/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz ఈ నెల 24 న హిమాన్షు కొత్త సాంగ్ Yadagiri Goud
ఈ నెల 24 న హిమాన్షు కొత్త సాంగ్

బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ త‌నయుడు క‌ల్వ‌కుంట్ల హిమాన్షు మ‌రో కొత్త సాంగ్‌తో అల‌రించ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని హిమాన్షు ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు. నా కొత్త పాటను జులై 24వ తేదీన విడుద‌ల చేస్తున్నాను.

ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించ‌డం నాకు చాలా సంతోషంగా ఉంద‌ని హిమాన్షు పేర్కొన్నారు. ఈ సాంగ్‌ను చూసి మీరంద‌రూ ఆనందిస్తార‌ని ఆశిస్తున్నాని పేర్కొన్నారు.

ఈ ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేశారు. హిమాన్షు సాంగ్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాన‌ని కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

అమెరికాకు చెందిన గాయకుడు, గేయ రచయిత జాకబ్‌ లాసన్ పాడిన గోల్డెన్‌ అవర్‌’ సాంగ్‌ను క‌ల్వ‌కుంట్ల‌ హిమాన్షు రావు గ‌తంలో అద్భుతంగా ఆల‌పించిన సంగ‌తి తెలిసిందే.

ఈ ఇంగ్లీష్‌ సాంగ్‌ అలాపనలో హిమాన్షు ఆంగ్ల యాసను ఉచ్ఛరించిన తీరు ఆమోఘం అని నెటిజ‌న్లు కొనియాడిన సంగ‌తి తెలిసిందే. అచ్చం జాకబ్‌ లాసన్‌ను తలపించేలా అతను ఈ కవర్‌ సాంగ్‌ పాడాడ‌ని ప్ర‌శంసించారు. 24న విడుద‌ల కాబోయే సాంగ్ కూడా ఆ మాదిరిగానే ప్ర‌శంస‌లు అందుకోవాల‌ని నెటిజ‌న్లు ఆశిస్తున్నారు.........

'జగనన్న సురక్ష'లో అధికారుల నిర్బంధం.. అప్పటివరకూ వదిలేదిలేదంటున్న గ్రామస్థులు

కొత్తపల్లి: కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం నాగులపల్లిలో జగనన్న సురక్ష కార్యక్రమానికి హాజరైన అధికారులను స్థానికులు నిర్బంధించారు. తమ సమస్యలను పరిష్కరించిన తరువాతే సభా ప్రాంగణం నుంచి బయటకు వెళ్లాలని ఆగ్రహం వ్యక్తం చేశారు..

మూడేళ్ల కిందట గ్రామంలో అర్హులైన 600 మంది లబ్ధిదారులకు.. ఇళ్ల స్థలాల కోసం భూములు సేకరించారు. ఆ భూముల్లో స్థలాల విభజన చేయకుండా, సౌకర్యాలు కల్పించకుండా.. లబ్ధిదారులకు స్థల వివరాలు లేని ఖాళీ పట్టాలు అందజేశారు..

అప్పటినుంచి లబ్ధిదారులు తమ స్థలాలు ఎక్కడ అని పలుమార్లు అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు.

దీంతో స్థలాల్లో ఇంటి నిర్మాణం గురించి తేల్చే వరకు ఎవరూ బయటకు వెళ్లేది లేదంటూ స్థానికులు అధికారులను నిర్బంధించారు.

నియోజకవర్గంలో ఎమ్మెల్యే దొరబాబుకు అత్యధిక మెజారిటీ ఇచ్చినా తమ గ్రామంపై ఎందుకింత వివక్ష చూపుతున్నారని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్‌, స్థానిక ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి తమ సమస్యకు పరిష్కారం చూపితే గానీ, వదిలేది లేదని హెచ్చరించారు..

ప్రేమించడం లేదని యువతి పై బీర్ బాటిల్‌ తో దాడి

ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. కురిచేడు మండలం అలవలపాడులో యువకుడు వీరనారాయణాచారి ఉన్మాదిగా మారాడు. ప్రేమించలేదన్న కోపంతో యువతిపై బీర్ బాటిల్‌తో శుక్రవారం రాత్రి దాడి చేశాడు.

యువతికి గాయాలయ్యాయి. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు యువకుడితో పాటు మరో ఇద్దరు స్నేహితులను అరెస్ట్ చేశారు.

అయితే అలవలపాడుకు చెందిన యువతిని అదే గ్రామానికి చెందిన వీరనారాయణాచారి ప్రేమించమని చాలా రోజులుగా వెంటపడుతున్నాడు. కానీ అందుకు ఆమె ఒప్పుకోలేదు.

దీంతో కోపం పెంచుకున్న యువకుడు మద్యం సేవించి ఆ మత్తులో బీర్ బాటిల్‌లో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇలాంటి దాడులకు ఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదని పోలీసులు హెచ్చరించారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేస్తామని చెప్పారు. ఎవరైనా యువకులు వేధిస్తున్నట్లైతే యువతులు తమను సంప్రదించాలన్నారు. వెంటనే యాక్షన్ తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అటు తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు వారి ప్రవర్తన పట్ల దృష్టి సారించాలని పోలీసులు సూచించారు....

మణిపూర్‌ లో ఏం జరగనట్టు వ్యవహరిస్తున్న ప్రధాని

80 రోజులుగా మణిపూర్ అట్టుడుకుతుంటే బీజేపీ ప్రభుత్వం ఎం చేస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పాల్వాయి స్రవంతి ప్రశ్నించారు. శనివారం ఆమె గాంధీభవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ..

మణిపూర్‌లో ఏం జరగనట్టు ప్రధాని తీరు..

హైదరాబాద్: 80 రోజులుగా మణిపూర్ అట్టుడుకుతుంటే బీజేపీ ప్రభుత్వం ఎం చేస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పాల్వాయి స్రవంతి ప్రశ్నించారు.

శనివారం ఆమె గాంధీభవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. మణిపూర్‌లో ఎం జరగనట్టు ప్రధాని మోదీ మాట్లాడుతున్నారని, బీజేపీ ఆదివాసీ తెగల మీద చిచ్చుపెట్టిందని విమర్శించారు. అ

క్కడి ముఖ్యమంత్రి ఇది ఒక్క సంఘటనే కదా.. వందల సంఘటనలు జరుగుతాయని చెప్పడంతో బీజేపీ ఏంటనేది తెలుస్తోందన్నారు. మణిపూర్ గవర్నర్ మే 3న జరిగిన సంఘటన వీడియో బయటకు రావడంపై బావోద్వేగానికి గురవుతున్నానని చెప్పడం సిగ్గుచేటన్నారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కి ఈషాన్య రాష్ట్రాల మరణాహోమం కనబడడం లేదా? అని పాల్వాయి స్రవంతి ప్రశ్నించారు. బీజేపీ మహిళా మంత్రులు ఏం చేస్తున్నారని నిలదీశారు. కవితక్క లిక్కర్ స్కామ్‌ పై తెలంగాణ మంత్రులు ఢిల్లీ వెళ్లి ధర్నా చేశారని, మణిపూర్ ఘటనపై ఈ మంత్రులు ఎందుకు మాట్లాడడం లేదని అన్నారు. రాజస్థాన్‌లో దళిత మహిళపై అత్యాచారం జరిగితే 24 గంటల్లో పట్టుకున్నారని.. వారు ఏబీవీపీకి సంబందించిన వారని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్‌లు ఆత్మపరిశీలన చేసుకోవాలని పాల్వాయి స్రవంతి అన్నారు...

గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి

•బిసి యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ డిమాండ్.

నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల అధ్వర్యంలో గత 17 రోజులుగా

గ్రామ పంచాయతీ కార్మికులు, కారోబార్లు మరియు బిల్లు కలెక్టర్లు చేస్తున్న నిరవధిక సమ్మెలో శనివారం బిసి యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ పాల్గొని సంఘీభావం తెలిపిన అనంతరం ప్రసంగించారు.

ఈ సందర్భంగా కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికుల, కారోబార్ల మరియు బిల్ కలెక్టర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బందినందరిని పర్మినెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నిరంతరం గ్రామాలన్ని పరిశుభ్రంగా ఉంచుతూ, గ్రామ శ్రేయస్సుకు పాటుపడే గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వం ఉదాసీనత వైఖరి వహించకుండా, సత్వరమే వారి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జి.ఓ. నెంబర్ 51 సవరించి, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దుచేసి బిల్ కలెక్టర్ కారొబార్లను జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా నియమించాలని ఆయన కోరారు. 11వ పి ఆర్.సి లో నిర్ణయించిన విధంగా బేసిక్ సాలరీ 19000 రూపాయలు చెల్లించాలని కోరారు.

అంతేకాకుండా ప్రమాదంలో మరణించిన కార్మిక కుటుంబాలకు 10 లక్షల రూపాయల ప్రమాదభీమా వర్తింపచేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా తక్షణమే ఈఎస్ఐ పీఎఫ్ వర్తింపజేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి యలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, యలిజాల రమేష్, మారోజు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మణిపూర్ లో జరిగినటువంటి అమానవీయ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం

•యునైటెడ్ ముస్లిం మైనార్టీ రైట్స్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ నజీర్

ఈ రోజు నల్గొండ పట్టణంలోని పత్రిక విలేకరుల సమక్షంలో నల్గొండ యునైటెడ్ ముస్లిం మైనార్టీ రైట్స్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ నజీర్ మాట్లాడుతూ ప్రపంచ నలుమూలల కూడా ఇలాంటి సంఘటన ఎక్కడ జరగ లేదు,

భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి కూడా ఇలాంటి సంఘటనలు మనం ఎక్కడ కూడా చవి చూడ లేదు, భారతదేశంలో మనం స్త్రీలని ఇలా చూడడం చాలా బాధాకరమైన విషయమని,

భరత మాత అని పిలుచుకునే మన దేశం లో స్త్రీలకు రక్షణ కల్పించలేకపోవడం సిగ్గు చేటు అని తెలియజేశారు. దేశ ప్రజల కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి పలు యుద్ధాలలో దేశం కోసం తన వంతు కృషి చేసిన, దేశానికి రక్షణగా ఉన్న తన భార్యని కాపాడుకోలేక పోతున్నాడని ఒక సైనికుడు మనోవేదనకు గురవుతున్నారనీ,

ఎన్ని చట్టాలు వచ్చినా ఎందుకు పూర్తి స్థాయి లో అమలు కావట్లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు, మరియు ఇలాంటి సంఘటనలు మరల దేశం లో చోటు చేసుకోవద్దంటే కటినమైన చట్టాలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని,

ఈ సంఘటనను యునైటెడ్ ముస్లిం మైనార్టి రైట్స్ ఆర్గనైజేషన్ తీవ్రంగా ఖండిస్తుంది అని అన్నారు, ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ జావిద్ అలి, జనరల్ సెక్రెటరీ షేక్ సద్దాం హుస్సేన్, అబ్దుల్ మాజిద్, ఖరామత్ అలీ ఖాన్, జీశాన్ తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో మరో వ్యభిచార ముఠా గుట్టురట్టు

హైదరాబాద్‌లో మరో వ్యభిచార ముఠా గుట్టు రట్టుయింది. గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాపై సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అధికారులు దాడులు చేపట్టి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. స్పా ముసుగులో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇద్దరిని సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అధికారులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు.

మాదాపూర్ మెగాహిల్స్‌లోని ఓ స్పాలో వ్యభిచారం జరుగుతున్నట్లు అందిన సమాచారంతో అధికారులు దాడి చేశారు. ఇద్దరు నిర్వాహకులు, ఓ విటుడ్ని అరెస్ట్ చేశారు. విశాఖ, రాజమండ్రి, కూకట్ పల్లి ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువతులను నరక కూపం నుంచి రక్షించారు....

SB NEWS

SB NEWS

దేశం నుదిటిన మణిపూర్ నెత్తుటి తిలకం?

మణిపూర్‌లోని కాంగ్‌కోక్వీ జిల్లా బిఫైనోమ్‌ గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వీడియోలు బహిర్గతమైన తర్వాత కూడా కేంద్రం దీన్ని ఓ సాదా సీదా చర్యగానే పేర్కొంది. పైగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రే దీనిపై చర్యలు తీసుకోవాలంటూ సాక్షాత్తు ప్రధా ని పేర్కొనడం మరిన్ని విమర్శలకు దారి తీస్తోంది. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం నియమించిన గవర్నర్‌ అనుసూయ ఉ యికే దీనిపై తీవ్రంగానే విరు చుకుపడ్డారు. నిందితుల్ని వెంటనే అదు పులోకి తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.

వాస్తవానికి గతరెండు మాసాల్లో మణిపూర్‌ జాతుల ఘర్ష ణతో అట్టుడుకి పోతోంది. మెజార్టీ వర్గమైన మైతీని గిరిజనుల్లో చేర్చే అంశాన్ని పరిశీలించాలంటూ ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పునివ్వడంతో ఈ ఏడాది మే 3న ఒక్కసారిగా జాతుల మధ్య ఘర్షణ తలెత్తింది. హిందువులైన మెజార్టీ మైతీయిలకు గిరిజనులైన మైనార్టీ కుకి, నాగ, మరికొన్ని జాతులకు మధ్య బీకర ఘర్షణలు చెలరేగాయి. గిరిజనులకు చెందిన చర్చిల్ని మైతీయిలు కూల్చేశారు. వారి గ్రామాల్ని దగ్ధం చేశారు. కొందరు మైతీయులైతే భద్రతా బలగాల వద్దనున్న ఆయు ధాల్ని దొంగిలించి మారణహోమానికి పాల్పడ్డారు.

హైకోర్టు సూచించిన ఒక రోజు తర్వాత బిఫైనోమ్‌ గ్రామంపై మైతేయిలు దాడి చేశారు.

గ్రామంలోని ఇళ్ళన్నింటిని తగుల బెట్టారు. భయంతో పారిపోతున్న కుకీల్ని పట్టుకుని కొట్టి చంపేశారు. ఈ మారణకాండకు భయపడ్డ ఓ కుటుంబం అడవిలోకి పారిపో వడంతో పోలీసులు వారిని రక్షించి స్టేషన్‌కు తీసుకెళ్తుం డగా తిరిగి మైతీలు దాడి చేశారు. 20, 40, 50ఏళ్ళున్న ముగ్గురు మహి ళల్ని తమ వెంట తీసుకెళ్ళారు. వీరిలో ఇద్దర్ని నగ్నంగా మార్చారు. హైవేపై ఊరే గించారు. అనంతరం 20ఏళ్ళ యువ తిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమె ఎదురుగానే ఆమె తండ్రితో పాటు సోదరుడ్ని చంపేశారు.

ఈ సంఘటనల్ని కేవలం జాతుల మధ్య ఘర్షణగానే చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది. కేంద్రం కూ డా దీనికి వంత పాడింది. పైగా దాడుల వెనుక విదేశీ హస్త ముందంటూ నమ్మించే ప్రయత్నం జరిగింది. బంగ్లాదేశ్‌, చైనా ల నుంచొచ్చిన ఉగ్రవాదులే మైతీల ముసుగులో ఈ దారు ణాలకు ఒడిగట్టినట్లు ఇంత కాలం ప్రపంచాన్ని నమ్మించింది. గత రెండు మాసాలుగా జరుగుతున్న దాడుల్లో అధికారిక లెక్కల ప్రకారం 140మంది చనిపోయారు. 50వేల మంది ఇళ్ళు కోల్పోయారు. వందలకొద్దీ చర్చిలు నేలమట్ట మయ్యాయి.

వేల సంఖ్యలో ఇళ్ళు దగ్ధమై పోయాయి. అయినా ఈ చిన్ని రాష్ట్రంలోని వివాదాలపై కేంద్రం చిన్న చూపే చూసింది. కనీసం అదనపు బలగాల్ని మోహరించి జాతుల మధ్య ఘర్షణల్ని అణిచేసే ప్రయత్నం చేయలేదు. ఇది పరోక్షంగా ఇక్కడ మెజార్టీ మైతీ వర్గాల మద్దతు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ప్రాకులాడుతున్నాయన్న అంశాన్ని స్పష్టం చేసింది. ఇలాంటి ఘటనలే బీజేపీయేతర పార్టీల పాలనలో గల రాష్ట్రా ల్లో జరిగుంటే ఎప్పుడో ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం రద్దు చేసుండేది. గవర్నర్‌ పాలన విధించుండేది. సైన్యాన్ని బరిలో దింపుండేది. ఘర్షణల్ని కఠినంగా అణిచేసుండేది. కానీ బీజేపీకి మణిపూర్‌లో మైతీ తెగల ఓట్లు అవసరం. ఈ కారణంగానే కేంద్రం ఈ విషయంలో మీన మేషాలు లెక్కించింది. రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధతకు మద్దతుగా నిల్చిందన్న విమర్శల్ని ఎదుర్కొంటోంది.....

హైదరాబాద్లో తమిళ సినిమా షూటింగ్లపై వివాదం

హైదరాబాదులో తమిళ సినిమా షూటింగ్ ల ఫై వివాదం నెలకొంది. ఇకపై షూటింగులన్నీ తమిళనీడులోనే చేయాలని ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌతిండియా (ఫిపా)లో తీర్మానం చేశారు.

ఇతర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తే తమ అనుమతి తప్పనిసరి తీసుకోవాల్సి ఉంటుందని అసోసియేషన్ తేల్చి చెప్పింది. అంతే కాకుండా షూటింగ్ల కోసం తమిళ సినీ కార్మికులనే తీసుకోవాలని ఫెప్సీ నిర్ణయించింది.

కాగా, ఏపీ మంత్రి రోజా భర్త ఆర్ కె సెల్వమణి తమిళనాడులో సినీ రాజకీయం ప్రారంభించారు.

ఏపీ,తెలంగాణలో తమిళ చిత్రాల షూటింగ్ లు జరుగుతున్నాయని అలా చేయవద్దని ఉద్యమం లేవదీశారు. తమిళ సినీ కార్మికులకు పనులు ఉండడం లేదని, అగ్ర హీరోలు అందరూ హైదరాబాద్, విశాఖలో షూటింగులు చేస్తున్నారని సెల్వా అంటున్నారు. ఈ అంశంపై రజనీకాంత్, విజయ్ స్పందించాలని తమిళ సినిమాల షూటింగులు చెన్నైలోనే చేయడానికి అంగీకరించారని.. కానీ అజిత్ ఇంకా స్పందించాల్సి ఉంది అంటున్నారు.

కొంకాలంగా తమిళ భారీ చిత్రాల షూటింగులు ఎక్కువగా హైదరాబాద్, విశాఖలోనే జరుగుతున్నాయి. ఇది ఫేప్సీ పేరుతో ఓసినీ కార్మిక సంఘాన్ని నడుపుతున్న ఆర్ కె సెల్వమణికి నచ్చలేదు. తన సంఘంలోని సభ్యులకు పనులు ఉండడం లేదని ఆయన వివాదం ప్రారంభించారు. తాము సినిమా షూటింగులు చేయడానికి పనికిరామా?.. అంటూ ఆయన సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.

ఏపీలో సెల్వమణి భార్య రోజా మంత్రిగా ఉన్నారు. నిజానికి దర్శకుడు అయిన ఆర్కే సెల్వమణికి షూటింగులో లొకేషన్లు ఎలా సెలెక్ట్ చేసుకుంటారో తెలుసు.. కథను బట్టి షూటింగ్ చేసుకుంటారు.. కానీ లేనిపోని వివాదం రేపి తెలుగు రాష్ట్రాల్లో షూటింగులు వద్దని రచ్చ చేస్తున్నారని కొంతమంది మండిపడుతున్నారు....

ఇష్టం లేకుండా ముద్దు పెట్టాడని నాలికను కొరికేసిన భార్య

కర్నూలు జిల్లా:జులై 22

అవును వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పెళ్లయిన కొత్తలో వారి అన్యోన్య దాంపత్యం సాఫీగా సాగింది

ఏం జరిగిందో ఏమోగానీ రెండేళ్లుగా వారి మధ్య కలతలు మొదలయ్యాయి.. ఒకరంటే ఒకరికి పడదు.. నిత్యం గొడవలు.. శుక్రవారం సాయంత్రం కూడా వారిద్దరూ గొడవపడ్డారు. భార్యపై దాడి చేశాడు. అంతటితో ఆగాడా? అసలే పీకల్లోతు కోపంలో ఉన్న ఆమెను ముద్దుపెట్టబోయాడు. అంతే.. కసుక్కున భార్య అతని నాలుకను కొరికేసింది.

అసలు విషయం ఏమిటంటే..కర్నూలు జిల్లాకు చెందిన తారాచంద్ నాయక్‌.. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం ఎల్లంగుట్ట తండాకు చెందిన పుష్పవతిని 2015లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. పెళ్లయిన కొన్నాళ్ల పాటు ఇద్దరూ బాగానే అన్యోన్యంగా ఉన్నారు. రెండేళ్ల నుంచి వీరిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఇక ఈ మధ్య గొడవలు మరింత పెరిగాయి. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం కూడా వారిద్దరూ గొడవపడ్డారు.

ఒకరు ఒకరి మీద దాడి చేసుకున్నారు

కొద్దిసేపటి తర్వాత మనోడు వెళ్లి లిప్ కిస్ కోసం ట్రై చేశాడు, అప్పటికే పీక ల్లోతు కోపంతో ఉన్న ఆమె వెంటనే భర్త నాలుకను కొరికేసింది. దీంతో అల్లాడిపోయిన తారాచంద్.. హుటాహుటిన గుత్తి హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం వెళ్లాడు. తారాచంద్‌ను పరీక్షించిన వైద్యులు మెరుగైన మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం హాస్పిటల్‌కు సిఫార్సు చేశారు.

ఇక ఈ విషయమై భార్యాభర్తల వర్షన్ వేరుగా ఉంది. తనపై తారాచంద్ దాడి చేశాడని.. ఆపై తనకు ఇష్టం లేకుండా బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి వచ్చాడని అందుకే నాలుక కొరికానని పుష్పవతి జొన్నగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక తారాచంద్ మీడియాతో మాట్లాడుతూ.. తన భార్యకు వేరొక వ్యక్తితో అఫైర్ ఉందని అయినా కూడా తాను సర్దుకుపోతున్నానని తెలిపాడు. తన భార్యతో తనకు ముప్పు ఉందని చెప్పాడు. తన పిల్లలూ.. తాను ఎలా బతకాలో తెలియడం లేదని వాపోయాడు...