బీసీలను అవమానపరిచిన కల్వకుంట్ల కవిత బీసీలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి
•బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ డిమాండ్.
ఢిల్లీలో బీసీలకు స్థానిక సంస్థలు, విద్యా ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన పోరుగర్జన సభను ఉద్దేశించి అదొక తుఫెలు దీక్ష అని అనుచిత వ్యాఖ్యలు చేసిన కల్వకుంట్ల కవిత ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని యావత్ బీసీ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ బీసీలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు కల్వకుంట్ల కవిత అగ్రకులానికి నిదర్శనమన్నారు. తెలంగాణ రాష్ట్ర బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడిన మీకు మీ రాజకీయపబ్భం గడుపుకోవటం కోసమే ఫూలే విగ్రహాల కోసం దొంగ దీక్షలు చేస్తున్నావని దుయ్యబట్టారు. నిజంగా మీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే పది సంవత్సరాల కాలంలో మీ తండ్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కనాడయినా బీసీల గురించి, ఫూలే విగ్రహం గురించి మాట్లాడినారా అని ప్రశ్నించారు. ఈ పది సంవత్సరాల అధికారం మీదే ఉన్నప్పుడు ఎందుకు అసెంబ్లీలో ఫూలే విగ్రహం పెట్టలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారం కోల్పోగానే మళ్ళీ అధికారం కావాలని బీసీల ఓట్ల కోసం నేడు బీసీల మీద సవతి తల్లి ప్రేమ ఒలకబోస్తున్నారన్నారు. మీకు రాబోయే రోజుల్లో బీసీలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఇకమీదట ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు ముదిరాజ్, ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
May 08 2025, 15:57