GkNewschnel373

Dec 05 2023, 14:30

అభిమాన నాయకురాలికి అభినందనల వెల్లువ

ఎమ్మెల్యే లాస్యనందిత నివాసంలో జనసందోహం

- భారీగా తరలివచ్చిన గులాబీశ్రేణులు, స్థానికులు

- అందరికీ అందుబాటులో ఉంటా: ఎమ్మెల్యే లాస్యనందిత

- సాయన్న పేరును నిలబెడతా: ఎమ్మెల్యే లాస్యనందిత

----------------------------------------------------------

సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలు, పార్టీ శ్రేణుల సమిష్టిక్రుషితోనే తాను భారీ మెజార్టీతో విజయం సాధించానని ఎమ్మెల్యే లాస్యందిత తెలిపారు. తనకు అపూర్వ విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు అన్నివిధాల అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రజలకు మరింత సేవచేసి, తన తండ్రి సాయన్న పేరు నిలబెడతానన్నారు. ఈ మేరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే లాస్యనందితకు అభినందనల వెల్లువ కొనసాగుతోంది. భారీ మెజార్టీతో విజయకేతనం ఎగరవేసిన ఎమ్మెల్యే లాస్యనందితను పలు వార్డుల నాయకులు కలిశారు. అలాగే స్థానిక మహిళలు, యువత కలిసి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. భారీ గజమాలతో సత్కరించారు. శాలువాలతో సన్మానించి, అభినందించారు. దీంతో లాస్యనందిత నివాసంలో జనసందోహం కనిపించింది. జై సాయన్న.. జై లాస్యనందిత నినాదాలతో పార్టీ క్యాడర్ సందడి చేశారు.

మరోవైపు ఎమ్మెల్యే లాస్యనందిత విజయం సాధించడంతో పార్టీ నేతలు, అభిమానులు స్వీట్లు పంపిణీ చేశారు. వారు తీసుకొచ్చిన మిఠాయిలను లాస్యనందిత స్వయంగా అందరికీ పంపిణీ చేశారు. తనపై ఇంత అభిమానాన్ని చూపుతున్న కంటోన్మెంట్ ప్రజలకు రుణపడి ఉంటానని ఎమ్మెల్యే లాస్యనందిత మరోసారి స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే లాస్యనందితను కలిసిన వారిలో బోర్డు మాజీ సభ్యులు భాగ్యశ్రీ శ్యాంకుమార్, సీనియర్ నాయకులు శ్యాంకుమార్, మహిళా నేతలు విజయలక్ష్మి, మనీషా, ఈశ్వరమ్మ, నాగ భార్గవితో పాటు శివ నారాయణ్ శర్మ, అజయ్ శర్మ, భాస్కర్ ముదిరాజ్, హరి, పలు వార్డులకు చెందిన సీనియర్ నాయకులు, యువ నాయకులు, ఆలయ కమిటీల సభ్యులు, పార్టీ అనుబంధ సంఘాల సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.