నిజందాగదుక్షణంఆగదు

Feb 14 2023, 19:33

సూర్యాపేట పట్టణంలోని శ్రీ వెంకట లక్ష్మీ మోటార్స్ షో రూమ్ నందు హీరో జూమ్ స్కూటర్ ను విడుదల చేసిన రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్

సూర్యాపేట పట్టణంలోని శ్రీ వెంకట లక్ష్మీ మోటార్స్ షో రూమ్ నందు హీరో జూమ్ స్కూటర్ ను విడుదల చేసిన రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్

మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకట లక్ష్మి మోటార్స్ నందు హీరో బైక్ కంపెనీ సరికొత్త టెక్నాలజీతో తయారుచేసిన 110CC స్కూటర్,Hero XOOM మోడల్ బైక్ ను రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మార్కెట్లోకి విడుదల చేశారు.

 

ఈ సందర్భంగా ఎంపీ బడుగుల మాట్లాడుతూ, 

ఆటోమొబైల్ రంగాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, భారతదేశాన్ని ఎలక్ట్రిక్‌ మొబిలిటీకి మార్చడంలో కీలక పాత్ర పోషించాలని తెలంగాణ లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు.

 24 గంటల నాణ్యమైన విద్యుత్తు సరఫరా సామర్థ్యంతో తెలంగాణ దేశంలోనే మొబిలిటీలో ‘ఎలక్ట్రిఫైడ్‌’ స్టేట్‌గా అవతరించాలని సీఎం కేసీఆర్ గారు లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. 

హీరో కంపెనీ సరికొత్త టెక్నాలజీతో మార్కెట్ లోకి విడుదల చేసిన ఈ 110CC స్కూటర్,Hero XOOM యువతను ఆకట్టుకునేలా ఉందని ప్రశంసించారు.

ఆటోమొబైల్ రంగంలో విశేష అనుభవం ఉన్న వెంకటలక్ష్మి మోటార్స్ అధినేత రాచర్ల కమలాకర్ ఎప్పటికప్పుడు సూర్యాపేట జిల్లా ప్రజలకు నూతన మోడల్ బైక్స్ ను పరిచయం చేస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు. అదే విధంగా బైక్ వినియోగదారులకు సర్వీస్ విషయంలో ఉత్తమ సేవలు అందజేయాలని సూచించారు. 

ఈ కార్యక్రమంలో షోరూం అధినేత రాచర్ల లక్ష్మి కమలాకర్ , మేనేజర్ సుధీర్ , షోరూమ్ ఉద్యోగస్తులు రాజు, జైపాల్, సూర్య, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Feb 14 2023, 16:29

నవీన్ పట్నాయక్ గారు కంటతడిి...12 దేశాల సొంతజనం ఎదుట అనూహ్య ఉద్వేగం...

నవీన్ పట్నాయక్ గారు కంటతడిి...12 దేశాల సొంతజనం ఎదుట అనూహ్య ఉద్వేగం...

నవీన్ పట్నాయక్… పెళ్లాంపిల్లలు, కుటుంబం ఎవరూ లేరు… పైరవీలు, పెత్తనాల భయంతో తన బంధుగణాన్ని కూడా దగ్గరకు రానివ్వడు… ఎప్పుడూ తన మొహంలో ఎమోషన్స్ కనిపించవు… ఉన్నతాధికారులు, తన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కూడా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాడు… ఎవరూ తన దగ్గర సర్కిల్‌లోకి వెళ్లరు… తను కూడా పని ముగిసిందంటే చాలు, ల్యాప్ టాప్ తీసుకుని, ఓ సిగరెట్ పాకెట్‌తో బెడ్ రూంలోకి వెళ్లిపోతాడు… అత్యవసరమైతే తప్ప ఇక ఎవరూ తనను డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు

ఎంత కఠిన హృదయుడో కదా అనిపిస్తోందా..? ఏ బంధాలూ లేకుండా, సంపాదన కక్కుర్తి లేకుండా వ్యవహరిస్తున్నాడు కాబట్టే పాతికేళ్లుగా తనను ఎవరూ ఆ సీఎం కుర్చీ మీద నుంచి ఇంచ్ కూడా కదిలించలేకపోతున్నారేమో… ఐనా రాతి లోపల కూడా కొన్నిసార్లు జల ఉంటుంది… నవీన్ కూడా అంతే… నిర్వికారంగా కనిపించే ఆయన పన్నెండు దేశాలకు చెందిన ప్రవాస ఒడిస్సీల ఎదుట వేదిక మీద కన్నీళ్లు పెట్టుకున్నాడు… అసలు అనేక ఎత్తుపల్లాల నడుమ కూడా ఏ ఎమోషన్ చూపించని ఆయన కన్నీళ్లు పెట్టుకోవడాన్ని చూసి ఒడిశా నుంచి వెళ్లిన ఉన్నతాధికారుల బృందం ప్లస్ వేలాది మంది ప్రవాస ఒడిస్సీలు విస్తుపోయారు… విషయం ఏమిటంటే?

కిసన్ శేషదేవ్… సంబల్‌పూర్ జిల్లాకు చెందిన ఓ గిరిజన కుటుంబం… చిన్నప్పుడు ఏడాది వయస్సున్నప్పుడే తల్లిని కోల్పోయాడు… 2006లో తండ్రి తీవ్ర అనారోగ్యం పాలైతే కిసన్ కూలీ పని చేయాల్సి వచ్చింది… 2012లో తండ్రిని కూడా కోల్పోయాడు… అప్పటికి తనకు పద్దెనిమిదేళ్లు… రెండేళ్ల క్రితం అక్కను కూడా పొగొట్టుకున్నాడు… ప్రస్తుతం అనాథ…

చిన్నప్పటి నుంచీ మెరిట్ స్టూడెంట్… ప్రతి పరీక్షలోనూ తనే టాప్… 2005లో ఉత్తమ విద్యార్థి అవార్డు తీసుకుని నవోదయ ఎంట్రన్స్‌లో టాపర్‌గా నిలిచి, ప్లస్‌టూ వరకు అక్కడే చదివాడు… తరువాత 2012లో National Entrance Screening Test (NEST) రాశాడు… 17వ ర్యాంకు… కానీ ఆ సంవత్సరమే తండ్రి చనిపోయాడు… 2013లో మళ్లీ రాశాడు, ఈసారి 15వ ర్యాంకు, NISER లో అయిదేళ్ల ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్ కోర్సులో చేరాడు

2018… ఒడిశా నాలెడ్జ్ హబ్‌లో ఓ పెద్ద మీటింగ్… విద్యావేత్తలు, మంత్రులు, ఉన్నతాధికారులు, టెక్నిషియన్స్ ఉన్న ఆ మీటింగును ఉద్దేశించి ప్రసంగించాలని నవీన్ పట్నాయక్ ఈ కిసన్‌ను ఆహ్వానించాడు… అప్పట్లో స్లిప్పర్లు, మాసిపోయిన బట్టలు, చేతిలో ఓ డొక్కు నోకియా ఫోన్‌తో ఉన్న కిసన్ భుజం తట్టి ఒక ఐఫోన్ కానుకగా ఇచ్చాడు… తరువాత కిసన్ జర్మనీలోని Gottingen లోని జార్జ్-అగస్ట్ యూనివర్శిటీలో చేరాడు… పీహెచ్‌డీ చేశాడు… ఇప్పుడు తను అక్కడే కెమికల్ సైంటిస్టు…

గత నెల చివరివారంలో పట్నాయక్ రోమ్ వెళ్లాడు… దాదాపు 12 యూరప్ దేశాలకు చెందిన ప్రవాస ఒడిస్సీలను పిలిచారు ఓ మీటింగుకు… శేషదేవ్ కూడా జర్మనీ నుంచి రోమ్ వెళ్లాడు… అందరి ఎదుట శేషదేవ్‌కు కాసేపు మాట్లాడే చాన్స్ దొరికింది… తన చేతిలోని ఐఫోన్ పైకి లేపి, ఊపుతూ… ఇదేమిటో తెలుసా అంటూ… ముఖ్యమంత్రి తనకు ఏయే సందర్భాల్లో ఎలా అండగా నిలిచాడో ఎమోషన్‌తో చెబుతూ పోయాడు…

‘‘నాకు సార్ చెప్పింది ఒకటే… పది మందికీ ఉపయోగపడు అన్నాడు… పదే పదే అదే గుర్తొస్తుంది… మా ఊళ్లో 170 మంది పిల్లలకు కోచింగ్ సెంటర్ పెట్టించాను… 30 లక్షలతో ఇల్లు కట్టాను… నథింగ్ నుంచి నన్ను ఎవిరీ థింగ్ స్టేజీకి తీసుకొచ్చాడు సీఎం… తిరిగి వచ్చేస్తాను, ఓ పెద్ద ఫార్మస్యూటికల్ కంపెనీ పెడతాను ఒడిశాలో… నాకు ఎవరూ లేరు సార్, అందరినీ కోల్పోయాను, అయితే ఏమిటి సార్, మీరున్నారు, మీరే నా తండ్రి…’’ శేషదేవ్ ముగించాడు… అదుగో అప్పుడు ఏ ఫ్యామిలీ బంధాలు లేని ఆ పట్నాయక్‌ కంటి నుంచి బొటబొటా కన్నీళ్లు రాలాయి… ఆ ఎమోషన్ పేరు ఆనందమే…

ఇందులో ఏముంది అనకండి… మనసంతా పాజిటివిటీని నింపే ఇలాంటి వార్తలు చదవాలి… ఖచ్చితంగా చదవాలి… ఓ గిరిజన విద్యార్థి కష్టనష్టాల జీవనప్రయాణం ఇది… రాజకీయ నాయకులంటేనే హార్డ్ కోర్ అండ్ నొటోరియస్ అనే భావన బలంగా ఉన్న ఈ రోజుల్లో పట్నాయక్‌ వంటి నేతలూ ఉంటారని తెలియాలి… ప్రతి కఠినమైన గుండెలో కూడా తడి ఉంటుందనీ, అది కొన్నిసార్లు కంటికట్టలు తెంచుకుని బయటికి దూకుతాయని కూడా తెలియాలి…!!

ఇలాంటి వాళ్ళు కావాలి మన దేశానికి,తరాలు సంపద కూడబెట్టే వాళ్ళు కాదు.

నిజందాగదుక్షణంఆగదు

Feb 14 2023, 16:13

నల్లగొండ 14 వ వార్డు లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి

నల్లగొండ 14 వ వార్డు లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి

నల్లగొండ పట్టణ పరిధిలోని 14వ వార్డు మర్రిగూడలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి DMHO కొండల్ రావు కౌన్సిలర్లు ఊట్కూరి వెంకట్ రెడ్డి బొజ్జ శంకరయ్య తో కలిసి ప్రారంభించారు. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా కంటి చూపును మెరుగు పరుచుకోవాలని కోరారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకుని ఉచితంగా కళ్లద్దాలు పొందాలన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Feb 14 2023, 10:01

బీసీల కుల ప్రాతిపదికన జనగణన చేయాలి:BSP నల్లగొండ కమిటీ

బహుజన్ సమాజ్ పార్టీ నల్లగొండ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో తిప్పర్తి మండల కేంద్రంలో బీసీల కుల ప్రాతిపదికన జనగణన చేయాలి, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలి, 60 నుంచి 70 అసెంబ్లీ టికెట్లను కేటాయించాలి, అనే నినాదాలను ప్రజలకు వివరిస్తూ వారి సంతకాల ద్వారా మద్దతు తెలియజేయాలని కోరగా వివిధ వర్గాల నుండి అపూర్వ స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్చార్జి పంబాల అనిల్ గారు, ఉపాధ్యక్షులు కోడి భీం ప్రసాద్ గారు, మహిళ కన్వీనర్ గోస్కొండ కవిత గారు, నియోజకవర్గ ఇన్చార్జీలు వంటపాక యాదగిరి, అంకెపాక శ్రీనివాస్ గార్లు నియోజకవర్గ అధ్యక్షులు దున్న లింగస్వామి అడ్వకేట్ గారు తిప్పర్తి మండల అధ్యక్షులు పేరపాక లింగస్వామి గారు, ప్రధాన కార్యదర్శి దాసరపు నవీన్ కుమార్, పజ్జురు గ్రామ శాఖ అధ్యక్షులు దాసరపు రవితేజ మరియు వీరస్వామి, కృష్ణయ్య, సతీష్, వెంకన్న, యాదయ్య తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Feb 13 2023, 19:10

వ్యవసాయ కార్మిక సంఘం అఖిలభారత మహాసభ లకు తరలి వెళ్లిన జిల్లా ప్రతినిధులు

వ్యవసాయ కార్మిక సంఘం అఖిలభారత మహాసభ లకు తరలి వెళ్లిన జిల్లా ప్రతినిధులు

: ఈనెల 15 నుండి 18 వరకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హౌరా లో జరిగే అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ మహాసభలకు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల నుండి ప్రతినిధులు నల్గొండ రైల్వే స్టేషన్ నుండి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యురాలు దండంపల్లి సరోజ మాట్లాడుతూ ఈ మహాసభలో వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం అనేక తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ లో వ్యవసాయ కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు. 50 సంవత్సరాలు నిండిన వ్యవసాయ కార్మికులకు ఐదువేల రూపాయల పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదలందరికీ ఇండ్లు, ఇళ్ల స్థలాలు, సాగు భూములు ఇవ్వాలని కోరారు. వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సమగ్ర కేంద్ర శాసన చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 18న హౌరా లో లక్షలాదిమంది వ్యవసాయ కార్మికులతో భారీ బహిరంగ సభ జరుగుతుందని ,ఈ సభకు ముఖ్యఅతిథిగా కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ ఆల్ ఇండియా వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి .వెంకట్ తదితర నాయకులు హాజరవుతున్నారని అన్నారు. పట్టణ ప్రాంతాలలో ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి రోజు కూలి 600 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు తగ్గించి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్ర చేస్తుందని ఆరోపించారు ఈ మహాసభలలో ఉపాధి హామీ రక్షణ కోసం చేసే ఉద్యమ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని తెలిపారు

  ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మట్టిపల్లి సైదులు, కంబాలపల్లి ఆనంద్ ,జటావత్ రవి నాయక్, పులుసు సత్యం, జిల్లా ఉపాధ్యక్షులు గండమల్ల రాములు బెల్లంకొండ వెంకటేశ్వర్లు ,జిల్లా కమిటీ సభ్యులు లంజాపెళ్లి లక్ష్మయ్య ,పులసరి వెంకట ముత్యం కెవిపిఎస్ జిల్లా నాయకులు దేవరకొండ యాదగిరి, తదితరులు తరలి వెళ్లారు.

    జాతీయ మహాసభలకు తరలి వెళ్తున్న వారికి సెండ్ ఆఫ్ చెప్పిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మన్య బిక్షం తదితరులున్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Feb 13 2023, 18:42

మిరియాల వెంకటేశం గారిని రాష్ట్ర చేనేత సెల్ కో కన్వీనర్ గా నియమిస్తూ నియామక ఉత్తర్వులు జారీ చేసిన బిజెపి రాష్ట్ర ఓబిసి అధ్యక్షులు ఆలే భాస్కర్

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆలే భాస్కర్ రాజు గారు, శ్రీ మిరియాల వెంకటేశం గారిని రాష్ట్ర చేనేత సెల్ కో కన్వీనర్ గా నియమిస్తూ నియామక ఉత్తర్వులు అందజేశారు.ఈ సందర్భంగా ఈ అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర ఓబిసి అధ్యక్షులు శ్రీ ఆలే భాస్కర్ రాజు గారికి అలాగే నా నియామకానికి సహకరించిన జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు శ్రీ డాక్టర్ లక్ష్మణ్ గారికి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారికి, రాష్ట్ర చేనేత కన్వినర్ శ్రీ ఎన్నం శివ కుమార్ గారు, జిల్లా అధ్యక్షులు శ్రీ శ్రీధర్ రెడ్డి గారు మరియు జిల్లా రాష్ట్ర నాయకుల అందరికి కృతజ్ఞతలుుు తెలియజేశారు. ఈ సందర్భంగాా వెంకటేశం గారుు మాట్లాడుతూ బాధ్యతగా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నిర్వర్తిస్తూ రాష్ట్రములో ఉన్నటువంటి చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే విధంగా కార్యక్రమాలను ఉదృతం చేస్తాననిి తెలియజేశారు.

నిజందాగదుక్షణంఆగదు

Feb 13 2023, 17:46

నల్గొండ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించిన సమాచార హక్కు వికాస సమితి క్యాలెండర్

నల్గొండ జిల్లా కలెక్టర్ రెట్ లో సమాచార హక్కు వికాస సమితి 2023 క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ వినయ్ క్రిష్ణా రెడ్డీ అదనపు కలెక్టర్ భాస్కర్ రావు గార్ల చేతుల మీదుగా ఆవిష్కరణ చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ యర్ర మాద కృష్ణా రెడ్డి జిల్లా అధ్యక్షులు బైరు సైదులు గౌడ్ కారుణ్ కుమార్, సైదులు గౌడ్ ,రామ కృష్ణ, యం. వెంకన్న, రమణ తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Feb 13 2023, 17:28

దేశానికి కల్నల్ సంతోష్ బాబు చేసిన సేవలు మరువలేనివి

దేశానికి కల్నల్ సంతోష్ బాబు చేసిన సేవలు మరువలేనివి

దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన బిక్కుమళ్ల కల్నల్ సంతోష్ బాబు చేసిన సేవలు మరువలేనివని విశ్రాంత ఉపాధ్యాయులు సంతోష్ బాబు మామ తల్లాడ వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తా వద్ద గల సంతోష్ బాబు 39వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంతోష్ బాబు వీరమరణం పొంది రెండున్నర సంవత్సరాలు గడుస్తున్న చైనా సరిహద్దు గాల్విన్ లోయలో ఇంకా అలజడులు జరుగుతూనే ఉన్నాయని విచారణ వ్యక్తం చేశారు. దేశం కోసం తెగించి ప్రాణత్యాగం చేసి ఎందరో సైనికులను రక్షించారని తెలిపారు. ఆయన చేసిన సేవలు మరువలేనివి అని అన్నారు.ఈ కార్యక్రమంలో తల్లాడ ఉమ తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Feb 13 2023, 17:21

కలెక్టర్ కార్యాలయం పైకెక్కి భూసమస్య తీర్చాలని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం..

కలెక్టర్ కార్యాలయం పైకెక్కి భూసమస్య తీర్చాలని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం..

▪️జనగామ - కలెక్టర్ కార్యాలయం పైకెక్కి భూసమస్య పరిష్కరించాలని ఇద్దరు భార్య భర్తల హల్చల్.

▪️ఎమ్మర్వో తమ భూమిని ఇతరులకు అక్రమ పట్టా చేసారని, తమ సమస్య పరిష్కారించాలని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం, అడ్డుకున్న పోలీసులు.

▪️గతంలో కూడా ఆత్మహత్యయత్ననికి పాల్పడిన బాధితుడు నర్సింగరావు.

నిజందాగదుక్షణంఆగదు

Feb 13 2023, 14:45

అక్రమ అరెస్ట్ లతో ఉద్యమాన్ని ఆపలేరు..MRPS జాతీయ నాయకులు కందుల మోహన్ మాదిగ.....

అక్రమ అరెస్ట్ లతో ఉద్యమాన్ని ఆపలేరు..MRPS జాతీయ నాయకులు కందుల మోహన్ మాదిగ.....     హైవే దిగ్బంధానికి ముందే నాయకులనుపోలీసులు అరెస్టు చేయడం సమంజసం కాదని ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు అన్నారు.కందుల మోహన్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజులలోనే పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధ కల్పిస్తామని హామీ ఇచ్చి గత తొమ్మిది సంవత్సరాలుగా కాలయాపన చేస్తున్నందున ఈరోజు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశానుసారం హైదరాబాద్ టు విజయవాడ హైవే ద్రి గ్బంధ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ముందస్తుగాMRPS, MSP నాయకులని అరెస్టు చేయడం కేంద్ర ప్రభుత్వం సిగ్గుచేటని ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్ చేశారు. ఎస్సీ ఉరీకరణ చేయకపోతే 59 పప్పులాలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. ఎలక్షన్లో మాదిగ మాదిగ ఉప కులాలను వాడుకొని గెలిచేంతవరకు వడమల్లయ్య గెలిచిన తర్వాత బోడమలై అన్న విధంగా  చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఏర్పుల శ్రవణ్ కుమార్, వడ్డే రవి, దుబ్బ సత్యనారాయణతదితరులు ఉన్నారు.