/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz మేడం ఆలస్యంగా లేచారా ❓️రఘునందన్ రావు సెటైర్లు Yadagiri Goud
మేడం ఆలస్యంగా లేచారా ❓️రఘునందన్ రావు సెటైర్లు

గ్రేటర్‌లో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించింది. ఈ విషయాన్ని విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

అయితే పాఠశాలలు ప్రారంభమయ్యాక ఆలస్యంగా సెలవులు ప్రకటించడంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సెటైరికల్ కామెంట్లు చేశారు.

ట్విట్టర్ వేదికగా స్పందించిన ఎమ్మెల్యే.. ‘‘పిల్లలు స్కూల్ వెళ్లిన తర్వాత నిద్రలేచి విద్యాలయాలకు సెలవులు అంటూ ప్రకటించిన మన తెలంగాణ విద్యాశాఖ మంత్రి అంటూ రఘునందన్ రావు ట్వీట్ చేశారు.

మరోవైపు విద్యాశాఖ మంత్రి సెలవు ప్రకటించక ముందే ఉదయం పాఠశాలలు ప్రారంభమైపోయాయి. అనేక మంది విద్యార్థులు పాఠశాలలకు కూడా వెళ్లిపోయారు. సెలవులపై మంత్రి ఆలస్యంగా ప్రకటన చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రభుత్వ తీరుపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు సెటైర్లు విసురుతున్న పరిస్థితి. మేడం ఆలస్యంగా లేచారా అంటూ మండి పడుతున్నారు. గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తుంటే ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదంటూ తల్లిదండ్రులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు......

మరో 48గంటలు వర్షాలు.. సహాయక బృందాలు సిద్ధం.. : సీఎస్‌ శాంతికుమారి

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న 48గంటల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

అన్నిశాఖ అధికారులతో పాటు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు.

వరంగల్‌, ములుగు, కొత్తగూడెంలో ఎన్‌డీఆర్‌ఎప్‌ బృందాలు సిద్ధంగా ఉంచమన్నారు. హైదరాబాద్‌లోనూ 40 మంది సిబ్బందితో బృందం సిద్ధంగా ఉందన్నారు.

గేట్రర్‌ 426 హైదరాబాద్‌లో మాన్‌ సూర్‌ ఎమర్జెన్సీ బృందాలు సిద్ధంగా ఉన్నాయని.. అలాగే 157 స్టాటిక్‌ టీమ్‌లను సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు.

నీటి నిల్వ ఉండే 339 ప్రాంతాల వద్ద ప్రత్యేక సిబ్బందిని మోహరించామని, ఇప్పటి వరకు చెరువులు, కుంటలకు ఎలాంటి జరుగలేదని పేర్కొన్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, అన్ని మంచినీటి ట్యాంకుల్లో క్లోరినేషన్‌ చేపట్టాలన్నారు....

పార్లమెంట్‌ ఉభయ సభలు రేపటికి వాయిదా

న్యూఢిల్లీ : జులై 20

పార్లమెంట్‌ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఎటువంటి చర్చలు లేకుండానే ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. గురువారం ఉదయం 11 గంటలకు ఉభయ సభలు సమావేశమయ్యాయి.

ఇటీవల మృతి చెందిన సభ్యులకు సంతాపం ప్రకటించాయి. అనంతరం మణిపూర్‌పై చర్చ జరపాలని ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో రాజ్యసభను 12 గంటల వరకు వాయిదా వేశారు.

సభ ప్రారంభమైన అనంతరం సభ్యులు మళ్లీ ఆందోళన చేపట్టారు. దీంతో ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి.

లోక్‌సభలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. మొదట మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన కొద్ది సేపటికే మధ్యాహ్నం 2గంటలకు వాయిదా పడింది.

మణిపూర్‌ అంశంపై చర్చ జరపాలంటూ ప్రతిపక్ష పార్టీలు నినాదాలు చేశాయి. దీంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు..

మైనార్టీలకు త్వరలో లక్ష రూపాయల స్కీమ్.. : మంత్రి హరీష్ రావు

మైనార్టీల కోసం లక్ష రూపాయల స్కీం ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలనలో ఉందని, త్వరలో స్కీమ్ అమలవుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు.

గురువారం జల విహార్‌లో మైనార్టీ నేతల సమావేశం నిర్వహించారు. పలు మైనార్టీ కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమితులైనవారిని మంత్రి మహమూద్ అలీతో కలిసి సన్మానించారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. మైనార్టీలను సీఎం ఎంతో గౌరవిస్తారని రెండు పర్యాయాలు మహమూద్ అలీని మంత్రిగా చేశారని తెలిపారు.

హిందువులకు కల్యాణ లక్ష్మి తెచ్చినట్టు మైనార్టీల కోసం షాదీ ముబారక్ తెచ్చారని, సీఎం మైనార్టీలకు త్వరలోనే శుభవార్త చెప్పనున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి అని మండిపడ్డారు.

దేశంలో ఇప్పటికీ ముస్లింలు ఇంకా పేదవారిగానే ఉన్నారని ఇదంతా కాంగ్రెస్ పార్టీ పాలన వల్లనే అని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో మైనార్టీలకు రూ.2200 కోట్లు ప్రవేశ పెట్టినట్లు తెలిపారు...

పోలీస్ సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాలి..క‌మిష‌న‌ర్ శ్వేత పిలుపు

సిద్దిపేట జిల్లా :జులై 20

జిల్లాలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజల అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ శ్వేత కోరారు.

పోలీస్ అధికారులు సిబ్బంది అందుబాటులో ఉండేలా అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. వాగుల, చెరులు, నిండుకుండలా నిండి ప్రవహిస్తున్నాయి మరియు ప్రాజెక్టుల దగ్గరికి ఎవరు వెళ్ళవదనీ ప్రజలకు సూచించారు.

ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చెరువులు, కుంటల నీటి ప్రవాహం గురించి అన్ని జాగ్రత్త చర్యలు తీసుకొని ప్రత్యక్షంగా వెళ్లి పర్యవేక్షించాలని, సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను గురువారం సమావేశపరిచి సమన్వయంతో కలిసి పనిచేయాలని ఆమె కోరారు..

జిల్లాలో ఎక్కడైనా వరద ఉధృతో రోడ్లు తెగిపోయిన, ఉదృతంగా ప్రవహించేనా అక్కడికి ఆ గ్రామ ప్రజలు వెళ్లవద్దని, రెండు దిక్కులా ప్లాస్టిక్ కోన్స్, రోడ్స్ టాపర్స్ , తాడు మరే ఇతర పరికరాలు అడ్డంపెట్టి సంబంధిత గ్రామల సర్పంచులకు ప్రజలకు తెలియజేయాలని సూచించారు. గ్రామాల సర్పంచులతో ఎప్పటికప్పుడు వరద ఉధృతి గురించి అడిగి తెలుసుకోవాలని సూచించారు.

ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ అధికారులు సిబ్బంది హెడ్క్వార్టర్ వదిలి వెళ్లవద్దని తెలిపారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు...

కిషన్‌రెడ్డి, రఘునందన్‌ అరెస్ట్

బాట సింగారంకు బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ఈరోజు ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన కిషన్‌రెడ్డి శంషాబాద్‌ఎయిర్‌ పోర్టు నుంచి ఎమ్మెల్యే రఘునందన్ రావుతో కలిసి బాటసింగారంకు బయలుదేరారు.

బాట సింగారంలో డబుల్ బెడ్రూం ఇళ్ళను పరిశీలించేందుకు కేంద్రమంత్రి అక్కడకు పయనమయ్యారు. అయితే కేంద్రమంత్రి అయిన కిషన్‌రెడ్డిని అడ్డుకుంటారా?లేదా? అన్న అనుమానాలను పటా పంచలు చేస్తూ.. ఎయిర్‌ పోర్టు పరిధి దాటగానే వాహనాలను అడ్డుపెట్టి మరీ కేంద్రమంత్రి కాన్వాయ్‌ను పోలీసులు ఆపేశారు.

దీంతో పోలీసులతో కిషన్ రెడ్డి, రఘునందనరావు వాగ్వివాదానికి దిగారు. అధికారిక కార్యక్రమం కాదు కాబట్టి.. కేంద్రమంత్రిని అడ్డుకున్నామని పోలీసులు చెబుతున్నారు.

పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణులు, నాయకులు భగ్గుమంటున్నారు. చివరకు బలవంతంగా కిషన్‌రెడ్డి, రఘునందన్‌రావును పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది...

గిడ్డంగుల సంస్థ చైర్ ప‌ర్స‌న్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన.. రజనీ

ప్రముఖ ఉద్యమ గాయకుడు,దివంగ‌త నేత సాయిచంద్‌ సతీమణి రజనీ గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.

గురువారం గిడ్డంగుల కార్యాలయంలోని ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించగా, మంత్రులు హరీశ్‌ రావు, నిరంజన్‌ రెడ్డి, నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కవిత, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌,

చైర్మన్లు ఆంజనేయులు గౌడ్‌, ఎర్రోళ్ల శ్రీనివాస్‌, ఎమ్మెల్యే భగత్‌తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, భారత్‌ రాష్ట్ర సమితి నాయకులు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా చైర్మన్‌ రజనీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తమ కుటుంబానికి అండగా నిలిచారన్నారు. తనపై నమ్మకముంచి బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

తమ కుటుంబం ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌తో పాటు భారత్‌ రాష్ట్ర సమితికి ఎప్పుడు మా కుటుంబం రుణపడి ఉంటుందన్నారు...

బిజెపి పాలిత మణిపూర్లో మహిళల నగ్న ఊరేగింపు ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోకుంటే తామే తీసుకుంటామని హెచ్చరిక

మణిపూర్ వీడియో తమను తీవ్రంగా కలచివేసిందన్న సీజేఐ

ఘటనపై సుమోటాగా విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం

మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి లైంగిక దాడులకు గురిచేస్తున్న భయానక వీడియో ఘటనపై సుప్రీంకోర్టు గురువారం సుమోటోగా విచారణ చేపట్టింది.

నేరస్తులపై చట్ట ప్రకారం తీసుకున్న చర్యలను కోర్టుకు తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

భారత అటార్నీ జనరల్‌ ఆర్‌ వెంకటరమణి, సొలిసిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా తుషార్‌ మెహతా విచారణకు హాజరు కావాలని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ సూచించారు. 

ఈ ఉదయం కోర్టు సమావేశమైనప్పుడు, ఏజీ, ఎస్జీ లను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాన న్యాయమూర్తి ‘ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియోల గురించి తెలిసి మేం చాలా బాధపడ్డాం.

దీనిపై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నాం. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. కలహాల ప్రాంతంలో లింగ హింసను ప్రేరేపించడానికి మహిళలను సాధనంగా ఉపయోగించడం తీవ్ర కలత కలిగిస్తోంది.

ఇది అత్యంత ఘోరమైన మానవ హక్కుల ఉల్లంఘన’ అని పేర్కొన్నారు. 

 

ఈ వీడియో మే 4వ తేదీ నాటిదని కోర్టుకు తెలుసన్న సీజేఐ దాని వల్ల తమ అభిప్రాయంలో ఎలాంటి తేడా ఉండదన్నారు.

‘దీనిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి మేం కొంత సమయం ఇస్తాం, లేకుంటే మేమే చర్యలు తీసుకుంటాము’ అని సీజేఐ హెచ్చరించారు.

Bhadrachalam: భద్రాచలం వద్ద ఉద్ధృతంగా గోదావరి.. ఈ సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరిక!

Bhadrachalam: భద్రాచలం వద్ద ఉద్ధృతంగా గోదావరి.. ఈ సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరిక!

భద్రాచలం: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఇవాళ ఉదయం 11 గంటలకు నీటిమట్టం 41.3 అడుగులు దాటి ప్రవహిస్తోంది.

నీటిమట్టం 43 అడుగులకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు..

భారీగా కురిసిన వర్షానికి రామాలయం పరిసరాల్లోకి వర్షపు నీరు చేరడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు.

మరోవైపు అన్నదాన సత్రం వద్దకు వరద నీరు చేరడంతో అన్నదాన కార్యక్రమాన్ని నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొంది..

శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఉద్రిక్తత..
శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఉద్రిక్తత.. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు వర్షంలో రోడ్డుపై బైఠాయించిన కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు డబుల్ బెడ్ రూమ్ పరిశీలనకు వెళుతుంటే ఔటర్ రింగురోడ్డు వద్ద కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు. పోలీసులకు బిజెపి కార్యకర్తలకు మధ్య వాగ్వాదం. కేసీఆర్ జైళ్లు సిద్ధం చేసుకోండి. మేమంతా సిద్ధం అంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యలు.

శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఉద్రిక్తత.. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు వర్షంలో రోడ్డుపై బైఠాయించిన కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు డబుల్ బెడ్ రూమ్