బహుజనులకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం: ఆదిమల్ల వెంకటేష్
నల్లగొండ జిల్లా, అనుముల:
అక్టోబర్ 7వ తేదీన బహుజన సింహగర్జన సభ ను విజయవంతం చేయడం కోసం సాగర్ నియోజకవర్గంలో  3వ విడతలో భాగంగా, ఆదివారం బహుజన చైతన్య సైకిల్ యాత్ర అనుముల మండలంలో 3వరోజు ఉదయం మారేపల్లి నుండి బయలుదేరి పులిమామిడి గ్రామానికి చేరుకుంది. గ్రామంలో ప్రజలను ఉద్దేశించి బహుజన్ సమాజ్ పార్టీ సాగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదిమల్ల వెంకటేష్ మాట్లాడుతూ... సాగర్ నియోజకవర్గంలోని ఏ మండలంలో ఉన్న గ్రామాన్ని చూసిన వీధిలైట్లు, రోడ్లు , మురికి కాలువలు సరిగ్గా లేవని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో హామీలు తప్ప ఆచరణ లేదని ఆరోపించారు. ఆ వచ్చే ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కోడి భీం ప్రసాద్ , బహుజన్ సమాజ్ పార్టీ సాగర్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు బత్తుల ప్రసాద్ , నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ముదిగొండ వెంకటేశ్వర్లు, నియోజకవర్గ మహిళా కన్వీనర్ బైరాగి విజయ, దేవరకొండ నియోజకవర్గ మహిళ కన్వీనర్ సహాని , గుర్రంపోడు మండల అధ్యక్షుడు కొమ్ము రమేష్ , పెద్దవూర మండల ప్రధాన కార్యదర్శి ఆదిమల్ల సత్యనారాయణ , రాజు తదితరులు పాల్గొన్నారు.
సోనియా గాంధీకి ఘన స్వాగతం పలికిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
TS: హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శనివారం హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో వీరికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర పార్టీ అగ్రనేతలు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క, తదితరులు ఘన స్వాగతం పలికారు. వివిధ రాష్ట్రాల నేతలు కూడా హైదరాబాద్ కు చేరుకున్నారు. రేపు సాయంత్రం తుక్కగూడ లో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో సోనియా గాంధీ సహా అగ్ర నేతలంతా పాల్గొంటారు.
YRP ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండలో మట్టి వినాయకుని విగ్రహాల పంపిణీ
నల్లగొండ: YRP ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేడు పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ లో మట్టి వినాయకుని విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వై ఆర్ పి ఫౌండేషన్ డైరెక్టర్ ఎలిషాల హేమ్ చందర్ పాల్గొని వినాయకుని విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజు నల్గొండ పట్టణంలోని 6 ప్రాంతాల్లో ఎటువంటి కెమికల్ మరియు పెయింట్స్ లేని 12 వేల మట్టి విగ్రహాలను కలకత్తాలో తయారు చేయించి ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందించిన వారవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో యామా దయాకర్, బొమ్మపాల గిరిబాబు, మద్ది కరుణాకర్ లు పాల్గొన్నారు.
NLG: పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆశాలకు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలి: సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం: తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో శనివారం, ఆశాల న్యాయమైన డిమాండ్ల కోసం మర్రిగూడ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ దీపక్ ను కలిసి  సమ్మె నోటీసు అందజేశారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య హాజరై మాట్లాడుతూ.. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆశా ల పారితోషకాలను  రూ.18, 000/- లకు పెంచి ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని అన్నారు. పారితోషకం లేని అదనపు పనులు ఆశలతో  చేయించకూడదని, టిబి, లెప్రసీ, కంటి వెలుగు తదితర పెండింగ్ బిల్లు వెంటనే చెల్లించాలని, లెప్రసీ సర్వేలో వస్తున్న ఇబ్బందులను పరిష్కరించాలని అన్నారు. వాలంటరీలను ఏర్పాటు చేసి, ఆశాలకు పనిభారం తగ్గించాలి. ఆశాలకు జాబ్  చార్ట్ విడుదల చేయాలి. కేంద్రం చెల్లించిన కరోనా రిస్క్ అలవెన్స్ రూ.1000/- చొప్పున 16 నెలల బకాయి డబ్బులు వెంటనే చెల్లించాలి. 32 రకాల రిజిస్టర్ లను వెంటనే ప్రింట్ చేసి ప్రభుత్వమే సప్లై చేయాలి. క్వాలిటీతో కూడిన ఐదు సంవత్సరాల పెండింగ్ యూనిఫామ్ వెంటనే ఇవ్వాలని, ఆశలకు ప్రసూతి సెలవుల సర్కిలర్ వెంటనే జారీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సెప్టెంబరు 25 నుండి సమ్మెలోకి పోవడానికి సిద్ధమవుతున్నారని, ఈ లోపుగా వారి న్యాయమైన 11 డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు మర్రిగూడ మండల అధ్యక్ష కార్యదర్శులు సబ్ సెంటర్ల నాయకురాలు మట్టం భాగ్యమ్మ, జంపాల వసంత, లప్పంగి తబిత, అందుగుల యాదమ్మ, కలమ్మ, బి.యాదమ్మ, రోజా, బాలమణి తదితరులు పాల్గొన్నారు.
మర్రిగూడ మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలి: మాల మహానాడు మండలాధ్యక్షుడు
NLG: మర్రిగూడ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలని ఏర్పాటు చేయాలని మాల మహానాడు మర్రిగూడ మండల అధ్యక్షుడు, దళిత రత్న అవార్డు గ్రహీత నాగిళ్ల మారయ్య  ప్రభుత్వాన్ని  కోరుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. మర్రిగూడెంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థులు, దూర ప్రాంతాలకు వెళ్లి ఖర్చు చేసి విద్యను అభ్యసించలేక చదువు మానేసిన సందర్భాలు అనేకం ఉన్నాయని,  ప్రైవేట్ కళాశాలలో ఎక్కువ ఫీజులు ఉండటం వల్ల ఎక్కువ మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకోలేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. మర్రిగూడెం నుండి  15 - 30 కిలోమీటర్ల దూరంలో కళాశాలలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం వారు స్పందించి, మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలని ఏర్పాటు చేస్తే మండలానికి చెందిన వందలాది మంది పేద విద్యార్థుల అభ్యున్నతికి తోడ్పాటు అందించిన వారవుతారని అన్నారు. ఇకనైనా మర్రిగూడ మండలానికి ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని మాల మహానాడు మండలాధ్యక్షుడు నాగిల్ల మారయ్య కోరారు.
మర్రిగూడ మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలి: మాల మహానాడు మండలాధ్యక్షుడు
NLG: మర్రిగూడ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలని ఏర్పాటు చేయాలని మాల మహానాడు మర్రిగూడ మండల అధ్యక్షుడు, దళిత రత్న అవార్డు గ్రహీత నాగిళ్ల మారయ్య  ప్రభుత్వాన్ని  కోరుతున్నట్లు ఒక ప్రకటన తెలిపారు. మర్రిగూడెంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థులు, దూర ప్రాంతాలకు వెళ్లి ఖర్చు చేసి విద్యను అభ్యసించలేక చదువు మానేసిన సందర్భాలు అనేకం ఉన్నాయని,  ప్రైవేట్ కళాశాలలో ఎక్కువ ఫీజులు ఉండటం వల్ల ఎక్కువ మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకోలేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. మర్రిగూడెం నుండి  15 - 30 కిలోమీటర్ల దూరంలో కళాశాలలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం వారు స్పందించి, మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలని ఏర్పాటు చేస్తే మండలానికి చెందిన వందలాది మంది పేద విద్యార్థుల అభ్యున్నతికి తోడ్పాటు అందించిన వారవుతారని అన్నారు. ఇకనైనా మర్రిగూడ మండలానికి ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని మాల మహానాడు మండలాధ్యక్షుడు నాగిల్ల మారయ్య కోరారు.
NLG: నీటి సమస్యను తీర్చుటకు మోటర్ పంపును ప్రారంభించిన కన్మంతరెడ్డి శ్రీదేవి
నల్లగొండ: పట్టణంలోని పానగల్ 2వ వార్డు నందు మహిళలు నీటిసరఫరా సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలుసుకున్న, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు  కన్మంతరెడ్డి శ్రీదేవి శనివారం పానగల్ రెండో వార్డును సందర్శించారు. కాలనీ మహిళలు నీటి సమస్యతో ఇబ్బంది పడటం చూడలేక, స్థానిక కాలనీవాసుల కోరిక మేరకు, ఆమె అక్కడ ఉన్న హ్యాండ్ బోరులో.. మోటారు ఏర్పాటుచేయుటకు సహాయం చేసి వారి నీటి సమస్య తీర్చారు. మోటార్ పంపును ప్రారంభించే ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి మిర్యాలయాదగిరి, వలిగొండ మధు, మహిళలు , యువకులు పాల్గొన్నారు.
TS: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్ సర్కార్

HYD: సంక్షేమ పథకాలలో భాగంగా సీఎం కేసీఆర్ సర్కారు మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు విద్యార్థుల సంక్షేమం దిశగా మరో చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు శుభవార్త తెలిపారు. దసరా కానుకగా, అక్టోబర్ 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతుల వరకు చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు "ముఖ్యమంత్రి అల్పాహార పథకం" అందించాలని సీఎం నిర్ణయించారు. తద్వారా విద్యార్థులకు చక్కని బోధన తో పాటు మంచి పోషకాహారం అందించే దిశగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయనున్నది. తద్వారా నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు, వారికి చదువు పట్ల ఏకాగ్రతను పెంచే దిశగా చర్యలు చేపట్టింది.

ఉదయాన్నే వ్యవసాయం పనులు, కూలీ పనులు చేసుకోవడానికి వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులు పడే ఇబ్బందులను అర్థం చేసుకున్న సీఎం మానవీయ ఆలోచనకు అద్దంపట్టే దిశగా ఈ అల్పాహార పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం దసరా నుంచి అమలు చేయనున్నది. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత ఉత్తర్వులను జారీ చేసింది.

కాగా, తమిళనాడు రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న ఈ పథకాన్ని పరిశీలించి రావాలని ఐఎఎస్ అధికారుల బృందాన్ని సీఎం ఇటీవలే పంపించారు. అక్కడ విజయవంతంగా అమలవుతున్న "విద్యార్థులకు అల్పాహారం" పథకాన్ని అధ్యయనం చేసిన అధికారుల బృందం ప్రభుత్వానికి నివేదిక అందించింది.

NLG: రేపు నాంపల్లి మండలానికి రానున్న ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
నల్లగొండ జిల్లా: మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, రేపు శనివారం మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండలానికి విచ్చేయుచున్నారు. నాంపల్లి మండలంలోని దేవత్ పల్లి గ్రామంలో ఉదయం 9 గంటలకు బిటి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

అలాగే ఉదయం 09: 30 గంటలకు ముష్టిపల్లి గ్రామంలో  11 KV విద్యుత్ సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం  ముఖ్యమంత్రి సహాయనిధి ( సీఎంఆర్ఎఫ్ ) చెక్కులను మండలంలోని లబ్దిదారులకు అందజేయనున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు, ప్రజలు హాజరై కార్యక్రమాన్ని  విజయవంతం చేయాలని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ఒక ప్రకటనలో తెలిపారు.
పార్లమెంట్ సమావేశాలలో మహిళా బిల్లు ప్రవేశ పెట్టాలి: కక్కిరేణి శిరీష
యాదాద్రి జిల్లా, రామన్నపేట: ఈ నెల 18 నుండి ప్రారంభం అయ్యే పార్లమెంట్ సమావేశాలలో మహిళా బిల్లును ప్రవేశపెట్టి చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని, బహుజన్ సమాజ్ పార్టీ రామన్నపేట మండల మహిళా కన్వీనర్ కక్కిరేణి శిరీష డిమాండ్ చేశారు. శుక్రవారం రామన్నపేట బీఎస్పీ పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతు.. స్దానిక సంస్థలలో మాదిరిగా చట్ట సభలలో కూడా 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని  డిమాండ్ చేశారు. అవసరం అయితే ప్రతి పక్షాల మద్దతుతో ఈ పార్లమెంట్ సమావేశాలలో బిల్లు ప్రవేశ పెట్టాలని ఆమె కోరారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వాలు విశేష కృషి చేయాలని అన్నారు.