/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz ఆత్మకూరు మండల కేంద్రంలో స్నేహితుల సహాయం Vijay.S
ఆత్మకూరు మండల కేంద్రంలో స్నేహితుల సహాయం

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (యం) ఆదివారం  మండల కేంద్రంలో నిరుపేద కుటుంబానికి చెందిన వనం సుగుణ(38) భర్త మల్లేష్ 07-06-2024నాడు గుండెపోటు తో మరణించగా మృతురాలి కుటుంబ ఆర్థిక పరిస్థితిని చూసి చలించిన మృతురాలి కొడుకు వనం ప్రవీణ్ స్నేహితులు 2013-14 SSC బ్యాచ్ వారు బాధిత కుటుంబ సభ్యులకు 20,000 రూపాయల నగదు సాయం అందించి, పరామర్శించారు.

ఎస్సీ , ఎస్టీ ఉపాధ్యాయులకు పదోన్నతులలో న్యాయం చేయాలి: బోయ రాములు జిల్లా అధ్యక్షులు

నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న పదోన్నతులు బదిలీలు చేపట్టడం పట్ల ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు బోయ రాములు హర్షం వ్యక్తం చేశారు . శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అత్యవసర సమావేశం లో మాట్లాడుతూ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల స్కూల్ అసిస్టెంట్ పదోన్నతుల సీనియారిటీ లిస్ట్ లో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులు మెరిట్ లో ఉన్నప్పటికీ అడక్వసి పేరుతో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించడం లేదు . అందువల్ల ప్రమోషన్లు లో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది.కావున ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల పదోన్నతికి అడ్డంకి గా మారిన జీవో నెంబర్ రెండు లో ఉన్నటువంటి అడక్కసి అనే పదాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తొలగించి ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు ప్రస్తుతం జరుగుతున్న ప్రమోషన్లలో అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కట్ట మల్లయ్య మండల ప్రధాన కార్యదర్శి జానపాల కిషన్, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించాలని AISF ఆధ్వర్యంలో అడ్డగూడూర్ MRC లో వినతి పత్రం అందజేత

ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని వినతి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈ రోజు అడ్డగూడూరు మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని ప్రైవేటు విద్యాసంస్థల ఫీజు దోపిడీని అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రంలో లోయర్ డెవలప్మెంట్ అసిస్టెంట్ క్రాంతి కుమార్ కి వినతి పత్రంఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ మండలంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని పాఠశాలల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు అరికట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల నాయకులు తలాల సాయి, చిప్పలపళ్లి బన్నీ తదితరులు పాల్గొన్నారు.

డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య . హైదరాబాద్ లోని ప్రజా భవన్ లో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ని  ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య  మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపి శ్రీ యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి వారి చిత్రపటం లడ్డు, ప్రసాదన్నీ అందజేశారు.వీరితోపాటు యాదాద్రి ఆలయ ఈవో భాస్కరరావు , తదితరులు పాల్గొన్నారు.

గంజాయి మత్తులో యువత... యువతలో మార్పును తీసుకొచ్చే దిశలో వలిగొండ పోలీసులు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా గంజాయి విక్రయించినట్లైనా సేవించినట్లైనా.., తెలిసిన సమాచారం ఇవ్వగలరని, వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని వలిగొండ ఎస్సై డి మహేందర్ అన్నారు. ఈ సందర్భంగా వారు పలు చట్టాల గురించి వివరించారు. NDPS చట్టం అంటే NDPS చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఉత్పత్తి/తయారీ/సాగు, స్వాధీనం, అమ్మకం, కొనుగోలు, రవాణా, నిల్వ మరియు/లేదా ఏదైనా మాదక ఔషధం లేదా సైకోట్రోపిక్ పదార్ధాల వినియోగం నుండి నిషేధిస్తుంది. *మొదట 1985లో అమలులోకి వచ్చినది ఈ చట్టo* చట్టం ప్రకారం, నార్కోటిక్ డ్రగ్స్‌లో కోకా లీఫ్, గంజాయి (జనపనార), నల్లమందు మరియు గసగసాల గడ్డి ఉన్నాయి; మరియు సైకోట్రోపిక్ పదార్ధాలలో ఏదైనా సహజ లేదా సింథటిక్ పదార్థం లేదా సైకోట్రోపిక్ పదార్ధాల ద్వారా తీయబడిన ఏదైనా ఉప్పు (పౌడర్) లేదా తయారీ ఉంటుంది. సైకోట్రోపిక్ డ్రగ్‌ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు దాని అక్రమ రవాణా యొక్క పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ చట్టం కింద జరిమానాలు తీవ్రంగా ఉంటాయి. ఈ చట్టం కింద నేరాలకు ఒక సంవత్సరం నుండి 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు నేరాన్ని బట్టి జరిమానా విధించబడుతుంది. చట్టం ప్రకారం, ప్రేరేపణ, నేరపూరిత కుట్ర మరియు నేరానికి పాల్పడే ప్రయత్నాలు కూడా నేరానికి సమానమైన శిక్షను పొందుతాయి. నేరం చేయడానికి సిద్ధపడటం కూడా సగం పెనాల్టీని ఆకర్షిస్తుంది. పునరావృత నేరాలకు ఒకటిన్నర రెట్లు జరిమానా మరియు కొన్ని సందర్భాల్లో మరణశిక్ష విధించబడుతుంది. NDPS చట్టంలోని నిబంధనల ప్రకారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో 1986లో ఏర్పాటైంది . NCB అనేది మాదకద్రవ్యాల చట్ట అమలుకు సంబంధించి వివిధ మంత్రిత్వ శాఖలు, ఇతర కార్యాలయాలు & రాష్ట్ర/కేంద్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో సమన్వయం చేయడానికి మరియు మాదకద్రవ్యాల దుర్వినియోగానికి సంబంధించిన విషయాలకు సంబంధించి బాధ్యత వహించే నోడల్ ఏజెన్సీ . చట్టం ప్రకారం, చట్టం కింద దోషిగా నిర్ధారించబడిన డ్రగ్-సంబంధిత నేరాల నుండి వ్యక్తి సంపాదించిన ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు, స్తంభింపజేయవచ్చు మరియు జప్తు చేయవచ్చు. *NDPS చట్టం ప్రకారం శిక్షలు* అన్ని నేరాలు నాన్ బెయిలబుల్. 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష అలాగే, మాదకద్రవ్యాల దోషులు ఉత్తీర్ణత, ఉపశమనం మరియు ఉత్తీర్ణులైన శిక్షలను మార్చడం ద్వారా ఎటువంటి ఉపశమనం పొందలేరు. *నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ తగ్గింపు (NAPDDR) ఈ లక్ష్యాల దిశగా పనిచేస్తుంది.* *NDPS చట్టం గురించి తరచుగా అడిగే ప్రశ్నలు* *ప్రశ్న 1* NDPS చట్టం యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి? నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ పదార్ధాల చట్టం, 1985 కూడా NDPS చట్టంగా పిలువబడుతుంది, ఏదైనా మత్తుమందు లేదా సైకోట్రోపిక్ పదార్ధం యొక్క ఉత్పత్తి, సాగు, అమ్మకం, కొనుగోలు, రవాణా, నిల్వ మరియు/లేదా వినియోగంతో కూడిన ఏదైనా కార్యాచరణలో పాల్గొనకుండా ఏ వ్యక్తిని నిషేధిస్తుంది. *ప్రశ్న2* నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ పదార్థాల మధ్య తేడా ఏమిటి? వైద్య దృక్కోణం నుండి, సైకోట్రోపిక్స్ అనేది ఒక వ్యక్తి యొక్క స్పృహ లేదా అపస్మారక మానసిక జీవితంపై మనస్సుపై పనిచేసే రసాయన పదార్ధాలను నిర్దేశిస్తుంది. నార్కోటిక్స్‌లో మూర్ఖత్వం, కండరాల సడలింపు మరియు సున్నితత్వాన్ని తగ్గించడం లేదా తొలగించడం వంటి పదార్థాలు ఉంటాయని తెలిపారు.
వెలువర్తి లో మన గ్రోమోర్ సంస్థ ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వెలువర్తి గ్రామంలో మన గ్రోమోర్ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా
మార్కెటింగ్ మేనేజర్ రాజ్ కుమార్ సేంద్రీయ రసాయనిక ఎరువుల గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ సురేష్, మార్కెటింగ్ మేనేజర్ జానకయ్య ,మన గ్రోమోర్ వలిగొండ మేనేజర్ రమేష్ ,ఫీల్డ్ ఆఫీసర్ రాజు, అనిల్ గ్రామ మాజీ ఉపసర్పంచ్ చంద్రయ్య, రైతులు అంజయ్య, సాలయ్య, పాపయ్య ,బాలకృష్ణ ,ఉపేందర్, సురేష్ ,రాములు ,కిరణ్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు.




సామాజిక పురోగతికి సోషలిజమే మార్గం: AISF,AIYF ఆధ్వర్యంలో ఘనంగా చేగువేరా 96వ జయంతి

చేగువేరా 96వ జయంతి ని  ఏఐఎస్ఎఫ్ , వై ఎఫ్ యాదాద్రి జిల్లా సమితి ఆధ్వర్యంలో  సిపిఐ పార్టీ జిల్లా కార్యాలయంలో చేగువేరా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా *AIYF జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్, AISF జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ సంయుక్తంగా మాట్లాడుతూ* క్యూబాలో జన్మించిన చేగువేరా కేవలం తన దేశానికే కాక అనేక దేశాలలో పర్యటించి పెట్టుబడిదారీ వ్యవస్థపై అలుపెరుగని పోరాటాలు నిర్వహించిన గొప్ప యోధుడు అని వారు ఉద్ఘాటించారు. వంద పండ్లను ఒక్కడే దాచుకోవడం క్యాపిటలిజం- ఉన్నదాంట్లో అందరూ పంచుకోవడం కమ్యూనిజం అని చెప్పిన  చేగువేరా మాటలు ప్రజా ఆకాంక్షలకు అద్దం పడుతుందని వారు అన్నారు.చేగువేరా అమెరికన్ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించాడని వారు అన్నారు. కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా  ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో  క్యూబా  వైద్యులు పర్యటించి కరోనా బారిన పడిన వారికి వైద్య సేవలను అందించిన మానవతావాదులుగా నిలిచారని, దీనికి కారణం చేగువేరా దార్శనికత అని, క్యూబాలో 80శాతానికి పైగా ప్రజానీకం వైద్యులేనని వారు తెలిపారు.విప్లవం అనేది పక్వానికొచ్చినప్పుడు కిందపడే ఆపిల్ పండుకాదని-మనమే దాన్ని పోరాడి సాధించుకోవాలి  అన్న చేగువేరా మాటలు నేటి ప్రపంచానికి పోరాట పటిమను చూపుతుందని వారు ఉద్ఘాటించారు.
ఈ సందర్భంగా *ఏఐవైఎఫ్ మాజీ నాయకులు ఏషాల అశోక్* లు మాట్లాడుతూ క్యూబా దేశంలో విద్య, వైద్యం ఉచితమని ఈ దేశాన్ని ఆదర్శంగా తీసుకుంటే ప్రపంచ దేశాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వారు అన్నారు. చేగువేరా తాను జీవితాంతం ఏ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా పోరాడాడో అదే అతన్ని ఫ్యాషన్ ఐకాన్ గా మార్చేసి,ఆయన పేరు మీద నేటికీ వందల కోట్ల వ్యాపారం చేయడం విషాదకరమన్నారు.
ఈ కార్యక్రమంలో డిహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు కాశపాక దయాకర్, కొమ్ము బాల నరసింహ,  ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సూరారం జానీ తదితరులు పాల్గొన్నారు.

ఎల్ ఓ సి చెక్ అందజేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామం మధిర గోలిగూడెం కి చెందిన సింగిరెడ్డి బుచ్చిరెడ్డి ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో ఎల్ఓసి కి అప్లై చేయడం జరిగింది. దీనితో తన వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రెండు లక్షల రూపాయల చెక్కును భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా శుక్రవారం రోజున అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వలిగొండ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి గోలిగూడెం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంచి రాములు, కొంతం వెంకట్ రెడ్డి, కొంతం తిరుమల్ రెడ్డి, కొంతం నర్సిరెడ్డి, చిలుగూరు సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గురుకులాలలో మౌలిక వసతులు కల్పించాలి: AISF

గురుకులాలలో మౌలిక వసతులు కల్పించాలి ఏఐఎస్ఎఫ్* ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో గురుకులాలలో మౌనిక వసతులు కల్పించాలని , గురుకుల పాఠశాలల్లో మరుగుదొడ్లు వంటశాలలు పరిశుభ్రంగా ఉంచాలని నాణ్యమైన భోజనం అందే విధంగా చర్యలు తీసుకోవాలని మరియు గత సంవత్సరంలో జరిగిన అవకతవకలు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని యాదాద్రి రివిజనల్ కోఆర్డినేటర్ రజిని గారికి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ గత సంవత్సరంలో గురుకులాల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ విద్యార్థి మరణం ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రీజనల్ కోఆర్డినేటర్ రజని గారు నిత్యం గురుకులాల పర్యవేక్షణ చేయాలని అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా మేడ్చల్ జిల్లా జనగాం జిల్లాల లోని అన్ని బాలుర, బాలికల పాఠశాలలు కళాశాలలు సందర్శించాలని వారిని కోరారు గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని రీజనల్ కోఆర్డినేటర్ గారు హామీ ఇచ్చారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సూరారం జానీ, ఏ ఐ ఎస్ ఎఫ్ నాయకులు సందీప్ విద్యార్థుల తల్లిదండ్రులు బాల నరసింహ దయాకర్ లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

త్రిబుల్ ఆర్ బాధితులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుపరచాలి : సిపిఎం డిమాండ్

యాదాద్రి భువనగిరి జిల్లా: ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు నాటి ఎంపీ నేటి స్థానిక జిల్లా మంత్రి భువనగిరి ఎమ్మెల్యే, ఎంపీ లు త్రిబుల్ ఆర్ బాధితులకు మేము అధికారంలోకి వస్తే అలైన్మెంట్ ను మారుస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు గత ప్రభుత్వం త్రిబుల్ ఆర్ రోడ్డు నిర్మాణం కోసం ముందు చేసిన అలైన్మెంట్ను మార్చి చిన్న సన్నకారు రైతులకు చెందిన భూములను కోల్పోయే విధంగా రోడ్డు నిర్మాణం కోసం చేర్పులు, మార్పులు చేసిందన్నారు . దీనిపై భూ నిర్వాసితులతో పాటు రైతు సంఘాలు సంస్థలు అనేక రాజకీయ పార్టీలు ఆందోళన నిర్వహించాయన్నారు నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి  నేటి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మమ్మల్ని ఎమ్మెల్యే ఎంపీలుగా గెలిపిస్తే త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ ను మారుస్తామని చెప్పి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారా? లేదో దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మండల పరిధిలోని వర్కట్ పల్లి,గోకారం,పహిల్వాన్ పురం,పొద్దుటూర్,రెడ్ల రేపాక ఐదు గ్రామాల్లో ఈ రోడ్డు రావడంతో అనేకమంది చిన్న సన్నకారు రైతులు తమ భూములు కోల్పోవాల్సి వస్తుందన్నారు మరొకపక్క చౌటుప్పల్ ఆర్డీవో జంక్షన్ల కోసం 103 ఎకరాలు భూసేకరణ చేయాల్సి వస్తుందని దీనికి ప్రభుత్వం జీవో కూడా జారీ చేసిందని ప్రకటించారన్నారు రైతులు భూములు ఇవ్వమని తెగేసి చెబుతున్న మళ్లీ రైతులతో ఆర్డీవోల పరిధిలో అభిప్రాయ సేకరణ చేయాలని పాస్ పుస్తకాలు మిగతా డాక్యుమెంట్లు తీసుకురావాలని అధికారులు ఆదేశించడం ఏమిటని ప్రశ్నించారు ఇప్పటికైనా స్థానిక జిల్లా మంత్రి స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు వెంటనే స్పందించాలని అలైన్మెంట్ను మార్చేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో పోరాడాలని ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు..