. ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా అదే కోవలో పూర్తి చేయాలని చూస్తున్నట్టు కనిపిస్తోందనే టాక్ వినిపిస్తోంది...

హైదరాబాదుకు నలుమూలల మెట్రో సేవలు విస్తరిస్తాం: సీఎం కేసీఆర్

హైద‌రాబాద్ న‌లుమూల‌ల‌కు మెట్రోను విస్త‌రించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. వ‌చ్చే మూడు, నాలుగేండ్ల‌లో ఈ ప‌నులు పూర్తి చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని సీఎం పేర్కొన్నారు.

గోల్కొండ కోట‌పై జాతీయ జెండాను ఎగురవేసిన అనంత‌రం కేసీఆర్ ప్ర‌సంగించారు.

విశ్వనగరంగా దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించి, సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ. 67 వేల 149 కోట్ల వ్యయంతో వ్యూహాత్మ‌క ర‌హ‌దారుల అభివృద్ధి ప‌థ‌కం ఎస్ఆర్‌డీపీ అమలు చేస్తున్నద‌ని కేసీఆర్ తెలిపారు.

ఎస్ఆర్‌డీపీ కింద 42 కీలక రహదారులు, ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు, ఆర్వోబీల అభివృద్ధిని చేపట్టింది. వీటిలో చాలాభాగం పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.

రూ. 275 కోట్లతో 22 లింక్ రోడ్ల నిర్మాణం కూడా ప్రభుత్వం పూర్తిచేసింది. పెరుగుతున్న ప్రజా రవాణా అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ మహానగరం నలువైపులకూ మెట్రో రైలును విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందుకోసం రూ. 69 వేల కోట్లకు పైగా వ్యయపరచి ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న అన్ని జంక్షన్ల నుంచి పైదరాబాద్‌ను అనుసంధానం చేస్తూ, నేరుగా ఎయిర్ పోర్టుకు చేరుకొనే విధంగా మెట్రో రైలును విస్తరించాలని ప్రణాళిక రూపొందించింది.

వచ్చే మూడు, నాలుగేళ్లలో ఈ నిర్మాణాలు పూర్తిచేయాలనే లక్ష్యం నిర్దేశించింది. కొత్త ప్రతిపాదనలతో హైదరాబాద్‌లో 415 కిలోమీటర్లకు మెట్రో సౌకర్యం విస్తరిస్తుంద‌ని కేసీఆర్ తెలిపారు...