నిజంనిప్పులాంటిది

Sep 21 2023, 16:45

Rahul Gandhi : రైల్వే కూలీగా రాహుల్ గాంధీ..!

దిల్లీ : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) గురువారం మాస్‌ లుక్కులో కనిపించారు.

దిల్లీలోని ఆనంద్‌ విహార్‌ రైల్వే స్టేషన్‌ (Anand Vihar Railway Station)లో కొద్దిసేపు కూలీగా పనిచేశారు..

ఈ సందర్భంగా అక్కడి కూలీలతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు.

రాహుల్‌ తమను కలవాలని రైల్వే కూలీలు సామాజిక మాధ్యమంలో కోరిన వీడియో ఇటీవల వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దీనికి రాహుల్‌ స్పందించారు.

గురువారం ఆయనే స్వయంగా ఆనంద్‌ విహార్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్‌ పార్టీ (Congress) తన అధికారిక ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాలో పంచుకొంది.

భారత్‌ జోడో యాత్ర (Bharat Jodo Yatra)కు దీనిని కొనసాగింపుగా అభివర్ణించింది. ఆ వీడియోలో రాహుల్ గాంధీ రైల్వే కూలీ వలే సామాన్లు మోస్తున్న దృశ్యాలు కూడా ఉన్నాయి..

నిజంనిప్పులాంటిది

Sep 21 2023, 16:42

కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలు దేశంలో ఎక్కడైనా ఇలాంటి ఇండ్లు నిర్మించాయా?: మంత్రి కేటీఆర్

ఒక్క రూపాయి చెల్లించే అవసరం లేకుండా పేదలకు ఇళ్లను అందిస్తున్నామని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.

దుండిగల్ లో గురువారం రెండో విడత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ పాల్గొని 2,100మంది అర్హులైన పేద లబ్దిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ..ఇళ్లు కట్టి చూడు.. పెళ్ళి చేసి చూడు అని పెద్దలు అన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ ఇళ్లు కట్టిస్తున్నాడు..పెళ్లి చేస్తున్నాడు. ఒక్క రూపాయి చెల్లించే అవసరం లేకుండా పేదలకు ఇళ్లు అందిస్తున్నాం.

అత్యంత పారదర్శకంగా ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక జరిగింది. కాంగ్రెస్, బిజెపి పార్టీల కార్యకర్తలకు సైతం రెండు పడకల గదుల ఇళ్లు అందిస్తున్నాం.

రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ ఒక్కరోజే 13,300 ఇళ్లను అబ్ధిదారులకు ఇళ్లను అందజేస్తున్నాం. ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షలు ఖర్చు అవుతుంది.

కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలు దేశంలో ఎక్కడైనా ఇలాంటి ఇళ్లు నిర్మించాయా?. భవిష్యత్ లో అర్హులందరికీ రెండు పడకల గదుల ఇళ్లు ఇస్తాం. రూ.73వేల కోట్లతో రైతులకు రుణమాఫీ చేశాం” అని పేర్కొన్నారు...

నిజంనిప్పులాంటిది

Sep 21 2023, 16:40

సింగరేణి కార్మికులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు

ఉద్యోగులకు సింగరేణి యాజమాన్యం శుభవార్త అందించింది. 11వ వేజ్‌ బోర్డు ఏరియర్స్‌ విడుదల చేసింది.

మొత్తం 39,413 మంది సింగరేణి ఉద్యోగులకు రూ.1,450 కోట్లు జమచేసింది. ఈరోజు మధ్యాహ్నం నుంచి కార్మికుల బ్యాంక్‌ ఖాతాలో ఏరియర్స్‌ జమ చేయనున్నట్లు వెల్లడించింది.

ఈ లెక్కన ఒక్కో కార్మికుడి ఖాతాలో రూ.3.70 లక్షల ఏరియర్స్ జమకానుంది‌. త్వరలో దసరా, దీపావళి బోనస్‌ చెల్లింపులకు కూడా సింగరేణి సిద్ధమైంది..

SB NEWS

SB NEWS

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

Sep 21 2023, 16:32

అసెంబ్లీలో తొడ కొట్టడం మీసాలు మెలేయడం మన సాంప్రదాయం కాదు: స్పీకర్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా కొనసాగాయి, అసెంబ్లీ నుండి గురువారం 14 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.

మరో వైపు ఈ సమావేశాలు ముగిసే వరకు టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు ప్రారంభమైన వెంటనే చంద్రబాబు అరెస్ట్ పై వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టారు.

స్పీకర్ పోడియం వద్ద నిరసనకు దిగారు. స్పీకర్ పోడియం వద్ద టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మీసం తిప్పారు. బాలకృష్ణకు వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి తొడగొట్టి కౌంటరిచ్చారు.

దీంతో సభలో ఉద్రిక్తత నెలకొంది. రెండు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు పోటా పోటీగా నిరసనలకు దిగారు. దీంతో సభను స్పీకర్ తమ్మినేని సీతారాం వాయిదా వేశారు.

టీడీపీ ఎమ్మెల్యేలు అనగాని సత్య ప్రసాద్, పయ్యావుల కేశవ్.. వైసీపీ నుంచి టీడీపీ వైపు వెళ్లిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు స్పీకర్ తమ్మినేని సీతారాం. అదే సమయంలో నందమూరి బాలకృష్ణకు మాత్రం ఫస్ట్ వార్నింగ్ ఇచ్చారు.

అసెంబ్లీలో తొడగొట్టడం, మీసం మెలేయడం సరైన సంప్రదాయం కాదని అన్నారు స్పీకర్. అలాంటి చర్యలకు పాల్పడినందుకు బాలకృష్ణకు మొదటి హెచ్చరిక జారీ చేశారు. మిగతా సభ్యులపై కూడా అధికార పక్షం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరడంతో..

వారిని కూడా ఒకరోజు సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా టీడీపీ సభ్యులందర్నీ సభ నుంచి బయటకు పంపించి వేశారు...

నిజంనిప్పులాంటిది

Sep 21 2023, 16:29

తెలంగాణ రైతులకు రుణమాఫీ నిధులు విడుదల

తెలంగాణ రైతులకు రుణమాఫీ నిధులను కెసిఆర్ సర్కార్ అందించనుంది, రుణమాఫీ కోసం రూ.వెయ్యి కోట్లు నిధులను ఈ మేరకు విడుదల చేసింది.

తెలంగాణ ప్రభుత్వం బుధవారం రాత్రి నిధులను విడుదల చేసింది. ఈ డబ్బులు రైతుల అకౌంట్లలో జమ కానున్నాయి. రైతు రుణమాఫీ ద్వారా దాదాపు 21.35 లక్షల మంది రైతులు లబ్ది పొందారు. తొలి విడతగా రూ.50 వేలలోపు రుణాలు తీసుకున్న రైతులకు మాఫీ చేయగా..

రెండో విడత రుణమాఫీ ప్రక్రియను ఆగస్ట్ 3 నుంచి ప్రభుత్వం ప్రారంభించింది

రెండో విడతలో 29.61 లక్షల మంది రైతులకు రూ.19 వేల కోట్లను మాఫీ చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఆగస్ట్ 5న రూ.5809 కోట్లు, తాజాగా రూ.10 వేల కోట్ల విడుదల చేసింది.

త్వరలో రూ.లక్ష రుణం తీసుకున్న రైతులకు కూడా మాఫీ చేయనుంది. ఎన్నికల నేపథ్యంలో విలైనంత త్వరగా రైతు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో బ్యాంకులతో సంప్రదించి వేగవంతంగా చర్యలు చేపడుతోంది.

రుణమాఫీ నిధులు విడుదల అవుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా రైతు రుణమాఫీ ఎప్పుడు అవుతుందా? అని రైతులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పెట్టడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు......

SB NEWS

నిజంనిప్పులాంటిది

Sep 21 2023, 16:27

అసెంబ్లీ సాక్షిగా మీసం మెలేసిన బాలకృష్ణ!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు తొలిరోజు వాడి వేడిగా ప్రారంభమయ్యాయి, టిడిపి సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు.

టీడీపీ అధినేత చంద్రబాబుపై మోపిన స్కిల్ అక్రమ కేసు పెద్ద ఎత్తున దుమారం రేపింది. స్పీకర్ పోడియంను టీడీపీ ఎమ్మెల్యేలు చుట్టుముట్టారు.

ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యేలు పోడియం వద్దకు వెళ్ళబోయారు. హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణపై అంబటి ఫైర్ అయ్యారు. మీసాలు తిప్పడం వంటివి సినిమాల్లో చూపించుకోవాలని బాలకృష్ణను అంబటి అన్నారు.

దీంతో ఫైర్ అయిన బాలకృష్ణ చూసుకుందాం రా’ అంటూ అంబటికి సవాల్ విసిరారు. అంబటి సైతం ‘రా చూసుకుందాం’ అని ప్రతి సవాల్ విసిరారు.

అంబటి సవాల్‌కు బాలకృష్ణ మీసం మెలేసి తొడిగొట్టారు. దీంతో తామూ మెలేస్తాం అని అధికార పార్టీ ఎమ్మెల్యేలు అన్నారు.

ఒకరిపై ఒకరు సవాళ్లు, ప్రతిసవాళ్లలో సభలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది..

SB NEWS

నిజంనిప్పులాంటిది

Sep 21 2023, 10:28

అంగన్‌వాడీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నదెవరు?

ఉమ్మడి రాష్ట్రంలో రోజుల తరబడి సమ్మెచేసినా అంగన్‌వాడీలకు ప్రభుత్వాలు ఒక్క రూపాయి వేతనం పెంచలేదు.

కానీ, నేడు ఏ వినతిపత్రం ఇవ్వకపోయినా మూడుసార్లు వేతనం పెంచిన తెలంగాణ సర్కార్‌ మీదికి అంగన్‌వాడీలను ఉసిగొల్పుతున్నది ఎవరు?

తమ ఉనికిని కాపాడుకోవటం కోసం రెండు సంఘాలు ఈ పని చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అక్కున చేర్చుకొని అండగా నిలిచిన సర్కారుపై విషం చిమ్మే కుట్రలో భాగంగానే అంగన్‌వాడీలతో బలవంతపు సమ్మె చేయిస్తున్నారనే వాదనకు ఆదిలాబాద్‌ ఘటన నిదర్శనమనే వాదన వినిపిస్తున్నది.

అంగన్‌వాడీ కేంద్రం ప్రభుత్వ ఆస్తి.. ప్రభుత్వ ఆస్తిని సొంత ఆస్తిగా భావించి వాటికి తాళాలు వేసి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు భంగం కలిగించి తద్వారా ప్రభుత్వంపై తమ అక్కసును కొన్ని సంఘాలు వెళ్లగక్కుతున్నాయి.

అదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మహిళా ఎస్సై పై దాడి కి పాల్పడిన అంగన్వాడి కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.అక్కడ విధులు నిర్వహిస్తున్న,తలమడుగు ఎస్ ఐ ధనశ్రీ,వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా అంగన్వాడి టీచర్లు ఆమెపై దాడికి పాల్పడ్డారు జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారు.

భౌతికంగా వారు దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడిన అంగన్వాడీ టీచర్లపై కేసు నమోదు చేశామని పోలీసు చెబుతున్నారు...

నిజంనిప్పులాంటిది

Sep 21 2023, 09:54

మంచు లక్ష్మి కాషాయ కండువా కప్పుకోవడం ఫిక్సేనా?

మోహన్ బాబు కూతురు పొలిటికల్ ఎంట్రీ కి గ్రౌండ్ వర్క్ చేసుకుంది.మోదీకి మంచు కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండగా గతంలో మోదీ, మోహన్ బాబు చాలాసార్లు కలిసిన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే

బీజేపీలోకి మంచు లక్ష్మిని ఆహ్వానించటానికి ప్రధానమంత్రి ఆఫీస్ నుండి మంచు లక్ష్మికి పిలుపు అందిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.2024 ఎన్నికల సమయానికి తెలుగు రాష్ట్రాల్లో పుంజుకోవాలని బీజేపీ భావిస్తుండటం గమనార్హం.

తెలంగాణలో బీజేపీ పరిస్థితి కొంచెం మెరుగ్గానే ఉన్నా ఏపీలో మాత్రం దారుణంగా ఉంది.మంచు లక్ష్మి బీజేపీలోకి నిజంగా ఎంట్రీ ఇస్తారేమో చూడాల్సి ఉంది.

మంచు లక్ష్మి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే రాజకీయాల్లో సంచలనాలు సృష్టించడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

మంచు లక్ష్మి ఢిల్లీ పర్యటన ఊహాగానాలను తావిస్తుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.మహిళా బిల్లును కేంద్రం ఆమోదించిన నేపథ్యంలో పేరున్న ఎంతోమంది మహిళలను పిలిపించి మాట్లాడనున్నారని అందులో భాగంగా మంచు లక్ష్మికి ఆహ్వానం అందిందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

మంచు లక్ష్మి ఢిల్లీకి వెళ్లి మోదీని కలిసిన తర్వాత మాత్రమే ఇతర విషయాలకు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు...

నిజంనిప్పులాంటిది

Sep 21 2023, 10:19

మూడుసార్లు వేతనాలు పెంచింది తెలంగాణ సర్కార్ కాదా? మంత్రి సత్యవతి రాథోడ్

సమ్మెను విరమించి వెంటనే విధుల్లో చేరాలని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్

పిలుపునిచ్చారు.

అంగన్‌వాడీ సంఘాలు చేస్తున్న సమ్మెపై బుధవారం మంత్రి అధికారులతో చర్చించారు. దేశంలో ఏ రాష్ట్రమూ తీసుకోని సాహసోపేత నిర్ణయాలను సీఎం కేసీఆర్‌ తీసుకొని అంగన్‌వాడీలకు అండగా నిలిచారని గుర్తు చేశారు.

అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల వేతనాలను గతంలో ఎన్నడూలేని విధంగా పెంచింది రాష్ట్ర ప్రభుత్వమేనని చెప్పారు. అంగన్‌వాడీల సమ్మెతో సమాజంలో ఎకువగా ఉన్న బలహీనవర్గాల వారు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని పరిషరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు. సమ్మెతో సమస్యలు పరిషారం కావని, సంప్రదింపులు, చర్చల ద్వారా, వినతిపత్రాల ద్వారా పరిషరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇప్పటికే పలు అంగన్‌వాడీ యూనియన్లు కృతజ్ఞతలు తెలిపిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు.

ఇవి నిజాలు కావా?

చరిత్రలో ఎన్నడూలేని విధంగా విజ్ఞప్తులు లేకుండానే సీఎం కేసీఆర్‌ మూడుసార్లు వేతనాలు పెంచింది నిజం కాదా? మెయిన్‌ అంగన్‌వాడీ టీచర్లకు నెలకు రూ.13,650, మినీ అంగన్‌ వాడీ టీచర్లు, ఆయాలకు రూ.7,800 చెల్లిస్తున్నది నిజం కాదా? దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఇలా చెల్లిస్తున్నదా?

అంగన్‌వాడీ టీచర్లకు, ఆయాలకు 50 ఏండ్లలోపు వారికి రూ.2 లక్షల జీవితబీమా, 50 ఏండ్ల నుంచి 65 ఏండ్ల వరకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించే జీవో ఇటీవల ఇచ్చింది నిజం కాదా? దురదృష్టవశాత్తు మరణిస్తే టీచర్లకు రూ.20 వేలు, ఆయాలకు రూ.10 వేలు చెల్లించే జీవోను విడుదల

నిజంనిప్పులాంటిది

Sep 21 2023, 09:09

తిరుపతి లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది

తిరుమలలో భక్తుల రద్దీ సర్వ సాధారణంగానే ఉంది. నేడు గురువారం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 4 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు.

శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.89 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

కాగా... తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు 4వ రోజు వైభవంగా కొనసాగుతున్నాయి.

నేడు శ్రీవారికి కల్పవృక్ష, సర్వభూపాల వాహన సేవలు జరగనున్నాయి.........

SB NEWS

SB NEWS

SB NEWS