/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz ఉత్తరాఖండ్ చార్ ధామ్ యాత్ర కూడా వాతావరణం దెబ్బతింది, Yadagiri Goud
ఉత్తరాఖండ్ చార్ ధామ్ యాత్ర కూడా వాతావరణం దెబ్బతింది,

•భారీ వర్షాలు, రహదారిపై శిధిలాలు ప్రయాణాన్ని ప్రభావితం చేశాయి

•రోడ్లు మూసివేయడం వలన, ప్రయాణీకులు వివిధ ప్రదేశాలలో చిక్కుకుపోయారు

ఉత్తరాఖండ్ చార్ ధామ్ యాత్రపై కూడా వాతావరణం ప్రభావం చూపింది. భారీ వర్షాల తర్వాత రహదారిపై శిథిలాల కారణంగా ప్రయాణానికి అంతరాయం కలుగుతోంది. యూపీ, ఢిల్లీ-ఎన్‌సీఆర్, ఎంపీ సహా దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి గంగోత్రి-యమునోత్రి, బద్రీనాథ్, కేదార్‌నాథ్ ధామ్‌లకు వెళ్లే యాత్రికులు రోడ్లు మూసుకుపోవడంతో చిక్కుకుపోతున్నారు. అడ్మినిస్ట్రేషన్ తరపున, చార్ ధామ్ యాత్రకు వెళ్లే ముందు ఉత్తరాఖండ్ వాతావరణ సూచనను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఉత్తరకాశీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. గంగోత్రి, యమునోత్రి హైవేలను పలు చోట్ల మూసివేయడంతో రెండు ధామ్‌లకు వెళ్లే ప్రయాణం నిలిచిపోయింది. హైవే మూసుకుపోవడంతో రెండు రోజులుగా గంగోత్రి ధామ్‌కు వెళ్లేందుకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఐదు చోట్ల గంగోత్రి హైవేను మూసివేయడంతో జిల్లా కేంద్రంతోపాటు ప్రయాణికులను సురక్షిత ప్రదేశాల్లో నిలిపివేశారు.

ప్రస్తుతం ప్రయాణీకుల వాహనాలు ఉత్తరకాశీ దాటి వెళ్లేందుకు అనుమతి లేదు. బుధవారం, గంగోత్రి హైవే ధరాసు బ్యాండ్, బందర్‌కోట్, హెల్గుగాడ్, ధరాలి తదితర ప్రాంతాలలో రోజంతా ట్రాఫిక్ కోసం బ్లాక్ చేయబడింది. ధరాలీలో ఖీర్ గంగ ఉధృతంగా ప్రవహించడంతో నిన్న సాయంత్రం నుంచి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మధ్యాహ్నం ధారసు బ్యాండ్‌లో భారీగా కొండచరియలు విరిగిపడడంతో యాత్రకు అంతరాయం ఏర్పడింది.

దీంతో యాత్రికులు, కన్వరియాలను గంగోత్రికి వెళ్లకుండా జిల్లా యంత్రాంగం నిలిపివేసింది. గత రెండు రోజులుగా హైవే మూసుకుపోవడంతో గంగోత్రి ధామ్‌కు వెళ్లేందుకు పరోక్షంగా ఆటంకం ఏర్పడింది. అదేవిధంగా కళ్యాణి, సిల్క్యారా తదితర ప్రాంతాల్లో యమునోత్రి హైవే మూసివేత ప్రక్రియ కొనసాగుతోంది. సిల్క్యారాలోని యమునోత్రి హైవే ప్రస్తుతం ట్రాఫిక్ కోసం తెరవబడలేదు.

యమునోత్రి జాతీయ రహదారికి నిరంతర ఆటంకం కారణంగా, ధామ్ యాత్ర ప్రభావితం అవుతూనే ఉంది. మంగళవారం గంగోత్రి యాత్ర మార్గంలో చిక్కుకుపోయిన వేలాది మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు జిల్లా విపత్తు నిర్వహణ అధికారి దేవేంద్ర పట్వాల్ తెలిపారు. గంగోత్రి హైవేపై పలుచోట్ల తరచూ చెత్తాచెదారం పడుతుండటంతో ప్రయాణికులు గంగోత్రి ధామ్‌కు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. రోడ్డు తెరిచిన వెంటనే వాహనాలను దర్శనానికి అనుమతిస్తారు.

చమోలి నుండి బద్రీనాథ్ సమీపంలోని కంచన్ గంగా వరకు బద్రీనాథ్ హైవే, పాగల్ నాలా సహా, చాలా చోట్ల శిధిలాలు, బండరాళ్లు మరియు కొండలలో పగుళ్లు ఏర్పడటంతో పూర్తిగా అడ్డుకుంది. బద్రీనాథ్ హైవేపై పీపాల్ కోటికి 1 కి.మీ ముందుకి భారీ రాళ్ల రాకతో హైవే మట్టి బండలతో కప్పబడి ఉంది.పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయం నుండి అందిన సమాచారం మేరకు బండరాళ్లు, రాళ్లు, మట్టి రోడ్డుపైకి వచ్చాయి. చినకాలో మళ్లీ కొండ పగుళ్ల కారణంగా.

ఈ ప్రదేశాల్లో చాలా బండరాళ్లు, రాళ్లు, శిథిలాలు వచ్చి చేరడంతో యంత్రాలు కూడా పని చేయలేకపోతున్నట్లు సమాచారం. కొండలపై నుంచి రాళ్లు నిరంతరం పడుతున్నాయి. దీంతో యంత్రాల నిర్వాహకులు కూడా ప్రమాదానికి గురవుతున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం బుధవారం వరకు ఈ ప్రదేశాల్లో హైవే సాఫీగా సాగడం కష్టమే. బద్రీనాథ్ హైవేపై లంబగడ సమీపంలో ఖచడ డ్రెయిన్ పొంగిపొర్లడంతో హైవేపై భారీ బండరాళ్లు వచ్చాయి.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో బోనాల ఉత్సవాలు.. హాజరుకానున్న ఎమ్మెల్సీ కవిత

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జరగనున్న బోనాల ఉత్సవాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు. ఈనెల 15న ఆస్ట్రేలియాలోని బ్రిస్‌బేన్ నగరంలో ‘భారత జాగృతి ఆస్ట్రేలియా’ ఆధ్వర్యంలో బోనాలు సంబురాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు బ్రిస్‌బేన్‌లోని గాయత్రి మందిరంలో జరగనున్న ఈ వేడుకల్లో ప్రవాస భారతీయులతోపాటు ఆస్ట్రేలియా మంత్రులు, ఎంపీలు హాజరుకానున్నారు.

అలాగే జులై 16న న్యూజిలాండ్‌లోని అక్లాండ్ నగరంలో జరగనున్న బోనాలు వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొంటారు. న్యూజిలాండ్ తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ బోనాల వేడుకలకు ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. అక్లాండ్‌లోని గణేష్ టెంపుల్‌లో ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలిపారు.

అలాగే అక్లాండ్‌లో ఉదయం 9 గంటలకు వివిధ రాష్ట్రాల ఎన్నారైలు ఏర్పాటు చేసిన ప్రవాస భారతీయ సమ్మేళనం లో కవిత పాల్గొంటారు. సాయంత్రం తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్‌లో ఆస్ట్రేలియాలోని తెలంగాణీయులతో సమావేశం అవుతారు. ఆల్బర్ట్ వార్ మెమోరియల్ హాల్ లో ఈ సమావేశం జరగనుందని నిర్వాహకులు తెలిపారు....

కాపురంలో చిచ్చుపెట్టిన టమాటా!!

భోపాల్: జులై 13

పెరిగిన టమాటా ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే కేజీ టమాటా ధర రూ.200 చేరువలో ఉంది. దీంతో గృహిణులు ఆచితూచి టమోటా వినియోగిస్తున్నారు. . తాజాగా ఓ కుటుంబంలో టమాట చిచ్చురేపింది. భార్యకు తెలియకుండా భర్త కూరలో టమాట వేశాడనీ మనస్థాపం చెందిన భార్య అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. భార్య ఎంతకీ తిరిగిరాక పోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

వివరాలలోకి వెళితే మధ్యప్రదేశ్‌ షాదోల్ జిల్లాలో ధన్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలోని బెమ్‌హోరి గ్రామానికి చెందిన సందీప్ బర్మన్ చిన్న దాబాను నడుపుతున్నాడు. మంగళవారం సాయంత్రం వంట చేస్తున్న సమయంలో.. సందీప్‌ భార్యకు తెలియకుండా రెండు టమాటా లు కూరలో వేశాడు దీంతో మనస్తాపం చెందిన భార్య కోపంతో చిన్న కూతురుని తీసుకుని పుట్టింటికి వెళ్లింది. భార్య తిరిగిరాకపోవడంతో చేసేదిలేక సందీప్‌ ధన్‌పురి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

సందీప్‌ వద్ద అతని భార్య ఫోన్‌ నంబర్‌ తీసుకుని ట్రేస్‌ చేయగా..ఉమరియాలోని తన సోదరి ఇంట్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆమెను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చి దంపతులిద్దరికీ సర్దిచెప్పి పంపించినట్లు ధన్‌పురి పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి సంజయ్ జైస్వాల్ తెలిపారు..

ఉగ్రవాదులకు పదేళ్లు జైలు శిక్ష

హైదరాబాద్ :జులై 13

హైదరాబాద్ లో తీవ్ర సంచలనం సృష్టించిన లుంబినీ పార్కు, గోకుల్ చాట్ పేలుళ్ల కేసుల్లో నిందితులకు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.

ఇండియన్ ముజాహిద్దున్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులకు శిక్ష ఖరారు అయింది. నలుగురు టెర్రరిస్టులకు కోర్టు పదేళ్లు జైలు శిక్ష విధించింది. హైదరాబాద్‌కు చెందిన ఒబేదుర్ రహ్మన్‌తో పాటు, ధనీష్ అన్సారీ, అఫ్తాబ్ అలాం, ఇమ్రాన్ ఖాన్‌లకు కోర్టు శిక్ష విధించింది.

వారణాసి, ముంబై, ఫైజాబాద్, లక్నో హైదరాబాద్‌లో జంట పేలుళ్లు, జైపూర్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై సీరియల్ బ్లాస్ట్‌ల్లో నిందితుల ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. హైదరాబాద్, ఢిల్లీలో భారీ పేలుళ్లకు వీరు కుట్ర పన్నినట్లు సమాచారం..

తమిళనాడులో BRS : ఎంట్రీ..❓️ స్టార్ హీరోతో రహస్య చర్చలు!

తమిళనాడు:జులై 13

జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నాని టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన కేసీఆర్.. దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తున్నది. తమిళనాడులోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్రముఖ సినీ హీరోతో చర్చలు జరిపినట్లు సమాచారం.

కొన్ని వారాలుగా తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి త్వరలోనే పొలిటికల్ గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారని జోరుగా ప్రచారం వినిపిస్తున్నది.

ఈ ప్రచారానికి మరింత బలం చేకూరేలా ఈ మధ్య కాలంలో ఆయన చేసే కార్యక్రమాలు ఆసక్తిని పెంపొందిస్తున్నాయి.....

AP News: వచ్చే ఎన్నికల్లో భాజపా, తెదేపా, జనసేన మధ్య పొత్తు: ఆదినారాయణరెడ్డి

అమరావతి: ఏపీలో జరిగే ఎన్నికల్లో భాజపా, తెదేపా, జనసేన మధ్య పొత్తు ఉంటుందని భాజపా నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. పొత్తు దిశగానే చర్చలు జరుగుతున్నాయని చెప్పారు..

రాష్ట్రంలో వైకాపా దుర్మార్గపు పాలనను అంతమొందించడమే లక్ష్యమని.. 3 పార్టీలు కలుస్తాయని భాజపా కేంద్ర నాయకత్వం కూడా సంకేతాలు ఇచ్చిందని తెలిపారు.

ఇటీవల కేంద్ర మంత్రి నారాయణ స్వామి కూడా పొత్తులపై స్పష్టతిచ్చారని చెప్పారు. కేంద్రం సంకేతాలు లేకుంటే తానెందుకు ప్రస్తావిస్తానని వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌కు కేంద్రం నుంచి ఎలాంటి అండదండలేవని.. సీబీఐ కేసుల్లో కేంద్రం అండగా ఉందనేది అపొహే మాత్రమే ఆదినారాయణరెడ్డి చెప్పారు..

కొత్తగూడెంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం.. సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

కొత్తగూడెం:జులై 13

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం,కొత్తగూడెంలో గురువారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్నది. భద్రాచలం, బూర్గంపాడు, దుమ్ముగూడెం మండలాల్లో భారీ వానపడుతున్నది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.

వర్షం కారణంగా సింగరేణి జీకే ఓసీలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఎగువన భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నదిలో ఒక్కసారిగా ప్రవాహం పెరిగింది. ఒక్కరోజులోనే నదిలో నీటిమట్టం 13 అడుగులకు చేరింది.

కాగా, భద్రాద్రి రామయ్య సన్నిధి కల్యాణమండపం వద్ద పెను ప్రమాదం తప్పింది. కల్యాణమండపం వద్ద రోడ్డు మీద నుంచి రేలింగ్‌ పైకి కారు దూసుకెళ్లింది. అయితే

ఆ సమయంలో అక్కడ భక్తులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది....

ఉచిత విద్యుత్‌పై ఆగని మంటలు

కరీంనగర్ జిల్లా :జులై 13

జిల్లాలో కాంగ్రెస్ బీఆర్‌ఎస్ నేతల మధ్య ఫ్లెక్సీల వార్ నడుస్తోంది. ఉచిత కరెంట్ అవసరం లేదంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే. రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనకు కూడా చేసింది. తాజాగా గురువారం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా జిల్లాలో బీఆర్‌ఎస్ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

దీనిపై కోపంతో ఊగిపోయిన కాంగ్రెస్‌ నేత రోహిత్ రావు.. బీఆర్‌ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేశారు. అసలు ఆ ఫ్లెక్సీలో ఏముందంటే... ‘‘మూడు గంటలు కరెంట్ చాలన్న కాంగ్రెస్‌కు మా గ్రామంలో ప్రవేశం లేదు. కబర్దార్ కాంగ్రెస్ నేతల్లారా’’ అంటూ బీఆర్‌ఎస్ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలను చూసిన కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రోహిత్ రావు... ఆ ఫ్లెక్సీలను వాటిని చించివేశారు.

హైదరాబాద్‌‌కు రేవంత్..

మరోవైపు... టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. తానా సభల్లో ఉచిత విద్యుత్‌పై రేవంత్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణలో పాలిటిక్స్‌ హీటెక్కాయి. తాజా పరిణామాలతో రేవంత్ ఎలాంటి కార్యచరణ ప్రకటిస్తారోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. బీఆర్ఎస్ ఆందోళనపై ఇప్పటికే ట్విట్టర్ వేదికగా రేవంత్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎంత దుష్ప్రచారం చేసినా వచ్చేది కాంగ్రెస్ అని... ఉచిత విద్యుత్ ఇచ్చేది కాంగ్రెస్ అంటూ రేవంత్ కౌంటర్ ఇచ్చారు. ఈరోజు గురువారం రేవంత్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో రేవంత్ మీడియా సమావేశం అనంతరం ఉచిత్ విద్యుత్‌పై చెలరేగుతున్న మాటలు మంటలకు పుల్‌స్టాప్‌ పడుతుందో లేదో చూడాలి....

Manchu Mohanbabu : మీడియాపై మోహన్‌బాబు ఆగ్రహం.. లోగోలు లాక్కోండంటూ బౌన్సర్లకు ఆదేశం

హైదరాబాద్ : ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు షాద్ నగర్‌లో మీడియాపై కాసేపు చిందులు తొక్కారు. ఓ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ఆయన గురువారం స్థానిక సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చారు..

అయితే మోహన్ బాబు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న స్థానిక మీడియా ప్రతినిధులు కొందరు కవరేజ్‌కు వెళ్లారు. మీడియాను చూడగానే మోహన్ బాబు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు.

'ఆ లోగోలు లాక్కొండయ్యా' అంటూ తన బౌన్సర్లకు సూచించారు. మీడియా ప్రతినిధులకు బుద్ధి లేదా? అంటూ తన నోటికి పని చెప్పారు. సీనియర్ నటుడైన మోహన్ బాబు తన ఆస్తికి సంబంధించి వీలునామా కోసం వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం అందుతుంది. అయితే ఈ వ్యవహారం మీడియా దృష్టి పడకుండా ఆయన వ్యవహరించడంతో అక్కడ ఉన్నవారు ఏం జరుగుతుందోనని చూస్తూ ఉండిపోయారు. మీడియాపై చిందులు తొక్కిన వ్యవహారం, బౌన్సర్లు అత్యుత్సాహం ప్రదర్శించిన తీరు రాద్ధాంతం అయింది..

పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు ఉరి

•బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు..

•నల్లగొండ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆధ్యర్యంలో

•నల్లగొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో గల సబ్ స్టేషన్ ముందు...

బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు..

నల్లగొండ నియోజకవర్గంలోని అన్ని సబ్ స్టేషన్ల ముందు... బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు.. పెద్ద ఎత్తున రైతులతో కలిసి ధర్నా కార్యక్రమాలు నిర్వహించి.. దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు....

ఈ నిరసన కార్యక్రమాలకు రైతుల నుండి అనూహ్య స్పందన లభించింది... ఎక్కడికక్కడ స్థానిక బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ... రైతులు ఉచిత కరెంటు పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తమ తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు.

నల్లగొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో గల సబ్ స్టేషన్ ముందు... బిఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి....

పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ఉరి తీశారు...

కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల తమ నిజస్వరూపాన్ని... బయట పెట్టుకుందని... అందుకనే ఈ రోజు రైతు లోకం యావత్తు తమ తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తున్నారని..

రైతుల పట్ల కాంగ్రెస్ బిజెపిల... వైఖరి అర్థమైందని... వచ్చే ఎన్నికల్లో రైతులు ఆ రెండు పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించడం ఖాయమని అన్నారు.

రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి నిరంజన్ వలి.,. చైర్మన్ చీర పంకజ్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ ఛైర్మన్ అబ్బగోని రమేష్, మాలే శరణ్య రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, జమాల్ ఖాద్రి, జిల్లా శంకర్,కత్తుల సంజీవ ... పట్టణ పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్.. కార్యదర్శి సంధినేని జనార్దన్ రావు, కౌన్సిలర్లు ఊట్కూరి వెంకటరెడ్డి, ఆలకుంట్ల మోహన్ బాబు.. మారగోని గణేష్ జేరిపోతుల భాస్కర్ గౌడ్..

గోగుల శ్రీనివాస్, ఇబ్రహీం. ఎడ్ల శ్రీనివాస్ యాదవ్ వట్టిపల్లి శ్రీనివాస్, యామా దయాకర్ నాయకులు.. పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి, రావుల శ్రీనివాస్ రెడ్డి హసన్ సలీం, దొడ్డి రమేష్, సైదులు గౌడ్ కాసం శేఖర్, పి జనార్దన్ రావు,రాజేందర్,వీరమల్ల భాస్కర్ అంజి బాబు, కంకణాల వెంకటరెడ్డి, సింగిరికొండ శివకుమార్, దోనాల నాగార్జున రెడ్డి... పట్టణ మహిళా అధ్యక్షురాలు దుబ్బరూప, మామిడి పద్మ, యాట జయప్రద రెడ్డి కత్తుల సంధ్య గాలి రాధిక... తదితరులు పాల్గొన్నారు.