చర్ల మండలంలో అదనపు మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేయాలని న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో తహసిల్దార్ కి వినతి పత్రం అందజేత
చర్ల మండలంలో అదనపు మీసేవ కేంద్రాలని ఏర్పాటు చేయాలని న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో తహసిల్దార్ అనంత రామకృష్ణ గారికి వినతిపత్రం
చర్ల మండలంలో సుమారు 50 వేల మంది జనాభాకు రెండు మీసేవ కేంద్రాలు నడిపిస్తున్నారని దీనివలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, చర్ల మండలంలో మీసేవ కేంద్రాలను పెంచాలని కోరుతూ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో చర్ల మండల తహసిల్దార్ అనంత రామకృష్ణ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. అనంతరం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ నాయకులు ముసలి సతీష్ మాట్లాడుతూ 50వేల జనాభా గలిగిన చర్ల మండలంలో రెండే మీసేవ కేంద్రాలు ఉండటంతో విద్యార్థుల నుండి మొదలుకొని వృద్ధుల వరకు ఆధార్ అప్డేట్ చేయించుకోవడం సర్టిఫికెట్లు అప్లై చేయడం, ప్రభుత్వ పథకాలకు అప్లై చేయడం ఏదైనా మీ సేవలోనే చేయించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి దీనితో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోజుకి 500 నుండి 1000 మంది వరకు లైనులు కట్టి పనులు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వారు తెలియజేశారు. కావున మండల తాహాసిల్దారు గారు మాట్లాడుతూ మీసేవ కేంద్రాలను పొడిగించెందుకు ఇట్టి విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వెళ్తానని హామీ ఇవ్వడం జరిగింది ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడవలసిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా కోరుతున్నాం. విద్యార్థులకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడవలసిన బాధ్యత ఈ మండల అధికారులకు ఉన్నదని తెలియజేస్తున్నాం కావున స్పందించి మీసేవ కేంద్రాలను పొడిగించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కోరుతున్నాం. లేనియెడల జిల్లా కలెక్టర్ గారిని కలవాల్సి వస్తుందని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో మండల నాయకులు చిరిగిడి నరేష్ కనితి భాను ప్రకాష్ రాజేందర్ రాజు సమ్మక్క రాజమ్మ నాగలక్ష్మి బాయ్ అమ్మ రుక్మిణి రవణ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
Dec 18 2023, 19:15