/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz ఏపీలో పోలీసులు అనుసరిస్తున్నది ఐపీసీ సెక్షన్ కాదు వైసీపీ సెక్షన్ Yadagiri Goud
ఏపీలో పోలీసులు అనుసరిస్తున్నది ఐపీసీ సెక్షన్ కాదు వైసీపీ సెక్షన్

అమరావతి:జులై 18

రాష్ట్రంలో కొందరు పోలీసు అధికారులు రెచ్చిపోతున్నారు. విపక్ష నేతలు, కార్యకర్తలను టార్గెట్‌ చేసి మరీ కొడుతున్నారు. తాము తొడిగింది ఖాకీ అని మరిచి... అధికార పార్టీకి అండగా నిలబడుతున్నారు. ‘అధికార పార్టీని ఏమన్నా ఊరుకోం’ అంటూ వయలెంట్‌ రియాక్షన్‌ చూపిస్తున్నారు. అర్ధరాత్రి ఇళ్లకు వెళ్లి లాక్కొచ్చి మరీ తన్నడం... నడిరోడ్డుపై బూటుకాళ్లతో తొక్కడం, చెంపలు వాయగొట్టడం... ఇలా విపక్ష నేతలు, కార్యకర్తలపై యథేచ్ఛగా విరుచుకుపడుతున్నారు. కొందరు పోలీసు అధికారులు స్థానిక వైసీపీ నేతల ‘ప్రైవేటు సైన్యం’లా పని చేస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి. ‘ఇది తప్పు...భవిష్యత్తులో మీ సర్వీసుకు ముప్పు’ అని ఉన్నతాధికారులు ఎంత చెబుతున్నా చెవికి ఎక్కించుకోవడం లేదు. ఐజీలు, ఎస్పీలు పంపిస్తున్న మార్గదర్శకాలేవీ పనిచేయడం లేదని తాజా ఉదంతాలు చాటుతున్నాయి.

అధికార పార్టీ అయితే గడ్డం..ప్రతిపక్షమైతే జుట్టు

తెలుగుదేశం పార్టీ తరపున గెలిచి వైసీపీతో జట్టుకట్టిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఈ ఏడాది మొదట్లో టీడీపీ నేత పట్టాభిరామ్‌ రాజకీయ పరమైన ఆరోపణలు చేశారు. అంతే.... వంశీ తన అనుచరులను గన్నవరం టీడీపీ ఆఫీసుపైకి పంపి విధ్వంసం సృష్టించి అక్కడున్న కార్లు తగులబెట్టించారు. ఈ దుశ్చర్యలో వంశీ అనుచరులైన రాము, ఓలుపల్లి రంగా మరికొందరు దాడులకు వెళుతుంటే ‘అన్నా.. అన్నా..’ అంటూ పోలీసులు గడ్డం పట్టుకుని బతిమాలిన దృశ్యాలు టీవీల్లో కనిపించింది. ఆ దృశ్యాలు చూసి రాష్ట్ర ప్రజలు అవాక్కయ్యారు.

టీడీపీ కార్యాలయంలోపల అధికార పార్టీ శ్రేణులు విధ్వంసం సృష్టిస్తుంటే ప్రాణ భయంతో పారిపోయిన టీడీపీ శ్రేణుల ఎలక్ర్టానిక్‌ వస్తువులు పోలీసులు జేబులో వేసుకోవడం కృష్ణా జిల్లా ఖాకీల పరువును కృష్ణానదిలో ముంచేసింది. విధ్వంసం గురించి తెలిసిన వెంటనే నిరసన తెలిపేందుకు వెళ్లిన టీడీపీ నేతలపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టారు. జుట్టు పట్టుకుని లాక్కొచ్చి జైలుకు పంపి ఏకపక్షమంటే ఇదీ అని నిరూపించారు. అంతకు నెలరోజుల ముందు పుంగనూరులో బీసీ నాయకుడు రామచంద్ర యాదవ్‌ రైతులకు మద్దతుగా సదుం మండలంలో ‘రైతు భేరి’ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఆ విషయం తెలిసిన వైసీపీ కీలక నాయకుడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన అనుచరులను యాదవ్‌ ఇంటిపైకి పంపి......విధ్వంసం అంటే ఎలా ఉంటుందో చూపించారు. ఈ దుశ్చర్య జాతీయ స్థాయిలో వివాదాస్పదం అయింది. చివరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కలగజేసుకుని రామచంద్ర యాదవ్‌కు వై కేటగిరి భద్రతను కేంద్ర బలగాలతో కల్పించాల్సి వచ్చింది...

Oommen Chandy: ఐదు దశాబ్దాలుగా అదే నియమం.. అందుకే ఆదర్శ నాయకుడిగా..

మంగళవారం తెల్లవారుజామున కన్నుమూసిన కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ (Congress) సీనియర్‌ నాయకుడు ఊమెన్‌ చాందీ (79) (Oommen Chandy) ఖాతాలో ఓ అరుదైన ఘనత ఉంది..

ఇప్పటివరకు ఆయన 12 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అన్నిసార్లూ పూతుపల్లి నియోజకవర్గం నుంచే ఎన్నికయ్యారు.

ఊమెన్‌ చాందీ ఎన్నడూ పార్టీ మారలేదు. 2020 సెప్టెంబరు 17 నాటికి శాసనసభ్యుడిగా ఆయన ఐదు దశాబ్దాల ప్రస్థానాన్ని పూర్తిచేసుకున్నారు. సాధారణ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన చాందీ.. తన నిజాయతీ, చిత్తశుద్ధితో పార్టీ అధినాయకత్వానికి విశ్వాసపాత్రుడిగా నిలిచారు. 27 ఏళ్ల వయసులో పూతుపల్లి నుంచి 1970లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. తర్వాత ఎన్నడూ వెనుదిరిగి చూసుకోలేదు..

నేడు విద్యాశాఖ కార్యాలయం ముట్టడి

ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో హామీ ఇచ్చినట్లుగా 12 వేల టీచర్ పోస్టులకు వెంటనే ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చి టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేయాలని డీఈడీ, బీఈడీ అభ్యర్థుల సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

మొన్నటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు పోస్ట్ కార్డులు రాసి నిరసన తెలిపారు. కాగా మంగళవారం విద్యాశాఖ ముట్టడికి పిలుపునిచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకు లక్డీకాపూల్ లోని విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చే వరకు తమ పోరాటం ఆగదని, కొనసాగిస్తామని డీఈడీ, బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ్ మోహన్ రెడ్డి తెలిపారు........

న్యూజెర్సీలో అట్టహాసంగా బోనాల జాత‌ర‌

తెలంగాణ బోనాల జాత‌ర సంబురాలు ఖండంత‌రాలు దాటింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే బోనాల పండుగను అమెరికాలో సోమవారం ప్రవాసీయులు మొట్టమొద‌టి సారిగా అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. హైద‌రాబాద్‌ లాల్‌ దర్వాజ, లష్కర్‌ బోనాలను మరిపించే విధంగా, పోతురాజు నృత్యాలతో అట్టహాసంగా నిర్వహించారు.

తెలుగు మహిళలు బోనమెత్తారు. అమ్మ వారిని మేళతాళలతో ఘనంగా స్వాగతించి, పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి బోనం సమర్పించారు. తెలంగాణ - అమెరికా ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ప్రార్థించారు. సాయిద‌త్తాపీఠం చైర్మెన్ ర‌ఘుశ‌ర్మ శంక‌ర‌మంచి పూజ‌లు నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా.అధ్యక్షుడు శ్రీనివాస గనగోని మాట్లాడుతూ..

సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ అన్నారు. అందరికి బోనాల శుభాకాంక్షలు తెలిపారు.

అమెరికాలో తొలిసారిగా బోనాల పండుగ నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్‌లో మాట ఆధ్వర్యంలో మరిన్నీ కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సభ్యులు కిరణ్ దుద్దగి, విజయ్ భాస్కర్ కలాల్, శ్రీధర్ గుడాల, దాము గేదెల, జైదీప్ రెడ్డి, కృష్ణశ్రీ గంధం, మహేందర్ నరలా, వెంకీ మస్తీ, కృష్ణ సిద్ధదా, రంగారావు మాడిశెట్టి, గిరిజా మాదాసి, మహిపాల్ రెడ్డి, రాకేష్ కస్తూరి, ప్రభాకర్, పూర్ణ, శేష‌గిరిరావు, శిరీషా గుండపనేని, రఘు మడుపోజు, దీపక్ కట్టా, సురేష్ ఖజానా, అశోక్ చింతకుంట, మాధవి సోలేటి త‌దిత‌రులు పాల్గొన్నారు...

ప్రభుత్వ బడిని కాపాడుకుందాం : వంగూరి దామోదర్

నాగారం మండలం (సోమవారం) :ప్రైవేట్ స్కూల్ బస్సులు గ్రామానికి రాకుండా అడ్డుకుందామని ,ఈటూర్ గ్రామ ప్రభుత్వ బడిని కాపాడుకోవాల్సిన బాధ్యత గ్రామస్తులపైన ఉందని ఈటూరు గ్రామ వాసి టెక్నో డీడ్ ఐటీ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ వంగూరి దామోదర్ అన్నారు.

ఈ సందర్భంగా సోమవారం గ్రామంలో దామోదర్ మాట్లాడుతూ పిల్లల తల్లిదండ్రులు సానుకూలంగా స్పందించారని తెలియజేశారు.ఈటూరు గ్రామం నుండి ప్రైవేట్ స్కూల్స్ కి పంపుతున్న పిల్లల తల్లిదండ్రులనీ కలిసి ప్రైవేట్ స్కూల్స్ చేస్తున్న విచ్చలవిడి విడి దందనీ,విద్య వ్యాపారాన్ని గురించి తల్లిదండ్రులకి అహాగాహన కల్పించామన్నారు.

గ్రామంలో ఉన్న ప్రభుత్వ బడికి గ్రామ పిల్లలని పంపించకుండా ప్రైవేట్ బడులకి పంపటం వల్ల పిల్లలు తగ్గిపోతే భవిష్యత్ లో మూతపడే అవకాశం కూడా ఉందని,ప్రైవేట్ బడులకీ పోయే పిల్లల మనస్తవ్వం కూడా వ్యాపారం చేసే లాగా ఉంటుందని విలువలు నేర్పకుండ కేవలం ప్రతిధి పైసలకి ముడిపెట్టి ఒక వస్తువు లాగా విద్యార్థులు తయారు అయితరని , విలువలతో కూడిన విద్యా కేవలం ప్రభుత్వ బడిలోనే సాధ్యం కాబట్టి ఈటూరు గ్రామస్థులు అంత తమ పిల్లలని ఊరిలోని ఉన్న ప్రభుత్వ బడిలోకే పంపాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పేరాల సరిత యాదగిరి, హైస్కూల్ ఇంఛార్జి ప్రభాకర్,SMC చైర్మన్ కొత్తోజు ఏళ్ళ చారి,కవి గాయకులు పేరాల యాదగిరి,ప్రతిభ యూత్ అధ్యక్షులు బోడ పరశరాములు యువజన సంఘాల నాయకులు వంగూరి కుమార్,వంగూరి సందీప్,బొట్టు సురేష్,పేరాల రాజు,వంగూరి అవిలమల్లు,బోడ కళ్యాణ్, బొడ దిలీప్,వంగూరి అంజయ్య,బోడ సురేష్,పేరాల అబ్బాస్,పేరాల గోపి,పేరాల అవిలయ్యా,పేరాల దయానంద్,పేరాల అంజయ్య,తదితరులు పాల్గొన్నారు..

TTD: రేపు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల..

తిరుమల: రేపు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల చేయనున్నట్లు తితిదే వెల్లడించింది. భక్తులకు సౌకర్యంగా ఉండేలా షెడ్యూల్‌ ప్రకారం ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తున్నట్లు తెలిపింది..

ఈ మేరకు తితిదే ఓ ప్రకటన విడుదల చేసింది.

అక్టోబర్‌ నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్‌లైన్‌ లక్కీడిప్‌ కోసం జులై 18న ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చని తితిదే తెలిపింది. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు సొమ్ము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.

కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌ సేవ, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను జులై 21న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. అక్టోబర్‌ నెల అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను జులై 24న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. భక్తులు ఈ విషయాలను గమనించి https://tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లో సేవా టికెట్లను బుక్‌ చేసుకోవాలని తితిదే సూచించింది.

Pawan Kalyan: అంజూయాదవ్‌పై చర్యలు తీసుకోండి.. శ్రీకాళహస్తి సీఐపై ఎస్పీకి పవన్‌ ఫిర్యాదు..

తిరుపతి: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తిరుపతి చేరుకున్నారు. శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్‌పై తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డికి ఆయన ఫిర్యాదు చేశారు..

తొలుత గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంట చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి తిరుపతికి వచ్చారు. జనసేన కార్యకర్తలతో కలిసి భారీగా ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని అక్కడ వినతిపత్రం అందజేశారు..

ఇటీవల శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడు కొట్టే సాయిపై సీఐ అంజూయాదవ్‌ చేయిచేసుకున్నారు. దీన్ని జనసైనికులు తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలోనే పవన్‌ తిరుపతి చేరుకుని జిల్లా ఎస్పీని కలిసి సీఐపై చర్యలు తీసుకోవాలని కోరారు..

Chandrababu: ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలి: ప్రజలకు చంద్రబాబు సూచన

అమరావతి: రాష్ట్రంలో జూలై 21 నుంచి నెల రోజుల పాటు జరిగే ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం పట్ల ఏపీ ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సూచించారు..

బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వచ్చి చేపట్టే ఓటర్ వెరిఫికేషన్‌లో తమ ఓటు ఉందో లేదో ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలన్నారు.

ఓటు లేకపోతే తక్షణమే ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు అందరి బాధ్యతన్న చంద్రబాబు.. ఓటుతోనే భద్రత, భవిష్యత్తుకు భరోసా అని స్పష్టం చేశారు. ఈ మేరకు 'ఓటు మన బాధ్యత.. ఓటుతో భద్రత' అని పేర్కొంటూ ఆయన ట్వీట్‌ చేశారు..

టమాటా సాగుతో.. కోటీశ్వరులుగా మారిన ఇద్దరు రైతులు..

వ్యవసాయంతో కోట్లు ఆర్జించిన రైతులు అరుదు. కానీ.. దేశవ్యాప్తంగా పెరిగిన టమాటా ధరలు.. నెల కాలంలోనే ఇద్దరు రైతులను కోటీశ్వరులను చేశాయి..

మహారాష్ట్రలోని పుణె జిల్లాకు చెందిన తుకారాం భాగోజి గాయకర్‌ 12 ఎకరాల్లో టమాటా సాగు చేశారు..

ఈ పంటపై సరైన అవగాహన ఉండడంతో దిగుబడి బాగా వచ్చింది. దీంతో నెల రోజుల్లోనే రూ.కోటిన్నరకు పైగా ఆదాయం సంపాదించారు. ఒక్కో పెట్టెను రూ.2,100 చొప్పున నారాయణ్‌గంజ్‌ మార్కెట్‌లో విక్రయించారు. శుక్రవారం ఒక్కరోజే సుమారు 900 పెట్టెలను అమ్మి రూ.18 లక్షలు సంపాదించారు.

ఛత్తీస్‌గఢ్‌ ధమ్‌తరీ జిల్లాలోని బీరన్‌ గ్రామానికి చెందిన అరుణ్‌ సాహూ 150 ఎకరాల్లో టమాటా సాగు చేసి.. రోజుకు 600 నుంచి 700 పెట్టెలు విక్రయించారు. రూ.కోటికి పైగా ఈ నెల కాలంలోనే సంపాదించారు. ఉన్నత విద్య చదివిన సాహూ.. వ్యవసాయంపై మక్కువతో ఈ రంగంలోకి దిగారు..

వందేభారత్‌ రైలులో చెలరేగిన మంటలు : తప్పిన పెను ప్రమాదం

భోపాల్‌ : వందేభారత్‌ రైలుకు పెనుప్రమాదం తప్పింది. భోపాల్‌ నుంచి ఢిల్లీకి వెళుతున్న వందేభారత్‌ రైలులో మంటలు చెలరేగిన ఘటన సోమవారం ఉదయం కుర్వాయిస్టేషన్‌ వద్ద జరిగింది..

రాణికమలాపాటి స్టేషన్‌ నుంచి ప్రయాణం మొదలైన తర్వాత కుర్వాయి స్టేషన్‌ వద్ద రైలులోని సీ-14 కోచ్‌ వద్ద మంటలు వ్యాపించాయి. మంటలను గుర్తించిన రైల్వే సిబ్బంది వెంటనే లోకోపైలట్‌కు సమాచారం అందించారు.

దీంతో రైలును అక్కడే ఆపేశారు. రైలులో మంటలు చెలరేగడంతో ప్రయాణీకులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక దళం అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అర్పివేశారు. ఈ ప్రమాదంలో ప్రయాణీకులు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు..