నిజంనిప్పులాంటిది

Jun 04 2024, 09:17

దేశవ్యాప్తంగా ప్రస్తుతం 91 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ ఆధిక్యం...

దేశవ్యాప్తంగా ప్రస్తుతం 91 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ ఆధిక్యం...

ఇప్పటికే ఒక్కస్థానంలో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు...

కాంగ్రెస్ 33 పార్లమెంట్ స్థానాల్లో ఆధిక్యం...

Streetbuzz News

SB News

Realtime News Platform

నిజంనిప్పులాంటిది

Jun 04 2024, 08:37

పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో ఎన్డీఏ కూటమి అత్యధిక స్థానాల్లో ముందుకు దూసుకుపోతుంది..


పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో ఎన్డీఏ కూటమి అత్యధిక స్థానాల్లో ముందుకు దూసుకుపోతుంది..

అమరావతి

తెలుగుదేశం 107

జనసేన. 20

వైసీపీ. 27 స్థానాల్లో ముందంజ..

నిజంనిప్పులాంటిది

Jun 04 2024, 07:26

దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న ఉత్కంఠ..!

•నేడే పార్లమెంట్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు

- కౌంటింగ్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు

- 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం

ఈ సారి 400 సీట్లు సాధించాలన్న మోదీ లక్ష్యానికి దగ్గరగా ఎన్డీయే కూటమి సీట్లు సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇక ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మొద్దని ఇండియా కూటమి చెబుతోంది.

అంచనాకు మించిన ఫలితాలతో అధికారాన్ని దక్కించుకోబోతున్నట్టు కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు చెబుతున్నాయి. మరి ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా? లేక జనాల తీర్పు మరోలా ఉంటుందా?.. అనే ప్రశ్నలకు మరికొన్ని గంటల్లోనే సమాధానం దొరకనుంది. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన లైవ్‌ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు కోకిల డిజిటల్ మీడియా అందిస్తోంది.

మరికాసేపట్లో దేశవ్యాప్తంగా మొత్తం 452 లోక్‌సభ స్థానాలకు మొదలు కానున్న కౌంటింగ్.

నిబంధనల ప్రకారం తొలుత పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కిస్తారు.

పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు మొదలైన అరగంట తర్వాతే ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపును మొదలెట్టాల్సి ఉంటుంది.

ఒకవేళ నియోజకవర్గంలో పోస్టల్‌ బ్యాలెట్లు లేకుంటే నిర్దేశించిన సమయానికే ఈవీఎంల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభించాలి.

కంట్రోల్‌ యూనిట్ల నుంచి ఫలితాన్ని నిర్ధారించే ముందు.. పేపర్‌ సీల్‌ చెదిరిపోకుండా చూసుకోవాలి.

అనంతరం మొత్తం పోలైన ఓట్లను, ఫారం 17సీలో పేర్కొన్న సంఖ్యతో సరిపోల్చుకోవాలి.

కేంద్రంలో అధికార పీఠం ఎవరిదో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ప్రజలు, రాజకీయ పార్టీల ఉత్కంఠకు తెరపడనుంది. వరసగా మూడోసారి, రికార్డు విజయంపై ప్రధాని మోదీ కన్నేయగా.. ప్రతిపక్ష ఇండీ కూటమి అనూహ్యంగా తామే అధికారంలోకి వస్తామని ధీమాగా ఉంది.

నిజంనిప్పులాంటిది

Jun 03 2024, 18:48

కౌంటింగ్ సెంటర్ల పరిసరాలను రెడ్ జోన్ గా ప్రకటించాం.

ఏపీలో మొత్తంగా 1985 సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాం. 

సమస్యలను సృష్టించే 12 వేల మందిని గుర్తించి.. 

బైండోవర్ చేశాం. ఇప్పటి వరకు 1200 ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించాం. 

డ్రోన్ల ద్వారా నిఘా పెట్టాం-ఏపీ సీఈవో ముకేష్‌ కుమార్‌ మీనా

నిజంనిప్పులాంటిది

Jun 03 2024, 15:46

తడిసిన ధాన్యం పై రాష్ట్ర సర్కార్ సైలెంట్ ?

- అకాల వర్షాలకు తడిసిన ధాన్యం 

- అకాల వర్షాలతో రైతులకు భారీ నష్టం

- తడిసిన ధాన్యంతో అన్నదాతల అగులు బుగులు 

 

అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించినా ఎక్కడా అమలు కావడం లేదు. తడిసిన ధాన్యాన్ని కొనేందుకు అధికారులు ససేమిరా అంటున్నారు.

మళ్లీ ఆరబెట్టి తీసుకురావాలని చెప్తున్నారు. ఎక్కడో ఒక చోట రైతుల ఒత్తిడి తట్టుకోలేక కొనుగోలు చేస్తే.. ఆ ధాన్యాన్ని దించుకునేందుకు మిల్లర్లు నిరాకరిస్తున్నారు. ఈ తడిసిన ధాన్యం తామేం చేసుకుంటామని, తిరిగి బియ్యం ఏ విధంగా ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి మాటకే దిక్కులేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అకాల వర్షాలు .. ప్రభుత్వ నిర్లక్ష్యం !

ఓవైపు అకాల వర్షాలు రైతులపై పగబడితే.. మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం వారికి మరింత నష్టం చేస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంట చేతికొచ్చే సమయంలో కురిసిన అకాల వర్షాలు రైతులను నిండాముంచాయి. చేతికొచ్చిన మిగిలిన పంటతోనైనా పెట్టుబడి వస్తుందనుకున్న రైతులకు ప్రభుత్వం నుంచి నిరాశే ఎదురవుతున్నది. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల కష్టాలను, నష్టాలను మరింత పెంచుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. కొనుగోలు కేంద్రంలోకి ధాన్యం తీసుకొచ్చి వారం పది రోజులవుతున్నా.. కాంట పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఓసారి ధాన్యం తడిసిందని, మరోసారి ధాన్యం ఎండలేదని, ఇంకోసారి తాలు ఉందని ఇలా ఎప్పటికప్పుడు సాకులు చెబుతూ వాయిదాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికలు కూడా రైతుల నష్టాన్ని మరింత పెంచాయి. అధికారులంతా పోలింగ్‌లో నిమగ్నంకావడంతో కొనుగోళ్లు మరింత ఆలస్యం అవుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.

2వేల కోట్ల బకాయిలు ఎప్పుడో ?

ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం… రైతులకు డబ్బులు చెల్లింపుల్లోనూ ఇదే తరహా నిర్లక్ష్యం చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు సుమారు 26 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి రైతులకు సుమారు రూ. 5700 కోట్ల వరకు చెల్లించాల్సి ఉండగా రూ. 3700 కోట్ల వరకు చెల్లించినట్టు తెలిసింది. అంటే ఇంకా రైతులకు రూ. 2వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే రైతుబంధు పెట్టుబడి సాయాన్ని ఆలస్యంగా ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ధాన్యం అమ్ముకున్న డబ్బులు కూడా ఆలస్యంగా ఇస్తున్నదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం విక్రయించిన వారం పది రోజులకు కూడా డబ్బులు పడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిజంనిప్పులాంటిది

Jun 03 2024, 15:44

కొత్త చట్టాల పై అవగాహన కలిగి ఉండాలి

- నూతన చట్టాల అవగాహన పై సిబ్బందికి విడతలుగా శిక్షణ తరగతులు నిర్వహిస్తాం.

- ఎస్పీ రాహుల్ హెగ్డే సమావేశం

కొత్త చట్టాల అవగాహన కార్యక్రమానికి హాజరైన అదనపు ప్రజా న్యాయవాది ఉపేందర్ నూతన చట్టాల గురించి వివిధ సెక్షన్ల ల గురించి అవగాహన కల్పించారు. మారిన సెక్షన్స్ మరియు చాప్టర్లను ప్రతి ఒక్కరికి క్లుప్తంగా వివరిస్తూ.. గత సెక్షన్లతో పోల్చినప్పుడే తొందరగా అవగతం అవుతాయని అన్నారు. 

 ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ 2024 సం. జూలై 1వ తేది నుండి దేశవ్యాప్తంగా కొత్త చట్టాలను అమలు చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అందుకు అనుగుణంగా జూలై 1వ తేది నుండి కొత్త చట్టాలను అనుసరిస్తూ ముందుకు సాగాల్సి ఉంటుందన్నారు. కొత్త చట్టాల గురించి ప్రతి ఒక్క అధికారి, సిబ్బందికి పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఇందులో భాగంగా జిల్లా పోలీసులందరికీ విడతలవారీగా శిక్షణ తరగతులను నిర్వహించడం జరుగుతుందన్నారు. 

కొత్త చట్టాలైన (1) భారతీయ న్యాయ సంహిత, (2) భారతీయ నాగరిక్ సురక్ష సంహిత మరియు (3) భారతీయ సాక్ష్యా అధినియం-2023. వీటిపై పూర్తి అవగాహన కలిగి ఉన్నపుడే సమర్ధవంతంగా విధులు నిర్వహించగలం అని, కొత్త చట్టాలపై అవగాహణ రావాలంటే నేర్చుకోవాలనే తపన మనలో ఉన్నప్పుడే సాద్యం అవుతుందని అన్నారు.

కొత్త చట్టాల అమలు జరిగిన వెంటనే ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అన్ని సెక్షన్లపై పూర్తి అవగాహన అవసరం అని, అప్పుడే బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి, ఏఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి, స్టేషన్ బెయిల్ కు ఎవరు అర్హులు, చార్జీషీట్ ఎలా తయారు చేయాలి, నిందితులకు శిక్షలు ఖరారు చేయడంలో దర్యాప్తు అధికారులు ఎలా వ్యవహరించాలి, తదితర అంశాలపై కొత్త చట్టంలో మార్పుల గురించి వివరించారు. 

 అనంతరం అదనపు ఎస్పీ. నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా భద్రత కోసం ఎన్నో చట్టాల రూపకల్పన చేయడం జరుగుతుందని నూతన చట్టాల నిర్వహించే శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డీఎస్పీ లు రవి, శ్రీధర్ రెడ్డి, సి ఐ లు శ్రీను, రాము, సురేందర్ రెడ్డి, చరమంద రాజు, రజిత రెడ్డి, రామకృష్ణ రెడ్డి, రఘువీర్ రెడ్డి, స్టేషన్ ఎస్ ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

Jun 03 2024, 15:42

ద్వారకా తిరుమల ఆలయాన్ని సందర్శించిన కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

విజ‌య‌వాడ : టిడిపి విజ‌య‌వాడ పార్ల‌మెంట్ అభ్య‌ర్థి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ఏలూరు నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం ద్వార‌కా తిరుమ‌ల ఆల‌యాన్ని కుటుంబ స‌మేతంగా సంద‌ర్శించారు.

కేశినేని శివ‌నాథ్ తో పాటు ఆయ‌న స‌తీమ‌ణి జాన‌కి ల‌క్ష్మీ, కుమారుడు వెంక‌ట్ వేంకటేశ్వరస్వామి సేవలో పాల్గొని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి మొక్కులు చెల్లించుకున్నారు. 

అనంతరం అర్చకులు శివ నాథ్ ను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రూ ఎదురుచూస్తున్న ఉషోద‌యం జూన్ 4వ తేదీన ఉద‌యించాల‌ని...

చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రి కావాల‌నే ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ను నెర‌వేర్చాల‌ని వేంక‌టేశ్వ‌ర‌స్వామ‌ని కోరుకోవ‌టంతో పాటు.. రాష్ట్ర ప్రజలందరిపై స్వామి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించిన‌ట్లు కేశినేని శివ‌నాథ్ తెలిపారు.

నిజంనిప్పులాంటిది

Jun 03 2024, 15:39

ఎమ్మెల్సీ కవితకు మరో షాక్.. ఈసారి ఏకంగా నెల రోజులు

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించిన ఈడీ కేసులో బీఆర్‌ఎస్ నాయకురాలు కే. కవిత‌కి కష్టాలు తగ్గేలా కనిపించడం లేదు.

తాజా కేసులో జ్యుడీషియల్ కస్టడీ గడువు సోమవారంతో ముగియడంతో ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. వార్తా సంస్థ ANI ప్రకారం, కోర్టు నుండి జూలై 3 వరకు కవితను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో కవితను మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ ఈడీ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో తీహార్ జైలులో ఉన్న సమయంలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ కేసులో దాఖలైన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు మే 29న వారెంట్‌ జారీ చేయడం గమనార్హం. అంతకుముందు మే 6న, ఈడీ నమోదు చేసిన కేసులో బెయిల్‌ను కోర్టు తిరస్కరించింది, కవితకు బెయిల్ లభిస్తే, ఆమె సాక్షులను ప్రభావితం చేయగలదని దర్యాప్తు సంస్థ కోర్టుకు తెలిపింది.

నిజంనిప్పులాంటిది

Jun 02 2024, 09:33

Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం..!!

- అనారోగ్య సమస్యతో బాధపడుతున్న సోనియా గాంధీ 

- సోనియమ్మ లేకుండానే ఆవిర్భావ వేడుకలు

మరికాసేపట్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల సంరంభం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రారంభం కానుంది. వేడుకల్లో భాగంగా తెలంగాణ అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు.

పోలీస్ సిబ్బందికి అవార్డులను అందజేస్తారు. ఆవిర్భావ వేడుకలకు రావాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించారు. అనారోగ్య కారణాల వల్ల ఆమె రావడం లేదని తెలుస్తోంది. కానీ తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. 

ఉదయం 9.35లకు పరేడ్ గ్రౌండ్‌కు సీఎం రేవంత్ రెడ్డి వస్తారు.

9.55కు సీఎస్ శాంతి కుమారి, డీజీపీ స్వాగతం

10 గంటలకు జాతీయ పతాకం ఆవిష్కరణ

10.35కు తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం ఆవిష్కరణ

10.38కు సోనియా గాంధీ ప్రసంగం (షెడ్యూల్‌లో ఉంది. అనారోగ్య కారణాల వల్ల హాజరుకావడం లేదు)

10.43కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం11.08కు పోలీస్ సిబ్బందికి అవార్డుల ప్రదానం

తెలంగాణ ఆవిర్భవ వేడుకల నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రోజు సాయంత్రం ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వెల్లడించారు. ఆవిర్భావ వేడుకల కోసం జిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా తరలొస్తున్నారు. ఆ క్రమంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

నిజంనిప్పులాంటిది

Jun 02 2024, 08:40

నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు.

హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల్లో వేడుకలు. 

పరేడ్‌ గ్రౌండ్స్‌ వేడుకల్లో పాల్గొననున్న గవర్నర్‌, సీఎం రేవంత్ రెడ్డి. 

సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు.

Streetbuzz News